దిగవల్లి వేంకటశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిగవల్లి వేంకట శివరావు
1991 లో దిగవల్లి వేంకటశివరావు
జననందిగవల్లి వేంకటశివరావు
ఫిబ్రవరి 14, 1898
కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్
మరణంఅక్టోబరు 3, 1992
భోపాల్, మధ్య ప్రదేశ్
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుదిగవల్లి శివరావు
వృత్తిన్యాయవాది
మతంహిందూమతం
పిల్లలు7: 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు
తండ్రిదిగవల్లి వెంకటరత్నం
తల్లిఆలమూరు మాణిక్యాంబ

దిగవల్లి వేంకట శివరావు (ఫిబ్రవరి 14, 1898అక్టోబరు 3, 1992) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రి వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండి నుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం పాఠశాలలో చదివారు. 1916 లో మద్రాసు ప్రెసిడెన్సీలో కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎ ( 1918–1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920–1922) మద్రాసు లోనే పూర్తిచేసి 1922 నుండి విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య సాధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయుట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన తల్లిగారు ద్రాక్షారామం వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి విశాఖపట్టణంకు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండి విజయవాడలో ప్రఖ్యాత న్యాయవాది. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి,[1][2][3] గాంధేయవాది. గాంధీ ప్రవేశపెట్టిన అనేక సత్యాగ్రహ ఉద్యమాలలో వారి సేవ విశేషమైనది.[4] జైలుకు వెళ్ళటానికి ఏరోజు కారోజు సంసిద్దు లైయ్యుండి కూడా బ్రిటిష్ ప్రభుత్వం చేసే అన్యాయములను ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉధృత ముగా ఆనేక రచనలు కాంగ్రెస్సు వాదిగాను, వ్యక్తిగతముగను చేశారు. నిశితమైన న్యాయవాదిగా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికినీ వారు కేవలం వృత్తికే అంకితమై, ధన సంపాదనే లక్ష్యం చేసుకోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల నుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనేక అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.[5] వారు నీతి నిజాయితీకి మరోపేరు.[6] అవినీతి ఆటగోడుతనం సహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహసిం చేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు సాహిత్య, రాజకీయ, న్యాయవాద పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. ఉపన్యాసాలు ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళటం వారు అరుదుగా చేశేవారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినికిడి సామర్థ్యం కొంచెం తక్కువ కావటంతో 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా విజయవాడలోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు సాహిత్య కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదువుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న భోపాల్ నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి . అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు . వారి జ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు, పేర్లు, సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతున్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్న అనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానా లాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా కథలు గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింపతగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో జైలుకి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విశేషంగా చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా

 1. ఆంధ్ర మద్రాసు ప్రావిన్సల పై విపులమైన సమాచారము . గాంధీగారి హయాం లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపించారు
 2. స్వాతంత్ర్యోద్యమములో కాంగ్రెస్ కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్న పక్షపాతపు పరిపాలన, వారు మన ప్రజలను, మన దేశ నిధులను ఏ విధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
 3. కాంగ్రెస్ జాతీయనాయకులవద్దనుండి ఇంగ్లీషులో వచ్చిన కీలక సమాచార కార్యాచరణ విషయాలను తెలుగులోకి, ఆంధ్రప్రాంతపు కాంగ్రెస్సు నాయకులు తెలుగులో వ్రాసినది ఇంగ్లీషులోకి తర్జుమాలు
 4. కృష్ణా జిల్లా కాంగ్రస్ కార్యాచరణకు in charge for publicity గా పనిచేశారు
 5. సహకార సంస్ధోద్యమంలో వారు కృష్ణా జిల్లా సహకార సంస్థకు డైరక్టరు గాను బెజవాడ సహకార భాండారు కార్యదర్శిగాను పనిచేశారు
 6. న్యాయవాదిగా వారి సేవలను కాంగ్రెస్ నాయకులగు డా.ఘంటసాల సీతారామ శర్మ, ఎన్.జి.రంగా (ఆచార్యరంగా) గార్లకి వచ్చిన కేసులలో న్యాయవాదిగా వారి తరఫున పనిచేశారు
 7. ఇండియన్ లీగ్ కమిషన్ కు, ఖోసలా కమిషన్ (కృష్ణా రివర్ ) కూ తను వ్రాసిన మెమోరాండం సమర్పించారు.
 8. ప్రజాసేవ సంస్ధల్లో, న్యాయాలయాలలో ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భములలో అధికారులతో స్పందించి నివారణకు చర్యలు చేపట్టారు
 9. కేవలం తన పుస్తకాలే కాకుండా గొప్ప పండితులైన వేలూరి శివరామ శాస్త్రి గారు, భావకవి బసవరాజు అప్పారావు గార్ల పుస్తకాలు ముద్రంపచేశారు
 10. తనమిత్రులైన వారికోరికపై వారి పుస్తకాల సవరణలకు సహాయ పడ్డారు.
 11. ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.

“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండి వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్టేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- కాకినాడ- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో బ్రిటీష్ కంపెనీ ప్రభుత్వము వారి వున్నతోద్యోగి (1820లో ఇంగ్లీ షు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, పిఠాపురం జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850–1908, తన జీవితకాలం 1898–1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండి 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము, ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రాశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910–1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916–1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోరియా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలికులు విక్టోరియా హాస్టలలో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు అయిన తెలుగు వారు వారి జీవితకాలమంతయూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, వెలిదండ్ల హనుమంతరావు L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, యల్లాప్రగడ సుబ్బారావు L.M&S.,Ph.D (U.S.A), గోవిందరాజుల వెంకటసుబ్బారావు, డా అమంచర్ల శేషాచలపతి రావు కె.ఎల్.రావు (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) టి. యస్ అవినాశ లింగం (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), యమ్. భక్త వత్సలం ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) కోకా సుబ్బారావు ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) పోతాప్రగడ శ్రీరామారావు, (తణుకులో న్యాయవాదిగా చేశారు )

వంశ చరిత్ర: పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

దిగవల్లి అనే గ్రామం కృష్ణాజల్లాలో నూజివీడు తాలూకా లోనున్నది. శివరావు గారి పితామహుడు దిగవల్లి తిమ్మరాజు గారి పూర్వులు దిగవల్లి దగ్గిర కొయ్యూరు గ్రామంలో వుండి, బొమ్మలూరు రమణక్కపేటలో భూములు కలిగనవారు. వారి వంశీయులు సంప్రతీ కరణాలు. అంటే చుట్టుప్రక్కల గ్రామ కరణ సమూహమునకు పెద్ద కరణంగా మిరాస్మీ అనే హక్కు కలిగి గ్రామంలో జరిగే కార్యకలాపై లావజ్మల్ అనబడే ఫీజు వసూలు చేసుకునే హక్కు గల కరణాలు. తిమ్మారాజు గారి జీవిత కాలం 1794–1856. వారు చిన్ననాటనే 1807 సంవత్సర ప్రాంతంల్లో కొయ్యూరు గ్రామం వదలి ఏలూరులో కొంతకాలం వుండి ఇంగ్లీషు, పార్సీ భాషలు చదువుకుని అక్కడనుండి ఉద్యోగాన్వేషణలో రాజమండ్రీకి చేరి ఇంగ్లీషు వారి ఈస్టుఇండియా కంపెనీ ప్రభుత్వంలో మొట్టమొదలుగా 1811 లో రాజమండ్రి డిస్ట్రి క్టు కోర్టులో ‘ఇంగ్లీషు రికార్డు కీపర్’కు అసిస్టెంటుగా ప్రవేశించి తరువాత 1820 లో కాకినాడలో కలెక్టరు కార్యాలయంలో ఇంగ్లీషు రికార్డు కీపర్ గా చేశారు. ఆ తరువాత పిఠాపురంలో శిరస్తదారుగా నియమింపబడ్డారు. వారికి కలేక్టరు రాబర్టసన్ గారు 1922 లో నివాసగృహ నిమిత్తము 8640 చదరవు గజముల స్థలమును కాకినాడలో రాబర్టసన్ పేటలో ఇచ్చినట్లు గోదావరి జిల్లా రికార్డులలో ఉంది. ఆస్దలములో తిమ్మారాజుగారు రెండుమండువాల పెద్ద ఇంటిని నిర్మిచుకన్నారు. తిమ్మరాజుగారు 1828 లో కాకినాడలో శ్రీ భీమేశ్వరాలయ గోపురం, 1931 లో ఆ గుడి పూర్తిగా కట్టించినట్టుగా ఆ గుడిలోని శిలాశాసనం వల్ల తెలుస్తున్నది. 1850 లో తిమ్మరాజు గారు కంపెనీ ప్రభుత్వంలో హూజూర్ సిరస్తాదారుగా నెలకి రూ 250 జీతంపై పనిచేస్తున్నారు. వారు చేసిన పెద్ద ఉద్యోగాల కారణంగా రాజమండ్రీ జిల్లా (తదుపరి గోదావరి జిల్లా) లో ప్రభుత్వపు రికార్డులలో తిమ్మరాజుగారిని గూర్చిన రికార్టు వుంది పిఠాపురం జమీందారైన రావుసూర్యారావు గారు 1850 లో చనిపోగా తిమ్మరాజుగారిని కంపెనీ ప్రభుత్వం వారు పిఠాపురం సంస్థానంకి కోర్ట్ ఆఫ్ వార్డ్సు (Court of Wards) మేనేజరుగా నియమించారు. ఆవిధంగా వారు 1850 లో రెండు ఉద్యోగాలు నిర్వహించారు . 1834 లో వారు జొన్నలగడ్డ కొండయ్య కొత్తపల్లి అమల్దార్ల అన్యాక్రాంత లావాదేవిల వ్యవహారంలో తిమ్మరాజు గారు విచారణ జరిపి కలెక్టరుకు పంపిన రిపోర్టు (అప్పటి రాజమండ్రీ జిల్లా )గోదావరి జల్లా రికార్డులో చేర్చబడి యున్నది.[7] ధవళేశ్వరం ఆనకట్ట కట్టే రోజుల్లో తిమ్మరాజు గారి పనిలో లోపం కలిగనదని ఆనకట్ట నిర్మాణ కమీషనర్ వారికి ఒక అణా జుల్మానా విధించగా తిమ్మారాజు గారి అపీలుపై జిల్లా కలెక్టరు విచారణ జరిపించి వారు నిజాయతి పరులని, తెలుసుకుని జుల్మానా రద్దు చేసినట్లుగా జిల్లా రికార్డులో వున్న సంగతి శివరావు గారు బయటకు తీసి వారి కథలు గాథలు పుస్తకంలో వ్రాశారు.[8] తిమ్మరాజుగారి పనిచేసిన పదవులు కీలకమగుట వల్ల గోదావరి జల్లా రికార్డులలో వారి ద్వారా జరిగిన ప్రభుత్వ వ్యవహారాలలో వారి గురించి ప్రత్యక్షాధారాలు కనబడ తాయని శివరావు గారు చరిత్రపరిశోధనా దృష్టితో రికార్డులన్నీ వెదకి వారి తాతగారికి సంబంధించిన అనేక సంఘటనలు సేకరించి వారి దైనిక చర్యలు, వారి కాలం నాటి విషయాలెన్నో డైరీలో వ్రాశారు. తిమ్మరాజుగారు 1856 లో మరణించారు. తిమ్మరాజుగారు 1811 ఉద్యోగంలో చేరేనాటికి కాకినాడ, రాజమండ్రీ, మొగలుతుర్రు డివజన్సు కలిపి మచిలీపట్టణం కలెక్టరు క్రింద వుడేవి. గోదావరి జిల్లా అనేది లేదు. 1820 లో రాజమండ్రీ జిల్లా అనేది వచ్చింది. ఆజిల్లా కలెక్టరు ప్రధాన కార్యాలయాలు కాకినాడలోనుండేవి. ఆసంవత్సరంనుండే వారిని జిల్లాకలెక్టరు కార్యాలయంలో ఇంగ్లీషు రికార్టు కీపరుగా నియమించారు.

దిగవల్లి తిమ్మరాజు గారి పెద్ద కుమారుడు వెంకట శివరావుగారు (1829–1890) మన శివరావుగారికి పెద తండ్రి. వారు పిఠాపురం దివాన్ గా చేశారు. రెండవ కుమారుడు వెంకటరత్నంగారు (1850–1908) మన శివరావుగారి తండ్రి. వారు తహసిల్దార్ గా గోదావరి జల్లాలో అనేక చోట్ల పనిచేసి కొవ్ఊరిలో సబ్ మేజస్ట్రేటుగా 1905 లో రిటైరైనారు. వారి రెండవ భార్య సంతానం మన శివరావుగారు, వారి అక్కగారు సీతాబాయమ్మగారు (బొడ్డపాటి పూర్ణయ్యగారి భార్య ). శివరావు గారి తండ్రి మొదటి భార్యసంతానం ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. శివరావు గారు 14/02/1898 తేదీన కాకినాడలో వారి స్వగృహమందు జన్మిచారు. తండ్రి గారు తన ఆదాయమునకు మించి న ఖర్చులతో ఆనేక సంతర్పణలు, సమారాధనలు, దేవకళ్యాణాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణ సత్కరణలతో క్రమ క్రమంగా ఆస్తినంత తాకట్టు పెట్టి అప్పుల పాలై 1908 లో పరమదించారు. అప్పటికి శివరావుగారు 10 ఏండ్ల ప్రాయం. ఆప్పటిదాక శివరావు గారికి విద్యాభ్యాసమే లేదు. శివరావు గారి సవతి అన్నగారు వీరి కన్నా 25 ఏండ్లు పెద్ద ( వారు ఉయ్యూరు జమీందారుకు 1918–1922 మధ్య దివాన్ గా చేశారు ) . కాని దురద్రుష్టవశాత్తూ అన్నగారికి తమ్ముడైన శివరావుగారి మీద అప్పట్లో దయ కలుగలేదు. అందువల్ల ఏడాదిక్రితమే పెళ్ళి అయిన అక్కగారి పెనిమిటి క్యాలికట్లో టెలిగ్రాఫి మాస్టరుగా నున్న బొడ్డపాటి పూర్ణయ్యగారు శివరావుగారిని వారి తల్లినీ ఆదరించి క్యాలికట్ (కేరళ రాష్ట్రం ) తీసుకుని వెళ్ళారు.

సాహిత్య కృషి

[మార్చు]

వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ రాజమహేంద్రవరంలో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన వడ్ఢాది సుబ్బారాయుడుగారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, కార్యదర్శిగా అద్దంకి సత్యనారాయణ శర్మగారు, సభ్యులుగా మైనంపాటి నరసింహ రావు, అడవి బాపిరాజు, బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, కవికొండల వెంకటరావు తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, చిలుకూరి వీరభద్రరావు గారు, వంగూరి సుబ్బారావు గారు, చెలికాని సుబ్బారావు గారు, నాళం కృష్ణారావుగారు, వడ్డాది సుబ్బారావుగారు,కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా వీరేశలింగం గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915–1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లోఇంటర్ ఫైనల్ వుడగా మద్రాసు రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు మద్రాసు రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో తల్లాప్రగడ సుబ్బారావు ( 1850–1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and దాసు విష్ణురావు గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండి వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913–1914 సంవత్సరం పాఠశాల విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు దక్షిణాఫ్రికాలో చేసే సత్యాగ్రహ ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు చురితమైనవి

1922 నుండి న్యాయవాది వృత్తితోపాటు సాహిత్యం, స్వాతంత్ర్యపోరాటం

1922 లో న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తూనే వారు ఒకప్రక్క గాంధీగారి ఆధర్వాన జరిగే జాతీయ ఉద్యమాల ఆందోళనల దిశానిర్ధేశాల ప్రకారం కృష్ణా జిల్లాలో జరిగే ఆందోళనకు మదత్తుగా కృషి చేయటం ఇంకొక ప్రక్క ఏమాత్రం సమయం వృధా చేయకుండా సాహిత్య కృషి చేయటం న్యాయవాది వృత్తితోపాటు గణ నీయం. వారు చేసిన సాహిత్య కృషి ప్రశంసనీయము బెజవాడలో నున్న రామమోహన లైబ్రరీలో నున్న చరిత్ర సాహిత్యమీద వున్న అనేక పుస్తకాలు చదవటమే కాక మద్రాసులోని కొన్నెమరా లైబ్రరీ నుండి తనకు కావలసి న పుస్తకాలు ఇంటికి తెప్పించుకునే ఏర్వాటు రామమోహన లైబ్రరీ వారి ద్వారా చాలా సంవత్సారలుగా శివరావుగారికి వుండేది. ఆ విధంగా వారు అనే క పుస్తకాలు మద్రాసునుండి తెప్పించుకును బహు విధ కృషి చేసి అనేక చారిత్రాత్మక విషయాలు తెలుగు వారికోసం అనేక పుస్తకాలు వ్యాసాలు వ్రాయగలిగారు. 1922 బి యల్ ఆఖరి సంవత్సరంలో వుండగనే ఆంధ్రుల సం స్క్రుతిక చరిత్ర అనే వారి వ్యాసం బొంబాయి లోని తెలుగు సమాచార్ అనే పత్రికలో ప్రచిరుతమైనది. పట్టాపుచ్చుకుని 1922 జూన్ లో బెజవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న తరువాత శ్రీ కురుగంటి సీతారామయ్య గారు M.A (was Head Master) నడుపుచున్న విద్యార్థి అను పత్రికలో శివరావు గారి వ్యాసములు (1) భారతీయుల లలిత కళలు (2) జాతీయవిద్య ప్రచురితమైనవి. 1923–24 లో “చిన్న కథలు”, “మన దారిద్య్రము”, “ తెల్మా (నార్వే దేశపు నవలాధార కధ) అను వ్యాసములు శ్రీ దుగ్గిరాల రాఘవచంద్రయ్య గారు బెజవాడనుండి పచురించే స్వరాజ్య పత్రికలో ప్రచురించ బడినవి. 1922 లో ప్రెసిడెంసీ కాలేజీ లో వ్రాసిన పోటీ వ్యాసము పోతన-వేమనుల వారి కాలము, కృతులు నకు శివరావుగారికి 1924 పొవెల్ మోరహెడ్ ప్రాదేశిక భాషల బహుమతి రూ 150 ఇచ్చారు. ఈ వ్యాసము నే ఆధారంగా చేసు కు ని 1924 లో పోతన వేమనలయుగము అనే పుస్తకము ను ప్రచురించారు. ఆ పుస్తకమువావిలకొలను సూరయ్య గారు, కొడాలి ఆంజనేయులు గారు నడిపేటటువంటి శారదాభాండారు ప్రెస్సు లో ముద్రితమైనది. 1923 లో కాకినాడ కాంగ్రెస్సు సదస్సుకు శివరావరు గారు కూడ వాలంటరీ భాద్యత లో వెళ్లారు. 19/08/1922 టంగుటూరు ప్రకాశం గారు ఉత్తరంవ్రాసి వారి స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరెస్పాండెంటు గా వుండమని వ్రశారు అందు కు అంగీకరించిన శివరావు గారు 1922 కాకినాడ కాంగ్రెస్సు కు వచ్చిన దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారిని ఇంటర్వ్యూ చేసి స్వరాజ్యకి పంపిన రిపోర్టు ప్రచురితమైనది. 1925 లో వేలూరి సత్యనారాయణ గారి పుస్తకం బౌధ్ధమహా యుగం లో శివరావుగారి గారి సాహిత్యకృషి ని గూర్చి చెప్పారు. ఆదే సంవత్సరం లో కాశీనాధుని నాగేశ్వరరావు గారు సింగరాజు వెంకట సుబ్బారావు గారింట్లో వుండగా డా ఘంటసాల సీతారామ శర్మగారు శివరావుగారికి మొదటిసారిగా కాశీనాధుని నాగేశ్వరరావు గారిని పరిచయం చేయగా వారు శివరావుగారిని తమ భారతి మాస పత్రిక కు వ్యాసాలు వ్రాస్తు వుండమని అప్పట్ణుంచీ భారతి ని శివరావుగారికి కాంప్లిమెంటరీ గా పంపిచే ఏర్పాటు కూడా చేశారు. రాజమండ్రీలోని హితకారణి స్కూలుకు పూర్వవిధ్యార్ధుల సంఘం కోరిక పై 1925 వార్షికో త్సవం కు శివరావు గారు అధ్యక్షత వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారి ప్రేరేపణపై శివరావుగారు 1927 లో “దక్షిణాఫ్రికా” అనే పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకమును మహామత్మా గాంధీ గారికి అంకితమివ్వడానికి గాంధీ గారి అనుమతి కోరుతూ వ్రాయగా గాంధీ గారు శివరావు గారికి స్వయంగా చేతో జవాబు వ్రాశిన పోస్టు కార్డులో వ్రాసిన వాక్యాలు ఈ క్రింద ఇవ్వబడినవి .


