Jump to content

ఖతార్

వికీపీడియా నుండి
(కతర్ నుండి దారిమార్పు చెందింది)
دولة قطر
దౌలత్ ఖతార్
ఖతార్ రాజ్యము
Flag of ఖతార్ ఖతార్ యొక్క చిహ్నం
జాతీయగీతం
As Salam al Amiri
ఖతార్ యొక్క స్థానం
ఖతార్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
దోహా (Doha)
25°18′N 51°31′E / 25.300°N 51.517°E / 25.300; 51.517
అధికార భాషలు అరబ్బీ
ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన రాచరికము
 -  అమీర్ హమాద్ బిన్ ఖలీఫా
 -  ప్రధాన మంత్రి Hamad ibn Jaber Al Thani
స్వాతంత్య్రము
 -  యునైటెడ్ కింగ్ డమ్ నుండి
సెప్టెంబరు 3 1971 
విస్తీర్ణం
 -  మొత్తం 11,437 కి.మీ² (164వది)
4,416 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  జూలై 2007 అంచనా 841,000 (158వది1)
 -  2004 జన గణన 744,029[1] <--then:-->(159వది)
 -  జన సాంద్రత 74 /కి.మీ² (121st)
192 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $25.01 బిలియన్లు (102వది)
 -  తలసరి $31,397 (11వది)
జీడీపీ (nominal) 2005 అంచనా
 -  మొత్తం $42.463 billion (62వది)
 -  తలసరి $49,655 (7వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Decrease 0.844 (high) (46వది)
కరెన్సీ Riyal (QAR)
కాలాంశం AST (UTC+3)
 -  వేసవి (DST) (not observed) (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .qa
కాలింగ్ కోడ్ +974
1 Rank based on 2005 estimate.
2 Ruled by the Al Thani family since the mid-1800s.

[1] /ˈkɑːtɑːr/, /ˈkɑːtər/ or /kəˈtɑːr/;

[2]

అరబ్బీ: قطرQaṭar [ˈqɑtˤɑr];ప్రాంతీయంగా : [ɡɪtˤɑr]),అంటారు.[3][4] అధికారికంగా " స్టేట్ ఆఫ్ ఖతార్ " అంటారు. (అరబ్బీ: دولة قطرDawlat Qaṭar), ఇది ఒక స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యభాగంలో కొంతభూభాగంలో విస్తరించి ఉన్న ద్వీపకల్పమే ఖతార్. దేశానికి దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా ఉంది. మిగిలిన భూభాగానికి పర్షియన్ గల్ఫ్ (అరేబియన్ గల్ఫ్) ఉంది. ఖతార్, బహ్రయిన్ లను అరేబియన్ గల్ఫ్‌లో ఉన్న స్ట్రెయిట్ (జలసంధి) విడదీస్తూ ఉంది. ఖతార్ సముద్ర సరిహద్దులను యునైటెడ్, ఇరాన్ దేశాలతో పంచుకుంటూ ఉంది. ఓట్టమన్ పాలన తరువాత 20వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " బ్రిటన్ ప్రొటెక్టరేట్‌"లో భాగం అయింది. 1971లో ఖతార్‌కు స్వతంత్రం లభించే వరకు ఖతార్ బ్రిటన్ ప్రొటెక్టరేట్‌లో కొనసాగింది.19వ శతాబ్దం ఆరంభం వరకు ఖతార్ " హౌస్ ఆఫ్ తాని " పాలనలో కొనసాగింది. ఖతార్ రాజ్యాన్ని " జస్సిం బిన్ మొహమ్మద్ అలి తాని " స్థాపించాడు. ఖతార్ రాజుల వారసత్వంలో పాలించబడింది. దీనికి ఎమీర్ నాయకత్వం (షేక్ తమీం బిన్ హమాద్ అల్ తాని) వహించాడు.[5] ఖతార్ రాజ్యాంగం 98% ప్రజల సహకారంతో కాంస్టిట్యూషనల్ రిఫరెండంను ఆమోదించింది.[6][7] 2013 లో ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లు. వీరిలో 278,000 ఖతారి పౌరులు , 1.5 మిలియన్లు బహిస్కృతులు ఉన్నారు.[8] సౌదీ అరేబియా , ఓమన్ గల్ఫ్ కోపరేషన్ కౌంసిల్ లో ఖతార్ అత్యంత సంప్రదాయ దేశంగా గుర్తించబడుతుంది.[9][10] ఖతార్ అధిక ఆదాయం కలిగిన అభివృద్ధి చెందిన దేశం. సహజవాయువు , ఆయిల్ నిలువలలో ఖతార్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.[11] ఖతార్ తలసరి జి.డి.పి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఖతార్ అత్యంత మానవాభివృద్ధి కలిగిన దేశంగానూ , అరబ్ దేశాలలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఐఖ్యరాజ్యసమితి వర్గీకరించింది.[12] అరబ్ ప్రపంచంలో ఖతార్ గుర్తించతగిన శక్తిగా గుర్తించబడుతుంది. అరబ్ తిరుగుబాటు సమయంలో పలు తిరుగుబాటు బృందాలకు ఖతార్ ఆర్ధిక సహకారం , మాధ్యమాల గుర్తింపును అందించి మద్దతు ఇచ్చింది. [13][14][15] చిన్నదేశమైనా ఖతార్ ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా మిడిల్ పవర్‌గా గుర్తించబడుతుంది.[16][17] " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ "కు ఖతార్ స్వాగతం ఇచ్చింది. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి అరబ్ దేశంగా గుర్తించబడుతుంది.[18]

పేరువెనుక చరిత్ర

[మార్చు]

