గియా కొప్పోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గియా కొప్పోలా
గియా కొప్పోలా (2016)
జననం (1987-01-01) 1987 జనవరి 1 (వయసు 37)
వృత్తిసినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
తల్లిదండ్రులుజియాన్-కార్లో కొప్పోలా (తండ్రి)

జియాన్-కార్లా కొప్పోలా[1] (జననం 1987, జనవరి 1) అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత.

జననం[మార్చు]

గియా కొప్పోలా 1987, జనవరి 1న సినీ నిర్మాత జియాన్-కార్లో కొప్పోలా - జాక్వి డి లా ఫోంటైన్ దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా మనవరాలు, రోమన్ కొప్పోలా, సోఫియా కొప్పోలా మేనకోడలు. గియా తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో తండ్రి స్పీడ్ బోటింగ్ ప్రమాదంలో మరణించాడు.[2]

తన స్నేహితుని ఫ్యాషన్ లేబుల్ కోసం తొలిసారిగా ఒక షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించింది.[3] ఆ తరువాత, కొప్పోలా ఓపెనింగ్ సెర్మనీ కోసం షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి నియమించబడింది, ఇందులో కిర్‌స్టన్ డన్స్ట్, జాసన్ స్క్వార్ట్జ్‌మాన్, జాక్ పోసెన్, డయాన్ వాన్ ఫర్‌స్టెన్‌బర్గ్, రోడార్టే,ఎల్లే చైనా నటించారు.[3][4]

సినిమాలు[మార్చు]

  • పాలో ఆల్టో (2013)
  • యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ (2014)
  • యువర్ టైప్ (2015)
  • కట్ టు ది ఫీలింగ్ (2017)
  • అప్లాడ్ (2019)
  • మీరు మాంత్రికులా? (2020)
  • మెయిన్ స్ట్రీమ్ (2020)

మూలాలు[మార్చు]

  1. Buckley, Cara (May 1, 2014). "With 'Palo Alto,' Another Coppola, Another Show". The New York Times. Retrieved 2023-06-13. Ms. Coppola is the namesake of Gian-Carlo; her full name is Gian-Carla.
  2. Tatum O'Neal, A Paper Life, 0-060-75102-9 p. 158
  3. 3.0 3.1 Cowles, Charlotte (10 August 2012). "Q&A: Gia Coppola on Fashion Films, Flea Markets, and Her Waffle-Eating Cat". The Cut. Retrieved 2023-06-13.
  4. "Gia Coppola". The Collaborative Agency. Retrieved 2023-06-13.

బయటి లింకులు[మార్చు]