POST CARD POSTAL SEAL: VENUGARLA
                                                                                                                                    On Tour
 To 26-02-1927
D.V.Siva Rao
Dist Court Vakil
BEZWADA
MADRAS PRESIDENCY
Dear Friend,
I have your letter. I have no objection to your dedicating your work to me provided that you do not state anywhere that the dedication is with my permission for I do not want to give permission about a thing I do not know as I have no opportunity of knowing; for even if you offered the manuscript to me I shall not have time to get it read to me
Yours Sincerely
M.K.Gandhi

శివరావు గారి సాహిత్య, రాజకీయ రంగాలలో అభిరుచి కలగడానికి విద్యార్థి దశనుండే వారి అధ్యాపకుల బోధనలు, గొప్ప పుస్తకాలు వారి జాతీయ భావాలను చిగుర్చి స్వతంత్ర పోరాటానికి దోహ దం చేశాయి. 1920 లో వారు లా కాలేజీలో జేరిన సంవత్సరం గాంధీగారి సహాయనిరాకరణోద్యమం అప్పటికే జోరుగా సాగుతున్న రోజులు వారి మనసు కలవర పరచ సాగింది. న్యాయ వాది చదువు దైవాధీనంగా పూర్తిచేసుకుని బయటపడుతూనే స్వతంత్ర పోరాటసమరాటం అనేక విధాలుగా తనపాలు పంచారు. 1966 లో వారి సన్మాన సభలో మాట్లాడుతూ ఇట్లా చెప్పారు “ I read Savarkar’s war of Independence in 1929 and had no sleep for three nights” ఆ విధంగా అనేక సందర్భాలలో వారి మనస్సు మీద స్వతంత్ర పోరాటానికి ప్రేరణ కలిగింది. 1927 డిశంబరు 2 న భహ్మశ్రీ వేదం వెంకట రామశాస్త్రి గారు అప్పటికి బెజవాడలో నున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ కాన్వోకేషనుకు వచ్చియుండగా బెజవాడ మ్యునిసిపల్ కౌన్సిల్ వారు శాస్త్రి గారిని సన్మానించటానిక సభ ఏర్వాటు చేసి శివరావుగారిచే వ్రాయించిన సన్మాన పత్రం శాస్త్రి గారికి ఇచ్చారు, 1929 లో కోఆపరెటివ్ సొసైటీ న్యూస్ అను పత్రికలో శివరావుగారు ‘ భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు. ఆవ్యాసమును ఆధారము చేసే “ నిరభాగ్య భారతము” అను వ్యాసము కృష్ణా పత్రికలో ప్రచురించారు. 1930 లో పశ్చమ కృష్ణా జిల్లా న్యూస్ వారు శివరావుగారు రచించిన అనేక చిన్న పుస్తకములను ప్రచురించారు. పశ్చమ కృష్ణా జిల్లా మాహా సంఘం వారు రాజకీయ పరి జ్ఞానము అను పేరుతో చాల చిన్నపుస్తకములను ప్రచురించారు వాటిలో శివరావు గారు వ్రాసిన వి ఆరు పుస్తకములు ప్రచురించారు ఆంధ్ర గ్రంథాలయం వారు ముద్రించారు. అందులో మొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12/03/1930 తేదీనా డు వెలువడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 6/04/1930 నాడు వెలువడింది. అలాగ మిగత నాలుగూ దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము ఒకదానితరువాత ఒకటిగా వెలువడ్డాయి. ఈ “రాజకీయపరిజ్ఞానము” అను ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు1933 నవంబరులో నిషేధిచారు. 1933 లో సహకార వస్తు నిలయము, అధినివేశ స్వరాజ్యము (Dominion Status ), and భారతదేశ స్థితిగతులు ” అను చిన్న చిన్న పుస్తకములను ప్రచురించారు. వారి అధినివేశ స్వరాజ్యము చాల ప్రఖ్యతి గాంచింది. 1934 లో ఆచార్య ఎన్ జి రంగా గారు నిడుబ్రోలు లో రైతు బడినొక దానిని స్తాపించారు. ఆ రైతు బడిలో శివరావు గారి పుస్తకాలు ను పాఠ్య పుస్తకాలు గా పెట్టారు. రంగా గారు శివరావు గారిని నిడుబ్రోలు వచ్చి అందులో విజ్ఞాన సాధనకై వచ్చే రైతాంగానితో సంభోదించమని ఆహ్వానించారు. కానీ శివరావు గారు వెళ్లటానికి వారి సమయం చాలలేదు. శివరావు గారు 1939 నుండీ బ్రిటిష్ యుగ చరిత్ర మీద పరిశోధన ప్రారంభించి తీవ్ర కృషి సల్పి అనేక వ్యాసములు వ్రాయటం ప్రారంభిచారు అలా వారు వ్రాసిన వ్యాసాలు అమృత సందేశము [immortal Message] లో ప్రచురించారు. ఆ పత్రిక బెజవాడలో సి వి రెడ్డి , డి.యస్ శర్మ గార్లు సంకలనం చేశావారు అదే పత్రికలో శివరావు గారివి ఇంకో రెండు వ్యాసాలు—“ Christianization of India”, “Hindu Muslim Civilization” అనే రెండు ఆంగ్ల భాషలో వ్రాసిన వ్యాసములను 1939–1940 లో అమృత సందేశంలో ప్రచురించారు.. ఆంధ్ర మహా సభ వారు ఆంధ్రదేశ చరిత్ర వ్రాయించటానికి రచయితల సంఘం ఏర్పరిచారు. అందులో శివరావుగారని సభ్యులుగా నియమించారు . అట్లా నియమించినట్లుగా ఆంధ్రపత్రికలో వెల్లడైనది కూడా. 04/11/1943 తారీఖునాడు చిలకమర్తి వారు శివరావుగారికి జాబు వ్రాస్తూ వీరి సాహిత్య కృషి ప్రశంసించారు. 13/04/1945 తేదీన శ్రీ ప్రణవానంద వారు శివరావు గారికి స్వయముగా గాయత్రీ మంత్రార్ధ వివిరము తెలియ పరిచారు. ఆరోజులలో 1930 నుండి -1947 దాకా వారికి చాల ప్రముఖు ల వుత్తరాలు వ్రాసియున్నారు. అప్పట్లోవారి కన్నా చాల పెద్దవారు వ్రాసిన ఉత్తారలలో గజవల్లి రామచంద్ర రావు,వడ్డాది సుబ్బారాయడు,చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వావిలకొలను సుబ్బారావు, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, మాడపాటి హనుమంతరావు,అయ్యదేవర కాళేశ్వర రావు మొదలగు ప్రముఖులు. వారి సమకాలీకులైన సాహిత్యవేత్తలు ఇంకా చాలా మంది వారితో తరుచు ఉత్తర ప్రత్తుత్తరాలు జరిపినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ వారి పేర్లివ్వటం సాధ్యమైన విషయం కాదు. 1930–40 మధ్యకాలంలో వారు సహకార సంస్ధలకు సంబందిచిన పని కూడా చేశారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు, సహకార సంస్ధ నిబంధనలు, ఉప ప్రబంధనలు 1935 ఏప్రిల్ లోను, గోదావరి జిల్లా సహకార బ్యాంకు ఉపప్రబంధనలు 1935 మే నెలలోను, తెలుగులో వ్రాశారు వాటినే ఆయా సంస్దలవారు రిజస్టరు చేయంచి 1935 మేనెలలో ముద్రించారు. 1935 లో బెజవాడలో కృష్ణా సహకార స్టోర్సు పేరుతో వున్న సంస్ధకు కార్యదర్శిగా కూడా చేశారు. చెరుకుపల్లి వెంకటప్పయ్యగారు అధ్యక్షుడు గానుండేవారు తరువాత ఆంధ్ర కోఆపరేటివి ఇనసేటిట్యూట్ కు డైరెక్టరుగా పనిచేశారు.. 17/06/1937 శివరావు గారు Resignation and dismissal of ministers” అని హిందూ దిన పత్రికలో ఉత్తరం వప్రచురించారు. 01/02/1938 న హిందూ పత్రికలో శివరావు గారు సేకరించిన భారత దేశ రాజ్యాంగ విధానము (constitution) లో నున్న విషయాలు కొన్నిటిని ప్రచురించారు. సి యఫ్ యాండ్రూస్ గారు కాంగ్రెస్ అగ్రగణ్యడుగా వ్రాశిన ‘rise and growth of Congress’ అను పుస్తకము నకు మద్రాసు & ఆంధ్ర ప్రావిన్సుల పరిస్థితులను శివరావుగారు సేకరించి వ్యాసరూపంలో వారికి పంచారు.యాండ్రూస్ గారు 23/05/1939 శివారవూగారికి కృత్రజ్ఞతాపూర్వకమైన లేఖ వ్రాశారు 09/08/1942 తేదీన క్విట్ ఇండియా ఆందోళన ప్రారంభించినట్లుగా కాంగ్రెస్సు అగ్రనాయకులు ఉద్ఘోషించగానే గాంధీ గారిని అరెస్టుచేసిన కోన్ని నిముషములో ఆంధ్రలో ప్రొవెన్సియల్ కాంగ్రెస్సు వారు క్విట్ ఇండియా వుద్యమం ప్రారంభిచటానికి ఆంధ్ర కాంగ్రెస్సు నాయకుడైన కళా వెంకట్రావుగారి 29/07/1942 తేదీన ప్రకటన కర పత్రం సరళమైన తెలుగులో రేడియోలో ప్రసార నిమిత్తము వ్రాసిపెట్టమని నూకల వీరరాఘవయ్యగారు (వారి మరో పేరు శ్రీమతే) శివరావుగారిదగ్గరకు రాగా శివరావుగారు తెలుగులో వ్రాసిన పత్రం ముద్రించి యావధ్ధాంధ్ర దేశం పంచపె ట్టటం క్విట్ ఇండియా ఆందోళనలో జరిగిన విషయాలు. శివరావుగారు ఆంధ్రీకరించిన ఆ ప్రకటన పత్రం ఆనాటి కాంగ్రెస్సు కార్యకర్తలో చాల ప్రఖ్యాతి గాంచింది. 1946 లో మద్రాసునుండి ప్రచురితమైయ్యే న్యూ టైమ్స అనే పత్రికలో సంపాదకుడు యమ్ తిరుమలరావు సంపాదకుని మాటల్లో టంగుటూరి ప్రకాశంగారి జీవత చరిత్రని విషమంగా వ్యాఖ్యానించి వ్రాశారు. దానికి స్పందనముగా శివరావు గారు 12/08/1946 తేదిన ఆ పత్రిక సంపాదకునికి బహిరంగ లేఖ ఘాటుగా “Stop this disgraceful vilification of Prakasam” అని వ్రాసి పంపిచారు. ఆలేఖ ముద్రించి దానిమీద బెజవాడ పౌరులు న్యాయవాదులు సంతకాలు చేసి గాంధీగారికి పంపిచారు. ఆకాశవాణి ఢిల్లీలో వారణాశి సుబ్రమణ్యం గారు ప్రోగ్రమ్ డారెక్టరుగానున్నారు. వారు ఒక ఉత్తరంలో అప్పట్లో ఆంధ్ర ప్రొవిన్సియల్ కాంగ్రెస్సుకు అధ్యక్షుడుగానున్న ఆచార్య రంగాగారు టెక్నికల్ టెరమ్సు ట్రాన్సలేషన్ నిమిత్తము కమిటీనేర్పాటు చేస్తున్నారన్నీ ను, దానికి శివరావుగారిని అధ్యక్షనిగా వేస్తున్నారని దానికి శివరావుగారిని వద్దనకుండా స్వీకరించమని వారణాశి సుబ్రమణ్యంగారు వ్రాశారు. 1947 లో కొండా వెంకటప్పయ్య గారు తాను రచించిన వేంకటేశ్వర శతకం శివరావుగారికి బహుకరించారు. అదే సంవత్సరంలో బెజవాడ మునిసిపాలిటీ ఎన్నికలు జరిగినవి అధ్యక్ష పదవికి డా ఘంటసాల సీతారామశర్మ గారు పోటీ చేయ నిశ్చయించగా, వారికి ఎన్నికలు మానిఫస్టో శివరావుగారు తయారు చేశారు. కొమర్రాజు లక్ష్మణరావుగారు రచించిన పుస్తకం శివాజీ 3 వ సంకలనం 11/09/1947 తేదీన ప్రకటితమై న పుస్తకమునకు పరిచయ వాక్యాలు శివరావుగారు వ్రాశారు. అలే గే 4 వ సంకలనానికి కూడా డా కొమర్రాజు అచ్చమాంబగారి తమ్ముడు కొమర్రాజు వినాయకరావు గారు కోరినమీదట మరల పరిచయవాక్యాలు శివరావుగారే వ్రాశారు. 1955 లో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి వారు పెట్టబోయే సమితికి శివరావుగారి సలహాలు కోరారు. కంభంపాటి సత్యనారాయణగారు 1957 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ సంపాదకలుగానున్నప్పడు శివరావుగారు పెట్టిన షరత్తుల ప్రకారం ఏమాత్రం మార్పులు చేయకుండా 1857 పూర్వరంగములు అను పుస్తకమును విశాలాంధ్ర వారు ప్రచురించారు. 1957 లోనే నవోదయా పబ్లిషింగ్ హౌసు శివరావు గారు రచించిన సన్యాసుల స్వాతంత్ర్య సమరములు, ఆదిమనవాసుల యుధ్ధములు, మధుర నాయకులు అను మూడు పుస్తకములను ముద్రించుటకు నిశ్చయించి మొదటి రెండిటినీ వెంటనే ముద్రించారు.కాటూరి వెంకటేశ్వరరావుగారు అప్పట్లో (1957) కృష్ణా పత్రికకు సంపాదకుడుగానున్న కాటూరి వెంకటేశ్వరరావు గారు శివరావు గారిని తమ పత్రికకు వ్యాసములువ్రాయమని కోరారు. శివరావుగారి సాహిత్య పరిశోధన, రచనలు క్రమ క్రమంగా 1922 నుండి శర వేగంతో వృధ్ది అవుతూవచ్చి 1940 నుండి 1950 మధ్యలో అత్యదికంగావున్నవని చెప్పవచ్చును. వారు వ్రాసిన వ్యాసములు పది ఇరవై కాదు, ఒకటి రెండు పత్రికల్లో అనికాదు. అనేక వ్యాసాలు, వరుసగా శీర్షికలుగా వివిధ పత్రికల్లో, బెజవాడలోని పత్రికలే కాక ఆంధ్ర దేశంలో మారుమూలల నుండి ప్రచురితమైన పత్రికలవారు శివారువూగారి వ్యాసాలు కావలని కోరటం కొన్ని కొన్ని వ్యాసాలు అటువంటి కొన్ని చిన్న చిన్న పత్రికలకూడా పంపించి ప్రచురింటం కనబడుతున్నది. ఉదాహరణకు జ్ఞానోదయము ప్రజామిత్ర, కొరడా, అమృతసందేశము, సమదర్శిని, గ్రంథాలయసర్వస్వము, వసుమతి, ప్రభాతము, మాత్రు భూమి,గ్రామోద్యోగి,సహకారమిత్ర సమదర్శిని, విజయవాణి, జామీను రైతు,ఆంధ్ర లాజర్నల్, సమాలోచన ఇత్యాదులు. ఇంక మద్రాసునుండి ఆతరువాత బెజవాడనుండి ఇంకాతరువాత హైదరాబాదునుండి క్రమ క్రమంగా వచ్చిన అనేకం రోజూవారి, వీక్లీ, పక్ష మాస పత్రికలు శివరావుగారి వ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదనటం అతిశయేక్తి గదేమో. వారి వ్యాసాల సూచీ చివరలో పత్రికవారి, సంవత్సరం వారిగా సాధ్యమైనంతవరకూ తయారుచేసి చివరలో జతపరచడమైనది.

