జనవరి 1
Jump to navigation
Jump to search
జనవరి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 365 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
- 1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
- 1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
- 1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
- 1818: బీమా కోరేగావ్ తిరుగుబాటు (యుద్ధం) జరిగింది.
- 1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
- 1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
- 1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
- 1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
- 1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
- 1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
- 1939: బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
- 1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
- 1953: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
- 1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
- 1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
- 1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
- 1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
- 1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
- 1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
- 1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
- 1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
- 1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- 1986: సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
- 1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
- 1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
- 1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- 1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
- 1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
- 2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- 2004: టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.
- 2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
- 2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
జననాలు
[మార్చు]- 1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
- 1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
- 1888: అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961)
- 1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
- 1894: సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
- 1905: లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
- 1909: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
- 1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
- 1920: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
- 1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
- 1928: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
- 1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003)
- 1938: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
- 1938: తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
- 1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
- 1942: సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి(మ.2014)
- 1943: రఘునాథ్ అనంత్ మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త.
- 1946: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు .
- 1946: పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1948: షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
- 1951: వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
- 1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
- 1952: నానా పటేకర్, నటుడు.
- 1954: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
- 1961: దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
- 1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
- 1963: అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త.
- 1966: వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
- 1970:ఊహా , తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ,చిత్రాల నటి.
- 1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
- 1974: కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
- 1978: విద్యా బాలన్, హిందీ నటి.
- 1978: పరమహంస శ్రీ నిత్యానందా.
- 1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
- 1980: మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1980: సానా యాదిరెడ్డి , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
- 1990: సోనాలి బింద్రే , హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి,మోడల్ .
- 1991: శుభ్ర అయ్యప్ప, తెలుగు, తమిళ,కన్నడ ,చిత్రాల నటి .
మరణాలు
[మార్చు]- 1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
- 1775: అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
- 1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
- 1894: హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857)
- 1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
- 1955: శాంతిస్వరూప్ భట్నాగర్, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును ఏర్పాటు చేసారు.
- 1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
- 1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత
- 1994: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915)
- 1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
- 2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
- 2007: డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
- 2007: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)
- 2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.
- 2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు
- రహదారి భద్రతా దినోత్సవం
- అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
- సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జనవరి 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చారిత్రక దినములు.
డిసెంబర్ 31 - జనవరి 2 - డిసెంబర్ 1 - ఫిబ్రవరి 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |