ఆస్ట్రేలియా
కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా | ||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Advance Australia Fair |
||||||
రాజధాని | కాన్‌బెర్రా 35°18′S 149°08′E / 35.300°S 149.133°E | |||||
అతి పెద్ద నగరం | సిడ్నీ | |||||
అధికార భాషలు | ఆంగ్ల భాష | |||||
ప్రజానామము | ఆస్ట్రేలియన్ (Australian) | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాస్వామ్యం , రాజ్యాంగ రాజరికం | |||||
- | రాణి | రెండవ ఎలిజబెత్ [1] | ||||
- | గవర్నర్-జనరల్ | మైకల్ జెఫ్రీ[2][3] | ||||
- | ప్రధాన మంత్రి | కెవిన్ రడ్డ్[4] | ||||
స్వతంత్రం | ఇంగ్లాండు నుండి రాజ్యాంగ ప్రతిపత్తి 1901 లో | |||||
- | జలాలు (%) | 1 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 21,200,000[5] (53వది) | ||||
- | 2006 జన గణన | 19,855,288 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | US$718.4 బిలియన్లు (IMF) (17వది) | ||||
- | తలసరి | US$34,359 (IMF) (14వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | US$889.7 బిలియన్లు (AU $1.1 ట్రిలియన్లు) (15వది) | ||||
- | తలసరి | US$42,553 (DFAT) (16వది) | ||||
కరెన్సీ | ఆస్ట్రేలియన్ డాలర్ (AUD ) |
|||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .au | |||||
కాలింగ్ కోడ్ | +61 |
ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం., సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం.
భౌగోళిక స్వరూపం
[మార్చు]ఆస్ట్రేలియా, చుట్టుపక్కని ద్వీపాలు లక్షల సంవత్సరాల మునుపు మిగిలిన ప్రపంచం నుండి విడిపోయాయి. ఇందువల్ల, అక్కడ కనిపించే జంతువులు, పక్షులు మరి ఎక్కడా కనపడవు. 50,000 సంవత్సరాల మునుపు ఇక్కడికి మొదటి మానవ సంతతి ఆరంభమైంది. వీళ్ళని ఇప్పుడు ఆస్ట్రేలియన్ అబొరిజైన్స్ (Australian Aborigines) అంటారు. చుట్టుపక్కని ద్వీపాలు అన్ని ఇంగ్లాండు నుండి 1850 ప్రాంతంలో స్వాతంత్ర్యం పొందాయి. అవన్నీ కలిసి జనవరి 1 1901 నాడు ఒక సమాఖ్యగా మారాయి. ఆస్ట్రేలియా మెదటి ప్రధాన మంత్రి ఎడ్మండ్ బార్టన్. ఆస్ట్రేలియా ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్ అఫ్ నేషన్స్ (Commonwealth of Nations) లో భాగం.
ప్రాంతాలు , నగరాలు
[మార్చు]జులై 2007 లో ఆస్ట్రేలియా జనాభా 2.1 కోట్లు. ఆస్ట్రేలియా వైశాల్యంలో చాలా పెద్దది అయినప్పటికీ ఎక్కువ శాతం భూమి ఎడారి లాంటిది. అందువలన చాలా మంది సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, డార్విన్, హోబార్ట్ వంటి సమద్రతీరం వద్ద ఉన్న పట్టణాల్లో ఉంటారు. సముద్రానికి దూరంగా ఉండే అతి పెద్దపట్టణం కాన్ బెర్రా. అదే ఆస్ట్రేలియా రాజధాని.
చరిత్ర
[మార్చు]మొదటి మనుషులు
[మార్చు]ఆస్ట్రేలియాకి మొట్ట మొదట మనుషులు 50,000 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. వీళ్ళనే అబొరిజైన్స్ అంటారు. 1788లో ఇంగ్లీష్ వారు వచ్చే వరకు, వీళ్ళు వేటాడుతు బ్రతికే వాళ్ళు. అక్కడ పుష్కలంగా ఉన్న కంగారూలను వాళ్ళు ఎక్కువగా వేటాడే వాళ్ళు. కంగారూలు అడవుల్లో, పెద్ద పెద్ద చెట్లున్న చోట జీవంచడానికి ఇష్టపడవు. అందువల్ల ప్రతి ఐదారు సంవత్సరాలకోసారి ఎత్తుగా పెరిగిన గడ్డి, చిన్న చెట్లను కాల్చేసే వారు.
అబొరిజైన్స్ పెద్ద ఇళ్ళు, గోడలు, ఆవరణములు కట్టుకోలేదు. గడ్డీ, ఆకులతో చిన్న గుడిసెలు మాత్రమే కట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ఆవులు, గుర్రాలు అప్పుడు లేవు. అందువలన వాళ్ళకు ఆవరణములు కట్టుకోవలసిన అవసరం లేదు. అబొరిజైన్స్ కుండలు, లోహాలు వాడలేదు. కేవలం చెక్క మాత్రమే వాడారు. ఆస్ట్రేలియాలో దృఢమైన చెక్క ఉన్న చెట్లు చాలా ఉన్నాయి. వీటినే అబొరిజైన్స్ వాడేవారు.