శివరావుగారి వద్ద కల అరుదైన పత్రికల ప్రచురణ ప్రతులు, పుస్తకాలు

[మార్చు]

"మన మణిమాక్యాలు" అని 1993 ఫిబ్రవరి 15 నాటి ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో డాక్టరు అక్కిరాజు రమాపతిరావుగారు రచించిన వ్యాసములో దిగవల్లి వేంకట శివరావుగారి వద్ద ఎన్నేన్నో అపురూపమైన అరుదైన, అలభ్యైన పత్రికల ప్రచురణలు, పుస్తకాలు వుండేవని వ్రాశారు.1871 లో ప్రారంభిచబడిన ఆంధ్ర భాషాసంజీవని, 1872 లో బందరు నుండి ప్రచురించబ డే పురుషార్ధ ప్రదాయనీ, పురాతన కృష్ణాపత్రిక ప్రచురితమైన వ్యాసముల ప్రతులు, 18- 19 వ శతాబ్ధ ప్రచురితమైన కొన్ని అలభ్యమైన పుస్తకములు 1833 లో ప్రచురించబడ్డ "ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్రచరిత్ర" మొదటి సంకలనము, 1862 లో ప్రచురించ బడ్డ నీన నరసింహ్మ గారి "హితసూచనీ" పుస్తకము మొదలగు కొన్ని ఉదాహరణంగా చెప్పడమైనది. వారు ఏ విషయమునైన వ్రాశారంటే ములాధారము లేకుండా వుండదు.[9]

అలనాటివిశేషాలు కలిగిన వారి చేతి వ్రాత ప్రతులు

[మార్చు]

వారివి అప్రచురిత గ్రంథములు, అప్రచురిత వ్యాసములు కాకుండా ఎన్నో అలనాటి సంగతులు కలిగిన విశేష ప్రతులు (1) "నా జ్ఞాపకాలు" (2) "నా జ్ఞాపకాలు-అభిప్రాయాలు" (3) "18-19 శతాభ్దపు ఆంధ్ర ప్రముఖులు" (4) "chronological Notes" మొదలగునవి. వారి జావకాలు నోట్సులనుండి కొందరు విశేష ప్రముఖలు గురించి వ్రాసిన విశేషాలు తీసి తెలుగు వికీపీడయాలో విడివిగా వ్యాసాలు వ్రాయతగినవి. అందులో ఒకరిద్దరు పేర్లు ఉదహరించక తప్పదు: ధర్మానంద సరస్వతి, దర్మేంద్ర సత్యార్ది మొదలగు వారు.

దిగవల్లి- చెళ్ళపిళ్ళ వారి సమకాలీక వ్యాసాలు

[మార్చు]

అనేక వ్యాసములు శివరావుగారివి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారివి కృష్ణాపత్రికలోను, ఆంధ్రపత్రికలోనూ వరుసగా ప్రచురింపడినవి. అప్పడప్పుడు ఒకే రోజున ఇద్దరి వ్యాసములు ప్రక్కప్రక్కలనే ఒకే పత్రికలో ప్రచురించబడినవీ ఉన్నాయి. ఆంధ్రపత్రిక వారు దిగవల్లి వారిని మూల స్దంభముగా భావించినట్టుగా ఆ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు శివలంక శంభూ ప్రసాదుగారు శివరావుగారికి వ్రాసిన ఉత్తరాల్లో ఒక దాంట్లో వ్రాశారు. దాదాపుగా రెండు వందల దాకా వుంటాయి ఆంధ్రపత్రికలో శివరావుగారి వ్యాసాలు. “సుమారు పది సంవత్సరాలుగా శివరావుగారివి, చళ్లపిళ్ళ వారివివ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదని చెప్పడం అతిశయోక్తిగాదు ” ఆంధ్రపత్రిక శంభూప్రసాదు గారు వారు వీరిద్దరికి చెరి వేయనూట పదహారులిచ్చినట్టుగా ప్రకాశచంద్రశతపధి గారు శివరావుగారి గురించి వ్రాసిన వ్యాసం ఆంధ్రపత్రికలో 1986 నవంబరు 9 న వ్రాశారు.

న్యాయవాదిగా కృషి

[మార్చు]

మునిసిపల్ అవినీతి కేసులు 1922 లో శివరావు గారు ప్లీడరీలో జేరేటప్పటికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలో అతి ప్రముఖ న్యాయవాదులలో ఒకరుగా నుండటయేగాక కాంగ్రెస్ అగ్రగణ్యులల్లో నొకరు. 1923 లో వారు విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షులు కూడాను. ప్లీడరీ వృత్తికి ఆసంవత్సరమే స్వస్తి చెప్పారు. ఆసమయంలో మునిసిపాలిటీ నీటిసరఫరా బిల్ కలెక్టర్లు ఉకవుమ్మడిగా అవినీతికి పాల్పడి నీరు వాడకందార్లు ఇచ్చిన పైకం స్వంతం చేసుకున్నారు. ఆసంగతి బయల్పడగా, మునిసిపాల్టీ వారు కోర్టులో దావా వేయగా బిల్ కలెక్టర్లందరూ ఏకమై వారి అధ్యక్షుడైన కాళేశ్వరరావుగారే ఆ సొమ్మును వాడుకున్నారని ప్రతివాదన పెట్టారు. ఆ కేసులో ఒక సాత్వికుడైన బిల్ కలెక్టరును పూర్వపు మాజీ అధ్యక్షుడైన డా.ధన్వాడ రామచంద్రరావుగారు శివరావుగారివద్దకు తీసుకుని వచ్చి ఆతడు చేసిన తప్పు వప్పుకుంటున్నాడనీ, అతి తక్కువ శిక్షపేడేటట్లు చేయమని కోరిన మీదట శివరావుగారు కేసులో తన కక్షిదారు ద్వారా మిగతా వారి కుట్ర ఘటనా విధాన్నాని అధ్యయనం చేసి లోపలి విషయాలన్నీ అర్దంచేసుకుని కేసు రికార్డు కెక్కించి తన కక్షిదారు ప్రార్థనను కోర్టువారి సమక్షంలో వాదించారు. మిగతా బిల్లు కలెక్టర్లకు అతి ఖఠిన ఖారాగార శిక్ష 2 ఏండ్ల పైన పడగా తన కక్షిదారు కేవలం 2 నెల శిక్షతో బయటపడ్డాడు. ఆ కేసు ఫలితంగా కాళేశ్వర రావుగారు సంతోషించి తన పై కుట్రను బయటపెట్టినందుకు శివరావుగారిని అభినందించి తనలా లైబ్రరీ నుంచి M.L.T జర్నల్సును బహుమతిగా నిచ్చారు. 1932 లో ఇంకో కేసులో మునిసిపల్ కౌన్సిల్ లో అప్పట్లో అధ్యక్షుడు అలీ బేగ్ వారికి ప్రతి పక్ష సభ్యులుగా నున్న సర్దార్ గులామ్ మొహిద్దీన్ గారినీను, గుడిపాటి రంగన్నాయకమ్మ (వెంకటచలం గారి సతీమణి) నినీ ఒక మీటింగులో వీరిద్దరిని అధ్యక్షుని పక్షమునకు చెందిన దుండగుడోకడు కౌన్సిల్ మీటింగులో దౌర్జన్యంగా కొట్టాడు. గన్నవరం మేజిస్ట్రేట్ కోర్టులో శివరావుగారు గులాంమొహిద్దీన్ తరఫున కేసులో పనిచేశారు. శివరావుగారు వారి సమకాలీకులు సాహిత్యపిపాసకులైన రాజా వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ గారికి అయ్యంకి వెంకటరమణయ్యగారికీ కూడా ప్లీడరుగా విజ్ఞానచంద్రికామండలి కార్య కాలాపాల్లో 1936 లోవారి కేసుల్లో పనిచేశారు. శివరావు గారు ధర్మరక్షణ అవినీతి నిర్మూలనకు వెనుకాడని మనిషి. ఒకసారి 1932 లో వారు పనిచేయుచున్న జిల్లా మునిసిఫ్ గా నున్న నిడమర్తి నరసింహంగారు 67 మంది న్యాయ వాదులను తనపై కుట్రచేస్తున్నారని ఆరోపణచేసి తన కోర్టుకు రాకూడదని వెల్లడించారు. ఆ అరవైఏడు మందిలో శివరావుగారు కూడా ఒకరు. ఆసమయంలో ఆకాలంనాటి పెద్ద ప్లీడరు పెద్దిభొట్ల వీరయ్యగారు,చెరుకుపల్లి వెంకటప్పయ్యతో కలిసి ఒక మెమొరాండం తయారు చేసి జిల్లా జడ్జిగానున్న బైర్ అనే ఆంగ్ల న్యాయమూర్తికి శివరావరుగారు స్వయంగా అందించారు. బైరు దొరగారు తనతో పాటు ఎప్పుడు ఒక తుపాకి దగ్గర పెట్టుకునే వాడట .

శివరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా

[మార్చు]

1947 లో శివరావుగారు 31-01-1947 న బెజవాడ బార్ యసోసిఏషన్కు అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు. న్యాయవాదిగనూ, ఆ సంస్ధ అధ్యక్షునిగనూ ఆకాలంలో వారు చేసినపని గణనీయము. వారి కృషితో కొన్నిచిరకాల సమశ్యలను పరిష్కారమైఏట్లుగా చేశారు. అప్పటివరకూ న్యాయవాదులకు బార్ రూమ్ లో ఎండాకాలంకూడా మంచినీళ్ళిచ్చే జీతగాణ్ణి పెట్టుకోటానికి ప్రభుత్వఅనుమతి లేకపోటంవల్ల చాల ఇక్కట్టైన పరిస్తి తి వుడేది. వీరి అధ్యక్షతన మద్రాసు హైకోర్టు అనుమతికై ప్రయత్నంచేయటం చిట్టచివరకు లభించటం జరిగింది. ఆ ప్రయత్నానికి జిల్లాకోర్టు జడ్జిగారు ఆట్టే అభిరుచిచూప్పిచలేదు. అప్పటిదాక జిల్లాకోర్టుకుకూడా ఆ వ్యవస్థ వుండేది కాదు. వీరి ప్రయత్నంతో జిల్లాకోర్టువారుకు కూడా లబ్ధి పొందారు. బెజవాడ సివిల్ కోర్టుకు దగ్గరలో నున్న మునిసిపల్ ఉన్నత పాఠశాల బహిరంగ మైదానంలో ఒక మూల మునిసిపల్ పాహిఖానా బహిరంగంగా కుదువబెట్టేవారు (storing of night soil). ఆది ఆ పాఠశాల వారికే కాక ఆవేపునుంచి కోర్టుకు వచ్చే ప్రతి వారికి చాల అసహ్యకరమైన భరించరాని దుర్వాసన కలిగేది. కానీ అప్పటిదాకా ఎవ్వరూ ఏమీ చేయగలిగినట్లులేదు. శివరావు గారి అధ్యక్షతన బార్ యసోసియేషన్ వారు ఈ విపరీత పధ్ధతిని అరికట్టడానికి పట్టణ హెల్తాఫీసర్ కి వ్రాయగా వారు అలాంటిదేమీ మునిసిపాలిటీ వారు చేయటంలేదని దబాయింపు జవాబు చెప్పగా శివరావు గారు వదిలే మనిషికానందున వారు మద్రాసులోనున్న డైరెక్టరు ఆప్ పబ్లిక్ హెల్త్ కు వ్రాసి తగుచర్యకై కృషిచేయగా చివరకు ఆ సమస్య తీరింది. మునిసిపాలిటీ వారు ఆప్రదేశము చుట్టూ గోడ కట్టి తగు లోతుగా గొయ్యలు చేసి మూసి పెట్టివుచటం మొదలగు చర్యలు తీసుకునట వల్ల. బార్ యసోసేఏషన్ లో ఏ విషయానైనా పరిష్కారం కేవలం గవర్నింగ్ కమిటీయే చయాల్సివచ్చేది., దీనికి చాల కాలం వృధాగా వేచియుండాల్సి వచ్చేది. శివరావుగారి అధ్యక్షతన ఒక ఫోరాన్ని ఘటన చేయటం తత్కకాల పరిష్కార నిర్ణయాలను తీసుకుని వాటిని గవర్నింగ్ కమిటీ తదుపరి ఆమోదించేటట్టుగా చేయటం జరిగింది. ఆ కాలంలోనే టంగుటూరి ప్రకాశంగారు విజయడ వచ్చి సుభాష చంద్రబోసు విగ్రహావిష్కరణచేశారు, ఆమీటింగులో కొన్ని వర్గములవారి ఆందోళన వల్ల పోలీసులు జోక్యంచేసుకోటం జరిగింది. ఆసందర్భములో పోలీసులవారు లాఠీ చార్జీ చేశారని ఫిర్యాదుమీద ప్రభుత్వమువారు జిల్లాకలెక్టరుచే విచారణజరిపించారు. ఇరుపక్షములవారి కోరికపైన జిల్లకలెక్టరు శివరావుగారినీ, వారి సహచరుడైన వెంకటప్పయ్యగారినీ విడివిడిగా పిలచి జరిగిన విషయం చెప్పమని కోరారుట. శివరావుగారి సమధర్మనిస్పక్షపాత న్యాయ దృష్టి ఆవిధంగా అందరికీ అవగతిలో నుండేది. ఇంక జడ్జీల ప్రవర్తన వల్ల ఇటు న్యాయవాదులకు, అటు కక్షిదారులకూ గూడా కష్టతరంగా నున్న పరిస్థితులో ధైర్యంగా శివరావుగారు వారితో యదురుబడి సరైన దోవపట్టమని కోరిటం పై అధికారులకు వ్రాయటం మొదలగు చర్యలు: ఒక సారి 1947 లో జేసుదాసన్ అనే ఒక జాయింట్ మేజస్ట్రేట్ గారు కక్షిదారులతోనూ అనభవజ్ఞులైన న్యాయవాదులతో కూడా దురుసుగా వ్యవహరించేవారు. ఆపరిస్థితులో శివరావు గారు జిల్లాజడ్జిగారితో మాట్లాడినపిదర జేసుదాసన్ గారిని బదలీ చేయటం జరిగింది. ఇంకో సారి ఆర్ సి జోషి ఆనే సబ్ కలెక్టరు ఐ సి యస్ గారు తమ కోర్టును వారికనుకూలమైన సమయాలలోను, ఇంటిదగ్గరా సాయంత్రం పోద్దుపోయినా కూడా కోర్టును నిర్వహించటం వల్ల కక్షిదారులుకు న్యాయవాదులకు చాల ఇబ్బంది గలుగతూవుండేది. ఆపరిస్థితుల్లో శివరావుగారు జోషీ గారితో పరిస్థితి చెప్పి వారిని సరిగా నిర్నీత సమయాల్లో కోర్టును నిర్వహించమనికోరగా ఆ జోషీ గారు “నాతో ఇట్లాగ ఎవ్వరూ మాట్లాడలేదు” అన్నారుట అంతట శివరావుగారు “ప్రతిరోజు మీ దగ్గర వారి కి పని వుంటుంది అందుకని మీతోఇలా ఎవ్వరూ మాట్లాడరు, మీదగ్గర నాకే మీ పనిలేదు” అన్నారట . అంతట జోషీగారు తమఇబ్బందులును గూర్చి, బయట రాజకీయనాయకులు వీరి పనిలో జోక్యంచేసుంటు వత్తిడి తేవడంవంటి సాకులు చెప్పగా శవరావు గారు “మీరు చేసేది ఐ సి యస్ సర్వీసు, రాజకీయనాయకులతో ఎట్లా వ్యవహరించేదీ మీకు ఇప్పటికే తెలిసి వుండాలి” అని చెప్పారట. దాంతో జోషీగారు తమ దినచర్యలో మంచి మార్పుతో వ్యవహరించారట. కానీ, జోషీ గారి కష్టాలు వత్తిడిలు దృష్టిలోవుంచుకుని శివరావుగారు 20-07-1948 లో హిందూ పేపరులో లేఖ వ్రాయగా కాంగ్రెస్సు నాయకులు తప్పుపట్టి కొండావెంకటప్పయ్యగారిని పంపించి మాట్లాడించగా శివరావు గారు వారికి జోషీగారు పడే ఇబ్బందుల గురించి చెప్పారుట. ఇంకోసారి గోనేళ్ల కృష్ణ అనే ఫస్ట క్లాస్ మేజస్ట్రేట్ గారు కూడా చాల పొద్దుపోయినాకూడా కోర్టు నడిపిస్తుంటే పలువురు న్యాయవాదులు ఇబ్బంది గురించి శివరావుగారికి చెప్పుకోగా వారు కృష్ణాగారికి వ్రాయగా మేజస్ట్రేటుగారు వారి కోర్టును నిర్ణీత సమయాల్లో నడపటం జరిగింది. మద్రాసు హైకోర్టువారు బెజవాడ బార్ యసోసియేషన్ వారిని కోర్టుకేసుల త్వరిత గతిన విచారించటానికి మార్గాలనుకోరగా బెజవాడలో అప్పట్లో అతి అనుభవజ్ఞుడై రిటైరైపోయు న పెద్ది భొట్ల వీరయ్యగారి అమూల్య సలహలను పంపించటం జరిగింది. . న్యాయవాదిగనే కాక శివరావుగారు బార్ యసోసియేషన్ కు సాహిత్యమైన రూపుగూడా ఇచ్చారు. తిరుపతి దేవస్తానమువారికి వ్రాసి గొప్ప ఆధ్యాత్మకమైన తామ్రశాసనములు, సంస్కృతాంధ్ర గ్రంథాలు తెప్పించి బార్ యసోసియేషన్లో నుంచారు. శివరావు గారి హయములోనే భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య దినేత్సవం అతి వైభవంగా గడుపుకోటం జరిగింది. ఆఉత్సవ విందు వైభవాలలో వివధ వుద్యోగస్తులు పెద్దా చిన్నా అని విచక్షణ లేకుండా, అలాగే అన్నివర్గాలవారు, హిందూ, ముస్లిం ఇసాయిల నాయకులు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాలుపంచుకోటం విశేషణీయమైనది. కాని ఆరోజున జరిగిన వేడుకలో బెజవాడ న్యాయస్దాన సబ్ జడ్జిగానున్న అలీ రజా బైగ్ గారు మాత్రం పాలుపంచుకోకుండా వారి ఛేంబరులోంచి బైయటక్కూడా రాకుండా వుండటం ఒక సంఘటన అని శివరావు గారు వారి జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరము కూడా న్యాయ స్థానములోలను ఇతర ప్రభుత్వ కార్యస్తళాలలోనూ ఇంకా ఆంగ్ల రాజుల చిత్రపఠాలు యధా తదంగా వుంచటం చూసి శివరావుగారు హిందూ పత్రికకు 07/08/1947 లేఖ వ్రాయటం జరిగింది. బెజవాడ బార్ యసోసియేషన్ లో న్యాయవాదు ల పేర్ల రిజస్టరును పెట్టి అందులో బెజవాడలో న్యాయవాదులందరినీ మొదటినుండి జతచేశారు. శివరావు గారు అధ్యక్షుడుగానున్నకాలంలో జిల్లాజడ్జి పర్యవెక్షణ కై వచ్చినప్పుడు పార్టీలు చేశేవారు కాదు. అది ఆకాలంలో నున్న ఒక జిల్లాజడ్జి కె.వి.యల్ నరసింహంగారు. ఒకసారి బెజవాడ సబ్ జడ్జీలు వెంకటెశ్ అయ్యర్ బి.సి హెచ్ నారాయణ మూర్తిలు జిల్లా జడ్జికి టీ పార్టీ ఇస్తు శివరావుగారిని కూడా ఆహ్వానించారు. ఆపార్టీలో జిల్లాజడ్జి నరసింహంగారు శివరావుగారితో చాలవిషయాలు మాట్లాడారు. 1947 డిసెంబరులో బారయసోసియోషన్ డే జరుపారు. 1951 లో డా కె యల్ రావుగారి సూచన ప్రకారం విజయవాడకు వచ్చిన కృష్ణా రివర్ కమిషన్ ఖోసలా కమిటీకి బెజవాడ బార్ యసోసియోషన్ వారు శివరావుగారి ఆధ్యక్షతన నందికొండ ప్రజక్టు మొదలు పెట్టడానికి సమర్ధనగా ఒక మెమొరాండం సమర్పించారు. శివరావుగారు ప్లీడర్ వృత్తిలో కూడా నీతి నిబంధనలతో పనిచేశేవారు. ఎటువంటి గొప్ప వారి వత్తిడికీ లొంగకుండా తన కక్షిదారుని పట్ల బాధ్యతో చేశేవారు దానికి నిదర్శనాలు చాల ఉన్నాయి. 1960 లో డా టి వి యస్ చలపతి రావు గారు ఆంధ్ర పత్రికపై వేసిన కేసులో ఆంధ్ర పత్రిక తరఫున శివరావుగారు పనిచేస్తున్న సమయంలో, యసెంబ్లీ ఎలక్షన్ల ల సమయం రాగా కాంగ్రెస్ పార్టీవారు కెయల్ రావుగారిని గొట్టిపాడి భ్రహ్మయ్య గారినీ శివరావుగారి దగ్గరకు పంపించి ఆకేసు రాజీకై ప్రయత్నంచేసి చివరకు కోర్టులో చలపతిరావుగారి తరఫునుంచి ఒక రాజీ పెటిషన్ పెట్టి శివరావుగారిని ప్రతివాది తరఫన సంతంకం చేయమనగా వారు తన కక్షిదారు అనుమతిలేదని అభ్యంతరంతెలిపి అలాచేయలేదు. ఆంధ్రపత్రిక అధిపతైన శివలంక శంభూ ప్రసాద్ గారు వప్పుకుంటేగానీ ఎంత వత్తిడి వచ్చినా ఆకేసు రాజీ చేయలేదు.

