న్యూయార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం న్యూయార్క్ నగరం గురించి. అదే పేరుతో ఉన్న రాష్ట్రం కొరకు న్యూయార్క్ రాష్ట్రం చూడండి.
న్యూయార్క్ నగరం
Top of Rock Cropped.jpg
Flag of న్యూయార్క్ నగరం
Flag
Official seal of న్యూయార్క్ నగరం
Seal
ముద్దు పేరు: The Big Apple, The City That Never Sleeps, Gotham, The Capital of The World (Novum Caput Mundi), The Empire City, The City So Nice They Named It Twice.
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 40°43′N 74°00′W / 40.717°N 74.000°W / 40.717; -74.000
దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రం న్యూయార్క్
Boroughs The Bronx
Brooklyn
Manhattan
Queens
Staten Island
Settled 1624
ప్రభుత్వం
 - మేయర్ Michael Bloomberg (I)[1]
వైశాల్యము
 - City 468.9 sq mi (1,214.4 km²)
 - భూమి 303.3 sq mi (785.6 km²)
 - నీరు 165.6 sq mi (428.8 km²)
 - పట్టణ 3,352.6 sq mi (8,683.2 km²)
 - మెట్రో 6,720 sq mi (17,405 km²)
ఎత్తు 33 ft (10 m)
జనాభా (2007)[2]
 - City 82,74,527 (World: 13th, U.S.: 1st)
 - సాంద్రత 27,282/sq mi (10,533/km2)
 - పట్టణ 1,84,98,000
 - మెట్రో 1,88,18,536
 - Demonym New Yorker
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
Area code(s) 212, 718, 917, 347, 646
వెబ్‌సైటు: www.nyc.gov

న్యూయార్క్ నగరం (ఆంగ్లం : New York City) (అధికారికంగా న్యూయార్క్ యొక్క నగరం) అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. 1970వ సంవత్సరం వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. జార్జి వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రథమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య, ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, ఆల్ఫా వరల్డ్ సిటీ గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, మీడియా, రాజకీయాలూ, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు, ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకూ కేంద్రంగానూ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగానూ ఉన్నది.

చరిత్ర[మార్చు]

ఆమ్‌స్టర్డామ్

1524వ సంవత్సరంనకు ముందు యూరోపియన్ల రాకకు పూర్వం ఇక్కడ 5,000 మంది లెనేప్ అనే అమెరికన్ పూర్వీకులు ఇక్కడ నివసిస్తుండేవారు.ఫ్రెంచ్ ప్రభుత్వం తరఫున పనిచేసే ఇటాలియన్ పర్యాటకుడు డచ్ ఫర్ ట్రేడింగ్ పేరుతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇక్కడ యురోపియన్ ఒప్పందానికి నాంది అయింది. 1614 తరువాత మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని న్యూఆమ్‌స్టర్‌డామ్ అని పిలుస్తూ వచ్చారు. 1626 లో లెనేపుల నుండి మాన్‌హట్టన్ ద్వీపాన్ని 60 డచ్ బంగారునాణాలకు డచ్ కాలనీ డైరక్టర్ జనరల్ పీటర్ మైన్యూట్ కొనుగోలు చేసాడు. కానీ ధర విషయం సరి అయిన నిర్ధారణ జరగలేదు. 24 అమెరిక డాలర్ల విలువ కలిగిన గాజు పూసలు చెల్లించినట్లు మరొక వాదన కూడా ఉంది. 1664 లో ఈ ప్రదేశం ఆంగ్లేయులచే ఆక్రమించబడి యార్క్, అల్బెనీల ఆంగ్లేయ రాజ ప్రతినిధి పేరుతో న్యూయార్క్‌గా పిలువబడింది. ఆంగ్ల - డచ్ యుద్ధం చివర జరిగిన ఒప్పందంలో డచ్ ప్రభుత్వం ఆమ్‌స్టర్‌డామ్ ఆంగ్లేయులకు ఇచ్చి బదులుగా ఇండోనేషియాలో భాగమైన బాండా ద్వీపాలలో ఒకటైన రన్‌ ద్వీపాన్ని తీసుకున్నారు. 1700వ సంవత్సరం నాటికి ఇక్కడ లెనేప్ అమెరికన్ పూర్వీకుల సంఖ్య 200కు క్షీణించింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో న్యూయార్క్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా అభివృద్ధి సాధించింది. 1754వ సంవత్సరంలో రెండవ కింగ్ జార్జ్ ధార్మిక సౌజన్యంతో కింగ్ కాలేజ్ పేరుతో స్థాపించ బడింది. అమెరికన్ తిరుగుబాటు యుద్ధ సమయంలో న్యూయార్క్ కంపాజిన్ పేరుతో (న్యూయార్క్ యుద్ధం) ఈ నగరం వరస యుద్ధాలకు రంగస్థలంగా మారింది. న్యూయార్క్ నగరంలో కాంటినెంటల్ కాంగ్రెస్ కూటమి జరిగింది. 1789వ సంవత్సరంలో వాల్ స్ట్రీట్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ చే ఫెడరల్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. 1790 వ సంవత్సరం నాటికి అభివృద్ధిలో ఫిలడెల్ఫియాను అధిగమించి అమెరికాలో పెద్దనగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

మాన్ హట్టన్ లోని ముల్ బెర్రీ వీధి

19 శతాబ్దంలో వలసప్రజల రాక నగర అభివృద్ధి చెట్టాపట్టాలేసుకుని నడవటం ప్రారంభం అయింది. మాన్‌హట్టన్ చుట్టూ ఆనుకుని నగరం విస్తరించింది. దీనికి కమీషర్స్ ప్లాన్ ఆఫ్ 1811 పేరుతో చేపట్టిన నగరాభివృద్ధి ప్రణాళిక దోహదం చేసింది. 1819వ సంవత్సరంలో తెరవబడిన ఎరిక్ కెనాల్ విస్తారమైన ఉత్తర అమెరికా లోతట్టు ప్రాంతనికి చెందిన అంట్లంటిక్ వ్యవసాయ సంభదిత వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడానికి దోహదమైంది. ఐరిష్ వలస జాతీయుల రాజకీయపక్క బలంతో స్థాపించబడిన టమ్మీ హాల్ స్థానిక రాజకీయాలపై ఆధిక్యత సాధించింది. గుర్తించ తగినంత స్వతంత్ర నల్లజాతీయుల జనసంఖ్య మాన్‌హట్టన్ లోని బ్రూక్లిన్ ప్రాంతంలో స్థిరపడసాగారు. 1827 వ సంవత్సరం నుండి ఇక్కడ బానిసలు అధికసంఖ్యలో నివసించారు .
1861-1865 మధ్య కాలంలో అమెరికా సివిల్ వార్ సమయంలో బలవంతంగా రక్షణదళంలో చేర్చడానికి వ్యతిరేకంగా డ్రాఫ్ట్ రాయిట్స్ ఆఫ్ 1863 చెలరేగిన తిరుగుబాటు అమెరికా చరిత్రలో గుర్తించదగిన అశాంతిని సృష్టించింది. అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం 1898 వ సంవత్సరం నుండి ఇతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది. ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్, దికౌంటీ ఆఫ్ క్వీన్స్ పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.1904 వ సంవత్సరంలో ఆరంభించిన ది న్యూయార్క్ సిటీ సబ్‌వే కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది. 20 వశతాబ్దం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా, సమాచార రంగం అభివృద్ధిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది. దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చి ఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు 1920 వ సంవత్సరంలో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.1916 వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు. ఆర్థిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.1948 వ సంవత్సరం నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాల కారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో లండన్ నగరాన్ని అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ద కాలం కొనసాగింది.గ్రేట్ డిప్రెషన్ పేరుపొందిన ఆర్థిక సంక్షోభం కాలంలో ఆర్థిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ఫియోరెల్లో లాగార్డియా రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి. డెమాక్రటిక్ ఓటమి ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్‌ గా అభివర్ణించబడింది.

న్యూయార్క్ లోని మిడ్ టౌన్ మాన్‌హట్టన్

రెండవ ప్రపంచ యుద్ధానంతరం తిరిగివచ్చిన వారు, యురోపియన్ నుండి వలస వచ్చిన ప్రజల కారణంగా న్యూయార్క్‌లో యుద్ధానంతర ఆర్థికపురోగతి ఆరంభం అయింది. తూర్పు క్వీన్స్‌లో పెద్ద సంఖ్యలో నివాసగృహ ఆభివృద్ధి కొనసాగింది.రెండవ ప్రపంచయుద్ధం నుండి న్యూయార్క్ సురక్షితంగా బయటబడింది. అభివృద్ధి పధంలో కొనసాగుతున్న అంతర్జాతీయ నగరంగా న్యూయార్క్ నగరం గుర్తింపు పొందింది. అమెరికా అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. 1950 వ సంవత్సరం వరకు అమెరికా ప్రభుత్వ ప్రధాన కేంద్రంగానూ న్యూయార్క్ కొనసాగింది. అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజమ్ ఆవిర్భావం కళారంగంలోనూ అంతర్జాతీయ ప్రాముఖ్యత సాధించడంలో పారిస్ నగరాన్ని అధిగమించింది.1960 వ సంవత్సరంలో ఆరంభమైన ఆర్థిక సంక్షోభం,నేరాల పెరుగుదల, జాతివివక్ష కారణంగా పెరిగిన ఉద్రిక్తత 1970 వ సంవత్సరం నాటికి శిఖరాగ్రాన్ని చేరింది.

మాన్‌హట్టన్ ఆకాశహర్మ్యాలు -2001

ఆర్ధికరంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా పరిస్థితి కొంత మెరుగైంది.1980 వ సంవత్సరం నాటికి జాతి వివక్ష కారణంగా చెలరేగిన ఉద్రిక్తత సద్దుమణిగింది. నేరాలసంఖ్య ఎక్కువశాతం తగ్గుముఖం పట్టింది. ఆసియా, లాటిన్ అమెరికా నుండి వలస ప్రజల రాక పెరగసాగింది.ముఖ్యమైన రంగాలలో అభివృద్ధి ఆరంభమైంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఈ మార్పు ఎక్కువగా ఉంది.ఇది నగర ఆర్థిక అభివృద్ధికి దోహదమైంది.2000 వ సంవత్సరం నాటికి నగర జనసంఖ్య శిఖరాన్ని అధిరోహించింది.
తీవ్రవాదులు జరిపిన 2001 సెప్టెంబర్ 11 వైమానిక దాడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేని విషాదం. ప్రపంచ వ్యాపార కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రదేశం నగరంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఒకటి.

ప్రకృతి వైపరీత్యాలు[మార్చు]

అభివృద్ధి మాత్రమే కాక ఈ నగరం వైపరీత్యాలను ఎదుర్కుంది.1904 వ సంవత్సరంలో తూర్పు నది (ఈస్ట్ రివర్) లోజరిగిన మర పడవ (స్టీమ్ బోట్) జనరల్ స్లోకమ్‌ మంటల పాలు కావడంతో బోట్లో ఉన్న 1021 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.1911 ది ట్రయాంగిల్ షిర్ట్‌వైస్ట్ ఫాక్టరీ ఫైర్ గా పేర్కొనబడిన అగ్నిప్రమాదంలో 146 మంది దుస్తులు తయారీ పనివాళ్ళు ప్రాణాలు కోల్పోయారు . తరువాతి కాలంలో పరిశ్రమలో సురక్షిత కార్యక్రమాలు మెరుగుపరచబడ్డాయి.ఈ ప్రదేశంలో నిర్మాణదశలో ఉన్న ఫ్రీడమ్ టవర్ (స్వాతంత్ర్య గోపురం)2012 వ సంవత్సరం నాటికి తన నిర్మాణకార్యక్రమాలు పూర్తిచేసుకుంటుందని అంచనా.

భౌగోళికం[మార్చు]

కోటి మంది ప్రజలు నివసిస్తున్న న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతపు శాటిలైట్ చిత్రం

న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.సుమారు వాషింగ్టన్, బోస్టన్ మధ్యభాగంలో ఉంది. ఇది హడ్సన్ నది ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు అట్లాంటిక్ సముద్రంలో పెద్ద వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందటానికి సహకరించింది. న్యూయార్క్‌లో ఎక్కువ భాగం మాన్‌హట్టన్‌,స్టేటన్ ద్వీపం, లాంగ్ ఐలాండ్ అనే మూడు దీవులలో నిర్మించబడింది.పెరిగే జనాభాకు తగినంత భూభాగం తక్కువైన కారణంగా అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటైంది.
హడ్సన్ నది న్యూయార్క్ లోయల నుండి ప్రవహించి న్యూయార్క్ సముద్రంలో కలుస్తుంది. హడ్సన్ నది నగరాన్ని న్యూజెర్సీ నుండి వేరుచేస్తుంది.లాంగ్ ఐలాండ్ నుండి హడ్సన్ నది నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్, మాన్‌హట్టన్ దీవులను లాంగ్ ఐలాండ్ నుండి వేరుచేస్తూ ఉంటుంది.హార్లెమ్ నది వేరొక వైపు నేరుగా ప్రవహిస్తూ తూర్పుప్రాంతం, హడ్సన్ నదుల నదులమధ్య నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్, మాన్‌హట్టన్ లను వేరుచేస్తూ ఉంటుంది.
నగర భూభాగం కృత్రిమంగా మానవప్రయత్నంతో కొంచం కొంచం విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరణ కార్యక్రమం డచ్ కాలనీ కాలంలోనే ప్రారంభం అయింది.మాన్‌ హట్టన్ దిగువ ప్రాంతంలో ఈ విస్తరణ సుస్పష్టంగా చూడచ్చు.1970, 1980వ సంవత్సరంల మధ్య మాన్‌హట్టన్ లోతట్టు ప్రాంతంలో అభివృద్ధి చేసిన బ్యాటరీ పార్క్ సిటీ ఈ విస్తరణను స్పష్టంగా గుర్తించవచ్చు.ప్రత్యేకంగా మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ విస్తరణ వలన సహజ సిద్ధత కనుమరుగైంది.
న్యూయార్క్ నగర విస్తీర్ణం 304.8 చదరపు మైళ్ళు.న్యూయార్క్ నగర మొత్తం ప్రదేశం 468.9 చదరపు మైళ్ళు.159.88 చదరపు మైళ్ళు జలభాగం మిగిలిన 321 మైళ్ళు భూభాగం. నగరంలో ఎత్తైన ప్రాంతం స్టేటన్ దీవిలోని టాట్ హిల్ (Todt Hill).ఇది సముద్ర మట్టానికి 409.8 అడుగులు ఎగువన ఉంది.దీని దిగువభాగం దట్టమైన వనప్రదేశం.స్టేటన్ దీవి గ్రీన్‌బెల్ట్‌లో ఇది ఒక భాగం.

వాతావరణం[మార్చు]

న్యూయార్క్ నగరంలో చలికాలంలో చలి అధికం. దీవుల లోపలి భాగం కంటే సముద్ర తీరాలు కొంచం వెచ్చగా ఉంటాయి.చలి,మంచు, వర్షం ఎక్కువైనా వేసవికాలంలో ఎండ కూడా అధికం.వేసవి ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది.వాతావరణంలో తడిశాతం అధికం.హరికేన్ లాంటి తుఫానులు తరచుగా రాకపోయినా ఈ నగరం 1821 లో నార్‌ఫోక్ అండ్ లాండ్ ఐలాండ్ హరికేన్ మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని దెబ్బతీసింది. న్యూ ఇంగ్లాండ్ హరికేన్ ఆఫ్ 1938 నగర తూర్పు తీరంపై ప్రభావం చూపింది.