టెర్రా ఆస్ట్రాలిస్
[మార్చు]1600 ప్రాంతంలో డచ్ దేశస్తులు ఇండోనీషాతో వ్యాపారం చేసేవారు. ఇండొనేషియా ఆస్ట్రేలియాకి ఉత్తరాన ఉంది. ఆ కాలంలో కొన్ని డచ్ ఓడలు ఆస్ట్రేలియా యొక్క ఉత్తర సముద్ర తీరాన్ని చేరుకున్నాయి. డచ్ గవర్నర్ వాన్ దిఎమెన్ (van Diemen), అబెల్ తాస్మాన్ (Abel Tasman) అనే నావికుణ్ణి, ఆస్ట్రేలియా దక్షిణ భాగానికి పంపాడు. అప్పుడు తాస్మాన్ ప్రస్తుత తాస్మనియాను కనుగొని, దానికి వాన్ దిఎమెన్ స్ లాండ్ (van Diemen's Land) అని పేరు పెట్టాడు. తరువాత దాని పేరు, తాస్మాన్ గౌరవార్థం, తాస్మానియా అని మార్చారు.
ఇంగ్లాండు వారు దక్షిణమున ఒక పెద్ద దీవి ఉండాలని తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు కెప్టెన్ జేమ్స్ కుక్ (Captain James Cook) ని పసిఫిక్ మహాసముద్రం వైపు పంపారు. అతడి ఓడ HMS Endeavour. అతడి రహస్య గమ్యం "టెర్రా ఆస్ట్రాలిస్" (అంటే "దక్షిణ భూమి"). అతడి పయనం చాలా అనుకూలముగా సాగెను. ముందుగా వాళ్ళు న్యూజీలాండ్ కనుగొనిరి. దాన్ని దాటి పశ్చిమ దిక్కున వెళ్ళిరి. అప్పుడు టాం హిక్స్ అనే కుర్రవాడికి దూరంలో భూమి కనిపించెను. క్యాప్టెన్ కుక్ ఆ చిన్న పాటి భూమిని, పాయింట్ హిక్స్ (Point Hicks) అని పేరు పెట్టిరి. తీరం వరుకు వెళ్ళిన తరువాత క్యాప్టెన్ కుక్ ఆ భూమికి, "న్యూ సౌత్ వేల్స్" అని పేరు పెట్టిరి. శాస్త్రవేత్తలు సర్ బ్యాంక్స్, డా.సొలాండర్ అక్కిడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయిరి. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి వృక్ష, జంతు, పక్షి జాతులు వాళ్ళకు కనపడ్డాయి. చాలా వృక్ష జాతులను ఓడలో ఇంగ్లాండుకు తీసుకెళ్ళారు.
క్యాప్టెన్ కుక్ అక్కడ ఉన్న అబొరిజైన్స్, వాళ్ళ సహజమైన జెవనాశైలి, వాళ్ళు చేపలు పట్టడం, వేటాడటం, పండ్లను ఏరుకోవడం చూసాడు. కాని అక్కడ ఇళ్ళు కాని ఆవరణములు కానీ లేవు. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడ ఉంటున్న ప్రజలు, ఏదో ఒక రకముగా "ఈ భూమి నాది" అని చెప్పుకుంటారు. ఒక గోడ కట్టుకోవచ్చు, ఒక గీత గీసుకోవచ్చు. కాని అబొరిజైన్స్ అలాంటివేమి చేయలేదు. అందువల్ల కెప్టెన్ కుక్ ఇంగ్లాండు ప్రభుత్వానికి ఆ భూమి ఎవరిదీ కాదని చెప్పాడు. దీని వల్ల అబొరిజైన్స్ కి ముంముందు చాలా కష్టాలు వచ్చాయి.
ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు
[మార్చు]1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంబంధిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. చాలా మందిని చెరసాలలో బంధించేవారు. ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మంది ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు ఇంగ్లాండు వారికి ఏం చేయాలో తెలీలేదు.
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చెరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement) ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుండి బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, కెప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం కెప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచెం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతనికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని కెప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జిని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరికి సిడ్నీ అని పేరు పెటారు.
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెబ్చ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
శీతోష్ణస్థితి
[మార్చు]'ఆస్ట్రేలియా దక్షిణార్ద గోళంలో ఉంది. కాబట్టి ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం అయితే ఆస్ట్రేలియాలో చలికాలం, ఆస్ట్రేలియాలో వేసవి కాలం అయితే ఉత్తరార్ధ గోళంలో చలికాలం ఉంటాయి.
వ్యవసాయం
[మార్చు]ఆస్ట్రేలియాలో పంటభుములు విశాలంగా ఉండడం వల్లను, వ్యవసాయ రంగంలో పనిచేయువారు తక్కువ కావడం చేతను ఇక్కడ విస్తృత వ్యవసాయం అమలులో ఉంది.
- గోధుమ ఆస్ట్రేలియా ప్రపంచంలో గోధుమను ఎగుమతి చేయు దేశాల్లో 4వది.
- పండ్ల తోటలు
పశు పోషణ
[మార్చు]ప్రపంచంలో ఉన్ని అత్యధకంగా ఉత్పత్తి చేయు దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో వాణిజ్యపరంగా పెంచబడుతున్న జంతువుల్లో గొర్రెలు, పశువులు ముఖ్యమైనవి. శీతోష్ణస్థీతి, తృణ భుములు చాలావరుకు గొర్రెల పెంపకానికి అనుకులంగా ఉండడం వల్ల గొర్రెలు అత్యంత ప్రధానమయినవి. వాటి నుండి లభించు ఉన్ని ఆస్ట్రేలియా ఎగుమతుల్లో ముఖ్యమయినవి. పశువులలో నాలుగింట ఒక వంతు మాత్రమే పాలు, వెన్న, జున్ను కొరకు పెంచుతున్నారు. కొన్ని రకాల పాల ఉత్పత్తులతో పాటు మాంసము ప్రధానంగా ఎగుమతి చేయబడుతున్నాయి. వ్యవసాయ ఎగుమతుల్లో ఉన్ని, గోధుమల తర్వాతి స్థానంలో మాంసము మూడవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది.
ఖనిజాలు - పరిశ్రమలు
[మార్చు]ఖనిజాలు
[మార్చు]18వ శతాబ్దపు చివరిలో బ్రిటన్ ఇక్కడ మొదటగా వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పటికి,1850 నాటికి కూడా ఆస్ట్రేలియా జనాభా చాలా తక్కువగా ఉండేది.1851లో ఆస్ట్రేలియా బంగారు గనులను కనుగొన్న తరువాత వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆస్ట్రేలియా రావడం ఆరంభించారు.ఆస్ట్రేలియా అనేక ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయి.పశ్చిమ ఆస్ట్రేలియాలో కూల్ గార్డీ, దక్షిణక్రాస్, మార్గరెట్ మౌంట్ లాంటి స్థలముల్లో ముఖ్య బంగారు గనులున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలో అత్యధికంగా సీసమును ఉత్పత్తి చేస్తోంది.యశదపు ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటి. అణు విద్యుత్ తయారికి ఉపయోపపడు యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ఖండాలల్లో ఆస్ట్రేలియా ఉంది.
పరిశ్రమలు
[మార్చు]ఆస్ట్రేలియాలో చాలారకాలైన పరిశ్రమలున్నాయి. వాటిలో చాలా వరుకు ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్, ఎడిలైడ్, పెర్త్ సమీపంలో ఉన్నాయి. ఉన్ని వస్త్రాల తయారి, జాం తయారీ, పాల సంబంధ ఉత్పత్తుల, ఇతర అహార వస్తువుల పరిశ్రమలు, ఖనిజాలను శుద్ధి చేయు పరిశ్రమలు ఉన్నాయి.
వాణిజ్యం
[మార్చు]ఆస్ట్రేలియా యొక్క అంతర్జాతీయ వ్యాపారం ప్రధానంగా ఉన్ని, గొధుమ, శీతలీకరించిన పశుమాంసము, పాల ఉత్పత్తులు, లోహాలు, ద్రాక్ష సారాయి, ఎండబెట్టిన పండ్లు, జామ్లు వంటి వస్తువులను ఎగుమతి చేస్తూ, జౌళి వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఉన్నత ప్రామాణిక పారిశ్రామిక ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నది
జనాభా, ప్రధాన నగరాలు
[మార్చు]ఆస్ట్రేలియాలో దాని పరిమాణముతో పోలిస్తే, జనాభా చాలా తక్కువగా ఉండడం వల్ల దీనిని నిర్జన ఖండము అని కూడా అంటారు. ఆస్ట్రేలియా మొత్తం విస్తీర్ణములో నాలుగింట మూడువంతులు ఆక్రమించిన చాలా విశాలమయిన ఎడారి ప్రాంతములో అసలు జనాభా లేకపోవుటయే దీనికి కారణము. ఉన్న జనాభాలో సుమారు 60 శాతం మంది రాష్ట్రాల ముఖ్య నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్ బెన్, ఎడిలైడ్, పెర్త్ లలో నివసిస్తున్నారు. మరో 20 శాతం మంది చిన్న పట్టణాలలోను, ఇంకనూ మిగిలిన వారు గ్రామాలలోను నివసిస్తున్నారు.