Jump to content

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా

వికీపీడియా నుండి
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా (2011)
జననం (1939-04-07) 1939 ఏప్రిల్ 7 (వయసు 85)
విద్యాసంస్థ
  • హాఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయం (బిఏ)
  • యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1962–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఎలియనోర్ నీల్
(m. 1963)
పిల్లలు
తల్లిదండ్రులు
సంతకం

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. 1960లు, 1970లలోని న్యూ హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ ఉద్యమంలోని ముఖ్య వ్యక్తులలో ఒకడిగా పరిగణించబడ్డాడు.[1] ఐదు అకాడమీ అవార్డులు, ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు పామ్స్ డి'ఓర్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు (బాఫ్టా)లు అందుకున్నాడు.

జననం

[మార్చు]

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల 1939, ఏప్రిల్ 7న కార్మైన్ కొప్పోల - ఇటాలియా కొప్పోలా దంపతులకు డెట్రాయిట్, మిచిగాన్‌లో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

1969లో ది రెయిన్ పీపుల్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించిన తర్వాత పాటన్ (1970) సినిమాకు సహ-రచయితగా పనిచేశాడు. ఈ సినిమాకు ఎడ్మండ్ హెచ్. నార్త్‌తో కలిసి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అకాడమీ అవార్డును అందుకున్నాడు. 1972లో వచ్చిన ది గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాతగా కొప్పోలకు మంచి పేరును తెచ్చిపెట్టింది.[2] గాడ్‌ఫాదర్ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో మూడు అకాడమీ అవార్డులు వచ్చాయి. ది గాడ్‌ఫాదర్ పార్ట్ II (1974) ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి సీక్వెల్‌గా నిలిచింది. ఈ సినిమాకు కొప్పోలాకు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడిగా మరో రెండు అకాడమీ అవార్డులను అందుకున్నాడు. ఒకే సినిమాకు మూడు అవార్డులను గెలుచుకున్న రెండవ దర్శకుడు (బిల్లీ వైల్డర్ తర్వాత) ఇతడు.

1974లో, వచ్చిన థ్రిల్లర్ ది కన్వర్సేషన్‌ సినిమా వికేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామ్ డి ఓర్‌ను అందుకుంది. 1979లో వియత్నాం యుద్ధ నేపథ్యంలో వచ్చిన అపోకలిప్స్ నౌ సినిమా ప్రశంసలు అందుకుంది, పామ్ డి'ఓర్‌ను కూడా గెలుచుకుంది. రెండుసార్లు ఈ అవార్డును గెలుచుకున్న తొమ్మిది మంది చిత్ర దర్శకులలో కొప్పోలా ఒకడు. 1983లో ది ఔట్‌సైడర్స్, రంబుల్ ఫిష్,1984లో ది కాటన్ క్లబ్, 1986లో పెగ్గి స్యూ గాట్ మ్యారీడ్, 1990లో ది గాడ్ ఫాదర్ పార్ట్ III, 1992లో బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా, 1997లో ది రెయిన్‌మేకర్ వంటి సినిమాలు తీశాడు. 1979లో ది బ్లాక్ స్టాలియన్, 1982లో ది ఎస్కేప్ ఆర్టిస్ట్, 1982లో హామెట్, 1985లో మిషిమా: ఎ లైఫ్ ఇన్ ఫోర్ చాప్టర్స్, 1983లో ది సీక్రెట్ గార్డెన్ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

కొప్పోల కుటుంబ బంధువులు, పిల్లలు చాలామంది సినిమా నటులుగా, ఫిలింమేకర్స్ గా మారారు. సోదరి తాలియా షైర్ ఒక నటి కాగా, కుమార్తె సోఫియా దర్శకురాలిగా, కుమారుడు రోమన్ స్క్రీన్ ప్లే రచయితగా, మేనల్లుళ్ళు జాసన్ స్క్వార్ట్జ్‌మాన్ - నికోలస్ కేజ్ లు నటులుగా రాణిస్తున్నారు.[3]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పేరు అకాడమీ అవార్డులు బ్రిటీష్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్ విజేత నామినేషన్ విజేత నామినేషన్ విజేత
1966 యూ ఆర్ ఎ బిగ్ బోయ్ నౌ 1 1 3
1968 ఫినియన్స్ రెయిన్బో 2 5
1972 ది గాడ్ ఫాదర్ 10 3 5 1 7 6
1974 ది కన్వర్జేషన్ 3 5 2 4
గాడ్ ఫాదర్ పార్ట్ II 11 6 4 1 6
1979 అపోకలిప్స్ నౌ 8 2 9 2 4 3
1982 వన్ ఫ్రం ది హార్ట్ 1
1983 రంబుల్ ఫిష్ 1
1984 కాటన్ క్లబ్ 2 2 1 2
1986 పెగ్గీ స్యూ గాట్ మ్యారీడ్ 3 2
1988 టక్కర్: ది మ్యాన్ అండ్ హిజ్ డ్రీం 3 1 1 1 1
1990 గాడ్ ఫాదర్ పార్ట్ III 7 7
1992 బ్రామ్ స్టోకర్స్ డ్రాక్యులా 4 3 4
1997 ది రెయిన్ మేకర్ 1
మొత్తం 55 14 31 8 42 10

మూలాలు

[మార్చు]
  1. "Francis Ford Coppola: 10 essential films". April 5, 2019. Archived from the original on January 11, 2020. Retrieved 2023-06-06.
  2. Barry, Langford (2005). Film Genre: Hollywood and Beyond. Edinburgh University Press. p. 134.
  3. Mariani, John. "An Interview With Francis Ford Coppola: Master Filmmaker And Major Wine Producer". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2023-06-06.

బయటి లింకులు

[మార్చు]