పరిసరాలు[మార్చు]

న్యూయార్క్ నగర ప్రజలు అధికంగా ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాలను వాడుకుంటారు. న్యూయార్క్ నగర ప్రభుత్వ వాహనాల ప్రయాణీకుల సంఖ్య అమెరికాలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ కారణంగా శక్తి (ఎనర్జీ)ని సామర్ధ్యంగా వాడుకునే నగరాలలో న్యూయార్క్ అమెరికాలోనే ప్రథమ స్థానంలో ఉంది.ఈ కారణంగా 2006 వ సంవత్సరంలో 10.8 లక్షల గాలన్ల ఇంధనం (ఆయిల్) పొదుపు చేసినట్లు అంచనా.న్యూయార్క్ నగర సరాసరి గ్రీన్‌హౌస్ గ్యాస్ విడుదల 7.1.అమెరికా జాతీయ సరాసరి 24.5. దేశంలోని గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల లలో 1% న్యూయార్క్ నగరంనుండి విడుదల ఔతుంది.న్యూయార్క్ నగర ప్రజలు దేశంలోని ప్రజలలో 2.7%.న్యూయార్క్ నగరవాసి శాన్ ఫ్రాన్సిస్కో‎ నగరవాసి ఉపయోగించే విద్యుత్ శక్తిలో సగం కంటే తక్కువ ఉపయోగిస్తాడు, అలాగే డల్లాస్ నివాసి కంటే సుమారు నాల్గవ వంతు మాత్రమే ఉపయోగిస్తాడు.
న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్య నివారణపై దృష్టి కేంద్రీకరించింది.జసాంద్రత కారణంగా పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన కాలుష్యం న్యూయార్క్ నగర నివాసితులకు ఆస్త్మా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు రావడానికి కారణమైంది. పురపాలక వ్యవస్థ శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే సాధనాలను ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది.న్యూయార్క్ క్లీన్ ఎయిర్ డీసెల్-హైబ్రీడ్, కమ్‌ప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లను ఉపయోగించే బస్సులను అధికంగా ఉపయోగించడంలో దేశంలో ప్రథమస్థానంలో ఉంది. న్యూయార్క్ నగరం శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే గ్రీన్ ఆఫీస్ బిల్డింగ్స్ భవన నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది.
న్యూయార్క్ నగరం ప్రజలకు త్రాగునీటిని కేట్ స్కిల్ మౌంటెన్స్ వాటర్ షెడ్ రక్షిత నీటిసరఫరా పధకంద్వారా అందిస్తుంది. ఈ పధకంద్వారా అందించే నీరు వాటర్ ట్రీట్ మెంట్ ప్రక్రియ అవసరం లేకుండానే కలుషితంకాని స్వచ్ఛమైన త్రాగు నీటిని నగరవాసులకు అందిస్తుంది. అమెరికాలో ఇలాంటి నీటిని అందించే ఐదు నగరాలలో న్యూయార్క్ నగరం ఒకటి.

భవన నిర్మాణం[మార్చు]

బ్రూక్‌లిన్‌లో ఉన్న 19వ శతాబ్దానికి చెందిన బ్రౌన్‌స్టోన్ హౌ్‌సెస్

ఆకాశహర్మాలు న్యూయార్క్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.తక్కువ బడ్జెట్ యూరోపియన్ సంప్రదాయ భవనాల నుండి న్యూయార్క్ నగరాన్ని ఆకాశహర్మ్యాల నిర్మాణల వైపు క్రమంగా మార్పు కొనసాగింది.న్యూయార్క్ నగరంలో 5671 ఆకాశహర్మ్యాలు ఉన్నాయి.200మీటర్ల కంటే ఎత్తైన భవనాలు మాత్రం 48.ఎక్కువగా జలంచేపరినృత్తం కాబడి కడు సుందరంగా ఉంటాయి.నగరంలోని జనసాంద్రత,వ్యాపారకేంద్రంలో అందుయాటులో లేని ఆస్తుల ధరల కారణంగా ప్రత్యేకంగా నిర్మించబడిన విస్తారంగా క్రింది తరగతి ప్రజల నివాసాలు,కార్యాలయాలు, నివాస గృహసముదాయాల నిర్మాణాలలో న్యూయార్క్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.

మిలీనియం యుఎన్ ప్లాజా హోటల్ నుండి ఉదయపు వేళలో న్యూయార్క్ నగర సౌందర్యం


న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన అనేక శైలిలో భవన సముదాయాలు ఉన్నాయి.వీటిలో ముఖ్యమైనవి వూల్ వర్త్ (1913),మొదటి దశలో నిర్మించిన గోతిక్ రివైవల్,జోనింగ్ రిసొల్యూషన్ (1926),సెట్బాక్,ఆర్ట్ డికో శైలిలో నిర్మించిన క్రిస్లర్ బిల్డింగ్ (1930) వీటి స్టీల్ ప్లేట్స్ అలంకరణ సూర్య కిరణాలకు ప్రతిఫలిస్తూ ఈ భవనాలకు ప్రత్యేక అందాలను సమకూరుస్తాయి.ఈ భవనం అనేక మంది ప్రముఖులు, ఆర్కిటెక్కులచే ప్రశంసలను అందుకుంది.అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న అంతర్జాతీయ శైలిలో నిర్మించిన సీగ్రామ్ భవనం (1957) ఈ భవనం ముఖద్వారంలో రేకుతో తాపడంచేసిన స్తంభాలు ఈ భవనం యొక్క ప్రత్యేకత.కోండ్ నేస్ట్ భవనం (2000)అమెరిక ఆకాశహర్మ్యాలలో ఊన్న గ్రీన్ డిజైన్ భవనాలలో ప్రత్యేకత కలిగిన భవనాలలో ఒకటి.
న్యూయార్క్ నగర నివాసగృహ నిర్మాణంలో బ్రౌన్ స్టోన్ రా హౌసెస్ ,టౌన్ హౌసెస్ , ప్రత్యేక ఆకారంలో నిర్మించిన 1870 నుండి 1930 వ సంవత్సరంల మధ్య కాలంలో నిర్మించినటెనెమెన్ట్స్ చెప్పుకోతగినవి.1835 వ సంవత్సరంలో సంభవించిన అగ్ని ప్రమాదం తరువాత వచ్చిన మార్పు ఫలితంగా రాళ్ళు, ఇటుకలు నగర నిర్మాణాలలో ప్రముఖ పాత్ర వహించాయి.

కళలు వినోదాలు[మార్చు]

ఒపేరా అడిటోరియమ్
కార్నెగీ హాల్

అమెరికా చిత్రసీమలో న్యూయార్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది.1920 వ సంవత్సరంలో నిర్మించిన మాన్‌హట్టా చలనచిత్రం ఇక్కడ నిర్మించబడిన అవన్ట్ గ్రేడ్ ఆరంభ చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం న్యూయార్క్ నగరం అమెరికా చలనచిత్ర పరిశ్రమలో రెండవ స్థానంలో ఉంది. నగరంలో ప్రస్తుతం 2,0000 పైగా కళా, సాంస్కృతిక కేంద్రాలు,5,000 కళాప్రదర్శనశాలలు ఉన్నాయి.నగరపాలిత సంస్థ నేషనల్ ఎండోన్‌మెంట్ ఫర్ ఆర్ట్స్కు అధికమొత్తంలో నిధులను సమకూరుస్తుంది.19వ శతాబ్దంలో సంపన్నులచే ప్రముఖ సాంస్కృతిక సంస్థలు వరుసగా స్థాపించబడ్డాయి. కార్నెగీ హాల్, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వాటిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. 18వ శతాబ్దంలో విద్యుత్తుని కనిపెట్టిన తరువాత దీపాల వినియోగం అధికం కావడంతో నగరంలోని బ్రాడ్‌వే, 42వ వీధి సంగీతకార్యక్రమాలకు ప్రముఖ ప్రదర్శనా కేంద్రమైయ్యాయి. ఈ కారణంగా అవి బ్రాడ్‌వే మ్యూజికల్‌గా గుర్తింపు పొందాయి.
సెంట్రల్ పార్క్ సమ్మర్ స్టేజ్ వేసవిలో నాటకాలు, కన్సర్ట్ అనబడే సంగీత కార్యక్రమాలనూ ఉచితంగా ప్రదర్శిస్తూ వేసవిలో సందర్శకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. 5 బారోస్‌లో ఇప్పటివరకు 1,200 కన్‌సర్ట్స్,డాన్స్, రంగస్థల ప్రదర్శనలను అందించాయి. లిన్‌కన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్అమెరికాలోని కళా ప్రదర్శనశాలలలో అతి పెద్దది దీనిలో జాజ్ ఏట్ లింకన్ సెంటర్ ,ది మెట్రో పాలిటన్ ఒపేరా, ది న్యూయార్క్ ఫిల్ హార్మోనిక్, ది న్యూయార్క్ సిటీ బ్యాలెట్,ది వివియన్ బ్యూమోంట్ దియేటర్,ది జూలియర్డ్ స్కూల్ అండ్ అలైస్ టల్లీ హాల్ మొదలైన ప్రదర్శన శాలలు ఉన్నాయి.

పర్యాటక రంగము[మార్చు]

రాక్‌ఫెల్లర్ టవర్ పైభాగం నుండి సెంట్రల్ పార్క్ దృశ్యం


న్యూయార్క్ నగరం అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి.ఈ నగరాన్ని ప్రతి సంవత్సరం 4కోట్లమంది సందర్శిస్తుంటారు.న్యూయార్క్ సెంట్రల్ పార్క్ అమెరికాలో అత్యధికులు సందర్శించే సెంట్రల్ పార్క్.[[పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశాలలో ముఖ్యమైనవి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్,ఎల్లిస్ ఐలాండ్,బ్రాడ్‌వే దియేటర్ నిర్మాణాలు,మెట్రో పాలిటన్ ఆఫ్ ఆర్ట్ లాంటి మ్యూజియమ్స్,సెంట్రల్ పార్క్,వాషింగ్టన్ స్క్వేర్ పార్క్,రాక్ ఫెల్లర్ సెంటర్,టైమ్స్ స్క్వేర్,ది బ్రోన్‌క్స్ జూ,న్యూయార్క్ బొటానికల్ గార్డెన్,ఫెయిత్ అండ్ మాడ్సన్ అవెన్యూలలో ఖరీదైన షాపింగ్.ఇవికాక నగరంలో జరిగే కొన్ని ప్రత్యేక సందర్భాలు వాటిలో గ్రీన్ విచ్ విలేజ్‌లో జరిగే హాలోవిన్ పేరేడ్',ది ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్,సెంట్రల్ పార్క్‌లో జరిగే ప్రదర్శనలు ప్రధానమైనవి.అమెరికా యొక్క ప్రత్యేక గుర్తింపుగా మిగిలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకులను అమితంగా ఆకర్షించే ప్రదేశాలలో ఒకటి.తూర్పుతీరాలలో నివశించే మొదటి , రెండవతరాలప్రజల ప్రధాన షాపింగ్ కేంద్రాలైన జాక్సన్ హైట్స్,ఫ్లష్షింగ్ , బ్రింగ్టన్ బీచ్ కూడా ప్రత్యేక ఆకర్షణలే.
న్యూయార్క్ ఆహారరంగం విభిన్నరుచుల సమాహారం.భిన్నరీతుల భోజనశాలలు ఇక్కడ ప్రసిద్ధం.అనేక దేశాలనుండి వచ్చి ఇందుకు ఇక్కడ స్థిరపడిన ప్రజలే కారణం.యూదు , ఇటాలియన్ల కారణంగా నగరమంతా ప్రసిద్ధి చెందిన బాగిల్స్ ,చీజ్‌కేక్ , న్యూయార్క్ టైప్-పీజా .4,000 న్యూయార్క్ నగర పాలక వ్యస్థ నుండి అనుమతి పొందిన మంది వ్యాపారులు ఆహారరంగంలో సేవలందిస్తున్నారు.వీటిలో చాలావరకు వలస ప్రజలే స్వంతదారులు. మధ్యతూర్పు దేశాలకుచెందిన ప్రజల ఫాలాఫెల్స్ ,కబాబ్స్ ఖండాంతర ఆహారాలు న్యూయార్క్ వీధిలో విక్రయించే ఆహారాలలో కొన్ని.హాట్ డాగ్స్ , ప్రిట్జెల్స్ ఇప్పటికీ న్యూయార్క్ నగరవీధుల్లో లభ్యమౌతున్న ఆహారాలే.నగరం అనేక ప్రసిద్ధ హోటల్స్ నిలయమే.
న్యూయార్క్ నగరంలో ఉన్న ఉద్యానవనాల విస్తీర్ణం 28,000 చదరపు ఎకరాలు.నగర సముద్ర తీరం పొడవు 14 మైళ్ళు.

ప్రసార రంగం[మార్చు]

ఎన్.బి.సి స్టూడియోస్‌కు కేంద్రమైన రాఖ్ ఫెల్లర్ సెంటర్

న్యూయార్క్ నగరం ప్రకటనలకు,సంగీతానికి,దూరదర్శన్ కార్యక్రమాలకు,వార్తా పత్రికలకు , పుస్తక ప్రచురణా రంగం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగింది. లాస్ ఏంజలెస్,చికాగో , టొరంటో ల తరువాత న్యూయార్కు ప్రసార రంగానికి దక్షిణ అమెరికాలో మంచి గిరాకీ ఉంది.అంతర్జాతీయంగా ప్రాముఖ్యమున్న 8 ప్రకటనా వ్యవస్థలలో 7 సంస్థలకు ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్ నరంలో ఉన్నాయి.200 వార్తా పత్రికలకు , 350 పత్రికలకు నగరంలో కార్యాలయాలు ఉన్నాయి.పుస్తక ప్రచురణా సంస్థ ద్వారా 25,000 మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
అమెరికాలోని మూడు వార్తా పత్రికలలో రెండు వార్తా పత్రికలు న్యూయార్క్ నుండి వెలువడుతున్నాయి.అవి ది వాల్ స్ట్రీట్ జర్నల్ , ది న్యూయార్క్ టైమ్స్.ప్రజల ఆదరణను చూరగొన్న ది న్యూయార్క్ డైలీ న్యూస్ , ది న్యూయార్క్ పోస్ట్1801 లో అలెక్జాండర్ హామిల్టన్ చే స్థాపించ బడ్డాయి.నగరంలో పురాతన సంప్రదాయ శైలిలో నడుస్తున్న ప్రచురణా సంస్థ 40 భాషలలలో 270 పత్రికలను ప్రచురిస్తుంది.స్పానిష్ భాషలో ప్రచురిస్తున్న పత్రిక ప్రచురణలో ఉన్న అతి పురాతన పత్రిక. హార్లెమ్‌‌లో ప్రచురితమౌతున్న ది న్యూయార్క్ ఆమ్‌స్టర్‌డామ్ న్యూస్ ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు ప్రచురితమైన పత్రికలలో ప్రధానమైంది.ఆల్టర్‌నేటివ్ న్యూస్ పేపర్లలో ది విలేజ్ వాయిస్ ముఖ్యమైంది.
న్యూయార్క్ నగరంలో దూరదర్శన్ అభివృద్ధి అత్యధికులకు ఉపాధి కల్పిస్తూ నగర ఆర్థిక రంగానికి తోడ్పాతును అందిస్తూ ఉంది.నగరంలోని నాలుగు ప్రధాన ప్రసార సంస్థలు ఎ.బి.సి, సి.బి.ఎస్,, ఎన్.బి.సిలు ప్రసార రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.అనేక కేబుల్ టి.వి ప్రసారాలు నగర ప్రజలకు వినోదాన్నందిస్తున్నాయి.వాటిలో ఎమ్.టివి.,ఫాక్స్ న్యూస్,హెచ్.బి.ఓ, కామెడీ సెంట్రల్ ప్రధానమైనవి.100 కంటే అధికంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న కార్యక్రమాలు చానల్స్ ద్వారా నగరంలో ప్రసారమౌతున్నాయి.

న్యూయార్క్ భాషా నుడికారం[మార్చు]

న్యూయార్క్ నగరానికి ప్రత్యేకమైన ప్రాంతీయభాషను ఇక్కడి ప్రజలు న్యూయార్క్ డయాలెక్ట్ గా వ్యవహరిస్తుంటారు. దీనిని బ్రూక్‌లినీస్, న్యూయార్కీస్ గానూ గుర్తింపు పొందింది. ఇది తరచుగా అమెరికా ఆంగ్లభాషా సరళులలో ఒకటిగా వ్యవహరిస్తుంటారు. ఈ సంప్రదాయక భాష మధ్య అమెరికాకు చెందిన యురేపియన్ అమెరికన్లకు చెందిన శ్రామిక వర్గం నుండి ప్రాచుర్యం పొందింది.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

న్యూయార్క్ ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించటానికి మొగ్గు చూపుతారు. దిగువ తరగతి న్యూయార్క్ ప్రయాణీకులు అమెరికా మొత్తం ప్రయాణీకులలో మూడవ స్థానంలో ఉన్నారని అంచనా. దేశంలోని మూడింట రెండు వంతులు రైలు ప్రయాణీకులు న్యూయార్క్లో నివసిస్తున్నట్లు అంచనా. ఇది దేశంలోని ఇతర ప్రదేశానికి పూర్తి విభిన్నం. మిగిలిన దేశంలోని అన్నిప్రాంతాలలో 90% ప్రజలు కార్లలో ప్రయాణించి తమ కృయాలయాలకు చేరుకుంటున్నట్లు అంచనా.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మాత్రమే స్వంత కార్లు లేని వారు సగంకంటే ఎక్కువ మంది ఉన్నారు.మాన్‌హట్టన్‌లో స్వంత కార్లు లేని పౌరుల శాతం 75%.దేశీయ సరాసరి 8%. న్యూయార్క్ పౌరులు తాము పని చేసే ప్రదేశానికి చేరుకోవడానికి ఒకరోజుకు 38.4 నిమిషాల కాలం వెచ్చిస్తారని యు ఎస్ సెన్సస్ బ్యూరో అంచనా. ఇది దేశంలో అత్యధిక ఉద్యోగప్రయాణ సమయం.

న్యూయార్క్ నగరపౌరులకు అమ్‌టెక్ రైల్వే సస్థ రైల్వే సేవలు అందిస్తుంది. ఇది పెన్సిల్‌వేనియా స్టేషన్‌ను ఉపయోగించుకుంటూ బోస్టన్,ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డి సి నగరాలను కలుపుతూ సేవలు అందిస్తుంది .

ది న్యూయార్క్ సిటీ సబ్‌వే ప్రంచంలోనే పెద్ద భూగర్భ రైలు మార్గం.468 స్టేషన్‌లు ఉన్నా ఇంత పెద్ద రాపిడ్ ట్రాన్సిస్ట్ ప్రంపంచంలో ఇది ఒక్కటే. ఇది రోజులో 24 గంటలూ తెరిచే ఉండటంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.2006లో 1.5 బిలియన్ల పాసింజర్ ట్రిప్పులులు వేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రాత్రి వేళలో మార్గాలలో కొన్ని మార్పులు ఉంటాయి. ఇతర నగరాలలో రాత్రి పూర్తిగా ప్రయాణాలు నిలిపివేస్తాయి.అలా నిలిపి వేసే వాటిలో లండన్,పారిస్,వాషింగ్టన్ డి సి,మాడ్రిడ్, టోకియో నగరాలు ఉన్నాయి.న్యూయార్క్ నగర ప్రయాణ సౌకర్యాలు విభిన్నంగా ఉంటాయి.అమెరికాలోని అతిపెద్ద వంతెన సస్పెన్షన్ బ్రిడ్జ్ ,యాంత్రికమైన వెంటిలేషన్ చేయబడిన సొరంగ వాహనమార్గం, 12,000 కంటే ఎక్కువున్న పసుపు కార్లు (బాడుగ కార్లు),రూజ్‌వెల్ట్ ద్వీపం నుండి ఉద్యోగులను మాన్‌హట్టన్కు చేరవేసేఏరియల్ ట్రామ్‌వే మారియు మాన్‌హట్టన్ నుండి నగరంలోపలి ప్రాంతాలకు వెలుపలి ప్రాంతాలకు చేరవేసే ఫెర్రీలు. అవిశ్రాంతంగా పనిచేయడంలో అమెరికాలోనే ప్రథమ స్థానంలో ఉన్న స్టేటెన్ ఐలాండ్ ఫెర్రీ సంవత్సరానికి 19 మిలియన్ల ప్రజలను 5.2 మళ్ళ మార్గంలో స్టేటెన్ ఐలండ్, మాన్‌హట్టన్ దిగువ ప్రాంతాలకు ఉద్యోగులను చేరవేస్తుంది.