1933 లో శివరావుగారిని ఆంధ్ర కోఆపరెటివ్ ఇన్సుటుట్యూటికి డైరక్టరుగానియమించబడ్డారు. తరువాత 1935 లో కృష్ణా జిల్లా కోఆపరెటివ్ స్టోర్సుకు కార్యదర్శిగాను చెరుకుపల్లి వెంకటప్పయ్య అధ్యక్షుని గాను పనిచేశారు. న్యాయవాదిగా శివరావుగారు కోఆపరెటివ్ సొసైటీ అధ్యక్షుడుగానున్న సింగరాజు సుబ్బారావుగారి తరఫున అయ్యంకి వెంకటరమణయ్య గారికి ప్రతికూలంగా కూడా పనిచేశారు. శివరావుగారు స్వాతంత్ర్య సమరయోధులైన ఘంటసాల సీతారామ శర్మ, ఆచార్య ఎన్ జి రంగా గారి తరఫున న్యాయవాదిగా వారి తరఫున కేసులు చేశారు. డా శర్మగారిని ఎన్నికలు కమిషన్ వారు అభ్యంతరాల కేసులో వారి తరఫున వాదన చేశారు. ఎన్ జి రంగాగారు జైలునుండి తన రీసెటల్మెంటు కేసులో 108 సి ఆర్ పి సి క్రింద వచ్చిన కేసులో తన తరఫున పనిచేయమని శివరావుగారిని కోరారు

న్యాయవాది వృత్తితో పాటు సాహిత్య పరిశోధన, స్వాతంత్ర్య సమరయోధన

[మార్చు]
దస్త్రం:As Lawyer D.V.Sivarao in 1956.jpg
1956లో న్యాయవాదిగా శివరావు

1923 డిసెంబరు 28 తారీఖనాడు కాకినాడ కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారు డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారు వైద్య సిబిరం నెలకొలిపి కాంగ్రెస్సు కార్యకర్తలకు సభకు వచ్చిన ఇతర ప్రజానీకానికానికి కావలసిన వైద్య సహాయమునిచ్చారు. ఆ కాకినాడ కాంగ్రెస్సు మహా ఘనంగా జరిగింది. చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు దిగవల్లి శివరావు గారు స్వరాజ్య పత్రికాప్రతినిధులుగా ఆరోజు సభలో పాల్గొన్నట్లు శివరావుగారి డైరీలో వ్రాశారు. 1924లో ఆయ్యదేవర కాళేశ్వర రావు గారు దక్షిణాప్రికామీద పుస్తకము వ్రాయమని శివరావుగారిని ప్రేరణచేసి దక్షిణాఫ్రికామీద ( South Africa in the series of Story of Nations అనే) ఒక పుస్తకమునిచ్చారు అప్పట్లో విజ్ఞాన చంద్రికా మండలికి కాళేశ్వరావుగారు అధ్యక్షడు గానుండి శివరావుగారిని సభ్యునిగా వేశారు. 1926 లో శివరావుగారి స్నేహితుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య మద్రాసు నుండి ఉత్తరం పోస్టుకార్డు మీద వారి బావగారి చిరునామాకి కేర్ ఆఫ్ బి.పూర్ణయ్య టెలిగ్రాఫ్ సూపరింటెండెటు బెజవాడ అని వ్రాశారు. ఆ కార్డు సూపరింటెండెంట్ టెలిగ్రాఫ్ బదులుగా సూపరింటెండెంట్ పోలీసుకు బట్వాడా చేశారు దాంతో పాపం శివరావుగారి బావగారైన బొడ్డపాటి పూర్ణయ్య గారు ప్రభుత్వోద్యోగి గానుండి స్వతంత్ర సమరయోధంలో పాలు పంచుకుంటున్నారనే అనుమానంతో పోలీసువారు పై అధికారులకు తెలపగా పూర్ణయ్య గారిని సస్పెండ్ చేశారు. అటుతరువాత విచారణ జరిపి తిరిగి పదవిలోకి నియమించారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్సు కార్యకర్తగా శివరావుగారికి అప్పటికే గుర్తింపు జరింగిందని చెప్పవచ్చు. 1927 డిసేంబరులో ఆంధ్రా యూనివర్సిటీ కాన్వొకేషన్ కి బెజవాడ వచ్చి న వేదం వెంకటరాశాస్త్రి గారిని బెజవాడ మునిసిప ల్ కౌన్సిల్ వారు లిటీ వారు సన్మానించటానికి సభ ఏర్వాటు చేసి, శివరావుగారిచేత సన్మాన పత్రం వ్రాయించి శాస్త్రిగారికి సమర్పించారు. 1927 డిశంబరు 2 న బెజవాడ మునిసిపాలిటీ వారు భ్రహ్మశ్రీ వేదం వెంకటరామ శాస్త్రి గారిని సన్మానించారు. 1929 ఫిబ్రవరిలో “అల్లాహో అక్బర్” అనే భోగరాజు నారాయణమూర్తి గారు రచించిన పుస్తకమునకు శివరావుగారు తొలిపలుకు వ్రాశారు. వీరు వ్రాసిన తొలిపలుకు బ్రిటిష్ ప్రభుత్వమును బ్రటిష్ ప్రభు భక్తులను చాల ఖఠినముగా విమర్సించటం వల్ల ఆపుస్తకము ప్రభుత్వ టెక్టస్టు బుక్కు కమిటీవారిచే తిరస్కరించ బడింది.

అదే సంవత్సరంలో కోఆపరెటివ్ న్యూస్ అను పత్రికలో ‘భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు ఆవ్యాసమునే ఆధారం చేసు కుని మరల “నిరభాగ్య భారతము” అను వ్యాసమును కృష్ణా పత్రికలో ప్రకటించారు.

ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమాలలో శివరావు పాత్ర, వారి కృషి

[మార్చు]

1930 నుంచీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో స్వతంత్రపోరాటోద్యమాలలో జరిగిన అనేక సంఘటనలు, ప్రముఖుల కార్యకాలపాలు శివరావు గారు తమ డయరీలో వ్రస్తూ 1930 సంవత్సర జనవరీ మొట్టమొదటి అంశం తమ డైరీలో ఇట్లా వ్రాశారు “I was restless with the civil disobedience movement that was in the offing after declaration of Independence in Lahore Congress.” పశ్చమ కృష్ణా జిల్లాకాంగ్రెస్సు మహా సంఘము అనేక చిన్న చిన్న పుస్తకములను కాంగ్రెస్సు కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానము అను పేరుతో ప్రచురించారు. అందులో శివరావుగారు వ్రాసిన చిన్న పుస్తకములు కూడా ఆరు పుస్తకములు ప్రచురించారు. మొట్టమొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12-03-1930 లో ఆంధ్ర గ్రంథాలయం లోముద్రించబడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 06-04-1930 లో ముద్రించబడింది. ఆ తరువాత ఇంకో నాలుగు దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము అను నాలుగు పుస్తకములు కృష్ణా జిల్లా కాంగ్రెస్సు వారి ద్వారా ప్రచురించ బడినవి. ఈ రాజకీయపరిజ్ఞానము అను కృష్ణాజిల్లా కాంగ్రెసేవారి ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు 1933 నవంబరులో నిషేధించారు. 1930 నుంచీ కాంగ్రెస్సుకార్యకలాప్పాలలో శివరావుగారు ఈవిధంగా వెనుకనిలబడి పనిచేశారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్సు పబ్లిసిటీ సమితికి శివరావుగారి అధ్యక్షతన జరిగేది. ఏ రాజనీతి పరిజ్ఞాన కర పత్రంమైనా, కాంగ్రెస్ నాయకుల వ్రాతప్రతుల తర్జుమా లైనా శివరావు గారి కలంతో జరిగేది. 11/04/1930 తారీఖునాడు ఉప్పుసత్యాగ్రాహికుల మొదటి విడతగా గంపలగూడెం కుమార రాజాగారి అధ్యక్షతన బెజవాడనుండి బందరు దగ్గరు చిన్నపురానికి బయలుదేరారు. వారితోపాటు డా ఘంటసాల సీతారామశర్మగారు కూడానున్నారు. 4/04/1930 తారీఖునాడు డా. వెలిదండ్ల హనుమంతరావుగారి అధ్యక్షతన రెండవవిడత బెజవాడనుండి పాదగమనంతో రైల్వేస్టేషన్ కు వెళ్ళి అక్కడనుండి రైలులో మచలీపట్ణానికి వెళ్లారు. అక్కడ రాత్రి డా. పట్టాభిసీతారామయ్యగారింట బస చేసి మర్నాడు ప్రొద్దున్న ముగ్గురు డాక్టర్లూ ( హనుమంతరావుగారు, సీతారామయ్యగారు, శర్మగారు) కలసి 15-04-1930 తారీఖున బందరు దగ్గర చిన్నపురం చేరుకున్నారు. మొదటగా బయలుదేరిన కుమార రాజాగారు చిన్నపురంలో చేసిన ఉప్పు జమచేసుకుని బందరు పట్టుకుచ్చి బందరు బజారులలో అమ్మకం చేశారు. సత్యాగ్రహ సమర ఉగ్రతంగా జరిగే రోజల్లో శివరావు గారు వ్రాసిన అనేక కర పత్రములు పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్సుకమిటీ వారి ప్రచురణల క్రింద కాంగెస్సు కార్యకర్తలకు బోధనానుకూలముగా ముద్రించబడేవి. వారు వ్రాసిన “భారతీయుల దారిద్య్రము” అను వ్యాసము సహకారము అనే పత్రికలో ను, 10/03/1930 తారీఖున వారి పుస్తకము “సత్యాగ్రహ చరిత్ర” ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్ లో ముద్రించబడింది. ఈపుస్తక ఆవిష్కరణం పడమర కృష్ణాజిల్లా వారి రణభేరీతో “శుక్ల సంవత్సరము ఫాల్గుణ శు బుధవారము నాడు సత్యాగ్రహ సమర సుభముహూర్తమున దిగవల్లి వేంకట శివరావు రచించిన సత్యాగ్రహ చరిత్ర డా//ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య, మంచాల సుబ్బారావుగార్ల చే ప్రకటింపబడినది” అని ఉద్ఘోటించబడినది 06/01/1930 తారీఖున వారి ఇంకో పుస్తకం “నిర్భాగ్య భారతము” పడమర కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీవారిచే ప్రచురించబడి స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా విడుదల చేయ బడింది. ఆ కాలంలోనే బెజవాడ బార్ యసోసియేషన్ వారు ఒక ప్రస్తావనచేసి స్వాతంత్ర్యోద్యమానికి సమర్దనగా తీర్మానించారు ఆసందర్భములో శివరాపుగారి డైరీలో ఇలా వ్రాసుకున్నారు “I was in great excitement”. 1930 మార్చి నుంచీ జూన్ మధ్య కాలంలో శివరావుగారివి మరి కొన్ని పుస్తకాలు కాంగ్రెస్సు కమిటీవారు ప్రచురించినవి “ ఆంధ్ర పౌరుషము, కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమము, పాంచజన్యము, దరిద్రనారాయణీయము, బార్డోలీ సత్యాగ్రహ విజయము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము and సత్యాగ్రహ బోధిని” ఈ పుస్తకాలు సాధారణ ప్రజానీకానికి, కాంగ్రెస్సు కార్యకర్తలకు మన దేశ ఆర్థిక రాజకీయ, రాజ్యాంగ విషయాలను సరళమైన తెలుగులో బోధించడానికి ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకాలు. బ్రిటిష్ వారు పరిపాలనలో మనదేశ ప్రజలను ఏవిధంగా ఆర్థికంగా దోచుకుంటున్నదీ ఈ పుస్తకాలలో బోధింప బడినవి. సబర్మతీలో తయారైన ఉప్పును గాంధీగారు తీసుకువచ్చిన రోజుతో జతగా బెజవాడలో శివరావుగారి పుస్తకము సత్యాగ్రహబోధిని 04-05-1930 తారీఖున వెలువడించ బడింది. 08/05/1930 నాడు బెజవాడలో డా వెలిదండ్ల హనుమంతరావు గారి ఆధ్వర్యాన్న జరిగిన ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపులో శివరావుగారు కూడా వెళ్ళారు. కాంగ్రెస్స వారి అధినియమం ప్రకారం మారుమూలల గ్రామాలలో నున్న ఆర్థికక్షీణత, అభివృధ్ధి శూన్యత మొదలుగు అంశాల వాస్తవిక స్థితిని బయటకు తీశే నిమిత్తం చేయబడిన ఒక ప్రశానావళిని శివరావు గారు 10/05/1930 తారీఖనాడు తయారుచేయగా కాంగ్రెస్సు అగ్రనాయకులు గ్రామాలకు వెళ్లినపుడు కాంగ్ర్రస్సు కార్యకర్తలకు ఆప్రశ్నావళి పంచపెట్టి దానిని పూర్తిచేయించి తిరిగి తీసుకుచ్చి శివరావు గారికివ్వటం వారు వాటిని సంకలితంచేయించి వ్యాఖ్యానంచేసి కాంగ్రెస్సు అధిష్ఠానంకి పంపిచేవారు. ఉప్పు సత్యాగ్రహ ఆందోళన కాలం 1930 లో కృష్ణాజిల్లా ముఖ్యంగా బెజవాడలో జరిగనటువంటి కార్యకలాపాలు ఈ క్రింది విధంగా వివరించారు:

15/04/1930 తారీఖునాడు గంపలగూడెం కుమార రాజాగారు, డా వెలిదండ్ల హనుమంతరావు గారు రెండు విడతలుగా చిన్న పురం వెళ్ళి వారు తయారు చేసితీసుకుచ్చిన ఉప్పును అమ్మకం చేశారు. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురం లోఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్ణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న యావన్మంది ప్లీడర్లు (శివరావుగారుకూడ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న ఆంగ్ల మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీ. సత్యాగ్రహం ఉద్యమంలో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్సు నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావరు గారు కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారు. గంపలగూడెం కుమార రాజా గారు, డా ఘంటసాల శర్మ గారు మొదలగు ప్రముఖలకు కూడా శివరావు గారే అమికస్ క్యూరీగా నున్నారు. శివరావు గారి మీద వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46 of 1930. అందులో శివరావు గారు Respondent (దోషి, = ప్రత్యర్థి ), తనకు వకీలు తానే. 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు గారిచ్చివ వాగ్మూలం ఈ విధంగా “I am the Circle inspector of Bezawdada . I know the respondent. He took active part in civil disobedience campaign and is assisting all most all the civil resisters who were prosecuted by giving legal assistance. I also found him in Congress building whenever I went to arrest members there”. ఆ వాగ్మూలాన్ని బట్టి శివరావు గారు న్యాయవాదిగా స్వాతంత్ర్యసమర యోధములో ఎంత కృషి చేసినది విశదమౌతుంది.

04/05/1930 నాడు బెజవాడలోని యావన్మంది ప్లీడర్లు ఆప్పటి మూడురంగుల జాతీయ పతాకమును పట్టుకుని రహదార్లలోఊరేగింపుగా వెళ్లారు. 1/05/1930 నుంచీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఉప్ప సత్యాగ్రహ ఆందోళన కారణంగా జేలుకు వెళ్ళటం వలన వారు బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు ఆధ్యక్ష పదవి పోయినది వారి స్థానములో సీ. కోదండ రెడ్డిగారిని ఎన్నకునుట జరిగింది. వీరుl 01/12/1930 వరకు అధ్యక్షునిగాకొనసాగారు. డా ఘంటసాల సీతారామశర్మగారు 1930 మే మధ్యలో పలు గ్రామాలకు పర్యటనచేసి శివరావుగారు చేసిన ప్రశ్నావళి పూర్తిచేయించి తీసుకుచ్చి యిచ్చారు. అంతలో ఉప్పు సత్యాగ్రహకార్యకలాపాలకి వారికి కూడా 18 నెలల ఖటిన ఖారా గార శిక్ష విధించబట్టి వారు కూడా జైలుకు వెళ్లారు. వారి కేసులో శివరావుగారు అమికస్ క్యూరీ (amicus curie ) గా నున్నారు. 21/06/1930 తేదీన బెజవాడలోని ఆంధ్రరత్న భవనాన్ని పోలిసు వారు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో సెక్షన్ 144 విధించారు మీటింగులూ ప్రసంగాలు నిషేధించారు. 1930 జూన్ నెల 6 వతారీఖునాడు రాజమండ్రీ జైలులో నున్న డాక్టరు ఘంటసాలసీతారామ శర్మ, వెలిదండ్ల హనుమంతరావు, డాక్టరు రాయప్రోలు సీతారామ శాస్త్రీ వేలూరి యజ్ఞన్నారాయణ శాస్త్రి, నూకల వీర రాఘవయ్య బ్రహ్మాండం నరసింహం గార్లను రాజమండ్రీ జైలునుండి తెల్లవార్ఝామున పాసింజరు రైలు బండిలో వెల్లూరుకు విజయవాడమీదుగా తీసుకు వెళ్లారు. విజయవాడ రైలు స్టేషన్ లో వారిని చూడ్డానికి వచ్చిన దిగవల్లి శివరావుగారు ఇతర మిత్రులును పోలీసు వారి నిఘాలో బహుక్లుప్తంగా మాట్లాడనిచ్చారు. అప్పడు రైలుబండిలో ఖైదీలు గానున్న వారిలో కొందరు శివరావు గారికి చిన్న చిన్న చీటీలు మీద సమాచారాం వ్రాసి పోలీసులు చూడకుండా అందిచారు. డా శర్మగారి చిన్న ఉత్తరం ఆరోజు శివరావుగారి కిచ్చిన దాంట్లో వారిని వెలిదండ్ల హనుమంతరావుగారి నీ ఆ రోజు తెల్ల వార్ఝామున పోలీసు సార్జంటు కృూరంగా నిర్దయగా లాఠీతో కొట్టాడని వారి సామానులు జగ్గులు కళ్ల జోడులు, లాంతర్లను విరక్కొట్టాడని అలా ఎందుకు చేసినదీ మావల్ల తప్పుఏమిటో మాక్కూడాతెలీదు అని వ్రాసి ఇచ్చారు. ఆ వుత్తరం నకలు శివరావుగారి చేతి దస్తురీతో వారి నోట్సులో నున్నది. స్వతంత్రయోధుడు, వకీలును అగు పీసుపాటి సీతాకాంతం గారు తిరుఊరు జైలులోనుండగా జఫర్ షరీఫ్ అనే పోలీసు హెడ్ పోలీసు బంట్రోత్తు సీతాకాంతం గారి ధోవతిని తీసివైచి దౌర్జన్యంగా కొట్టాడు అందుకు సీతాకాంతంగారు ఆపోలీసు మీద క్రిమినల్ కేసు పెట్టగా ఆ కేసు విచారించిన జాయింట్ మేజిస్ట్రేట్ ఆపోలీసుకు చాలా తక్కువ శిక్షతో రూ 20/-జుల్మానా విధించారు. ఆ తీర్పును పై అధికారైన ఆంగ్లేయ జిల్లా కలెక్టరు పక్షపాత దృష్టిలో ఆమాత్రపు శిక్షకూడాఇచ్చివుండకూడదని వెల్లడించి నట్లు తెలిసింది. స్వాతంత్ర్య సమరయోదులైన బారూ రాజారావు గారు, ధూలియా జైలునుండి విడుదలై వారి స్వగ్రామం రాజమండ్రీకి వెళుతూ బెజవాడలో దిగి శివరావుగారి ఆతిధ్యం స్వీకరించారు. గాంధీ ఇర్విన్ సంధి క్రింద పోలీసు కేసులు ఉపసంహరణ ఫలితం గా02/03/1931 తారీఖనాడు ఇదివరలో జప్తుచేసి న ఆంధ్ర రత్న భవనాన్ని తిరిగి కాంగ్రెస్సు వారికి అప్పగించటానికి బెజవాడలో కాంగ్రెస్సునాయకులందరూ జైలులో వుండబట్టి శివరావుగారిని తత్కాలీన నాయకునిగా ఎంచి వారికి అప్పచెప్పారు. శివరావుగారు వారి మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య ఇతర కాంగ్రెస్సు కార్యకర్తలు కలసి ఆంధ్రరత్న భనన్ కు సున్నంకొట్టించి రంగులు కొంతవారకూ స్వయంగానే వేసి జైలునుండి బ్యాచ్ లు బ్యాచ్ లుగా విడుదలై వచ్చిన స్వతంత్ర యోధులకు సన్మాన పుర్వకంగా ఆహ్వానం చేశారు. అప్పుడు కాంగ్రెస్సు వాలంటీర్సుచేసిన నినాదం “నహీ డరెంగే ” జైలు నుంచి వచ్చిన మొదటి బ్యాచిలో వున్నవారు జి. దుర్గాబాయి, సృంగార కవి, లక్షమణ్ రావు మొదలగు వారు. 07/03/1931 తారీఖున టంగుటూరి ప్రకాశంగారు ఆంధ్ర రత్నభవన్ కు వచ్చి జాతీయ జండా ఎగురవేశారు. 12/03/1931 తారీఖున డా శర్మ, నల్లూరి పాపయ్య చౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణ మొదలగు వారిని వెల్లూరు జైలు నుండి విడుద లచేశారు. దారిలో మద్రాసులో కొన్నిరోజులుండి వారు 4/03/1931 తారీఖున బెజవాడ చేరుకున్నప్పు డు శివరావు ప్రభృతులు రైలు స్టేషన్ కు వెళ్లి స్వాగతం చెప్పారు కృష్ణా పడమర జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగు 1931 మార్చిన 10/03/1931న ముదునూరులో జరిగిన సత్యాగ్రహ సన్మాన సభకు డా శర్మ, మతం బాలసుబ్రమణ్యం వెళ్ళారు

తరువాత ఆంధ్ర కాంగెస్ కమిటీ మీటింగులు 1931 ఏప్రిల్ లోను జరిగినవి. స్వరాజ్య పత్రికకు వెంగళ రామయ్య బెజవాడలో ఏజన్సీ తీసుకోటానికి నశ్చయించారు. 10/05/19131 తారీఖున ప్రకాశంగారు బెజవాడ వచ్చారు నిధులు పోగుచేసుకునేందుకు

1930 , 1931 సంవత్సరాలలో శివరావు పై రాజద్రోహం కేసులు

[మార్చు]

గాంధీజీ దండి యాత్రకు బయలు దేరిన తేదీ12/03/1930. ఆదే రోజున బెజవాడ బార్ యసోసియేషన్ వారు గాంధీజీ నిరాకరణోద్యమము (Civil Disobedience movement) కు మద్ధతుగా ఒక సంకల్పమును (రిజొల్యూషన్) పాస్ చేశి మినిట్సు రికార్డు చేశారు. అరోజునాటి తమ వ్యక్తిగత మనోభావన శివరావుగారు తన డైరీలో ఇట్లా వ్రాశారు “I was in great excitement”. వారు ప్రత్యక్షంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఉప్పు తయారుచేయక పోయినప్పటికీ వారు కాంగ్రెస్ కార్యకర్తగానూ, కృష్ణాజిల్లా కాంగ్రెస్ పబ్లిసిటీ అధినేతగనూ వారు చేసిన అనేక రచనలవలన ప్రజలను కాంగ్రెస్సు కార్యకర్తలను బ్రిటిష్ ప్రభుత్వంచేసే దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా ప్రోద్బలం చేస్తున్నందు వల్లనూ శివరావుగారిని ఏక్షణమునైనా పోలీసువారు నిర్బంధనలోకి తీసుకుంటారని అందరకూ అప్పట్లో విశదమైన విషయం. శివరావుగారు కూడాఎరిగన విషయమే. అందుకని వారి కుటుంబం పిల్లల క్షేమం చూసే దిక్కు తన తల్లిగారైన మాణిక్యాంబగారి పేరట 06/04/1930 తారీఖు న ఒక ట్రస్టుడీడ్ వ్రాసి తన పేరుమీదనున్న స్దిరాస్తిని అవసరమైనప్పుడు అమ్మకం చేసుకోవచ్చని చెప్పి జైలు కెళ్లటానికి సంసిధ్ధులుగా వున్నసమయానికే 23/06/1930 తేదీన పోలీసు వారు సర్కిల్ ఇనస్పెక్టరు ఎన్ యల్ యన్ ఆధ్వర్యంలో శివరావుగారి ఇల్లు సోదా చేసి వారు రచించిన పుస్తకములేవైతే ప్రభుత్వము నిషేధించారో వాటిని పట్టుకుని జప్తుచేశారు. ఆ పుస్తకాలతో పాటు బార్ యసోసియేషన్ వారి మినిట్సు పుస్తకం దేంట్లోనైతే బార్ యసోషియేషన్ వారి సంకల్పంచేసి న రిజొల్యూషన్ వున్నదో దాన్నికూడా జప్తు చేయటానికి ప్రయత్నించారు. పోలీసువారు శివరావుగారి మీద 25/08/1930 తారీఖున Sec108 CRPC సెక్షన్ 108 సి ఆర్ పి క్రింద కేసు MC 46/30 దాఖలు చేశారు మేజిస్ట్రేటు కోర్టుకు హాజరుకమ్మని సమన్ పంపిచారు. అప్పటి మేజిస్ట్రేటు హెజ్మడే అను ఐ సి యస్ అధికారి. శివరావు గారు జైలు కెళ్లటానికి సంసిధ్ధమౌతుండగా బెజవాడలో నున్న ప్లీడర్లు చాలమంది సిడాంబి రాజగోపాలచారి (పెద్ద ప్లీడరు) గారితో సహా కలసి వారింటికుచ్చి ఆకేసును కంటెస్టు చెయమని తను కనుక జైలు కెళ్లిపోతే మిగతా ప్లీడర్లమీద కూడా అలాంటి కెసులు వస్తాయని (బార్ యసోసియేషన్ వారు సత్యాగ్రహాన్ని సమర్ధిస్తూ రిజొల్యూషన్ చేసినందుకు) పట్టుబట్టగా శివరావుగారు కోర్టులో హాజరై తనమీద అట్లాంటి రాజద్రోహం కేసులో గవర్మరు ఇన్ కౌన్సిల్ వారి ఆమోదం కావలసియుండును. అటువంటి ఆమోదం లేకుండా ఈ కేసు దాఖలు చేయటం చట్ట విరుధ్ధ మని కంటెస్టు చేస్తూ పెటిషన్ పెట్టారు. ఆమరుసటి రోజునే ( 26-08-1930) తేదీన శివరావు గారి తృతీయ కుమార్తె జననం అవటం అందుకామెకు జయలక్ష్మి అని పేరు పెట్టంటం జరిగింది. పోలీసు వారు శివరావుగారి న్యాయవాది పట్టా రద్దు చేయటానికి హైకొర్టుకి వ్రాసినట్లుగా పోలీసు వారు మాజిస్ట్రేటుతో జిరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు కోర్టులో దాఖలు చేసినదానిని బట్టి తెలిసింది.[10] శివరావుగారి పెటిషన్ విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు కోర్టులో శివరావుగారి రచనలు ప్రభుత్వద్వేషముకలుగజేసి సహాయనిరకణ పెంపోందిచేలాంటివి అనిన్నూ, శివరావుగారు తన న్యాయసలహాలతో అప్పటిదాక అరెస్తు చేయబడ్డ చాలమంది స్వతంత్ర సమరయోధుల తరఫును అమికస్ క్యూరిగా కోర్టువారి అనుమతితోనే పనిచేస్తున్నారన్నీనూ పోలీసు వారు ఎప్పుడు కాంగ్రెస్సు కార్యాలయానికి వెళ్లునా శివరావు గారు అక్కడ పుండటం జరుగుతున్నదన్నీనూ సర్కిల్ ఇన్ స్పెక్టరు గారు కోర్టులో తన వాగ్మూలంలో పేర్కొన్నాడు. ఆకేసులో సాక్ష్యంకోసం వెల్లూరు జైలులో నున్న నల్లూరి పాపయ్యచౌదరీ, వేలూరి యజ్ఞన్నారాయణశాస్త్రి గార్లను వెల్లూరు సెంట్రల్ జైలునుండి పోలీసు యస్కార్టుతో బోళెడుడబ్బు ఖర్చుచేసి 16-10-1930 తారీఖు వాయిదాకు తీసుకుచ్చారు. ఆ కేసు విచారణలో సర్కిల్ ఇన్ స్పెక్టరు సమక్షంలో ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయానికి చెందిన కర్లపాలెం కోదండరామయ్య గారి వాగ్మూలం, మరి యు అనేక మంది స్వతంత్రసమరయోధలును సాక్షులుగా తీసుకువచ్చారు. వారిలో ఉప్పలూరి లక్ష్మీనరసిహారావు, సి వి కృష్ణయ్య నాయడు విజయరాఘవులు నాయడు భైరవ స్పెషల్ డ్యూటి సబ్ ఇన్ స్పెక్టరు సూర్యదేవర రామచంద్రరావు, మంచాల వెంకట సుబ్బారావు మొదలగు వార్లను సాక్షులుగా పేర్కొన్మారు ఆ వాయిదా తేదీ నాడు శివరావుగారి పెట్టిన పెటిన్ ను ఆమోదించతూ మేజిస్ట్రేటు హెజ్మాడె గారు పోలీసువారి కేసు కొట్టివేయటం (quashed) జరిగింది. పోలీసు వారికి పరాభవం ఉక్కురోషం కలిగి వెల్లూరు నుండి తీసుకుచ్చిన సాక్షులను మరల తిరుగు ప్రయాణంలో వెనక్కు తీసుకుని వెళ్లారు. పోలీసు వారు వెంటనే గవర్నరు ఇన్ కౌంసిల్ ఆమోదం కోసం సన్నాహాలు ప్రారంభించి రెండో సారి మళ్లీ ఇంకో కేసు దాఖలు చేశారు.

మళ్ళీ రెండో రాజద్రోహం కేసు

[మార్చు]

1931 లో బెజవాడ పోలీసు వారు మద్రాసు లోనున్న అడ్వకేట్ జనరల్ ద్వారా కూడా వెళ్ల కుండా తిన్నగా గవర్నరు ఇన్ కౌన్సిల్ వద్దకే వెళ్లి శివరావుగారి మీద కేసు పెట్టుటకు అనుమతి తీసుకుని బెజవాడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ 15/01/1931 తారీఖున రెండవసారి శివరావుగారి మీద సెక్షన్ 108 సి ఆర్ పి సి క్రింద జాయింట్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు MC 8/31 ను దాఖలు చేశారు. ఈ కేసు 09-01-1931 నాడు విచారణ మొదలైంది. కాని 30-01-1931 నాడు గాంధీ గారీతో సంధికుచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం సంధి పత్రం గాంధీ-ఇర్విన్ సంధి (Gandhi-Irwin Pact) మీద 05-03-1931 నాడు సంతకాలైనవి. ఆ సంధి వప్పందాల ప్రకారం రాజద్రోహం కేసులన్నీ విరమించుకోవాలి. అందు కని దేశం అంతటా అలాంటి రాజద్రోహం కేసులవిచారణలు వాయిదాలు పడ్డం మొదలై చివరకు ఉపసంహరింప బడ్డాయి. ఇక్కడ బెజవాడలో కూడా శివరావుగారి మీద కేసు విచారణ వాయిదాలు వేయటం మొదలైంది . శివరావుగారి పై కేసు MC 8/31ను ఉపసంహరించుకున్నట్లుగా ప్రభుత్వ జి ఒ (GO No.374 M.S) తారీకు 15/03/1931 న విడదలచేశారు తత్ఫలితముగా ఆకేసును 30-04-1931 తారీకునాడు కోర్టులో ఉపసంహరింపబడింది. అప్పటి జాయింట్ మేజిస్ట్రేటు టి శివశంకర్ అయ్యర్ శివరావుగారిని కేసునుండి అధికారరూపంగా ముక్తి (discharged from the case) చేశారు.

మళ్ళీ రెండోసారి సోదా

[మార్చు]

మళ్లీ రెండోసారి 02/02/1932 తారీఖున పోలీసు వారు సోదా చేశినప్పుడు శివరావు గారు రచించిన పుస్తకములు కొన్నిటిని జప్తుచేయటమే కాకుండా వారి వ్యక్తిగత పుస్తక భాండారులో నున్న పుస్తకాల్లోంచి మహదేవ దేశాయి గారు రచించిన the Story of Bardoli అనే పుస్తకం ( ఆ పుస్తకం నిషేధించబడ లేదు, అయినా గూడా ) పోలీసు వారు జప్తుచేసుకుని తీసుకెళ్లిపోవటం వల్ల 12/02/1932: తారీఖున ఆప్పటి జాయింట్ మేజిస్ట్రేటు హెనింగ్టన్ అను వారికి శివరావుగారు కంప్లైంటు వ్రాయగా వారు జవాబు వ్రాసి తన పై అధికారైన మేజిస్ట్రేటు గారికి ఆపుస్తకం పంపించి విచారిస్తామని జవాబు వ్రాశారు కానీ ఆపుస్తకం తిరిగి శివరావుగారికీ రానేలేదు.

1932 civil disobedience movement ఉద్యమంలో శివరావు పాత్ర, వారి కృషి

[మార్చు]

