Jump to content

ఇండోనేషియా

వికీపీడియా నుండి
Republic of Indonesia
రిపబ్లిక్ ఇండోనేషియా
Flag of ఇండోనీషా
Flag
Coat of arms of ఇండోనీషా
Coat of arms
Motto: "భిన్నేక తుంగ్గల్ ఇకా"  (పాత జావనీస్)
"భిన్నత్వంలో ఏకత్వం"

National ideology: Pancasila[1]
Location of ఇండోనీషా
రాజధాని
and largest city
జకార్తా
అధికార భాషలుఇండోనేషియన్
ప్రభుత్వంరాష్ట్రపతి తరహా గణతంత్రము
Susilo Bambang Yudhoyono
ముహమ్మద్ Jusuf కల్లా
స్వాతంత్ర్యం 
• ప్రకటితం
ఆగస్టు 17 1945
• గుర్తింపబడినది
డిసెంబరు 27 1949
• Water (%)
4.85
జనాభా
• జూలైJuly 2007 స్థాపనం. estimate
234,693,997 (4వది)
• 2000 census
206,264,595
GDP (PPP)2007 estimate
• మొత్తం
US$845.6 bn[2] (15)
• తలసరి
US$3,400[2] (110వది)
Gini (2002)34.3
medium inequality
HDI (2004)Increase 0.711
Error: Invalid HDI value (108వది)
ద్రవ్యంరుపయ్యా (IDR)
Time zoneUTC+7 to +9 (అనేక)
• సమ్మర్ (DST)
లేదు
Calling code62
Internet TLD.id

ఇండోనేషియా లేదా ఇండోనీషా[3] మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా , ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ , ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం , మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

హిందూ , బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా , జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ , బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.

16వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చి అనేక చిన్న చిన్న రాజ్యాలుండటాన్ని గమనించారు. సుగంధద్రవ్యాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించే యత్నంలో ఉన్న యూరోపియన్లకు ఈ చిన్న చిన్న రాజ్యాలు దాడులకు అనువుగా కనిపించాయి.

17వ శతాబ్దంలో స్పానిష్ , పోర్చుగీస్ వారిని బయటకు తరిమి, డచ్ వారు మరింత శక్తివంతమైనారు. తిమూర్ ద్వీపం లోని పోర్చుగీస్ తిమూర్ మాత్రం పోర్చుగీస్ వారి వలస రాజ్యం గానే ఉంది. మొదట డచ్ ఈస్ట్ ఇండియా కంపెని VOC నియంత్రణలోను, తరువాత డచ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోను 19వ శతాబ్దం నుండి 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇందోనేసియాను డచ్ వారు పరిపాలించారు.

19వ శతాబ్దపు వ్యవసాయ పద్ధతి Cultuveerstelsel పేరుతో జావా ద్వీపంలో విశాలమైన వనాలు , నిర్బంధ వ్యవసాయం, డచ్ ప్రభుత్వానికి లాభాలు తెచ్చాయి. 26 డిసెంబరు 2004 నాటి సునామీ వలన సుమత్రా దీవి లోని ఉత్తర భాగాలు కొన్ని ముఖ్యంగా Aceh, తీవ్రంగా నష్టపోయాయి.

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

2007లో తయారు చేసిన అంచనాల ప్రకారం ఇండోనేషియా GDP 410.3 బిలియను డాలర్లు ఉంది (అనగా 845.6 బిలియను డాలర్ల కొనుగోలు శక్తి).[2]

ప్రజలు

[మార్చు]

ఇండోనేషియా ప్రజలను రెండు గ్రూపులుగా విభజింపవచ్చును. పశ్చిమాన అత్యధికంగా మలయ్ లు, తూర్పున పాపుఅన్ లు, వీరి మూలాల మెలనేసియాకు చెందినవి. ఇండోనేషియాలోని చాలామంది ప్రజలు భాష , ప్రాంతీయ పరంగా జావనీలు (జావా ద్వీపాలకు చెందినవారు), సుందనీలు లేదా బాటక్లు. ఇండోనేషియాలోని ప్రధాన మతం ఇస్లాం, 2000 గణాంకాల ప్రకారం దాదాపు 89% (88.22%) లు ముస్లింలు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశంగా పేరొచ్చింది. క్రైస్తవులు (9%), బౌద్ధులు (2%), , హిందువులు (7%).

ప్రంబానన్ దేవాలయం, 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం, జావా, ఇండోనేషియా.

దాదాపు ప్రజలందరూ 'బహాసా దీరాహ్' తమ ప్రథమ భాషగా మాట్లాడుతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ లేదా 'బహాసా-ఇండోనేషియా'. దీనికి మలయ్ భాషతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాదాపు ఇండోనేషియాలోని అన్ని పాఠశాలలలోనూ ఉపయోగించ బడుతున్నది.

సంస్కృతి

[మార్చు]

ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం ఉంది. ప్రఖ్యాత 'జావనీ' నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగివున్నది. ప్రఖ్యాత జావనీ , బాలినీ నృత్యం 'వయాంగ్-కులిత్' అనేక థియేటర్ షోలు, పలు మతపరమైన ఘటనలను చూపెడతాయి. అనేక ద్వీపాలు తమ 'బాతిక్' , 'ఇఖత్' వస్త్రాలకు పేరుగాంచినవి. 2012 ఆగస్టు 27న ఇండోనేషియాలోని వే రెబో గ్రామంను ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది.

సిలాట్ అనునది ఏకైక 'యుద్ధ కళ', ఇది ద్వీపసమూహాలన్నింటిలోనూ ప్రసిద్ధి.

దేవాలయాలు

[మార్చు]

Further reading

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

Official Sites (owned and operated by the government of Indonesia and its agencies)

Other Sites (not owned nor operated by the government of Indonesia and its agencies)

మూలాలు

[మార్చు]
  1. ↑ US Library of Congress; Vickers (2005), page 117.
  2. 1 2 3 "ఎంపిక చేసిన దేశాలు , వర్గాల GDP రిపోర్టు". వరల్డ్ ఫ్యాక్ట్ బుక్కు. సీఐఏ. 2007. Archived from the original on 2008-12-10. Retrieved 2008-03-26.
  3. ↑ "How to pronounce Indonesia : Pronunciation of Indonesia". inogolo.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-11.