బసవరాజు అప్పారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి.

బసవరాజు అప్పారావు
Basavaraju Apparao.jpg
జననం
బసవరాజు వేంకట అప్పారావు

(1894-12-13)1894 డిసెంబరు 13
పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా
మరణం1933 జూన్ 10(1933-06-10) (వయస్సు 38)
పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా
మరణ కారణంమనోవైకల్యము
జాతీయతభారతీయుడు
విద్యబి. ఏ., బి. యల్.
విద్యాసంస్థప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
వృత్తికవి, సంపాదకుడు, న్యాయవాది
క్రియాశీల సంవత్సరాలు1916-1932
ఉద్యోగంఆంధ్రపత్రిక, భారతి
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
తల్లిదండ్రులుపిచ్చయ్య, వెంకమ్మ
సంతకం
Signature of Basavaraju Apparao (1934) (page 6 crop).jpg

బసవరాజు వెంకట అప్పారావు (1894 - 1933) కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

బసవరాజు అప్పారావు (1894-1933) విజయవాడ సమీపంలోని పటమట గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక, భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.

సంసారిక జీవితం[మార్చు]

ఆయన భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు. పూర్తిస్థాయి వ్యాసం: బసవరాజు రాజ్యలక్ష్మి

రచన రంగం[మార్చు]

బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే, నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు."సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.

అప్పారావుగారి గీతాలు[మార్చు]

బసవరాజు అప్పారావు గారి మరణానంతరం బెజవాడలోని అప్పారావు మెమోరియల్ కమిటీ వారు 1934 సంవత్సరంలో ముద్రించిన "బసవరాజు అప్పారావు గీతములు" పుస్తకంలో ప్రచురించబడినవి.[2]

 • ఉత్తుత్త పెళ్ళి
 • క్రాస్ పరీక్ష
 • కోణంగి పద్దు
 • కైపు
 • గురువర్య
 • గోపాలకృష్ణుడు
 • చెవిటి మల్లయ్య పెళ్ళి
 • చంద్రగ్రహణము
 • జీవయాత్ర
 • డాబులు
 • దగాయీత
 • నా కవిత్వ ధాటి
 • నా జీవిత నాటకము
 • నా ముక్తి
 • నీటి బుగ్గలు
 • నోరు విడబడుతున్నదయ్యా
 • యమునా సాంత్వనము
 • యశోధరా విలాపము
 • వియోగి విలాపము
 • వృధాన్వేషణము
 • శారదాభంగము
 • హెచ్చరిక
 • భూదేవి
 • ప్రళయాగ్ని
 • కయ్యాల విందు
 • మాయమై పోతె
 • పలుకవేలనే
 • తెలియని వలపు
 • సౌఖ్యమే లేదా
 • ఆనందమే లేదా
 • ఎది కావలెనే
 • కవి జీవితము
 • ఆశాభంగము
 • కాలగతి
 • కాంచితి! కాంచితి!
 • నవజీవనము
 • వీరుడు
 • మరణావస్థ
 • అధోగతి
 • నిరాశ
 • స్వయంకృతము
 • మనస్సాక్షి
 • నివృతయాదార్ధ్యము
 • ఆశా బంధములు
 • అకాల కుసుమములు
 • గొంతెమ కోరికలు
 • కనుమూత
 • నా జీవనదము
 • లజ
 • తెలిసీ తెలియని పలుకులు
 • ఇంకెన్నాళ్లు
 • మానవ వాంఛా నిష్ఫలత్వము
 • లైలా మజ్నూస్
 • ఆశా కిరణము
 • గగన కుసుమములు
 • ఆదర్శము
 • జీవనావ
 • వరుస వావి
 • ప్రేమ ప్రయాణము
 • దేవదత్తము
 • కవరు
 • అవస్థాభేదము
 • శివరాత్రి
 • కుతుబ్ మీనార్
 • "నిష్ఠలేని జన్మకొసగె"
 • నా స్థితి
 • తాజ్ మహల్
 • ప్రణయాంజలి
 • జీవమింక దాల్పనేల
 • కామిని
 • నాట్యసుందరి
 • ప్రేమతత్వము
 • కోకిల
 • చందమామ
 • కోయిల 1, 2
 • బిచ్చగాడు
 • పాటకుడు
 • విరహిణి
 • ప్రోషిత
 • ప్రణయ గీతము
 • ఊరేగింపు
 • భక్తిమార్గము
 • చాకలోళ్ళ గొప్ప
 • మజా
 • వెఱ్ఱిపిల్ల
 • హితోపదేశము
 • గోపికా గీతలు 1, 2, 3
 • రాధికా గీతము
 • దొంగకృష్ణుడు
 • వటపత్రశాయి
 • త్రోవే లేదా?
 • క్రొత్తవింతలు
 • మురళీకృష్ణుడు 1, 2
 • తగనా?
 • గుర్తులు
 • పాడు సిగ్గు
 • రాగిణి
 • ముసిడిపండు
 • కాంచలేను! కాంచలేను!
 • విహారము
 • ఎడబాటు
 • నిరాలంబస్థితి
 • చిట్టినిద్ర
 • దాంపత్యము
 • పలవరింతలు
 • సముద్రము
 • రాజూ రాణి
 • ప్రణయ కలహము
 • నాగుల చవితి
 • ఏమొ!!
 • ఐక్యమౌదామె!
 • పితృస్మృతి
 • స్వాగతము
 • కడుపుతీపి
 • చలిపిడుగు
 • దోపిడి
 • కాస్తి
 • నిర్వాణ సుఖము
 • సంవత్సరాది
 • నడమంత్రపు సిరి
 • దీపావళి
 • జేజేలు
 • పాపాయి లీలలు
 • ఉపశాంతి
 • జీర్ణం జీర్ణం
 • అడవిసీమ
 • వెన్నెల రేయి
 • ఎడబాటు
 • ఆంధ్రవీధి
 • ఇంద్రకీలాద్రి
 • నూజివీటి పోతుగడ్డ
 • కన్నెనోము
 • ప్రణయగానము
 • సౌందర్య పిపాస
 • ప్రేమతర్కము
 • ప్రేమశక్తి
 • చుక్కలరాక
 • వలపుల జోల
 • పూలకిరీటము
 • సర్వసమత్వము
 • ప్రియ నిరీక్షణము 1, 2, 3
 • ప్రణయ స్మృతి
 • వరప్రసాది
 • మేలిముసుగు
 • నిరాశ
 • అప్పచెల్లెళ్లు
 • ప్రేమరాజ్యము
 • కామాసుర
 • జీవితరహస్యము
 • అదృష్టము
 • ప్రణయ పారవశ్యము
 • సమానావస్థ
 • జీవయాత్ర
 • భావి చింతనము
 • ప్రేమమాయ
 • అవతార సమాప్తి
 • బాలకృష్ణుడు
 • విరహము
 • వసంతాగమము
 • గోపబాలులేనగు మోము
 • తెలివిమాలి తెలియనైతి
 • రామకథాసుధ
 • సీతా విరహము
 • మా గాంధి
 • గాంధీప్రభ
 • ఈ జన్మము
 • వేణునాదము
 • మత్తుమందు
 • మాల మాదిగల మొఱ
 • స్వరాజ్యలక్ష్మి పెళ్ళి
 • జాతీయ పతాకము
 • రాట్నము
 • బాపూజీ - మా బాప్
 • ప్రేమకారణము
 • సహజ లావణ్యము

ప్రాచుర్యం[మార్చు]

అప్పారావు వ్రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో (1938) పరిచయం చేశాడు.సూరిబాబు పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. కాంచనమాల సుందరమ్మలు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడాడు. తాజ్‌మహల్ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.

మూలాలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 1. రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"
 2. బసవరాజు అప్పారావు గీతములు, అప్పారావు మెమోరియల్ కమిటీ, బెజవాడ, 1934.