ఆంగ్ల ప్రభు భక్తి, ఆంగ్ల సంస్థానలపై సంయమనం కలిగియున్నంత కాలం దేశీయ ఉద్యోగులలోను సామాన్య ప్రజలలోను గూడా స్వపరిపాలనా కాంక్ష కలుగదని గ్రహించిన గాంధీగారు ఈ సహాయ నిరాకరణోద్యమము చేపట్టారని శివరావుగారు 1966 లోజరిగిన తన సన్మాన సభలో చేప్పారు. 1932 ఏప్రిల్ నెలలో కాకినాడ వాస్తవ్యులు కాంగ్రెస్సు అగ్రనేత అయినట్టి డా చెలికాని రామారావు గారు కాంగ్రెస్సు బోధనలు కార్యకలాపాలు మార్గదర్శనాలు మోదలగు విషయాల కరపత్రాలు రహశ్యంగా బెంగుళూరు నుండి ముద్రించి ఈ ప్రాంతల్లో పంచపెట్టతున్న రోజులలో బెజవాడనుండి శివరావుగారు మారు పేరుతో (వెంకట్రావను మారు పేరుతో) వారితో కలసి పనిచేస్తూ తపాలా పెట్టిలాగ జనార్దనరావు అనే ఒక ఇన్స్యూరెన్స ఏజెంటు ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపెవారు.. ఇంకో ఇద్దరు జగన్నాద దాసు, ధరణీప్రగడ సేషగిరి రావు మద్రాసులో నుండి కాంగ్రెస్ కార్యకాలపాలకు ధనం పోగుచేశి ఇక్కడికి పంపిచేవారు. అన్నే ఆంజనేయులుగారు కాంగ్రెస్సు కార్యకర్తలకోసం గ్రామాలలో ప్రచురించే “Ready” అనే పత్రికకు శివరావుగారు చేదోడుగా బెజవాడనుండి అదే పత్రికను సైక్లోస్టైల్ చేసినెలకు 40 మందికి మేజస్ట్రేట్, పోలీసు ఆఫీసర్లకు కూడా పంపిచేవారు. ఈ సైక్లోస్టైల్డు పత్రికనడపటానికి వేలూరి యజ్ఞన్నారాయణ గారు, నూకల రామ గారు కృషి సల్పేవారు. ఇంతే కాక బ్రిటిష్ ప్రభు భక్తులైన ఉద్యోగస్తులను, పోలీసు వారిని హెచ్చెరిస్తూ కాంగ్రెస్సు ప్రభుత్వము త్వరలో రాబోవునని ఇప్పుడు బ్రిటిష భక్తులు వారి వారి దష్ట చర్యలకు జవాబుచెప్పుకునే రోజు త్వరలోనే రాబోవునని హెచ్చరిస్తూ శివరావుగారు వ్రాసిన కరపత్రములు అచ్చువేయించి కాంగ్రెస్సు కార్యకర్తలు వాటిని పంచపెట్టేవారు. 14/07/1932 నాడు శివరావుగారు మద్రాసు లెజిస్లెటివ్ కౌన్సిల్ కు ఒక ప్రార్థనా పత్రం పంపి కృష్ణాజిల్లాలో జరుగుతున్న పోలీసు వారి నిరంకుశత్వమైన లాఠీ చార్జీలును గూర్చి. ఆ పత్రంలో వారు పోలీసువారి లాఠీచార్జీలో దెబ్బలు తగిలి బెజవాడలోని పీపుల్సు హాస్పిటల్ అన బడే డా శివలంక మల్లిఖార్జునరావుగారి వైద్యశాలలో వైద్యసహాయం పొందిన వారి దిన దిన సంఖ్యలతో సహా పంపిచారు. 1932 ఆగస్టులో శివరావుగారు కాంగ్రెస్ పశ్చమ కృష్ణా జిల్లా వారి తరఫునే కాకుండా ఆంధ్ర ప్రొవెస్సియల్ తరఫున రెండు వేరు వేరు రిపోర్టులు తయారుచేసి కాంగ్రెస్స అధిష్టానంలో మదన్ మోహన్ మాలవ్యా గారికి అప్పటి బనారస్ హిందూ విశ్వావద్యాలయ కాలేజీ ప్రిన్సిపాలుగా నున్న రుద్రాగారి ద్వారా పంపించారు. ఆరెండు రిపోర్టులు కాంగ్రెస్సు అధిష్ఠానం 15/10/1932 తారీఖునాటి ఎ ఐ సి సి వారి జాతీయ బులెటిన్ లో ముద్రించారు. అంతే కాక ఎ ఐ సి సి వారు తమ రిపోర్టులో పశ్చమకృష్ణా జిల్లా వారి ఈ రిపోర్టులను కొనియాడారు. 1932 సెప్టెంబరు 5 నాడు ఇండియా లీగు డెలిగేషన్ వారు బెజవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్సు వారి తరఫున శివరావు గారు ఒక మేమొరాండమ్ వ్రాసి స్వయంగా లీగు సభ్యులను కలుసుకుని వారికి అందజేశారు. బెజవాడలో జనవరి 4 వతారీకు 1932 లో section 144 CRPC క్రింద మీటింగులు నిషేధిస్తూ చాటింపుచేసి ప్రత్యేకంగా డా శర్మగారు ప్రభ్రతుల పేరు పేరునా నోటీసు జారీ చేశారు. శివరావు గారు రచించిన 1930 లో ప్రచురించిన ఒక కరపత్రము “దరిద్రనారాయణ “ 1932 లో ప్రెస్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స క్రింద నిషేధించారు [ Saint George Gazette 1932 ]. శివరావుగారు రచించి న కరపత్రాలను ( నిర్భాగ్య భారతము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము మొదలగు కరపత్రములును ) ఆయ్యదేవర కాళేశ్వరరావు, కాట్రగడ్డ మధుసూదన రావు, కాకుమాను లక్షయ్య చౌదరీ గార్లు పంచపెట్టారని నేరారోపణ కేసు మీద వీరి ముగ్గురును 09/01/1932 తేదీనాడు పోలీసువారు జాయింటు మేజిస్ట్రేటు యస్.ఏ వెంకట్రామన్ ఐ సి యస్ గారి కోర్టులో విచారణకు హాజరు పరిచారు. ఆ కరపత్రాలు చూచిన జాయింటుమేజస్ట్రేటు “ఈ కరపత్రాలు ఎవ్వరు వ్రాశారో గాని అవి చాల తీవ్రమైన ధాటిలోనున్నవి ” అని అన్నారట ఆ విచారణకు పోలీసు సూపరింటెండెంటు కూడా బెంచిమీద కూర్చుని వున్నాడట ( అలా కూర్చోటం అనుచితమే కాక అనర్హతమైన ట్టిది). 29/01/1932 తేదీ నాడు కాట్రగడ్డ మధుసూదనరావుగారి తల్లి రామశేషమ్మగారిని పోలీసులు నిర్బంధనలోకి తీసుకున్నారు ఎందుకంటే ఆమె మొగల్రాజ పురంలో 26/01/1932 తేదీన భారత స్వతంత్రదినోత్సవంగా పరిగణించి జరుపుకున్నారట అందుకు ఆమెకు 6 నెలల ఖారా గార శిక్ష మరియూ జల్మానావిధించారు. ఆవిడ జుల్మానా కట్టకపోతే ఆవిడచేతివి వారి కోడలు చేతి గాజులు జప్తుచేశారు ఆ విధంగా పోలీసుల దురహంకార చర్యలు చేశారు. ఇంకో చోట పోలీసువారు ఇద్దరు మహిళలు బట్టల కొట్టును ముట్టడించినందుకు వారిద్దరును నిర్బంధించి కొన్ని గంటల సేపు కదలనీవకుండా నిర్బంధించి కొట్టి 90 మైళ్ళ దూరం తీసుకు పోయి వదలి పెట్టారు . ఇంకో చోట ఒక గృడ్డి వాడైన భువనవడియం నాగభూషణం అనే వ్యక్తి మూడురంగుల జండా పట్టుకుని ఆనందిస్తున్నందుకు పోలీసులు నిర్బంధించి కొట్టారు. మరి ఇంకోచోట కాంగ్రెస్సు కార్యకర్త వేదాంతం సోమేస్వర శాస్త్రిని రక్తంచిమ్మే వరకూ చితక కొట్టారు. 13/04/1932 తేదీన కాంగ్రెస్సు వాలంటీర్లు జలియన్ వాలా బాగ్ కాల్పుల కర్మకాండ దినం జరుపుకున్నందుకు పోలీసులు కొట్టారు. 27/04/1932 తేదీన వాలంటీర్లు తపాలా కార్యాలయమును ముట్టడించారని నేరంపై కొట్టారు. ఆ విధంగా 14/02/1932 to 04/07/1932 మధ్య జిల్లాలో చేసిన పోలీసుల అత్యాచారాలను శివరావుగారు వ్రాసి మద్రాసు లెజిస్లేటివ అశంబ్లీలో ప్రశ్నించవలసినదని కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన సభ్యులు మహాబూబ్ అలీ బైగ్, సి కోదండరామిరెడ్డి గార్లను కోరారు కానీ వారేమీ కలుగజేసుకో నందున శివరావుగారు వాస్తవిక స్ధితులతో కూడిన ఒక మెమొరాండమ్ తయారు చేసి తన సహోగ్యులైన 20 మంది న్యాయవాదులైన బెజవాడ బార్ మెంబర్లచేత సంతకాలు పెట్టించి తన చిననాటి మిత్రు డూ అప్పటి మద్రాసు లెజిస్లేటివ యశంబ్లీలో సభ్యలూనూ అయిన, మంగళూరులో వకీలుగాయున్న యూ సి భట్ గారికి పంపిచి కృష్ణాజిల్లాలో జరిగిన పోలీసు దుండగ చర్యలను యశంబ్లీ టేబుల్ పై పెట్టి ప్రశ్నంచగా అప్పుడు ప్రభుత్వము వారు దానిని ప్రింటు చేసి ఒక మెమొరాండమ్ ను విడుదల చేశారు అందులో జవాబుగా ప్రభుత్వమువారు ఏమీ చెప్పలేక నీరుకార్చారు. శివరావుగారు స్వతంత్రపోరాటములో చేసి న కృషి అలాగ బహుముఖములుగానున్నది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లాసరీ ( నిఘంటువు) కమిటీ లో శివరావు కృషి

[మార్చు]

1957 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభాద్యక్షులైన ఆయ్యదేవర కాళేశ్వరరావుగారు వారు ఏర్పాటు చేయునున్న గ్లాసరీ సంస్థ గురించి ముందుగా ముఖ్యమైన నలుగురు ప్రముఖలుకు వారి అభప్రాయముకోరుతూ వ్రాయగా వారు నలుగురూ (గిడుగు సీతాపతి, నార్ల వెంకటేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ) ఏక ఖంఠంతో శివరావుగారిని సభ్యునిగా చేర్చమని వ్రాశారు. శివరావు గారు 1934 లోనే వ్యవహారిక పదకోశము, శాస్త్ర పరిభాష రచించినవారైనందున వారి పేరు ఆ నలుగురు ప్రముఖులు వక్కాణించటమైనది. శివరావుగారి ఆ పుస్తకమును గూర్చి మద్రాసు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అల్లాడి కృష్ణ20/1/1935 న ఇలా వ్రాశారు “this book is first of its kind and supplies a long felt need”. ఆ కమిటీ హైదరాబాదులో శాసన సభా మందిరంలో జరిగేది దానికి విజయవాడలోని రెండు ఉప సభల్లో నొకటి శివరావుగారి ఇంట్లో జరిగేది. మొట్టమొదట 1957 అక్టోబరులో హైదరాబాదు కమిటీలో 32 మంది సభ్యులతో చేయబడింది. తరువాత 1958 డిసెంబరులో సభ్యులని 16 మందిగా చేశారు తరువాత రెండు సబ్ కమిటీలు విజయవాడలోపెట్టారు. 1958నాటి విజయవాడ శివరావు గారింట్లో సబ్ కమిటీకి విశ్వనాధ సత్యనారాయణ గారిని అధ్యక్షునిగాను శివరావుగారిని కన్వీనరు. సభ్యులు కాటూరి వెంకటేశ్వరారావు,, గరికిపాటి కృష్ణమూర్తి, యమ్. ఆర్. అప్పారావు (శాసన సభ్యులు), గిడుగు వెంకట సీతాపతి, రామ నాయడు (శాసన సభ్యులు) మల్లంపల్లి సోమసేఖర శర్మ భమిడిపాటి కామేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. అదే సబ్ కమమిటీని తిరిగి మార్పుచేసి 1959 ఫిబ్రవరిలో శివరావుగారిని అధ్యక్షతన, రామ నాయడు, గరికిపాటి కృష్ణమూర్తి, కంభంపాటి సత్యనారాయణ సభ్యులుగా యున్నారు. 1958 డిసెంబరులో History Academy పునావర్దీకరించబడినది దాని గవర్నింగ్ కౌన్సిల్, ఎడిటోరియల కమిటీ కాళేశ్వరారావుగారి అధ్యక్షతన సభ్యులు శివరావుగారు, రాళ్లబండి సుబ్బారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారును. పుట్టపర్తి శ్రీనినివాసాచారి గారు కార్యదర్శి. 1959 లో శివరావుగారు వ్రాసిన ఆఫ్రికాజాతీయోద్యమము పుస్తకమును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్ర విజ్ఞాన అకాడమీ వారు ప్రచురణను. 21-08-1959 తేదీన భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు పుస్తకావష్కరణ చేశారు. 1960 సెప్టెంబరులో కాళేశ్వరరావుగారు శివరావుగారిని భారత రాజ్యాంగమును తెనుగుసేతచేయమని కోరారు అటుతరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు చరిత్ర విజ్ఞాన అకాడమీ వారి ఆధర్యములో ఇంకో కమిటీ వేసి అందులోకూడా శివరావుగారిని సభ్యులుగా నియమించారు. 1961 లో కాళేశ్వరారావు గారు శివరావుగారు రచించే పుస్తకము ఆంధ్రప్రదేశ్ చరిత్రను తొందరగా పూర్తిచేయమని ప్రేరేపించేవారు. ఈలోపల కాళేశ్వరరావుగారు 26-02-1962 లో పరమదించగా అప్పట్లో విద్యాశాఖా మాత్యులుగానున్న పి. వి. నరసింహారావుగారి అధ్యక్షతన అన్నికమిటీలు కొనసాగాయి. 11/05/1962 నాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ముగ్గురు సభ్యలు గల కమిటీలో శివరావుగారిని నామినేట్ చేశారు. ఈ కమీటియొక్క వుద్దేశం విలువైన వ్రాత ప్రత్తులను మైక్రో ఫిల్మింగే చేసి ప్రచురించటం for arrangemts to take Micro film copies of Mackenzie manuscripts (to be microfilmed and published). అప్పట్లో జరుగుతున్న ట్రాన్సలేషన్ కమిటీలో సభ్యులుగానున్న శివరావు గారు హిందీ మాటలను తెలుగులోకి తీసుకుస్తున్నందుకు శివరావుగారు ఆభ్యంతరం తెలిపి సభకు రాజీనామాచేశారు. పి. వి నరసింహరావుగారు అప్పటి విద్యా మంత్రి ఆ సభకు అధ్యక్షులు గానున్నారు. అలా హిందీ మాటలను తెలుగులోకి తీసురావటంగురించి శివరావు గారు హిందూ పత్రికలో లేఖవ్రాశారు. వారి రాజీనామాకి కారణం ఆంధ్రప్రభవారు ప్రచురించారు.

రాష్ట్రప్రభుత్వం పై కాపీరైటు ఉల్లంఘన దావా

[మార్చు]

1941 లో ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర అను పుస్తకము మూడవ సంకలనం కాపీ రైటుతో శివరావుగారు ప్రచురించారు. మొదటి రెండు (1838 and1860) సంకలనాలు చాల క్లిష్టమైన, వికటమైన గ్రాంధిక తమిళ, తెలుగు పదములు గలిగియుండి ఒకే మెట్టులో కామా గానీ, ఫుల్ స్టాపులుగానీ, పేరాలు గాని ప్రయాణంచేసిన దారి (రూట్)మ్యాపుగాని లేక యుండినవి. శివరావు గారు మద్రాసు ఓరియంటల్ లైబ్రరీకి స్వయంగా వెళ్లి బహు ముఖ కృషి చేసి మొదటి రెండవ సంకలనం పై నోట్సు వ్రాసుకుని, క్లిష్టమైన పదాల వివరణతో చాల పేజీలకి ఫూట్ నోట్లతో వాటిని సాదారణ వాడుక తెలుగు చేసి వీరస్వామయ్య గారి ప్రయాణం చేసిన దారి మార్గపు సూచిక (rout map)తో సంకలనంచేసినట్లుగా వ్రాశారు, 1951 కాపీ రైటు యాక్టులో రిజిష్ట్రేషన్ కు ప్రావధానం లేదని 1867 కాపీ రైటు యాక్టు Press and Registration of Books Act 1867 క్రింద తన 1941 సంకలనానికి తన కాపీ రైటును రిజస్టర్ చేశారు. 1975 లో ప్రభుత్వయాజమాన్యములోనున్న ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స అండ్ రిశర్చి ఇనస్టిట్టూట్ (స్టేట్ ఆర్కైవ్జ్ ) వారు శ్రీ పి సీతాపతి ఐ ఎ యస్ అధికారి, వి పురషోత్తం గార్ల సంపాదకత్వంతో ఈ పుస్తకముకు ఇంగ్లీషు సంకలనం విడుదల చేశారు. శ్రీ వడ్లమూడి గోపాల కృష్ణయ్య, జాయింట్ డైరెక్టరుగా ఆ పుస్తకముకు పీఠిక వ్రాశారు, ఆ ఇంగ్లీషు సంకలనం వచ్చిన కొన్ని రోజులకే వెంకటేశ్వరా యూని వర్సిటీలో ప్రొఫే స్సర్ గా చేసిన డా జి యన్ రెడ్డి గారు ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగములో శివరావు గారి 1941 సంకలనం గురించి చెప్పి దానికే ప్రభుత్వమువారు ఇంగ్లీషు తర్జుమా చేశారు. అని చెప్పారు. శివరావు గారు తన 1941 సంకలనముతో ఈ 1975 ఇంగ్లషు సంకలనాన్ని పోల్చి చూడగా ఇది నకలే నని చెప్పకనే చెప్పు ఆధారలు ( శివరావుగారి 3వ సంకలనం లోనున్నతప్పోప్పులు, అపశబ్దాలు, ఫూట్ నోట్ల వివరణ ) రూట్ మ్యాప్పు ఇవ్వకపోడం మొదటి రెండవసంకలనాలలో రూట్ మ్యాపు లేదని) ఇటువంటి విశదమైన ఆధారాలతో శివరావుగారు హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో 1975 లోనే ఇంగ్లీషు ప్రతులను ఆపుచేసి తనకు వప్పచెప్ప మనీన్న, నష్ట పరిహారం రూ 20000 చెల్లింపమనీ దావా వేయటం జరిగింది కానీ క్రిందకోర్టువారు సంకలనదారుకి వర్తించే కాపీ రైటు యాక్టును అన్యధా వ్యాఖ్యానించి దావాను త్రోసిపుచ్చారు తదుపరి శివరావుగారు హై కోర్టుకు అప్పీలు చేశారు. . హైకోర్టులో ఏకారణంతో కొట్టి వేసిందీ ఇంకా తెలీలేదు

శివరావు రచించిన పుస్తకాల అంకితం

[మార్చు]

వారి రచనలు ఏ రాజకీయ నాయకుని గాని మంత్రులకు గాని అంకితం చేయలేదు. వారి తల్లి తండ్రులకు, గాంధీ గారికి, ప్రియమిత్రులకు, సాహిత్యవేత్త, నిస్వార్ధ స్వతంత్రసమరయోధులకు అంకితం చేశారు. 1928 లో దక్షిణాఫ్రికా చరిత్ర గాంధీగారికి, 1933 లో అధినివేశ నిజస్వరూపము (డొమీనియన్ స్టేటస్) అను స్వతంత్రసమరయోధుడైన డా వెలిదండ్ల హనుమంతరావుగారుకు కొండా వెంకటప్పయ్య గారి సమక్షములోఅంకింతం చేశారు. కథలు గాథలను వారి మిత్రులు వాడ్రేవు వెంకటనరసింహారావుగారు, డా ఘంటసాల సీతారామ శర్మ, చెరుకుపల్లి వెంకటప్పయ్య గార్లకు. తమ విశాలంద్ర విస్మ్రు తాంధ్ర పుస్తకమును మల్లంపల్లి సోమసేఖర శర్మగారికి అంకితం చేశారు. ఇంకో పుస్తకము, పోలీసు వ్యవస్థను సూర్యదేవర రామచంద్రరావు, ఐ పి యస్ పోలీసు ఆఫీసరుకు

శివరావు ఇతరుల రచనలును ప్రోత్సహించి ప్రచురించిన సందర్భాలు

[మార్చు]

1. 1929 లో భోగరాజు నారాయణమూర్తి గారు రచించిన “అల్లాహో అక్బర్” అను పుస్తకముకు తొలిపలుకుగా పరిచయవాక్యాలు శివరాపుగారు వ్రాశారు. 2. బసవరాజు అప్పారావు గారి అకాల మరణం తరువాత వారి గోప్ప రచిన “గేయాలు” అను పుస్తకమును శివరావరు గారు ప్రేరేపణపై న ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయం వారు 1934 సెప్టెంబరులో ముద్రించారు (అప్పారావుగారి మరణం16/06/1933 ) 3. 1936 లో బసవరాజు అప్పారవుగారి పాటలను అన్యా క్రాంతముగా వాడుకుని లబ్ధి పొందుతున్న వారు తమ మిత్రులైనను సహించని శివరావుగారు అప్పారావు గారి సతీమణి గారి అనుమతితో మచిలీపట్ణంలోని వకీలు నాటక రంగస్తల పద్య ప్రియుడైన బంధా కనకలింగేశ్వరరావు తన మిత్రుడైననూ అతను అప్పారావుగారి పద్యాలు పాటలు వాడుకుని లబ్ధి పొందినవాడైనందున అతనిమీద కాళీపట్ణం నరసింహమూర్తి చేత బందరులో దావా[OS 45/36 ] వేయించి సొమ్ము వసూలుచేయించి అప్పారావుగారి వారసురాలైన వారి సతీమణికి అందచేసిన కృషి గణనీయం. 4. మార్చి –1939 ఏప్రిల్ లో బెజవాడలో డి.యస్ శర్మ, సి వి రెడ్డి గార్లు ప్రచురించుచున్న అమృత సందేశము (Immortal message) అను ద్విభాషా పత్రికలో గాజుల లక్ష్మీ నరసు చెట్టిని గూర్చి పరమేశ్వర పిళ్ళై రచించి న వ్యాసం ముద్రించినది శివరావు గారి ప్రేరేపణపైనే. 5. శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారంతటి మహా పండితుడు తమ పుస్తకము “ఏకవళి”ని ప్రచురించుకొను పరిస్తితుల్లో లేకపోవడం చూసి శివరావుగారు స్వయం కృషితో 1940 లో ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్సు వారిని ప్రేరేపించి ప్రింటింగ్ పేపరు ప్రపంచ యుధ్ధ కారణంగా కరువైన రోజులలోనే పేపరును ఇతరదేశమునుండి కొనిపించి ముద్రింపిచారు. ఆ సందర్భమున శివరామ శాస్త్రి గారు శివరావుగారిక కృతజ్ఞతలు చెపుతూ ఇట్లా వ్రాశారు “కాగితం తెప్పించటం పుస్తకం ముద్రించట గంభీరమైన ఉదారత. మీ ఔదార్యాన్ని స్వీకరించడానికి నేను తపస్సుచేసి వుండాలి లేదా ఇప్పుడు చేయాలి”. 6. బసవరాజు అప్పారావుగారి రచించిన పాటల పుస్తకము శివరావుగారి ప్రేరణపై అప్పారావు మేమోరియల్ కమిటీ వారు ముద్రణ చేశారు. శివరావుగారు అప్పారావుగారి జీవిత పర్వాన్ని పాలపర్తి వారు రచించిన “మా ఊరు” పుస్తకము 1972 ప్రచురించారు. 7. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రచించిన ముట్నూరి కృష్ణారావుగారి జీవిత చరిత్రలో సుబ్బయ్యగారి కోరికపై మొదటి 8 పేజీలు శివరావుగారు సరిదిద్ది తిరగవ్రా శారు.

