సోఫియా కొప్పోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోఫియా కొప్పోలా
సోఫియా కొప్పోలా (2013)
జననం
సోఫియా కార్మినా కొప్పోలా

(1971-05-14) 1971 మే 14 (వయసు 53)
ఇతర పేర్లుడొమినో కొప్పోలా
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1972–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
స్పైక్ జోన్జ్
(m. 1999; div. 2003)
థామస్ మార్స్
(m. 2011)
పిల్లలు2
తల్లిదండ్రులు
బంధువులు

సోఫియా కార్మినా కొప్పోలా (జననం 1971, మే 14) అమెరికన్ సినిమా దర్శకురాలు, నటి. అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, గోల్డెన్ లయన్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు[1] వంటి అవార్డులను అందుకుంది. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయింది.[2][3]

జననం

[మార్చు]

సోఫియా కొప్పోలా 1971, మే 14న డాక్యుమెంటరియన్ ఎలియనోర్ (నీల్ నీల్) - సినీ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దంపతులకు ఏకైక కుమార్తెగా న్యూయార్క్ నగరంలో జన్మించింది.[4] 1989లో సెయింట్ హెలెనా హైస్కూల్ నుండి పట్టభద్రురాలయింది.[5] మిల్స్ కళాశాల, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరింది.[6] ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, సంగీతం, డిజైన్‌తో సహా అనేక రంగాల్లో పనిచేసింది. 1998లో తన మొదటి లఘు చిత్రం లిక్ ది స్టార్‌ని రూపొందించింది.[7]

సినిమారంగం

[మార్చు]

తన తండ్రి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 1972లో తీసిన ది గాడ్ ఫాదర్ క్రైమ్ డ్రామా సినిమాలో పసిపాపగా తన సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత అనేక మ్యూజిక్ వీడియోలలోనూ, అలాగే పెగ్గి స్యూ లోగాట్ మ్యారీడ్ (1986)లో సహాయక పాత్రలోనూ నటించింది. ది గాడ్‌ఫాదర్ పార్ట్ III (1990)లో మైఖేల్ కార్లియోన్ కుమార్తె మేరీ కార్లియోన్ పాత్రను కూడా పోషించింది.

1999లో ది వర్జిన్ సూసైడ్స్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించింది. 2003లోలాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్ అనే కామెడీ-డ్రామా సినిమాకు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అకాడమీ అవార్డును అందుకుంది. ఉత్తమ దర్శకురాలిగా అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన మూడవ మహిళగా నిలిచింది. 2006లో మేరీ ఆంటోయినెట్, 2010లో సమ్వేర్, 2013లో ది బ్లింగ్ రింగ్ (2013), 2017లో ది బెగ్యుల్డ్ (2017), 2020లో ఆన్ ది రాక్స్ మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించింది.[8][9]

2015లో నెట్‌ఫ్లిక్స్ క్రిస్మస్ మ్యూజికల్ కామెడీ స్పెషల్ ఎ వెరీ ముర్రే క్రిస్మస్‌ను విడుదల చేసింది. దీనికిగానూ సోఫియా కొప్పోలా అత్యుత్తమ టెలివిజన్ మూవీకి ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు నామినేషన్‌ను సంపాదించింది.[10]

2017 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కోలిన్ ఫారెల్, కిర్‌స్టెన్ డన్స్ట్, ఎల్లే ఫాన్నింగ్, కొప్పోలా, నికోల్ కిడ్‌మాన్

దర్శకత్వం

[మార్చు]

