వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్
VIAF Screenshot 2012
2012 తెరపట్టు
పొడి పేరుVIAF
ప్రవేశపెట్టిన తేదీ2003 ఆగస్టు 6 (2003-08-06)
నిర్వహించే సంస్థOCLC
ఉదాహరణ106965171

వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్ (VIAF) అనేది అనేక జాతీయ లైబ్రరీల ఉమ్మడి అథారిటీ ఫైల్ ప్రాజెక్టు. దీన్ని ఆన్‌లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ (OCLC) నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

1990ల చివరలో ఉమ్మడి అంతర్జాతీయ అథారిటీ ఉండాలనే చర్చ మొదలైంది. ఒక ప్రత్యేక ఉమ్మడి అథారిటీ ఫైల్‌ను సృష్టించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఇప్పటికే ఉన్న జాతీయ అథారిటీలను లింకు చేయాలనే కొత్త ఆలోచన వచ్చింది. దీనివలన ఎక్కువ సమయం, ఖర్చూ లేకుండానే ఉమ్మడి ఫైల్ వలన కలిగే అన్ని ప్రయోజనాలనూ కలుగుతుంది. [1]

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ 2003 లో నిర్వహించిన వరల్డ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌లో VIAF భావనను ప్రవేశపెట్టారు. US లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (LC), జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB), OCLC లు 2003 ఆగస్టు 6 న ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. [2] బిబ్లియోథెక్ నేషనల్ డి ఫ్రాన్స్ (BnF) 2007 అక్టోబరు 5 న ప్రాజెక్టులో చేరింది.


2012 ఏప్రిల్ 4 న ఈ ప్రాజెక్టు OCLC యొక్క సేవగా మారింది. [3]

జాతీయ అధికార ఫైల్‌లను (జర్మన్ నేమ్ అథారిటీ ఫైల్ వంటివి) ఒకే వర్చువల్ అథారిటీ ఫైల్‌కి లింక్ చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఫైల్‌లో, విభిన్న డేటా సెట్‌లలో ఉండే ఒకేలాంటి రికార్డులను ఒకదానితో ఒకటి లింకు చేసారు. VIAF రికార్డు ప్రామాణిక డేటా సంఖ్యను పొందుతుంది. ఒరిజినల్ రికార్డులలో ఉండే ప్రాథమిక "చూడండి", "ఇవి కూడా చూడండి" రికార్డులు ఇందులో ఉంటాయి. ఒరిజినల్ అథారిటీ రికార్డులను ఇది సూచిస్తుంది. పరిశోధనలకు, డేటా మార్పిడి, భాగస్వామ్యాల కోసం ఈ డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. పరస్పర నవీకరణ మెటాడేటా హార్వెస్టింగ్ (OAI-PMH) ప్రోటోకాల్ కోసం ఓపెన్ ఆర్కైవ్స్ ఇనిషియేటివ్ ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది.

ఫైల్ నంబర్లను వికీపీడియా జీవిత చరిత్ర వ్యాసాల్లో చేరుస్తున్నారు. వికీడేటాలో కూడా వీటిని చేరుస్తున్నారు. [4]

VIAF క్లస్టర్‌లు[మార్చు]

VIAF క్లస్టరింగ్ అల్గోరిథంను ప్రతి నెలా నడుపుతారు. పాల్గొనే లైబ్రరీల నుండి మరింత డేటా జోడించబడినందున, అధికార రికార్డుల సమూహాలు కలిసిపోవచ్చు లేదా విడిపోవచ్చు. దీని వలన కొన్ని అధికార రికార్డుల VIAF ఐడెంటిఫైయర్‌లో కొంత హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.

పాల్గొనే లైబ్రరీలు, సంస్థలు[మార్చు]

ఇంగ్లీషు వికీపీడియా వ్యాసం పేరు ఐడెంటిఫయరు ప్రదేశం దేశం
బిబ్లియోథెకా ఆలెక్జాండ్రినా EGAXA అలెగ్జాండ్రియా ఈజిప్టు
బిబ్లియోటెకా నేషనల్ డి చిలీ BNCHL శాంటియాగో చిలీ
బిబ్లియోటెకా నేషనల్ డి ఎస్పానా BNE మాడ్రిడ్ స్పెయిన్
బిబ్లియోటెకా నేషనల్ డి పోర్చుగల్ PTBNP లిస్బన్ పోర్చుగల్
బిబ్లియోథెక్ ఎట్ ఆర్కైవ్స్ నేషనాలెస్ డు క్విబెక్ B2Q క్విబెక్ కెనడా
బిబ్లియోథెక్ నేషనాల్ డి ఫ్రాన్స్ BnF పారిస్ ఫ్రాన్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ గ్రీస్ ΕΒΕ ఏథెన్స్ గ్రీస్
బిబ్లియోథెక్ నేషనాల్ డు రోయాం డు మారోక్ (BNRM) MRBNR రబత్ మొరాకో
బయోగ్రాఫిష్ పోర్టాల్ BPN ది హేగ్ నెదర్లాండ్స్
బ్రిటిష్ లైబ్రరీ లండన్ ఇంగ్లాండు
డేనిష్ ఏజన్సీ ఫర్ కల్చర్ అండ్ పాలసెస్ కోపెన్‌హాగన్ డెన్మార్క్
Danish Bibliographic Centre DBC బాలరప్ డెన్మార్క్
జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB) GND ఫ్రాంక్‌ఫర్ట్ జర్మనీ
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేం ఐడెంటిఫయర్ ISNI లండన్ యునైటెడ్ కింగ్‌డమ్
ఇజ్రాయిల్ మ్యూజియమ్ జెరూసలెం ఇజ్రాయిల్
Istituto Centrale per il Catalogo Unico ICCU

SBN
రోమ్ ఇటలీ
లెబనీస్ నేషనల్ లైబ్రరీ LNL బీరూట్ లెబనాన్
లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ కెనడా LAC అట్టావా కెనడా
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ LCCN వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఇన్ జాగ్రెబ్ NSK జాగ్రెబ్ క్రొయేషియా
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ స్లోవేనియా ల్యుబ్లియానా స్లోవేనియా
నేషనల్ సెంట్రల్ లైబ్రరీ NCL CYT తైపీ తైవాన్
నేషనల్ డయట్ లైబ్రరీ NDL టోక్యో క్యోటో జపాన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ NII

CiNii
టోక్యో జపాన్
నేషనల్ లైబ్రరీ బోర్డ్ NLB సింగపూర్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియా NLA కాన్‌బెర్రా ఆస్ట్రేలియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్రెజిల్ BLBNB రియో డి జానీరో బ్రెజిల్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కటలోనియా BNC బార్సెలోనా స్పెయిన్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఎస్టోనియా ERRR తల్లిన్ ఎస్టోనియా
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ ఐస్‌లాండ్ (NULI) UIY రేజవిక్ ఐస్‌లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఐర్లండ్ N6I డబ్లిన్ ఐర్‌లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్ NLI జెరూసలేమ్ ఇజ్రాయిల్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కొరియా KRNLK సియోల్ కొరియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లాట్వియా LNB రీగా లాట్వియా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లక్సెంబర్గ్ BNL లక్సెంబర్గ్ లక్సెంబర్గ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెక్సికో BNM మెక్సికో నగరం మెక్సికో
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది నెదర్లాండ్స్ NTA ది హేగ్ నెదర్లాండ్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ న్యూజీలాండ్ వెల్లింగ్టన్ న్యూజీలాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ నార్వే BIBSYS
W2Z
ట్రాండ్‌హీమ్ నార్వే
నేషనల్ లైబ్రరీ ఆఫ్ పోలండ్ NLP వార్సా పోలండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ రష్యా NLR సెయింట్ పీటర్స్‌బర్గ్ రష్యా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లండ్ ఎడింబరో స్కాట్లాండ్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కేప్‌టౌన్
ప్రిటోరియా
దక్షిణాఫ్రికా
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ SELIBR స్టాక్‌హోమ్ స్వీడన్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ వేల్స్ అబెరిస్విత్ వేల్స్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది చెక్ రిపబ్లిక్ NKC ప్రాగ్ చెక్ రిపబ్లిక్
నేషనల్ షెచెనిల్ లైబ్రరీ NSZL బుడాపెస్ట్ హంగరీ
పెర్సియస్ ప్రాజెక్ట్ PERSEUS మెడ్‌ఫోర్డ్ యునైటెడ్ స్టేట్స్
RERO (లైబ్రరీ నెట్‌వర్క్ ఆఫ్ వెస్టర్న్ స్విట్జర్లండ్) RERO మార్టినీ స్విట్జర్లండ్
రిపర్టోయిర్ ఇంటర్నేషనల్ డెస్ సోర్సెస్ మ్యూసికేల్స్క్వ్ RISM ఫ్రాంక్‌ఫర్ట్ జర్మనీ
సిస్టెమె యూనివర్సిటెయిర్ డి డాక్యుమెంటేషన్ SUDOC ఫ్రాన్స్
సిరియాక్ రిఫరెన్స్ పోర్టల్ SRP నాష్‌విల్ యునైటెడ్ స్టేట్స్
స్విస్ నేషనల్ లైబ్రరీ SWNL బెర్న్ స్విట్జర్లండ్
Narodowy Uniwersalny Katalog Centralny, NUKAT (pl) NUKAT పోలండ్
Union List of Artist Names – Getty Research Institute ULAN

JPG
లాస్ ఏంజలెస్ యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అగ్రికల్చరల్ లైబ్రరీ NALT బెల్ట్స్‌విల్ యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ బెథెస్దా యునైటెడ్ స్టేట్స్
వాటికన్ లైబ్రరీ BAV వాటికన్ నగరం
కల్చర్‌కనెక్ట్ బ్రసెల్స్ బెల్జియమ్
వికిడేటా WKP బెర్లిన్ అంతర్జాతీయం

ఇవి కూడా చూడండి[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

  1. O'Neill, Edward T. (12 August 2016). "VIAF: Origins". Authority Data on the Web, a Satellite Meeting of the 2016 IFLA World Library and Information Congress. OCLC. Archived from the original (Video presentation) on 2018-07-13.
  2. Morris, Susan R. (September 2003). "Virtual International Authority". Library of Congress Information Bulletin. Library of Congress. Retrieved 2021-01-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Murphy, Bob (4 April 2012). "Virtual International Authority File service transitions to OCLC; contributing institutions continue to shape direction through VIAF Council" (Press release). OCLC (in ఇంగ్లీష్). Dublin, OH.
  4. Klein, Max; Renspie, Melissa (7 December 2012). "VIAFbot Edits 250,000 Wikipedia Articles to Reciprocate All Links from VIAF into Wikipedia". OCLC.