విందులు ప్రచారాలు నిర్మోహమాటంగా నిరాకరించే శివరావు

[మార్చు]

18/04/1948 నాడు కాంగ్రెస్సు అగ్రనాయకుడు కె.యమ్ మున్షీగారు బెజవాడ వచ్చిన సందర్భములో వారి గౌరవార్ధము విందు ఏర్పాటు చేయగలవా అని అయ్యదేవర కాళేశ్వరరావుగారు ప్రశ్నించగా నిరాకరించి న శివరావు గారు ఇలా అన్నారు “I cannot foot the bill for Congressmen”

1972–73 లో తెలంగాణా లోని ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతం ఆందోళన

[మార్చు]

02/12/1972 నాడు ఆంధ్ర ప్రభలో శివరావుగారి వ్యాసం “సత్యాగ్రహమునకు సమయము” ఆంధ్రలో ఆందోళన గురించి న వ్యాసం ప్రచురించ బడింది. అదే రోజున ఆంధ్ర తెలంగాణా సమశ్యకు సంబంధిచిన ప్రధాన మంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా శివరావుగారు వ్రాశిన రెజొల్యూషన్ ను విజయవాడ బార్ యసోసియేషన్ వారు ఏకగ్రీవంగా ఆమోదంతో స్వీకరించడం శివరావుగారు జయంతిపురం రాజాగారు (వాసిరెడ్డి సదాశివేశ్వర ప్రసాద్) జాయింటుగాఇచ్చిన వాగ్మూలం ఆంధ్రజ్యోతి లోను, దైనిక జాగరణలోను అదేరోజు (02–12-1972) నాడు ప్రచురించారు. ఆసంవత్సరం డిసెంబరు 9 వ తారీఖునాడు మళ్ళీ బార్ యసోసియేషన్ కు History of Indian Nationalism ను గూర్చి ప్రసంగించారు. ఆనెలలోనే బెజవాడ లాయర్ల కన్వెన్షన్ కు రిజొల్యూషన్ వ్రాసి యిచ్చి వారి అధ్యక్షుని కోరిక పై ప్రసంగిచారు.. తెలంగాణ ముల్కీ నియమాలను ఖండిస్తూ వారు వ్రాసిన పెద్ద వ్యాసాలను “వారధి” అనే దిన పత్రిక డిసెంబరు 6 వ తారీఖున ప్రత్యేక సంచిక వేసి ప్రచురించారు. ఆ ప్రచురణ కాపీలు పంచ బెట్టుట జరిగింది. ప్రముఖ న్యాయవాది Mr. Seervai రచించి న కాన్ స్టిట్యూషనల్ లా ననుసరించి శివరావుగారు ఒక మెమొరాండాన్ని వ్రాసి వారి జూనియర్ వకీలు యద్దనపూడి హనుమంతరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నరు (ఖండూభాయ్ దేశాయిగారు) కు పంపించారు. భారత ప్రధాన మంత్రికి తంతి పంపిచారు. ఆంధ్ర తెలంగాణ సమశ్య తీసుకుచ్చిన ముల్కీ విధానం అమలు భార త రాజ్యాంగ పై అక్రమం జరిగినట్లని శివరావుగారు ఒక వ్యాసంలో వ్రాశారు. ఆరోజులలో పోలీసువారు అనవసరంగా విధించిన కర్ఫ్యూ పై శివరావుగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్టు వేయుటకు పెటిషన్ స్వయంగా వ్రాసి, తన జూనియర్ లాయర్ వై. వి. .హనుమంతరావుచేత రిట్ వేయించారు. జస్టిస్ చెన్నప రెడ్డిగారి బెంచి ఆ రిట్టును స్వీకరిస్తూ గవర్నమెంటుకు నోటీసు జారీ చేసి ఇంక ఆ ఆందోళన రోజలలో కర్ఫ్యూ అమలు చేయకుండా నిషేధించారు. 1973 మార్చిలో శివరావుగారు “who is responsible for violence?” అను ఒక కరపత్రం వ్రాసి ప్రచురించారు. ఇండియన్ ఎక్,ప్రస్స్ పేపరులో శివరావుగారు సంపాదకుడికి వ్రాసి న లేఖ ఫిబ్రవరి 2 తారీఖున ప్రచురించ బడింది. అదే లేఖను తెలుగు అనువాదం చేసి ఆంధ్ర ప్రభవారు ప్రచురించారు.

శివరావుగారి రచించిన పుస్తకాలను గూర్చి ఆభిప్రాయాలు

[మార్చు]

శివరావుగారి పుస్తకాలను వ్యాసములు చదివి అభినందనలు తెలుపుతూ అనేక ప్రముఖ సాహిత్యకారులు, పండితులు, కవులు, కళాకారులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, పత్రికాప్రతినిధులే కాక ఆంధ్రదేశం నలుమూలనుంచీ పాఠశాల అధ్యాపకులు, కాలేజీ లెక్చరర్లు, వివిధ వృత్తులలో వారు వైద్యులు, వ్యాపారస్తులు దేశాంతరాలలో నున్న తెలుగువారు కూడా ఉత్తరాలు వ్రాశి ప్రశింసించారు. వారిలో చిలకమర్తి లక్ష్మీనరసింహం, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, వేలూరి శివరామ శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి, స్వామీ చిరతానంద, కట్టమంచి రామలింగా రెడ్డి, అల్లాడి కృష్ణ అయ్యర్, అయ్యదేవర కాళేశ్వరరావు, నార్ల వెంకటేశ్వర రావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, ఖండవల్లి లక్ష్మీరంజనం మొదలగు ప్రముఖుల పేర్లు చెప్పక తప్పదు. 1928 లోధక్షిణాఫ్రికాలో ఇండియన్ మిషన్ లో పనిచేస్తన్నటువంటి ఒక తెలుగు వారు శివరావుగారి దక్షిణాఫ్రికా రివ్యూ చూసి వారికి ఉత్తరం వ్రాశాడు. పాశ్చాత్య దేశీయులు సాహిత్య సంశోధనచేస్తూ శివరావుగారిని సంప్రంతించిన వారిలో ఒక రిద్దరు ఫ్రాన్సుదేశస్తుడు, ఆంగ్లేయుడు కూడానున్నారు. అక్కిరాజు చంద్రమౌళి కవి గారు1944 లో శివరావుగారు రచించిన కథలు-గాధలు మీద 1949 జూలై 27 తేదిన చెప్పిన అభిప్రయము చంపకమాల పద్యము

చం// సరస చరిత్రగాధసను సంగ్రహణంబొనరించి నేర్పుతో పరమరసాను భావమున చాకమొనర్చి సుధాసుంబు గా నిరుపమవర్తి గుంపదమనీషులు మెచ్చగ డించినావు దరదిగవల్లి వెంకటశిప్రవరా!కవిరాజశేఖరా

సమీక్షలు, పత్రికాభిప్రాయాలు

[మార్చు]

శివరావుగారి పుస్తకములు వ్యాసములు అనేక మంది సమీక్షించటం ఆనేక పత్రికలు సంపాదకీయ సమీక్షలు వ్రాయటం జరిగింది. వాటిలో కొన్ని

 • 02/09/1933: ఆంధ్ర పత్రిక సంపాదక వర్గం వారి పుస్తకం అధినివెశ నిజ స్వరూపము (Dominion Status) మెచ్చుకుంటూ సమీక్షించారు
 • 19/11/1933 ఆదే పుస్తకమును హిందూ పత్రిక అభినందనలతో సమీక్షించింది. ఆ పుస్తకము వివిధ రాజకీయవిధానములును పోల్చిచూచే పుస్తకమని ( it is a comparative politics ) చెప్పారు
 • 19/06/1934: హిందూ పత్రిక వారు వ్యవహార కోశము పారిభాష పదకోశమును కొనియాడుతూ సమీక్షించింది
 • 1938 లో ప్రజామిత్ర, ప్రతిభ అనే పత్రికలు శివరావుగారి సాహిత్య కృషి కొనియాడుతూ బ్రిటిషరాజ్యతంత్రము పుస్తకముపైఎడిటోర్యల్సు వ్రాశాయి
 • 1938లో శివరావుగారి బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాను 19-10-1938 న హిందూ పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు సమీక్షించారు
 • 1939 లో అదే పుస్తకమును గృహలక్ష్మిలో సమీశక్షించారు, ఆంధ్ర పత్రికలో4-3-1939 న జొన్నలగడ్డ సత్యనారాయణ గారు సమీక్షించారు
 • 1944 లో కృష్ణా పత్రిక ఎడిటోరియల్ వ్రాసింది..
 • 04/01/1943: గోల్కోండ పత్రిక శివరావుగారి పుస్తకం కాశీయాత్ర చరిత్ర సమీక్ష.
 • 25/10/1944: ఆంధ్ర పత్రికలో జలసూత్రం రుక్మీణీనాథ శాస్త్రి గారు శివరావుగారి కథలు గాథలు సమీక్షించారు
 • 25-05-1946 ఆంధ్ర పత్రిక ఆదివారం సంచికలో భూమిరైతురాజు గురించి సమీక్ష.
 • 20/01/1959: మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు విశాలాంధ్ర పత్రికలో సన్యాసుల స్వాతంత్ర్య సమరములు అను శివరావుగారి పుస్తకమును సమీక్షించారు..
 • 13/04/1958: The Hindu reviewed his book 1857 పూర్వ రంగములు
 • 20/04/1958: ఆంధ్ర పత్రిక reviewed his book 1857 పూర్వ రంగములు
 • 20/12/1959:. ఆంధ్ర ప్రభ దినపత్రిక శివరావుగారి పుస్తకము ఆఫ్రికా జాతీయోద్యమమును సమీక్షించారు
 • 07/10/1959: Visalandhra reviewed his book ఆఫ్రికా జాతీయోద్యమము
 • 12/09/1959: Andhra Prabha reviewed ఆఫ్రికా జాతీయోద్యమము
 • 17/01/1960: Andhra Patrika reviewed ఆఫ్రికా జాతీయోద్యమము
 • 02/01/1972 ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రికలో శివరావరుగారు వారి మిత్రులు రాజా వాసిరెడ్డి సదాసివేశ్వర ప్రసాద్ గారి గురించి ఆపత్రిక సబ్ ఎడిటర్ జి. కృష్ణ వ్రాసిన వ్యాసం “two scholar politicians” in the Indian Express
 • 1977: అక్కిరాజు రమాపతి రావుగారు సమీక్షించారు
 • 11/07/1980: తిరుమల రామచంద్ర గారు ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో * 1981 లో మాలతీ చందూర్ గారు ఏనుగల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చెరిత్ర సమీక్షించారు స్వాతి అనే పత్రికలో * 26/01/1986: న్యూస్ టైమ్సు పత్రిక శివరావుగారి పుస్తకము వీరేశలింగం వెలుగు నీడలను ఆంధ్రప్రభ సంపాదకుడు పొత్తూరు వెంకటేశ్వర రావుగారు సమీక్షించారు

శివరావు గారి పుస్తకములన్నిటిలో వారి కథలు గాథలు ( 1,2,3,4 భాగములు) చాల సార్లు పునర్ముద్రించబడి చాలమంది చే సమీక్షింపబడినది 1941 నుండి అనేక ప్రముఖ రచియతలు కళాకారులు విద్యావేత్తలు సమీక్షించారు. ఆ పుస్తమును శివరావుగారి పెద్ద కుమారుడు కీర్తి శేషులు వెంకటరత్నంగారు 2010 లో విశాలాంద్ర వారిచే పునః ముద్రింపిచారు. ఈ 2010 సంకలనం చాల జనప్రియమైన పుస్తకం. పుస్తకం డాట్ నెట్ అను వెబ్ పత్రికలో 2011 జూన్ నెలలో అమెరికా షికాగో వైద్యకళాశాలలో సైకియట్రీ ప్రోఫెస్సర్ గానున్న డా జంపాల చౌదరి గారు ఆన్ లైన్ పత్రికలో సమీక్షించారు. చిన్న వయస్సులో నే నార్తు అమెరికా తెలుగు యసోసిఏషన్ (TANA =TELUGU ASSOCIATION OF NORTH AMERICA) కు ప్రసిడెంటైన చౌదరిగారు వైద్య నిపుణేలాగాక సాహిత్యభిలాషులవటం తెలుగువారికి గర్వకారణం

శివరావు 1922 నుండి స్వతంత్ర పోరాట ఉద్యమాల జ్ఞాపకాల వాగ్మూలం రికార్డింగు

[మార్చు]

12/11/1974 తేదీన Dr. పి సత్యనారాయణ రావు, డైరెక్టరు, రీజనల్ సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సు రీశర్చి ఉస్మానియాయూనివర్సటీ కాంపస్ నుండి వచ్చి శివరావు గారి అనుభావలు జ్ఞాపకాల మీద ప్రశ్నావళికి జవాబులు ఆడియో రికార్డ చేశారు. తరువాత మళ్ళీ 26/02/1979 తారీఖన ప్రొఫెస్సర్ సరోజినీ రెగాణి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారి స్వతంత్రపోరాటలలో హూ ఈజ్ హూ (who is who of freedom during freedom fighting) అను ప్రాణాలిక కోసం ఒక ప్రత్యేక సిబ్బందిని శివరావు గారి వద్దకు పంపిచారు. కానీ శివరావుగారు తాము స్వతంత్ర సమరయోధుడిని కానని జైలు కెళ్ల లేదని, న్యాయవాది వృత్తి లోనే స్వతంత్రవుద్యమాలలోపాలు పంచుకున్నాని చెప్పి తనవాగ్మూలం రికార్డు ఇవ్వటానికి వప్పు కోలేదు. కానీ సరోజనీ రేగాణి గారు మరల సిబ్బందిని పంపిచి ప్రభుత్వ ప్రణాళిక ఉద్యమంలో పాలు పంచుకున్న హూ ఈజ్ హూ అని బహు ఓరిమితో శివరావుగారిని వప్పించి వారి జ్ఞాపకాలు అనుభావుల వాగ్మూలం 1922 నుండి స్వతంత్రం వచ్చేవరకూ జరిగిన అనే క కార్య కలాపాలు గురించి ఆడియో క్లిప్ రికార్డు చేశారు ప్రభుత్వము వారే కాకుండా వ్యక్తి గతంగా వచ్చి శివరావుగారి వాజ్మూలం 18/07/1986 న రికార్డు చేసిన వారిలో త్రిపురనేని వెంకటేశ్వరావు గారు, నర్రా కోట.య్య గారు 1980 ఆగస్టులో ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రిక ఉప సంపాదకుడు నీలంరాజు మురళీధర్ వారి స్టాఫ్ ఫొటోగ్రఫర్ ను తీసుకుచ్చి శివరావుగారి ఛాయా చిత్రము తీసి ఆ పత్రిక వారి ఆర్కైవ్సులో వుంచారు.

సన్మానాలు, సత్కారాలు

[మార్చు]

ఆంధ్ర పఆదేశ్ ప్రభుత్వము వారు శివరావుగారి సాహిత్య కృషికి 1966 సెప్టెంబరు 22 లో సన్మానించారు. ఆసన్మాన సభ పార్లమెంటు సభ్యులైన డా టివియస్ చలపతిరావుగారి అధ్యక్షతన జరిగింది చాల మంది ప్రముఖులు స్వయంగానే వచ్చి ప్రసంగించి అభినందలు తెల్పి పారు వారిలో సర్వశ్రీ విశ్వనాధ సత్యనారాయణ, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం, కవి దీపాల పిచ్చయ్య, ఆంధ్ర ప్రభ సంపాదకులు నీలం రాజు శేషయ్య విశాలాంధ్ర సంపాదకులు కంభంపాటి సత్యనారాయణ, నవయుగ ఫిల్మస్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు, టాటా బెంజ్ కంపెనీ విజయవాడ బ్రాంచి మేనెజింగ్ డైరెక్టరు బాడుగ శేషగిరి రావు, విజయవాణి సంపాదకులు మల్లెల శ్రీరామమూర్తి, మొదలగు వారు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యానారాయణ గారు ప్రసంగం చెప్పతూ శివరావుగారి పుస్తకం 1857 పూర్వ రంగములు అను పుస్తకం ఆధారంగా తను రచించి న నవల ప్రళయ నాయడును శివరావుగారికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. అభినందనలు పంపిచినవారిలో చిరివాడ నుండి శతావధాని వేలూరి శివరామ శాస్త్రి, తమిళనాడు ముఖ్యమంత్రి యమ్ భక్తవత్సలం, మాజీ మంత్రి అవినాష వింగం, ఆంధ్ర లెజిస్లేటి కౌన్సిల్ అధ్యక్షులు గొట్టిపాటి బ్రహ్మయ్య, ఢిల్లీనుండి నీటిపారుదల మంత్రి కె యల్ రావు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కోకా సుబ్బా రావు, అంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి తిమ్మారెడ్డి, అడిషనల్ డిస్ట్రిక్టు జడ్జి కృష్ణమూర్తి, న్యూ సైన్సు కాలేజీలో అధ్యాపకుడు అక్కిరాజు రమాపతి రావు, జగ్గయ్య పేటనుండి రాజా వాసిరెడ్డి సదాశివేస్వర ప్రసాద్ ఆంధ్ర జ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, అమాలా పురంనుండి గోష్ఠి పత్రికాధిపతి గుమ్మడిదల సుబ్బారావు, భీమవరం కాలేజీ అధ్యాపకుడు వై విఠల్రావు,మొదలగు వారు, మళ్లీ ఇరవైఏండ్ల తరువాత 09/11/1986నాడు విజయవాడలో త్రిపురనేని వెంకటేశ్వర రావుగారు వేమన వికాసకేంద్రం తరఫున శివరావుగారిని చాల ఘనంగాగా సన్మానించి సత్కరించారు. ఆ రోజు జస్టిస్ ఎపి. చౌధరీ గారి అధ్యక్షతన ఆసభ జరిగింది దాదాపుగా 2000 మంది దాకా రోటరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన సభకువిచ్చేసి శివరావుగారిని అభినందించారు.