రోమన్ రచయిత " ప్లినీ ది ఎల్డర్ " క్రీ.పూ 1వ శతాబ్దం మధ్యకాలంలో ఈ ద్వీపకల్పంలో నివాసితుల గురించి మొదటిసారిగా వ్రాతపూర్వకంగా నమోదుచేసాడు. రోమన్ రచయిత ఇక్కడ ప్రజలను కాదరీ అని పేర్కొన్నాడు. ఈ పేరు ప్రాంతీయంగా నివసిస్తున్న ప్రధాన సెటిల్మెంటుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు.[19][20] ఒక శతాబ్దం తరువాత ప్టోల్మీ మొదటిసారిగా తయారుచేసిన మ్యాప్‌లో ఈ ద్వీపకల్పం " కతర " పేరుతో చేర్చబడింది.[20][21] ద్వీపకల్పం తూర్పు భాగంలో " కదరా " అనే నగరం కూడా ఉంది.[22] ఇదే కాలక్రమంలో " కతర" లేక కతరీగా మారింది.[23] 18 శతాబ్దం వరకు ఆ పేరుతోనే పిలువబడి తరువాత కతరాగా మారింది.[22] చివరికి, ఆధునిక ఉత్పన్నం "ఖతార్"ను దేశం యొక్క పేరుగా అవలంబించారు.[3] [22]

చరిత్ర

[మార్చు]

పూర్వీకత

[మార్చు]
జెబెల్ జస్సాస్సియెహ్, వద్ద డాట్ బొమ్మలు,4000 BC కాలానికి చెందినది

ఖతార్ ప్రాంతంలో 50,000 సంవత్సరాల పూర్వం మానవ ఆవాసాలు ప్రారంభం అయ్యాయి.[24] రాతి యుగానికి చెందిన సెటిమెంట్లు , ఉపకరణాలు ఖతార్ ద్వీపకల్పంలో లభించాయి.[24] ఉబైడ్ కాలంనాటి (6500-3800)మెసపొటేమియా కళాఖండాలు విసర్జించబడిన సముద్రతీర సెటిమెంట్లలో లభించాయి.[25] ఖతార్ ఈశాన్య సముద్రతీరంలో అల్ దాస సెటిల్మెంటు దేశంలోని ఉబైడ్ సెటిల్మెంట్లలో ప్రధానమైనదిగా భావిస్తున్నారు. ఇది చిన్న సీజనల్ మకాం.[26][27] అల్ ఖోర్ ద్వీపంలో బాబిలోనియాకు చెందిన క్రీ.పూ 2వ శతాబ్ధానికి చెందిన వస్తువులు లభించాయి. ఖతార్ వాసులకు , కస్సైట్ (ప్రస్తుత బహ్రయిన్) వాసులకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలకు సాక్ష్యంగా నిలిచాయి.[28] వీటిలో 3 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం నాటి పీతల పెంకులు , కస్సైట్ కుండ పెంకులు ప్రధానమైనవి.[26] ఖతార్ షెల్ఫిష్ డై ఉత్పత్తికి ఖ్యాతి చెందింది. సముద్రతీరంలో కస్సైట్ పర్పుల్ షెల్ డై సంస్థ ఉంది.[25][29] సా.శ. 224 స్సనింద్ సామ్రాజ్యం పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలతో చేర్చి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.[30] Qatar played a role in the commercial activity of the Sasanids, contributing at least two commodities: precious pearls and purple dye.[31] సస్సనిద్ పాలనలో పలువురు తూర్పుతీరంలో ఉన్న మెసపొటేమియా క్రైస్తవుల ప్రభావంతో క్రైస్తవమతాన్ని ఆచరించారు.[32] సాంరాజ్యాలు మారాయి పలు సెటిల్మెంట్లు ఏర్పడ్డాయి.[33][34] క్రైవశకం చివరి దశలో ఖతార్ చేర్చిన ప్రాంతాన్ని " బెత్ క్వత్రయే " (సిరియా;క్వతరీలరాంతం) అని పిలిచేవారు.[35] ఖతార్ ప్రాంతం ఒకప్పుడు బహ్రయిన్, తారౌట్ ద్వీపం, అల్- ఖాఫ్ , అల్- హసా ప్రాంతాలతో చేరిన ప్రాంతంగా ఉండేది.[36] 628లో ముహమ్మద్ తూర్పు అరేబియా పాలకుడైన " ముంజిర్ ఇబ్న్ సవ అల్ తమిమి " వద్దకు ఒక ముస్లిం దూతను పంపి తాను తన వారు ముస్లిం మతం స్వీకరించామని తెలియజేసాడు. ముంజిర్ అందుకు అంగీకరించాడు. తరువాత అరబ్ తీరంలోని ప్రజలు ముస్లిం మతావలంబకులుగా మారరు.[37] ఇలాం మతాన్ని స్వీకరించిన తరువాత అరబ్బులు పర్షియాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా సస్సనిద్ సామ్రాజ్యం పతనం అయింది.[38]

ఆరంభకాలం , ఇస్లామిక్ కాలం (661–1783)

[మార్చు]
Abbasid Caliphate at its greatest extent, c. 850.

ఖతార్ ఉమయ్యద్ కాలిఫతే కాలంలో ఖతార్ గుర్రాలు, ఒంటెలు ఉత్పత్తి కేంద్రంగా ఉండేది.[39] 8వ శతాబ్ధానికి ఖతార్ పర్షియన్ గల్ఫ్‌లో వ్యూహాత్మకమైన వాణిజ్యకేంద్రంగా, ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఖతార్ అభివృద్ధి చెందింది.[40][41] అబ్బాసిద్ కాలిఫతే పాలనలో ఖతార్ ముత్యాల పరిశ్రమల కారణంగా గణనీయంగా అభివృద్ధి చెందింది.[39] బాస్రా నుండి చైనా, భారతదేశాలకు పయనించే నౌకలు ఖతార్‌లో కొంతకాలం విశ్రాంతి కొరకు నిలిపి ఉంచబడేవి. చైనీయుల పింగాణి పశ్చిమ ఆఫ్రికా నాణ్యాలు, థాయిలాండ్ కళాఖండాలు ఖతార్‌లో కనుగొనబడ్డాయి.[38] 9వ శతాబ్ధానికి చెందిన పురాతత్వ పరిశోధకులు ఖతార్ వాసులు నాణ్యమైన గృహాలు, ప్రభుత్వ భవనాలు నిర్మించుకుని సంపన్నంగా జీవించారని అభిప్రాయపడుతున్నారు. ఈ కాలంలోనే రాతితో నిర్మించిన 100 భవనాలు, రెండు మసీదులు, అబ్బసిద్ కలిఫతే కోట (ముర్వాద్) నిర్మించబడ్డాయి.[42][43] అయినప్పటికీ ఇరాక్లో కలిఫతే సంపద పతనం కావడం ఖతార్ మీద కూడా ప్రభావం చూపింది. [44] ముస్లిం పరిశోధకుడు యాక్వత్ అల్- హమావి వ్రాసిన పుస్తకంలో కువైత్ ప్రస్తావన ఉంది. అందులో వారి వులెన్ దుస్తులు, ఈటెలు తయారీలో నైపుణ్యం వర్ణించబడిది.[45] 1253లో తూర్పు అరేబియాలో ఉస్ఫ్యురిడ్స్ ఆధీనంలో ఉండేది. 1320లో ఒర్ముస్ రాకుమారుడు ఖతార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[46] ఖతార్ రాజ్యానికి ముత్యాలు ప్రధాన ఆదాయంగా ఉండేది.[47] 1515 లో మాన్యుయల్ ఐ (పోర్చుగల్) ఓర్మస్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1521 నాటికి తూర్పు అరేనియాలో గణనీయమైన భూభాగం పోర్చుగల్ వశం అయింది.[47][48] 1550 లో అలా-హస నివాసులు తమకు తామే ఓట్టమన్ సామ్రాజ్యంలో విలీనం అయ్యారు.[49] ఈ ప్రాంతం లోని బలహీనమైన సైనిక రక్షణ కారణంగా 1670లో ఈ ప్రాంతాన్ని బని ఖలిద్ గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు.[50]

బహ్రయిన్ పాలన (1783–1868)

[మార్చు]
1794 లో ఈస్ట్ అరేబియా పటం.

1776 లో ఉతుబ్ జాతికి చెందిన అల్ ఖలిఫా కువైట్ నుండి కువైత్‌లోని జుబరాహ్‌కు వలస వెళ్ళాడు.[51][52] వారు ప్రవేశించే సమయానికి ద్వీపకల్పం మీద బాని ఖలిద్ అధికారం బలహీనంగా ఉంది.[53] 1783 లో క్వతార్ - ఆధారంగా బని ఉతాబ్, సహాయక అరబ్ గిరిజనులు దండేత్తి పర్షియన్ల నుండి బహ్రయిన్ మీద దండెత్తి స్వాధీనం చేసుకున్నారు. తరువాత అల్ ఖలిఫా అధికారం బహ్రయిన్ నుండి ఖతార్ వరకు విస్తరించింది.[51]

A partially restored section of the ruined town of Zubarah.

1788 లో వహ్హాబి రాజ్యానికి రాకుమారుడు " అబ్ద్ అల్ - అజిజ్ " పాలకునిగా నియమించిన తరువాత ఆయన తన రాజ్యాన్ని తూర్పు దిశగా విస్తరించే ప్రయత్నం చేస్తూ పర్షియన్ గల్ఫ్, ఖతార్ వైపు పయనించాడు. 1795 లో బని ఖలిద్‌ను ఓడించాడు. పశ్చిమ భూభాగంలో ఈజిప్షియన్లు, ఓట్టమన్లు దాడి చేసారు. బహ్రయిన్ లోని అల్ ఖలీఫా, ఓమన్ తూర్పు భూభాగం మీద దాడి చేసారు.[54][55] 1811లో ఈజిప్షియన్లు ముందుకుచొచ్చుకుని పోయారు. బహ్రయిన్‌లో వహ్హామీ అమీర్ సైన్యాలను తగ్గించాడు.మస్కట్కు చెందిన సైయిద్ బిన్ సుల్తాన్ ఇది అవకాశంగా తీసుకుని తూర్పుతీరం లోని వహ్హాబీ మీద దండయాత్ర చేసి జుబారహ్ కోటకు నిప్పంటించాడు. తరువాత అల్ ఖలీఫా శక్తివంతంగా అధికారం స్వీకరించాడు.[55] ఈస్టిండియా కంపెనీకి చెందిన నౌకను దీపిడీ చేసినందుకు దండనగా 1821 లో దోహా మీద బాంబు దాడి జరిగింది. దాడిలో పట్టణం ధ్వంసం చేయబడి వందలాది నివాసితులను పట్టణం నుండి తరిమివేయబడ్డారు. నివాసితులకు బాబుదాడి గురించిన కారణాలు తెలియలేదు. ఫలితంగా క్వతారీ తిరుగుబాటుదారులు స్వతంత్రం కోరుతూ అల్ ఖలీఫా మీద దాడి చేసారు. [ఆధారం చూపాలి] 1825 లో షేక్ మొహమ్మద్ బిన్ తాని " హౌస్ ఆఫ్ తాని " స్థాపించాడు.[56] ఖతార్ సామంతరాజ్యం అయినప్పటికీ వారికి అల్ ఖలీఫా అంటే క్రోధం మాత్రం కొనసాగింది. 1867 లో అల్ ఖలీఫా అబూదాబీ పాలకునితో చేరి ఖతార్ తిరుగుబాటుదారులను అణిచివేయడానికి అల్ వక్రాహ్‌కు బృహత్తర నావికా దళాన్ని పంపారు. ఇది ఖతార్- బహ్రయిన్ యుద్ధం (1867-1868) గా మారింది. యుద్ధంలో బహ్రయిన్, అబు దాబీ దోహాను ఓడించి దోపిడీ చేసింది.[57] 1820 బహ్రయిన్ - ఆంగ్లో ఒప్పందాన్ని బహ్రయిన్ తిరుగుబాటుదారులు వ్యతిరేకిస్తూ హింసాత్మకచర్యలు చేపట్టారు. తిరుగుబాటుచర్యలకు ప్రేరేపితుడైన బ్రిటిష్ రాజప్రతినిధి " లూయిస్ పెల్లీ " 1868లో సెటిల్మెంటుకు ఆదేశించాడు. ఆయన నియమిచిన మిషన్ బహ్రయిన్, ఖతార్‌లలో శాంతి ఒప్పందం జరగడానికి ప్రయత్నించింది.

ఓట్టమన్ పాలన (1871–1915)

[మార్చు]
Qatar in an 1891 Adolf Stieler map
Old city of Doha, January 1904.

ఓట్టమన్ గవర్నర్ " విలాయత్ ఆఫ్ బాగ్దాద్ " మిదాత్ పాషా రాజకీయ, సైనిక వత్తిడి కారణంగా అల్ తాని గిరిజనులు ఈ ప్రాంతాన్ని 1871 లో ఓట్టమన్‌కు అప్పగించారు. [58] ఓట్టమన్ ప్రభుత్వం సంస్కరణావాది తంజిమత్‌ను పన్నువసూలు, భూమి క్రయవిక్రయాల నమోదు కొరకు నియమించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సామ్రాజ్యంలో విలీనం చేసుకుంది.[58] ప్రాంతీయ ప్రజల అసమ్మతి మధ్య అల్ తాని ఓట్టమన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు. అయినప్పటికి ఖతార్- ఓట్టమన్ మధ్య సంబంధాలు 1882 లో స్తంభించాయి. అల్ తాని అబుదాబి మీద దాడి చేసిన సమయంలో ఓట్టమన్ ప్రభుత్వం సహాయం అందించడానికి నిరాకరించిన కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బాధించబడ్డాయి. 1888 లో మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ ఖతార్ కయ్మకంగా అల్ తాని నియమించిన సమయంలో ఓట్టమన్ ప్రజలు మద్దతు ఇచ్చారు.[59] చివరికి అల్ తాని ఓట్టమన్ మీద తిరుగుబాటు చేసాడు. 1892లో ఆయన కయ్మకం పదవికి రాజీనామా చేసి పన్ను చెల్లింపు నిలిపివేసాడు.[60] 1893 ఫిబ్రవరిలో పన్ను వసూలుకు, జస్సిన్ బిన్ మొహమ్మద్‌ను సంస్కరణలకు అనుకూలంగా మార్చడానికి ఖతార్‌కు మెహ్మద్ హఫిజ్ పాషా చేరుకున్నాడు. మరణం, జైలుజీవితం ఎదుర్కోవాలన్న భయంతో జస్సిం అల్ వజ్బాహ్‌కు (దోహాకు 10కి.మీ దూరంలో ఉంది) పలువురు గిరిజనప్రజలతో వెళ్ళాడు. మెహమ్మద్ తన బృందాలను బిడిపించి ఓట్టమన్ ప్రభుత్వానికి విశ్వాసంగా ఉండమని జస్సిన్‌ను నిర్బంధించాడు. జస్సిన్ ఆ ప్రతిపాదనను నిరాకరించాడు. మార్చిలో మెహ్మద్ జస్సింస్ సోదరుని, 13 మంది ప్రముఖ ఖతార్ నాయకులను ఖైదుచేసాడు. 10,000 టర్కిష్ ఇరల్లిరాలు జరిమానాగా తీసుకునే షరతుతో మెహ్మద్ ఖైదీలను విడుదల చేసాడు. తరువాత మెహ్మద్ యూసఫ్ ఎఫ్ఫెంది నాయకత్వంలో 200 బృందాలను జస్సిన్ కోట మీద దాడికి పంపాడు. అది " అల్ వజ్బాహ్ యుద్ధం " నికి దారితీసింది.[38] ఎఫ్ఫెండెస్ బృందాలు అల్ వజాబాహ్ మీద దాడి చేసి షెబక కోటను స్వాధీనం చేసుకున్నాయి. జస్సిన్ సైవ్యాలు ప్రతిఘటించి ఓట్టమన్ సైన్యాలను వెనుకకు తరిమాయి. అల్ బిడ్డా కోటను విడిపించిన తరువాత జస్సిన్ కోలం చేరుకుని కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఓట్టమన్ ఓటమిని అంగీకరించి జస్సిన్‌తో ఒప్పందం చేసుకుని మెహ్మద్ అశ్వికదళాలను సురక్షితంగా వెనుకకు మళ్ళించింది.[61] ఖతార్ ఓట్టమన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందలేదు. ఫలితంగా ఖతార్ - ఓట్టమన్ మధ్య కుదిరిన ఒప్పందం తరువాత ఓట్టమన్ సామ్రాజ్యంలో ఖతార్ స్వయంప్రతిపత్తి అధికారం పొందింది.[62]

బ్రిటిష్ పాలన (1916–1971)

[మార్చు]
Zubarah Fort built in 1938.

