తూర్పు
స్వరూపం
తూర్పు (East) ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించేసూర్యుడుకి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు కుడి వైపున ఉంటుంది. తూర్పు దిశను "పూర్వ దిశ" అని కూడా అంటారు. పడమర దిక్కు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.
భౌగోళిక విషయాలు
[మార్చు]తూర్పుకు సంబంధించిన మరికొన్ని విషయాలు
[మార్చు]- భారత దేశంలో అతి తూర్పున ఉన్నరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్.
- ఆంధ్ర ప్రదేశ్‌లో అతి తూర్పున ఉన్న జిల్లా శ్రీకాకుళం.
- తూర్పు మణిగా ప్రసిద్ధి చెందిన ద్వీపం ఇండోనేషియా లోని బాలి.
- తూర్పు దేశాలు అనగా గ్రీనిచ్ రేఖకు తూర్పున ఉన్న దేశాలు.
- భారతదేశంలో అత్యంత తూర్పున ఉన్న ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ లోని థిల్సా కనుమ.
- ఆంధ్ర ప్రదేశ్‌లో తూర్పు పేరుతో కల ఏకైక జిల్లా తూర్పు గోదావరి.
- దక్షిణ భారతదేశంలో తూర్పువైపున ఉన్న మైదానాలకు తూర్పుతీరమైదానాలు అని పేరు.
- స్వాతంత్ర్యానికి పూర్వం బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది.
- భారతదేశంలో ప్రవహించే ప్రధాన నదులు తూర్పు వైపునకు ప్రవహిస్తున్నాయి.
- భారతదేశంలో తూర్పు నావికాదళం ప్రధాన స్థావరం విశాఖపట్టణంలో ఉంది.
- భారతదేశంలో రైల్వే డివిజన్లలో ఒకటైన తూర్పు రైల్వే జోన్ ప్రధాన స్థావరం కోల్‌కతాలో ఉంది.
- భారతదేశంలో రైల్వే డివిజన్లలో ఒకటైన తూర్పుతీర రైల్వే జోన్ ప్రధాన స్థావరం భువనేశ్వర్‌లో ఉంది.
- భారతదేశంలో రైల్వే డివిజన్లలో ఒకటైన తూర్పుమధ్య రైల్వే జోన్ ప్రధాన స్థావరం హాజీపూర్ (అయోమయ నివృత్తి)లో ఉంది.
తూర్పు పేరుతో ప్రసిద్ధి చెందినవి
[మార్చు]- ప్రపంచ చరిత్రలో తూర్పు రోమన్ సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందినది బైజాంటియన్ సామ్రాజ్యం.
- తూర్పు పేరుతో ఉన్న దేశాలు : తూర్పు తైమూర్,
- ఇది వరకు తూర్పు పేరుతో ఉన్న దేశాలు: తూర్పు జర్మనీ, తూర్పు ఆఫ్రికా,
- చరిత్రలో తూర్పు పేరుతో వెలిసిన రాజ్యాలు : తూర్పు చాళుక్యులు, తూర్పు గాంగులు,
- తూర్పు పేరుతో కల సినిమాలు : తూర్పు పడమర, తూర్పు వెళ్ళే రైలు,
- తూర్పు పేరుతో కల మండలాలు : మద్దికేర తూర్పు,
- తూర్పు పేరుతో కల గ్రామాలు : తూర్పు రొంపిదొడ్ల, తూర్పు తక్కెళ్లపాడు, కోడూరు (తూర్పు), తూర్పు బండవీధి, తూర్పు పొలినేనిపాలెం, పాతకోట(తూర్పు), తూర్పు వెంకటాపురం, తూర్పు చౌటపాలెం, తూర్పు లక్ష్మీపురం, తూర్పు తిమ్మాపురం, బాపట్ల తూర్పు (గ్రామీణ), తూర్పు మల్లవరం, చౌలపల్లి (తూర్పు), కొందుర్గ్ (తూర్పు), తూర్పు గూడూరు (r), చీపురపల్లి తూర్పు, తూర్పు కొప్పెరపాడు, తూర్పు విప్పర్రు, తూర్పు కోడిపల్లె, తూర్పు కంభంపాడు, తూర్పు గంగవరం, మాధవరం(తూర్పు), పాతకోట(తూర్పు),
పురాణాలలో/వాస్తు శాస్త్రంలో
[మార్చు]అష్టదిక్పాలకులలో ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. ఇది సూర్యభగవానుడు ఉదయించే దిక్కు. తూర్పు వైపు శుభ్రంగా ఉంచి, తేలికైన వస్తువులు పెట్టడం తప్పనిసరి అని వాస్తు నియమం.
- చదువుకొనే విద్యార్థులకు తూర్పు మంచి దిశ.
- తూర్పు వైపు పూజగది కడితే చాలా శుభం.
- నీటి కోసం బోర్ తూర్పు దిక్కులో వేస్తే అధిక ఫలం కలుగుతుంది. గౌరవాలు పెరుగుతాయి.
- భవనం వాలు తూర్పుదిశగా ఉంటే సంపద, సమృద్ధి.
- నీటి టాంకు భవనం పైన తూర్పు దిశగా కడితే పిల్లల చదువుపై చెడు ప్రభావం పడుతుంది.
- వంట వండేటప్పుడు గృహిణి ముఖం తూర్పువైపు ఉన్నట్లయితే అరోగ్యప్రదం.
- తూర్పు దిశలో గదిని పిల్లలకు ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది. మానసిక వికాసం కలుగుతుంది.
- తూర్పువైపు స్టోర్ రూం., మెట్లు, శౌచాలయాలు కట్టరాదు.
- తూర్పు దిక్కులో బరువైన సామాన్లు పెడితే దోషం పెరుగుతుంది. రకరకాల కష్టాలు వస్తాయి.