ఆల్ ఇండియా తెలుగు రచయితల మహా సభల్లోను, ఆంధ్ర ప్రదేశ హిస్టరీ కాంగ్రెస్సు మహాసభల కును అధ్యక్షత వహించమని కోరటం జరిగింది గాని శివరావుగారు వెళ్లలేదు. ఎ పి హిస్టరీ కాంగ్రెస్సు వారు 7/08/1978 న విజయవాడ కె బి యన్ కాలేజీలో జరిగిస సభలోనూ మరియూ 06/03/1982 న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సభలోను శివరావుగారిని ఇన్ యాబ్సెన్షియాగా (అప్రత్యక్షంగా) సన్మానించారు 22/09/1986: గాంధీ స్మారక నిధి అధ్యక్షులు కోదాటి నారాయణరావుగారు శివరావుగారిని మళ్లీ రెండో సారి 1986 లో సన్మానించటాని నిశ్చయించి ఆహ్వానించారు. కాని శివరావుగారు వెళ్లలేదు.

శివరావు మార్గదర్శకాలతో పుస్తకాలు ఉపయోగించి పి. హెచ్. డి పట్టబద్రులైన ప్రముఖులు

[మార్చు]

కొత్తపల్లి వీరభద్రరావుగారు 1959 లో మహారాజా కాలేజీ విజయనగరంలో లెక్చరర్ గా నున్న ప్పుడు వారు పి హెచ్చ్ డి పట్టాకు శివరావుగారు 1941 లో సంకలంనంచేసిన ఏనుగుల వీరస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర 3 వ సంకలనం అను పుస్తకమును శివరావు గారి అనుమతితో ఉపయోగించి పట్టభద్రులైరి. వారు 2626/01/1960.తారీఖున కృతజ్ఞతాపూర్వక అభివందనముల లేఖ వ్రాశారు. అక్కిరాజు రమాపతిరావు గారు 1964 లో న్యూసైన్సకాలేజీ హైదరాబాదులో లెక్చరర్ గానున్నప్పుడు వీరేశ లింగం గారి మీద సాహిత్యాన్వేషణ చేయుచూ పి హెచ్చ డి పట్టా కోసం అన్వేషణ చేసే రోజులలో మొదటి సారిగా శివరావు గారి దగ్గరకు వచ్చి వారి మార్గదర్శం తోనూ వారివద్దనుండి అనేక అపూర్వ పుస్తకములు చూసి నోట్సు వ్రాసుకుని డాక్టరేటు పట్టాపుచ్చుకుని కృతజ్ఞతాపూర్వక అభినందనలతో 23/07/1965 తారీఖున పెద్ద లేఖ వ్రాయటామే కాక శివరావుగారి గురించి అనేక సార్లు వార్తాపత్రికలలో వ్యాసాలు వ్రాశారు. అందులో కొన్ని 22/12/1972 నాటి ఆంధ్రప్రభలో తాతలనాటి చరిత్రలను త్రవ్వి తీసి న ప్రఖ్యాత చరిత్రకారుడు శివరావుగారు అనియు మరియూ 15/02/1988 నాటి ఆంధ్ర ప్రభలో ప్రామాణిక చరిత్రకారుడు దిగవల్లి అనియు ప్రచురితమైనవి. వై విఠల్ రావు W G B College భీమవరం కాలే జీ లెక్చర్ గారునున్నప్పుడు వారూ మరియూ ఇంకా కొందమంది ఇతరలు గూడా అధేవిధముగాశివరావుగారి మార్గదర్శన కోసం వారి దగ్గరకు రావటం జరిగింది. ప్రముఖ సాహిత్యవేత్త చరిత్రకారుడు బంగోరే (బండి గోపాలరెడ్డి), పి. హెచ్. డి పట్టా కోసం కాకపోయినా, శివరావుగారికి “ఏకలౌవ్యశిష్యుడు నమస్కారం” అని సంబోధించి అనేక విషాయాలను సంగ్రహించేవారు. వకుళాభరణం రామకృష్ణ జె ఎన్ టి విశ్వవిద్యాలయంలో చరిత్రపరిశోధనచేసే రోజులలో విరేశలింగం గారి మీద చారిత్రక పరిశోధనకుశివరావుగారు 1940 శతాబ్దంలో రచించిన వ్యాసాలనుపయోగించినటుల తమ పి.హెచ్.డి ధీసీసులో పేర్కొనిరి.

శివరావు గూర్చి ఇతర రచయితలు తమ తమ పుస్తకాలలో

[మార్చు]
 1. బౌధ్ధ మహా యుగం (విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ద్వారా 1925లో ప్రచురణ). రచయిత వేలూరి సత్యనారాయణ ఆ పుస్తక పరిచయంలో శివరావు గూర్చి)
 2. శ్రీ వాసిరెడ్డి సదాశివేశ్వర ప్రసాద్, (జయంతిపురం జమీందారు) గారు ఆయన రచించిన "గీతామృతం" లో.
 3. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి ‘మితృలు నేను’
 4. దాసు విష్ణు రావుగారి స్వీయ చరిత్ర 1939
 5. పెద్దిభొట్ల వీరయ్య గారి స్వీయచరిత్ర
 6. అయ్యదేవర కాళేశ్వర రావు గారి స్వీయ చరిత్ర
 7. కురుగంటి సీతారామభట్టాచార్యులు గారు తమ పుస్తకము నవ్యాంధ్రచరిత్రవీధలు అను పుస్తకములో శివరావుగారిని గూర్చి ప్రశంసిచారు

శివరావుకు అంకితమైన పుస్తకాలు

[మార్చు]
 1. విశ్వనాధ సత్య నారాయణగారి పుస్తకం ప్రళయ నాయడు 1960 లో # బంగోరె [బండి గోపాల రెడ్డి] గారి బ్రౌను జాబులు 1973 లో # అక్కిరాజు రమాపతి రావు గారి కొమ్మర్రాజు లక్ష్మణ రావుగారి జీవిత చెరిత్ర 1978 లో # ఎన్ గోపి గారి పుస్తకం పారిస్ ప్రతి వేమన పద్యాలు 1988 లో శివరావు గారి ప్రసంగాలు

వారు సభలకెళ్ళడం ప్రసంగాలు చేయటం సమయం వృధా అవుతందని చాల తక్కువగా ప్రసంగాలు చేసేవారు కానీ వారు చేసి న కొన్నిప్రసంగాలు వారు వెళ్లిన సభలు ఈ క్రింద విశదీకరించబడినవి.

 • నవంబరు 11 1938 :ఆల్ ఇండియా రేడియో మద్రాసు స్టేషన్ ప్రోగ్రామ్స్ డైరెక్టరు వీరికి ఉత్తరం వ్రాశారు. వారి పుస్తకం అప్పట్లో ప్రచురంచబడిన వ్యవహారకోశం ఆధారం చేసుకుని ఇంగ్లీషు మాటలకు తెలుగు కావలసిన ఇంకా విజ్ఞాన పదకోశంమీద కూడా విశేషంగా చెప్పమని. కానీ శివరావుగారు వెళ్ళ లేదు.
 • ఫిబ్రవరి 6 1951 :ఆల్ ఇండియా రేడియో మద్రాసు స్టేషన్నుండి శివరావుగారు ఇంగ్లీషులో కృష్ణ దేవరాయలు మీద చేసిన ప్రసంగం ప్రసారం చేయబడింది.
 • అక్టోబరు 16 1953 : ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుండి ఆంగ్లంలో "నేషనల్ ప్లాగ్" మీద చేసి న ప్రసంగమును ప్రసారం చేసారు.
 • 1960 : ఆల్ ఇండియా తెలుగు రచయితల సభ హైదరాబాదులో జరిగినప్పుడు శివరావుగారు బ్రిటిష్ వారి పరిపాలనా కాలం మీద ప్రసంగించారు.
 • 1966 : వారికి ప్రభుత్వ సన్మానము చేసిన సందర్భములో వారు మాట్లాడుతూ, స్వతంత్రపోరాటంలో వారికి ప్రేరేణ గలుగుటకు తోడ్పడిన శక్తులు, చరిత్ర, చరిత్ర పరిశోధన గూర్చి బహు నైపుణ్యముగా విశ్లేషించి చెప్పారు. బ్రిటిష్ వారి కాలంలో ఆ ప్రభుత్వముపై తను చేసిన తీవ్ర విమర్శనలు గురించి చెప్పారు, స్వతంత్రపోరాటములో నిస్వార్దముతో బలి దానం అయిన అనేక ప్రముఖులను స్మరించి నివాళులర్పించారు. ప్రభుత్వము చేస్తున్న అసమర్ధక సాహిత్య ప్రచురణలను ఎత్తిపొడిచారు.
 • జనవరి 22 1969 : అయ్యదేవర కాళేశ్వర రావు గారి జయంతి సభ, రామమోహన లైబ్రరీ హాలు, విజయవాడలో జరిగినప్పుడు శివరావుగారు ప్రసంగిచారు.
 • మే 31 1981 : మాడపాటి సుకుమార్ స్మారకోపన్యాసము-గ్రామ రాజకీయాలు మీద హైదరాబాదులోని కృష్ణదేవరాయ భాషానిలయంలో ప్రసంగించారు.
 • బెజవాడ న్యాయవాద సంఘంలోను, రామమోహన లైబ్రరీ లోను చాల సార్లు ప్రసంగించడం జరిగింది
 • నవంబరు 28 1982 : చెరుకుపల్లిలో లైన్సు క్లబ్ లో వైద్యనిపుణులు డా కొడాలి పాపారావుగారి అధ్యక్షతలో శివరావుగారి ప్రసంగము దేశ చెరిత్ర పై మత ప్రభావము అను విషయముపై ప్రసంగించారు.

మతం, సంస్కృతి మీద శివరావు ఆశయాలు

[మార్చు]

ఏ దేశంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా మన సంస్కృతి పుార్వచరిత్రను గూర్చి తెలుసకోవాలనీ, వాటిని తరతరాలుగా నోటిమాటగానైనా వంశపారంపర్యంగా అందజేయాలని ఆయన చెపుతూవుండేవారు.[11]

85 ఏండ్లపైబడిన తరువాత చేసిన సాహిత్య కృషి

[మార్చు]

ఆయన 1990 వరకు చురుకుగా 85 యేండ్లు దాటిన పిమ్మట కూడా యధావిధిగా చదువుతూ వ్రాసుకుంటూ వుండి సాహిత్యకృషి చేశారు. ఆయన 1985 నుండి 1990 మద్యకాలంలో వ్రాసిన 55 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వాటిలో 32 వ్యాసాలు రాజమండ్రి నుంచి ప్రచురింపబడే "సమాలోచన" పత్రికలోనూ, 3 వ్యాసాలు నెల్లూరు నుండి ప్రచురించబడే "జామీను రైతు" పత్రికలోనూ, 8 వ్యాసాలు "ఉదయం" పత్రికలోనూ, 10 వ్యాసాలు "ఆంధ్రప్రభ" దినపత్రికలోనూ, 2 వ్యాసాలు "ఆంధ్రప్రభ" వారపత్రికలోనూ ప్రచురించారు. ఏప్రిల్ 25 1983 న ఆయన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావు గారికి కాంగ్రెస్ పరిపాలనలో దిగజారిన సాహిత్య పోషన గూర్చి బహిరంగ లేఖ వ్రాసారు.

1981 అక్టోబరులో ప్రముఖ రచయిత డా.ఎన్ గోపి గారు తమ రచనలను శివరావు గారికి బహుకరించారు. డా గోపి గారు 1988 లో వారు రచించిన పుస్తకం ఒక దానిని శివరావుగారికి అంకితం చేశారు. 1981 నవంబరులో ప్రముఖ రచయిత ఆరుద్ర శివరావుగారిని సాహిత్య గోష్ఠి జరిపారు. మే 4 1983 న కావలి జవహర్ భారతి సంస్ద అధిపతి ఎం.పి.ఆర్.రెడ్డి గారు శివరావుగారి బహిరంగ లేఖని అభినందిస్తూ వ్రాశారు. ఫిబ్రవరి 26 1983 న కాట్రగడ్డ మధుసూదనరావు గారు తమ మిత్రులు మాజీ మంత్రితో కలసి వారు తలపెట్టిన "కృష్ణాజిల్లా కాంగ్రెస్సు చరిత్ర"కు సలహా నివ్వమని శివరావుగారిని కోరారు. అటుతరువాత డిశంబరు లో ఆ పుస్తకము విడదలవటం చూసిన శివరావుగారు విచారం వ్యక్తంచేశారు.

ఉన్నత ఆశయాల గీటురాయితో పనిచేసే శివరావుగారికి చరిత్రాంశాలపై వ్రాతల లోటుపాటులు సరిపెట్టు కోలేరు. ఆ రోజులలోనే తెలుగు అకాడమీ వారు శివరావుగారిని మాండలిక పరిశోధన గూర్చి తమ అభిప్రాయాలు సలహాలివ్వమని కోరారు. 1985 లో వారి ఆఖరి పుస్తకము "వీరేశలింగం వెలుగు నీడలు"ను త్రిపురనేని వెంకటేశ్వరావుగారి "వేమన వికాసకేంద్రం" వారు ప్రచురించారు. శివరావుగారు 90 ఏండ్ల తరువాత వారి కుమూరునితో పాటు ఆంధ్రేతర రాష్ట్రములకు వెళ్ళడం మూలంగా కొన్ని రచనలు ప్రచురింపబడలేదు. సమాలోచన పత్రికాధిపతి బులుసు సీతారామశాస్త్రిగారు 1988 పరమదించబట్టి వారి పత్రిక మూతపడిపోయింది. ఆప్పటి దాకా శివరావుగారి వ్యాసాలు ఆ పత్రికలో చాల ప్రచురితమైనవి.

1988 ఫిబ్రవరి 15 ఆంధ్రప్రభలో డా అక్కిరాజు రమాపతి రావు గారు వ్రాసిన "ప్రామాణిక చరిత్రకారుడు దిగవల్లి" అనే సమీక్షా వ్యాసం శివరావు గారి సాహిత్య కృషి సమీక్ష. 1990 సంవత్సరంలో శివరావుగారు 93 ఏండ్లు పూర్తిచేసుకుని ఆరోగ్యంగానే వుంటూ అంతర రాష్ట్ర వాసంలో వారికి తగిన పుస్తకాలు పత్రికలు దొరక్క పోయినా కూడా సాధ్యమైనవి తెప్పించుకు చదువుతూ వ్రాస్తూ చాల నిశితమైన మనోబలంతో వుండేవారు. అప్పటిదాకా ఒక కంటిలో కాటరాక్టు తోనే క్రమక్రమంగా చూపు తగ్గిపోతున్నను వారికి కాటరేక్టు శస్త్రచికిత్స యిష్టం లేని కారణంగా శస్త్రచికిత్సకు ఒప్పుకోలేదు. కాని 1991లో కొత్తగావచ్చిన ఇన్ట్రా ఆక్యులార్ లెన్సు ఇమ్ ప్లాంటేషన్ తో కాటరాక్టు చాలా సులువని భూతద్ధంలాంటి కళ్లజోడుపెట్టుకోవక్కర్లేదనీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరులో ఒకరోజు చదివి ఆపరేషనుకు ఒప్పుకొని గుజరాత్ లోని ఆనంద్ (బరోడా దగ్గర) ఆపరేషన్ చేయించుకున్నారు. వారికి చూపు బాగుపడినందుకు వారికి ఆనందమైన పని చదవటం, వ్రాయటం సాగించారు. మరో ఏడాదిన్నర జివించి 1992 అక్టోబరు 3 లో 95 పడిలో ప్రవేశించిన తరువాత పరమదించారు.

రచనలు

[మార్చు]

ముద్రిత రచనలు

[మార్చు]

అముద్రిత వ్యాసములు

[మార్చు]

కథలు గాథలు 6 భాగము, ఆంధ్రదేశ చరిత్ర, విస్మృతాంధ్రము విశాలాంధ్రము 2వ భాగము, 1857 నాటి భారత స్వాతంత్ర్య సమరము, జాతీయోద్యమ చరిత్ర, దిగవల్లి తిమ్మరాజుగారి జీవతకాలము (1794–1856), శివరావు గారి దివాన్గిరి, భారత దేశ కుల వ్యవస్థ ఇత్యాదులు దాదాపు యాభై వ్యాసములు

భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. The National Biography of Indian Literature 1901–1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419
 2. నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159
 3. మిత్రులు నేను గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (1970) పేజీ 186-193
 4. ఆంధ్రజ్యోతి అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" కాకాని వెంకటరత్నం
 5. " ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988
 6. ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి
 7. Godavari District Record Volum4484/19-23 Letterof District Collector to the Board of Revenue , page 345 Report of Colector Mr.Crawley Proceedings of the Board of Revenue dated 26/09/1835 Volune4660/703
 8. కధలు గాధలు (2010)1 వ భాగం దిగనల్లి వేంకట శివరావు పేజీ9-18
 9. "మన మణి మాక్యాలు" డా అక్కిరాజు రమాపతి రావు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక ఫిబ్రవరి 15,1993
 10. స్వకీయవిలేఖరి ఆంధ్రపత్రిక సెప్టెంబరు 1930
 11. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక- 11/04/1984 -ఒక అమూల్య చిత్రం
 12. వేంకటశివరావు, దిగవల్లి. ఆంగ్ల రాజ్యాంగము. Retrieved 2020-07-12.

యితర లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: