Jump to content

కురుగంటి సీతారామయ్య

వికీపీడియా నుండి
కురుగంటి సీతారామయ్య
జననం
కురుగంటి సీతారామయ్య

(1890-12-15)1890 డిసెంబరు 15
మరణం1959 ఫిబ్రవరి 24(1959-02-24) (వయసు: 68)
జాతీయతభారతీయుడు
చదువుఎం.ఎ.
వృత్తిఅధ్యాపకుడు
Organization(s)నిజాం కళాశాల, హైదరాబాదు
పేరుపడ్డదిరచయిత
Notable workనవ్యాంధ్ర సాహిత్య వీధులు
అలంకార తత్త్వ విచారము

కురుగంటి సీతారామయ్య రచయిత, అధ్యాపకుడు.[1] హైదరాబాదులోని నిజాం కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేశారు. విద్యార్థి అనే పత్రికను నడిపాడు. నవ్య సాహితీ సమితికి అధ్యక్షుడుగా పనిచేసాడు. రాయప్రోలు సుబ్బారావు, మొహమ్మద్ ఖాసింఖాన్ లతో కలిసి హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించాడు.[2] 1932లో ప్రారంభమైన ఈ సంస్థకు రాయప్రోలు అధ్యక్షుడు కాగా కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా వ్యవహరించారు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

కురుగంటి సీతారామయ్య 1890 డిసెంబరు 15 న బాపట్ల జిల్లా, వేమూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టా తీసుకున్నాడు. కొంతకాలం బెజవాడ జాతీయ పాఠశాల లోనూ, కొవ్వూరు సంస్కృతాంధ్ర కళాశాల లోనూ, తంజావూరు తాళపత్రగ్రంథాలయం లోనూ పనిచేశాడు. ఆ తరువాత నిజాం కళాశాలలో సంస్కృత, ఆంధ్ర ఉపన్యాసకుడుగా చాలాకాలం పనిచేసి రిటైరయ్యాడు. న్యాయవిద్య చదివాడు. వేద విద్వాంసుడు. స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్నాడు.

ఉస్మానియా విశ్ళవిద్యాలయంలో సంస్కృత అకాడెమీ అనే పరిశోదన సంస్థలో ఉద్యోగం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పారిభాషిక పదకోశం నిర్మాణ కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు.

సాహిత్య వ్యాసంగం

[మార్చు]

సీతారామయ్య సాహిత్య నివాదాలలో పాల్గొనేవాడు. కట్టమంచి రామలింగారెడ్డి కవిత్త్వ తత్త్యవిచారాన్ని ఖండిస్తూ 1914 లో “అలంకార తత్త్యవిచారం' అనే వ్యాసం రాసాడు. 1932 లో 'తంజాపురాంధ్రనాయక రాజ చరిత్రము" ప్రకటించాడు. ఆయన రచనలలో కధాత్రయి (1952) అనే కధల సంపుటి ఒకటి. నవ్యాంధ్ర సాహిత్య వీధులు కాక ఇంగ్లీషులో 'హాండ్‌బుక్‌ ఆఫ్‌ తెలుగు. లిటరేచర్' అని ఒక గ్రంథాన్ని 1941 లో ప్రచురించాడు. 'కొందరు తంజావూరు కవులు, పండితులు’ అనే మరొక పుస్తకాన్ని కూడా రచించాడు.[4]

వివాదాలు, ఘర్షణలూ

[మార్చు]

సీతారామయ్య ఉద్యోగ జీవితంలో ప్రధాన భాగం నిజాం సంస్థానంలో జరిగింది. అందువలన నిజాం ప్రభుత్వం పట్ల వినయ విధేయతలతో ఉండేవాడు. ఆ కాలంలో, నిజాం రాజ్యంలో ఉన్న ఆంధ్ర మహాసభ, స్టేట్‌ కాంగ్రెస్‌, నిజాంరాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి సంస్థలతో గానీ, అవి నిర్వహించే జాతీయ విముక్తి పోరాటాల పట్ల, సాహిత్యోద్యమాల పట్లా ఆయనకు సామరస్యం ఉండేది కాదు. రాయప్రోలు సుబ్బారావు, మహమ్మద్‌ కాశింఖాన్‌, సీతారామయ్య వంటివారు హైదరాబాదు సాహిత్యరంగంలో ఒక వర్గంగా ఉండేవారు. వారి వ్యతిరేకులు, వారి పేర్ల మొదటి అక్షరాల (రా కా సీ) ఆధారంగా వారిని "రాకాసి పరిషత్‌" అని పిలిచేవారు. మరోవైపు సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ తదితరులు మరొక వర్గంగా ఉండేవాళ్ళు. రాకాసి పరిషత్సభ్యులు వీరిని నిరాశాపరిషత్తు అని పిలిచేవారు.[4]

నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఒక వైపు పోరాటం నడుపుతూ ఉండగా, అతన్ని ఆదర్శ ప్రభువని ప్రశంసిస్తూ గ్రంధాలు రాసే ధోరణి హైదరాబాదు సంస్థానం లోని తెలుగువారికి బాధ కలిగించేది. రాయప్రోలు సుబ్బారావు కవిత్య రీత్యా జాతీయోద్యమ సమర్థకుడే అయినప్పటికీ, తెలంగాణలో మాత్రం ఆయన నిజాం ప్రభుత్వాన్ని సమర్థించేవాడు.[4]

రచనలు

[మార్చు]
  1. అలంకార తత్త్వ విచారము[5]
  2. నవ్యాంధ్ర సాహిత్య వీధులు [6]
  3. శ్రీ కురుగంటి వ్యాసలహరి
  4. షడ్దర్శనములు
  5. శాతకర్ణి (నవల)
  6. లవంగి (నవల)
  7. ఆదర్శప్రభువు[7]
  8. కురుగంటి కథావళి[8]
  9. తంజాపురాంధ్రనాయకరాజ చరిత్రము
  10. కథాత్రయి

మూలాలు

[మార్చు]
  1. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2018-05-01.
  2. కోవెల సుప్రసన్నాచార్య. "ఏ మావి చివురులు తిని ఎవరిని కీర్తిస్తూ పాడుతున్నావు?". సంచిక తెలుగు సాహిత్యవేదిక. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. జి. వెంకటరామారావు (16 December 2017). "చైతన్యం రగిలించిన మన గ్రంథాలయాలు". తెలంగాణ మాసపత్రిక. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite journal}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 కురుగంటి, సీతారామయ్య (1994). కోవెల, సుప్రసన్నాచార్య (ed.). నవ్యాంధ్ర సాహిత్య వీధులు అను నవ్యసాహిత్య చరిత్రము. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. pp. vi.
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అలంకార తత్త్వ విచారము పుస్తకప్రతి
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నవ్యాంధ్ర సాహిత్య వీధులు పుస్తకప్రతి
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆదర్శప్రభువు పుస్తకప్రతి
  8. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2018-05-01.