సినిమా

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత ఇతర వివరాలు
1989 న్యూయార్క్ స్టోరీస్ కాదు Yes కాదు ఆంథాలజీ సినిమా
1998 లిక్ ది స్టార్ Yes Yes Yes షార్ట్ ఫిల్మ్
1999 ది వర్జిన్ సూసైడ్స్ Yes Yes కాదు
2003 లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ Yes Yes Yes
2006 మేరీ ఆంటోనిట్టే Yes Yes Yes
2010 సమ్ వేర్ Yes Yes Yes
2013 బ్లింగ్ రింగ్ Yes Yes Yes
2017 ది బెగైల్డ్ Yes Yes Yes
2020 ఆన్ ది రాక్స్ Yes Yes Yes
2023 ఫెయిరీల్యాండ్ కాదు కాదు Yes
TBA ప్రిస్కిల్లా Yes Yes Yes పోస్ట్ ప్రొడక్షన్

టెలివిజన్

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ ఇతర వివరాలు
2015 ఎ వెరీ ముర్రే క్రిస్మస్ Yes Yes Yes టీవీ ప్రత్యేకం

నాటకం

సంవత్సరం పేరు ఇతర వివరాలు
2017 లా ట్రావియాటా ఒపెరా ఇన్ రోమ్ టీట్రో డెల్'ఒపెరా డి రోమా

నటించినవి

[మార్చు]

సినిమా

సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు గమనికలు
1972 ది గాడ్ ఫాదర్ మైఖేల్ ఫ్రాన్సిస్ రిజ్జీ (శిశువు) ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1974 గాడ్ ఫాదర్ పార్ట్ II ఓడలో పిల్ల
1983 ది ఔట్ సైడర్స్ చిన్న అమ్మాయి డొమినోగా క్రెడిట్ చేయబడింది
రంబుల్ ఫిష్ డోనా
1984 ఫ్రాంకెన్వీనీ అన్నే ఛాంబర్స్ టిమ్ బర్టన్
కాటన్ క్లబ్ వీధిలో పిల్లవాడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1986 పెగ్గీ స్యూ గాట్ మ్యారీడ్ నాన్సీ కెల్చర్
1986 ఫేరీ టేల్ థియేటర్: ది ప్రిన్సెస్ హూ హాడ్ నెవర్ లాఫ్డ్ గ్వెన్డోలిన్ మార్క్ కల్లింగ్‌హామ్ డొమినోగా క్రెడిట్ చేయబడింది
1987 అన్నా నూడిల్ యురేక్ బొగయేవిచ్
1988 టక్కర్: ది మ్యాన్ అండ్ హిజ్ డ్రీం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
1990 గాడ్ ఫాదర్ పార్ట్ III మేరీ కార్లియోన్
1992 మంకీ జెట్టర్‌ల్యాండ్ లోపల సిండి జెఫరీ లెవీ
1999 స్టార్ వార్స్: ఎపిసోడ్ I - ది ఫాంటమ్ మెనాస్ సాచే జార్జ్ లూకాస్
2001 సీక్యూ ఎంజో యొక్క మిస్ట్రెస్ రోమన్ కొప్పోలా

టెలివిజన్

సంవత్సరం సినిమా దర్శకుడు
2022 వాట్ వుయ్ డూ ఇన్ ది షాడోస్‌ జెమైన్ క్లెమెంట్

సంగీత వీడియోలు

  • సోనిక్ యూత్ (1990) చే "మిల్డ్రెడ్ పియర్స్" - డేవ్ మార్కీ దర్శకత్వం వహించారు
  • మడోన్నా రచించిన " డీపర్ అండ్ డీపర్ " (1992) - బాబీ వుడ్స్ దర్శకత్వం
  • ది బ్లాక్ క్రోవ్స్ (1992) రచించిన "కొన్నిసార్లు సాల్వేషన్" - స్టెఫాన్ సెడ్నౌయ్ దర్శకత్వం వహించారు
  • ది కెమికల్ బ్రదర్స్ (1997) ద్వారా " ఎలెక్ట్రోబ్యాంక్ " - దర్శకత్వం స్పైక్ జోన్జ్
  • ఫీనిక్స్ (2002) ద్వారా "ఫంకీ స్క్వేర్డెన్స్" - రోమన్ కొప్పోల దర్శకత్వం వహించారు

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

తన తండ్రి తీసిన ది గాడ్‌ఫాదర్ పార్ట్ III లో నటనకు చెత్త సహాయ నటి, చెత్త కొత్త తార విభాగాల్లో రెండు గోల్డెన్ రాస్ప్‌బెర్రీ అవార్డులను గెలుచుకున్నది.

2003లో లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాలలో మూడు అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డు అందుకుంది. ఉత్తమ దర్శకురాలు విభాగంలో నామినేట్ నామినేట్ పొందిన మొదటి అమెరికన్ మహిళగానూ, లీనా వెర్ట్‌ముల్లర్, జేన్ కాంపియన్ తర్వాత మొత్తంగా మూడవ మహిళగా నిలిచింది.

2010లో కాథరిన్ బిగెలో నామినేట్ చేయబడిన నాల్గవ మహిళగా, అవార్డును గెలుచుకున్న మొదటి మహిళగా నిలిచింది. ఉత్తమ దర్శకురాలి విభాగంలో నామినేట్ అయిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో (ఆమె కజిన్ నికోలస్ కేజ్ 1996లో ఉత్తమ నటుడిగా గెలుపొందడంతోపాటు) ఆమె కుటుంబం రెండవ మూడు-తరాలకు ఆస్కార్-విజేత కుటుంబంగా రికార్డు నెలకొల్పింది. ఆమె తాత కార్మైన్ కొప్పోలా, ఆమె తండ్రి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా గతంలో ఆస్కార్‌లను గెలుచుకున్నారు.

లాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్‌లో ఆమె చేసిన పనికి, కొప్పోలా మూడు బ్రిటీష్ ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అవడంతోపాటు ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్‌లను అవార్డులను కూడా గెలుచుకుంది.

2010 సెప్టెంబరు 11న సమ్‌వేర్ సినిమాకు వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత బహుమతి గోల్డెన్ లయన్‌ని గెలుచుకుంది.[11] ఈ అవార్డును గెలుచుకున్న మొదటి అమెరికన్ మహిళ నిలిచింది.[3]

2017 మే 28న, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది బెగ్యుల్డ్ సినిమాకు ఉత్తమ దర్శకురాలిగా అవార్డును అందుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న రెండవ మహిళ (మొదటి అమెరికన్ మహిళ)గా నిలిచింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Gonzalez, Sandra. "Sofia Coppola is first woman to win Cannes director prize in 56 years". CNN. Retrieved 2023-06-13.
  2. 2.0 2.1 Blumberg, Naomi. "Sofia Coppola | American director". Encyclopaedia Britannica. Retrieved 2023-06-13.
  3. 3.0 3.1 Silverstein, Melissa. "Sofia Coppola Wins Top Prize at Venice Film Festival". Women and Hollywood. Archived from the original on September 15, 2010. Retrieved 2023-06-13.
  4. "Sofia Coppola". Encyclopedia Britannica. Retrieved 2023-06-13.
  5. Coppola, Sofia (June 22, 2017). "Interview with Sofia Coppola". WTF Podcast (Interview). Interviewed by Marc Maron.
  6. Menkes, Suzy (October 14, 2008). "Sofia Coppola: Discreet, chic and grown-up". The New York Times. Retrieved 2023-06-13.
  7. Coppola, Sofia (January 25, 2018). "Sofia Coppola on making The Virgin Suicides: 'When I saw the rough cut I thought: Oh no, what have I done?'". The Guardian (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.
  8. Sales, Nancy Jo. "THE SUSPECTS WORE LOUBOUTINS | Vanity Fair | March 2010". Vanity Fair | The Complete Archive. Retrieved 2023-06-13.
  9. The Bling Ring (in ఇంగ్లీష్), June 14, 2013, retrieved 2023-06-13
  10. "A Very Murray Christmas". Primetime Emmy Awards. Retrieved 2023-06-13.
  11. Vivarelli, Nick (September 11, 2010). "Coppola's 'Somewhere' wins Golden Lion". Variety. Retrieved 2023-06-13.

బయటి లింకులు

[మార్చు]