న్యూయార్క్ నగరంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. అవి జాన్ ఎఫ్ కెన్నడి ఇంటర్నేషనల్, న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్, లాగార్డియా. న్యూబర్గ్ సమీపంలో స్టీవార్డ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు జరుగుతున్నాయి. 2005లో 100 మిలియన్ల ప్రయాణీకులు న్యూయార్క్ నుండి ప్రాయాణించినట్లు గణాంకాల వివరణ.

న్యూయార్క నగరంలో విస్తారంగా లభిస్తున్న ప్రభుత్వ వాహన సౌకర్యంలేకాక నగరవెలుపలి ప్రాంతాలను కలుపుతూ పలు రహదారులు, పార్క్‌వేలు, వంతెనలు, భూగర్భ మార్గాలు ఉన్నాయి.ఉత్తర న్యూ జెర్సీ,వెంచెస్టర్ కౌంటీ,లాంగ్ ఐలాండ్, నైరుతి కనెక్టికట్ నుండి ఈ మార్గాలద్వారా లక్షలాది ఉద్యోగులు న్యూయార్కుకు వచ్చి పోతూ ఉంటారు. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి చిక్కుకు పోవడం సర్వ సాధారణం. ప్రత్యేకంగా పనివేళలలో వాహన రద్దీ అత్యధికం. ది జార్జ్ వాషింగ్‌టన్ వంతెన ప్రంపంచంలో అత్యధిక వాహన రద్దీ అధికంగా కలిగిన వంతెన.

అత్యధిక ప్రభుత్వ వాహనాలేకాక నగరంలో పాదచారులూ సైకిల్ వాడకందారులూ ఎక్కువే. 1,20,000 మంది సైకిల్‌ పై ప్రయాణిస్తున్నారు. పాదచారులూ, సైకిలిస్టులూ 21% ఉన్నట్లు అంచనా. సాధారణంగా దేశంలోని ఇతర నగరాలలో సరాసరి 8% ప్రజలు ఇలా ప్రయాణిస్తున్నట్లు అంచనా.

ప్రచురణలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

 • ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణ ఎడ్విన్ జి బర్రో, మైక్‌వాలేస్ (1998)రచన గోథమ్:ఎ హిస్ట్రీ ఆఫ్ న్యూయార్క్ సిటీతో 1898.
 • లిట్టిల్,బ్రౌన్&కో ప్రచురణ ఆంటోనీ బర్గెస్ (1976)రచన న్యూయార్క్.
 • ది న్యూ ప్రెస్ ప్రచురణ (1995లో పున॰ ప్రచురణ)ఫెడరల్ రైటర్స్ ప్రాజెక్ట్ (1939)ది డబ్ల్యూ పి ఎ గైడ్ టొది న్యూయార్క్ సిటీ.
 • యేల్ విశ్వవిద్యాలయం ప్రచురణ కెన్నెత్ టి. జాక్సన్ (1965)రచన ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ న్యూయార్క్ సిటీ.
 • కొలంబియా విశ్వవిద్యాలయం ప్రచురణ కెన్నెత్ టి. జాక్సన్, డేవిడ్ ఎస్.డన్‌బార్ (2005).
 • లంక్ విచ్,జార్జ్ ఎల్ (1998)రచన అమెరికన్ మెట్రో పోలిస్:ఏ హిస్ట్రీ ఆఫ్ న్యూయార్క్ సిటీ.
 • లిటిల్ బుక్ రూమ్ (2000 పున్॰ ప్రచురణ)ప్రచురణ ఇ.బి వైట్ (1949)హియర్ ఈజ్ న్యూయార్క్.
 • కోల్‌సన్ వైట్‌హెడ్ (2003)కోలోసస్ ఆఫ్ న్యూయార్క్:ఎ సిటీ ఇన్ తర్టీన్ పార్ట్స్,డబుల్ డే.
 • గూగుల్ బుక్స్ విడుదల ఇ పోర్టర్ బెల్డన్ (1849)రచన న్యూయార్క్,పాస్ట్,ప్రజెంట్,ఫ్యూచర్:కంప్రైసింగ్ ఎ హిస్ట్రీ ఆఫ్ ది స్టీ ఆఫ్ న్యూయార్క్,ఎ ప్రిస్క్రిప్ష ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ కండిషన్ ఏండ్ ఇట్స్ ఏస్టిమేట్ ఆఫ్ ఫ్యూచర్ ఇంక్రీజ్,న్యూయార్క్,గ్,పి పుట్నమ్.

వ్యక్తులు[మార్చు]

 1. లారీ టెస్లర్: కంప్యూటర్ శాస్త్రవేత్త. కంప్యూటరులో క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించాడు.[3]

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Bloomberg Leaving GOP" Archived 2007-10-03 at the Wayback Machine. WCBS-TV. Accessed 19 June 2007.
 2. "Big Apple Coming to Its Census" (html). New York Post. Retrieved March 20. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
 3. నమస్తే తెలంగాణ, అంతర్జాతీయం (20 February 2020). "క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు". ntnews. Archived from the original on 22 ఫిబ్రవరి 2020. Retrieved 31 March 2020. {{cite news}}: Check date values in: |archivedate= (help)

బయటి లింకులు[మార్చు]

 • న్యూయార్క్ నగరం-అధికారిక వెబ్సైటు :లింక్