మొదటి ప్రపంచ యుద్ధంలో వివిధ సంకీర్ణాలతో పాల్గొన్న యుద్ధాలలో అపజయాన్ని ఎదుకొని ఓట్టమన్ సామ్రాజ్యం బలహీనపడింది. ఓట్టమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అరబ్ తిరుగుబాటులో ఖతార్ భాగస్వామ్యం వహించింది. తిరుగుబాటు విజయవంతం అయింది. దేశంలో ఓట్టమన్ పాలన మరింత బలహీనపడింది. యునైటెడ్ కిండం, ఓట్టమన్ షేక్ అబ్దుల్లా బిన్ జస్సిం అల్ తాని అధికారానికి గుర్తింపు ఇచ్చాయి. అలాగే ఆయన వారసులకు ఖతార్ ద్వీపకల్ప పాలనాధికారం ఇవ్వబడింది. ఓట్టమన్ ఖతార్ మీద అధికారం వెనుకకు తీసుకుంది.మొదటి ప్రపంచయుద్ధం ఆరంభం అయిన తరువాత 1915 అబ్దుల్లా బ్రిటన్ దోహా విడిచివెళ్ళాడానికి వత్తిడి చేసాడు. [63] ఓట్టమన్ సామ్రాజ్యం విభజించబడిన కారణంగా ఖతార్ 1916 నవంబరు 3న బ్రిటిష్ ప్రొటెక్టరేట్‌లో భాగం చేయబడింది. అదే రోజు బ్రిటిష్ ప్రభుత్వం షేక్ అబ్దుల్లా బిన్ జస్సిం అల్ తానితో ఖతార్‌ను ట్రూషియల్ స్టేట్స్‌తో చేర్చడానికి ఒప్పదం మీద సంతకం చేసింది. బ్రిటన్ సముద్రం నుండి ఎదురైయ్యే దాడుల నుండి ఖతార్‌కు రక్షణ కల్పిస్థానని మాట ఇచ్చిన కారణంగా అబ్దుల్లా మరే ఇతర దేశాలతో ఒప్పందానికి అంగీకరించలేదు.[63] 1935 మే 5న అబ్దుల్లా బ్రిటిష్ ప్రభుత్వంతో మరొక ఒప్పందం మీద సంతకం చేసాడు. ఈ ఒప్పందం కారణంగా ఖతార్ బ్రిటన్ నుండి అతర్గత, బహిర్గత రక్షణ పొందింది.[63] ఖతార్‌లో 1939లో ఆయిల్ నిక్షేపాలు కనుగొనబడినప్పటికీ దీనిని రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం అయ్యే వరకు వెలికితీసే ప్రయత్నం జరగలేదు. రెండవ ప్రపంచయుద్ధం బ్రిటిష్ ప్రభుత్వం ప్రభావం క్షీణించడం ఆరంభం అయింది. 1947లో భారతదేశం, పాకిస్థాన్ దేశాలకు స్వతంత్రం లభించింది. 1950 లో ముత్యాలు, మత్స్యపరిశ్రమ స్థానంలో ఆయిల్ ఉత్పత్తి ఖతార్ ప్రధాన ఆయిల్ వనరుగా మారింది. ఆయిల్ ద్వారా లభించే ఆదాయం ఖతార్ మౌలిక వసతుల అభివృద్ధికి, ఆధునికీకరణకు ఉపయోగించబడింది. 1950 లో పర్షియన్ గల్ఫ్, అరబ్ ఎమిరేటులను వదిలి వెళ్ళాలని బ్రిటన్‌కు వత్తిడి అధికం అయింది. 1968లో బ్రిటన్ అధికారికంగా ఖతార్ స్వాతంత్ర్యం ప్రకటించింది. తరువాత ఖతార్ బహ్రయిన్, ఇతర ఏడు దేశాల ఫెడరేషన్‌లో విలీనం అయింది. ప్రాంతీయ వివాదాలు ఖతార్ ఫెడరేషన్ నుండి వెలుపలకు వెళ్ళడానికి దారితీసింది. ఖతార్ సంకీర్ణం నుండి విడుదల కావడం " యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ " రూపొందడానికి కారణం అయింది.

స్వతంత్రం తరువాత(1971)

[మార్చు]
Traditional dhows in front of the West Bay skyline as seen from the Doha Corniche.

1971 సెప్టెంబరున ఖతార్‌కు అధికారికంగా యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం లభించింది. తరువాత ఖతార్ సార్వభౌమాధికారం కలిగినదేశం అయింది.[64] ప్రభుత్వం తరువాత ఆయుధాలను ఫ్రెంఛ్ నుండి దిగుమతి చేసుకుంది.[65] 1972 లో ఖలిఫా బిన్ హమద్ అల్ తాని అధికారం బలహీనపడింది. 1974 లో ఖతార్ " జనరల్ పెట్రోలియం కార్పొరేషన్ " దేశంలోని ఆయిల్ నిక్షేపాల మీద ఆధిపత్యం వహించింది.[66] 1976లో ప్రపంచంలో ఖతార్‌లో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన " నార్త్ డోం గ్యాస్ కండెంసేట్ ఫీల్డ్ " కనుగొనబడింది.[65] అలాగే ఎల్.ఎన్.జి. వెసెల్స్ తయారు చేసిన దేశాలలో ఖతార్ మొదటిది.[67] 1991 లో ఖతార్ గల్ఫ్ యుద్ధంలో ఖతార్ ప్రముఖ పాత్ర వహించింది. ఖఫ్జి యుద్ధంలో ఖతార్ ట్యాంకులు వీధులలో సంచరిస్తూ " సౌదీ అరేబియా నేషనల్ గార్డ్ "కు సహకరించింది. వీటిని ఇరాక్ ఆర్మీ ట్రూప్స్‌ నియమించాయి. ఖతార్ కెనడా సంకీర్ణ దళాలకు ఎయిర్ బేస్‌లను వాడుకోవడానికి కెనడాను అనుమతించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ , ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తమ భూభాగం వాడుకోవడానికి ఖతార్ అంగీకరించింది.[24] 1995 లో ఎమీర్ హమీద్ బిన్ కలీఫా అల్ తాని సైన్యం, మంత్రులు, జాక్యూ చిరాక్ (ఫ్రెంచ్) , పొరుగుదేశాల మద్దతుతో తనతండ్రి నుండి ఖలిఫా బిన్ హమద్ అల్ తాని నుండి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు.[65] [68] ఎమీర్ హమద్ పాలనలో ఖతార్ తగినంత స్వతంత్రం అనుభవించింది. ఈ సమయంలో అల్ జజీరా టెలివిషన్ (1996) స్థాపన, 1999 ముంచిపల్ ఎన్నికలలో స్త్రీలకు ఓటు హక్కు, 2005 లో రాజ్యాంగ నిబంధనలు వ్రాతబద్ధం చేయడం , 2008లో రోమన్ కాథలిక్ చర్చి నిర్మించబడ్డాయి. 2010లో ఖతార్ 2022 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ క్రీడలు నిర్వహించడానికి హక్కు సాధించింది. మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇలాంటి హక్కు పొందిన మొదటి దేశం అన్న గౌరవం ఖతార్ దక్కించుకుంది. 2013లో ఖతార్ లెజిస్లేటివ్ ఎన్నికలు నిర్వహించబడతాయని ఎమీర్ ప్రకటించాడు. తరువాతి ఖతార్ జనరల్ ఎన్నికలు 2016లో నిర్వహించాలని ప్రతిపాదించబడింది.2003 లో ఖతార్ యు.ఎస్. సెంట్రల్ కమాండ్ ప్రధానకేంద్రంగా పనిచేసింది.[69] 2005 మార్చిలో సూసైడ్ అటాక్ బాంబింగ్‌ దోహ్రా ప్లేయర్స్ థియేటర్లో బ్రిటిష్ టీచర్‌ను హతమార్చింది. ఈ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఖతార్‌లో గతంలో ఇలాంటి తీవ్రవాద చర్యలు చోటుచేసుకోలేదు. ఈ బాంబును మోసుకువచ్చిన అహ్మద్ అలి అరేబియన్ ద్వీపకల్పానికి చెందిన అల్ కొయిదాకు చెందిన ఒక ఈజిప్షియన్.[70][71] 2011లో ఖతార్ " మిలట్రీ ఇంటర్వెంషన్ ఇన్ లిబియా (2011), లిబియన్ అప్పోజిషన్ బృందాలలో చేరింది. [72] సిరియన్ అంతర్యుద్ధంలో తురుగుబాటుదారులకు ఆయుధాలు అందిస్తున్న దేశాలలో ఖతార్ ఒకటి.[73] 2012లో ఖతార్ ఆఫ్ఘన్ శాంతి ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన సమయంలో తలిబాన్ చర్చలు సులువుగా జరగడానికి ఖతార్‌లో రాజకీయ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని కోరిక వెలిబుచ్చారు. 2013 జూన్‌లో షేక్ తమీం బిన్ అల్ తాని ఖతార్ తనతండ్రి నుండి అధికారం పొంది ఎమీర్‌గా ఎన్నిక చేయబడ్డాడు.[74] షేక్ తమిన్ ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యరక్షణ, విద్యాభివృద్ధి, మౌలిక నిర్మాణాల అభివృద్ధి 2022 వరల్డ్ కప్ ఆతిథ్యానికి తగిన ఏర్పాట్లు మొదలైన విషయాలపై శ్రద్ధ వహించాడు.[75]

భౌగోళికం

[మార్చు]
Desert Coast
Desert landscape in Qatar

ఖతార్ ద్వీపకల్పం 160 కిలోమీటర్లు (100 మై.) పర్షియన్ గల్ఫ్‌లో చొచ్చుకుని ఉంది. ఖతార్ 24-27డిగ్రీల ఉత్తర అక్షాంశం, 50-52డిగ్రీల తూర్పు రేఖామ్శంలో ఉంది. దేశంలో అత్యధికభాగం దిగువన ఉన్న ఇసుకతో నిండిన మైదానంతో నిండి ఉంది. దేశం ఆగ్నేయంలో నార్ అదైబ్ (ఇన్లాండ్ సముద్రం) ఉంది. దేశంలో ఉన్న కదిలే ఇసుక దిబ్బలు ఖతార్ ప్రత్యేకతలలో ఒకటి. దేశంలో స్వల్పమైన చలితో కూడిన శీతాగాలులు, అత్యంత వేడైన వేసవికాలాలు ఉంటాయి. " అబు అల్ బౌల్ " 103 మీటర్లు (338 అ.) ఖతార్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.[76] పశ్చిమంలో ఉన్న జెబెల్ దుఖన్‌లో లైం స్టోన్ ఔట్ క్రాపింగ్స్ ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. ఇవి ఉత్తరంలో జిక్రిత్ నుండి ఉం బాద్ మీదుగా దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయి. జెబెల్ దుఖన్ ప్రాంతంలో ప్రధాన " ఆన్ షోర్ ఆయిల్ ఫీల్డ్ " ఉంది. నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ద్వీపకల్పం వాయవ్యంలో ఆఫ్ షోర్‌లో ఉన్నాయి.

పర్యావరణం

[మార్చు]
Qatari Ostriches

1992 లో 11 జూన్‌లో ఖతార్ రియో సమావేశంలో వైవిధ్యం ఒప్పందంలో సంతకంచేసి 1996 ఆగస్టు 21న జరిగిన సమావేశంలో ప్రధాన్యత పొందింది.[77] ఖతార్ గణనీయంగా నిర్వహించిన బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ 2005 మే 18 సమావేశంలో ప్రశంశలను అందుకుంది. [78] ఖతార్‌లో దాదాపు 142 నాచు జాతులు కనుగొనబడ్డాయి. [79] " మినిస్టరీ ఆఫ్ ఎంవిరాన్మెంట్ డాక్యుమెంట్స్ " ఖతార్‌లో కనుగొనబడిన ప్రాకేజంతువులు (ప్రత్యేకంగా బల్లులు, తొండల వంటివి లేక లిజార్డ్స్) గురించిన పుస్తకం ప్రచురించింది. ఇది అంతర్జాతీయ పరిశోధకులు, సహకార బృందాలు నిర్వహించిన సర్వే ఆధారంగా తయారు చేయబడింది.[80] రెండు శతాబ్ధాల కాలం ఖతార్ తలసరి కార్బండైయాక్సిడ్ ఉత్పత్తి అంతర్జాతీయంగా అత్యధికస్థాయికి చేరిందని భావిస్తున్నారు. 2008 లో ఖతార్ తలసరి కార్బండైయాక్సైడ్ ఉత్పత్తి 49.1మెట్రిక్ టన్నులని భావిస్తున్నారు.[81] అత్యధికంగా తలసరి జలవినియోగం చేస్తున్న వారిలో ఖతార్ నివాసులు ఒకరు. ఖతార్ ప్రజలు తలసరి జలవినియోగం ఒక రోజుకు 400 లీటర్లు.[82] 2008 లో ఖతార్ పర్యావరణ అభివృద్ధి కొరకు స్థాపించిన " ఖతార్ నేషనల్ 2030 " రెండు దశాబ్ధాలలో ఖతార్ పర్యావరణ అభివృద్ధి కొరకు నాలుగు ప్రధానాంశాలను లక్ష్యంగా చేసుకుని స్థాపించబడింది. నేషనల్ విషన్ రాబోయే దశాబ్ధాలలో ఆయిల్ ఆధారిత విద్యుదుత్పత్తికి బదులుగా శాశ్వత ఇతరమార్గాలు లక్ష్యంగా పనిచేస్తుంది. [83] ఖతార్ జాతీయ జంతువు " ఒరిక్స్ ".

శీతోష్ణస్థితి డేటా - Qatar
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 22
(72)
23
(73)
27
(81)
33
(91)
39
(102)
42
(108)
42
(108)
42
(108)
39
(102)
35
(95)
30
(86)
25
(77)
33
(92)
సగటు అల్ప °C (°F) 14
(57)
15
(59)
17
(63)
21
(70)
27
(81)
29
(84)
31
(88)
31
(88)
29
(84)
25
(77)
21
(70)
16
(61)
23
(74)
సగటు అవపాతం mm (inches) 12.7
(0.50)
17.8
(0.70)
15.2
(0.60)
7.6
(0.30)
2.5
(0.10)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
0
(0)
2.5
(0.10)
12.7
(0.50)
71
(2.8)
Source: http://us.worldweatheronline.com/doha-weather-averages/ad-dawhah/qa.aspx

ఆర్ధికరంగం

[మార్చు]
Graphical depiction of Qatar's product exports in 28 color-coded categories (2011).

ఖతార్‌లో ఆయిల్ నిక్షేపాలు వెలికితీయడానికి ముందు ఖతార్ ఆర్థికరంగానికి ముత్యాల పరిశ్రమ, మత్స్యపరిశ్రమ ప్రధానాంశగా ఉంది. ఓట్టమన్ సామ్రాజ్యానికి చెందిన ప్రాంతీయ గబర్నర్ల నివేదిక (1892) అనుసరించి ముత్యాలపరిశ్రమలో లభించిన ఆదాయం 24,50,000 క్రాన్.[57] 1920-1930 మధ్యకాలంలో జపానీ సంప్రదాయ ముత్యాలు అంతర్జాతీయ విఫణిలో ప్రవేశించిన తరువాత ఖతార్ ముత్యాలపరిశ్రమ పతనం అయింది. 1940లో ఖతార్‌లోని దుఖాన్ ఫీల్డులో ఆయిల్ కనిపెట్టబడింది.[84] తరువాత ఖతార్ ఆర్థికరంగం ఆయిల్ నిక్షేపాలవైపు మళ్ళించబడుతుంది. ప్రస్తుతం ఖతార్ ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారు. దేశంలో ఆదాయం పన్నువిధింపు లేదు, ప్రపంచంలో అతి తక్కువ పన్ను విధానం అనుసరిస్తున్న దేశాలలో (మరొక దేశం బహ్రయిన్) ఖతార్ ఒకటి. 2013లో ఖతార్ నిరోద్యం శాతం 0.1%.[85] ఖతార్ కార్పొరేట్ లా ఖతార్ ప్రజలు ఏవాణిజ్యంలో అయినా 51% భాగస్వామ్యం వహించాలని ఆదేశిస్తుంది.[65] 2014 ఖతార్ తలసరి జి.డి.పి. ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది. [86] దాదాపు ప్రజలలో 14% మంది డాలర్లలో మిలియనీర్లుగా ఉన్నారు. [87] ఖతార్ అధికంగా విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడుతుంది. జనసంఖ్యలో వసల ఉద్యోగుల శాతం 86% ఉంది. ఉద్యోగులలో 94% విదేశీయులే.[88][89] ఖతార్ " ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంఫిడరేషన్ " విమర్శలను ఎదుర్కొంటుంది. [90] 1940లో స్థాపించబడిన పెట్రోల్, సహజవాయు ఆదాయం మీద ఖతార్ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంది.[91] ద్రవరూప సహజవాయువు ఎగుమతులలో ఖతార్ ప్రథమ స్థానంలో ఉంది. [92] 2012 లో ఖతార్ విద్యుత్ కొరకు 120 బిలియన్లు వ్యయం చేసిందని అంచనా.[93] ఖతార్ " ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రిస్ "లో సభ్యత్వం కలిగి ఉంది. ఈ ఆర్గనైజేషన్‌లో ఖతార్ 1961 నుండి సభ్యదేశంగా ఉంది. [94] 2012 లో ఖతార్ ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో చేర్చబడింది. తలసరి ఆదాయంలో ఖతార్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. 2010 లో తలసరి ఆదాయంలో ల్యూక్సంబర్గ్‌ను అధిగమించింది. వాషింగ్టన్ ఆధారిత " ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాంస్ " ప్రచురణలు 2012లో ఖతార్ తలసరి కొనుగోలు శక్తి జి.డి.పి. 1,06,000 అమెరికన్ డాలర్లు అని వెల్లడించాయి. ఇది దేశాన్ని సంపన్న దేశాలవరుసలో నిలపడానికి సహకరించింది. లక్సంబర్బర్గ్ 80,000 అమెరికన్ డాలర్ల తలసరి కొనుగోలు శక్తితో ద్వితీయస్థానానికి చేరింది. 61,000 అమెరికన్ డాలర్ల తలసరి కొనుగోలు శక్తితో సింగపూర్ మూడవస్థానంలో ఉంది. 2012 ఖతార్ జి.డి.పి. 182 బిలియన్ల అమెరికన్ డాలర్లు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సహజవాయు ఉత్పత్తి , అధికరించిన ఆయిల్ ధరలు ఖతార్ ఆదాయాన్ని శిఖరాగ్రానికి చేర్చాయి. 2012లో ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లకు చేరింది. అదే పరిశోధనలు ఖతార్ " ఇంవెస్ట్మెంట్ అథారిటీ " ద్రవ్యం 115 బిలియన్ల అమెరికన్ డాలర్లు అని తెలియజేస్తుంది. సార్వభౌమాధికారం కలిగిన ప్రపంచం లోని సంపన్న దేశాలలో ద్రవ్యం నిలువలో ఖతార్‌ను 12వ స్థానంలో నిలిపింది. [95] 2005లో " ఖతార్ ఇంవెస్ట్మెంట్ అథారిటీ " విదేశీపెట్టుబడుల విభాగం కొరకు " ఖతార్ వెల్త్ ఫండ్ " సంస్థను స్థాపించింది.[96] ఆయిల్, గ్యాస్ పరిశ్రమల నుండి డాలర్లు అత్యధికంగా లభిస్తున్నందున కతరి ప్రభుత్వం పెట్టుబడులను యునైటెడ్ స్టేట్స్, ఐరోపా, ఆసియా దేశాలకు మళ్ళించింది.2013 ఖతార్ విదేశీపెట్టుబడుల ద్రవ్యం 100 బిలియన్ల అమెరికండాలర్లు ఉన్నాయి. 2009 లో ఇంటర్నేషనల్ ఇంవెస్ట్మెంటు ఆర్మ్‌లో ఖతార్ 30-40 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంది. 2014లో వేలంటినో, సైమంస్, ప్రింటెంప్స్, హర్రాడ్స్, ది షర్ద్, బర్క్లే బ్యాంక్, హీత్రో ఎయిర్ పోర్ట్, పారిస్ సెయింట్ - జర్మన్ ఎఫ్.సి, వోల్స్ వ్యాగన్, రాయల్ డచ్ షెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, తిఫనీ, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, సైన్సు బురీ, బ్లాక్ బెర్రీ,[97] సాంతండర్ బ్రాసిల్ సంస్థలలో పెట్టుబడి పెట్టింది.[98][99]

విద్యుత్తు

[మార్చు]
Qatar Airways Airbus A380, Qatar Airways, one of the world's largest airlines, links over 150 international destinations from its base in Doha.

As of 2012, ఖతార్ ఆయిల్ 15 బిలియన్ల బ్యారెల్ ఉత్పత్తి, గ్యాస్ ఫీల్డ్స్ ఉత్పత్తి ప్రంపంచ ఉత్పత్తిలో 13% భాగస్వామ్యం వహించాయి. ఫలితంగా ఖతార్ తలసరి ఆదాయంలో ప్రపంచదేశాలలో అత్యంత సంపన్న దేశంగా మారింది. 2మిలియన్ల ఖతార్ ప్రజలలో దారిద్యరేఖకు దిగువున ఉన్న వారు లేరు. దేశంలో 1% కంటే తక్కువగా నిరుద్యోగులు ఉన్నారు.[100] ఖతార్ ఆర్థికరగం 1982 లో కొంత పతనం చెందింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పతనం కావడం, ఖతార్ ప్రణాళికా వ్యయం అధికంకావడం కారణంగా ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ప్రాంతీయ వాణిజ్య సంస్థలు కొంతమంది ఉద్యోగులను పని నుండి తొలగించింది. 1990 నుండి ఆర్థికరంగం కోలుకున్నది. తరువాత తిరిగి ఈజిప్ట్, దక్షిణాసియా నుండి నిపుణుల నియామకం వృద్ధి చెందింది.

దినసరి 5,00,000 బ్యారెల్ ఆయిల్ ఉత్పత్తి, సహజ వాయువు ఉత్పతో శిఖరాగ్రాన్ని అందుకున్న ఖతార్ ఆయిల్ ఉత్పత్తి 2033 నాటికి క్షీణిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఖతార్ ఈశాన్య సముద్రతీరంలో అత్యధికంగా ఉన్న చమురు నిక్షేపాలు క్షీణించవచ్చు. ఖతార్ సహజవాయువు నిక్షేపాలు (250 ఘన అడుగులు) ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాయి. 1991లో ఖతార్ నార్త్ ఫీల్డ్ నుండి 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం లభించింది. 1996లో ఖతార్ ఖతార్ ప్రాజెక్ట్ ద్రవ్యరూప సహజవాయువు ఎగుమతి (జపాన్ కు) ప్రారంభించింది. నార్త్ ఫీల్డ్ అభివృద్ధికి అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేయబడుతుంది.

ఖతార్ ఉం సైద్‌లో బృహత్తర ప్రాజెక్టులను కలిగి ఉంది. దినసరి 50,000 బ్యారెల్ (8000 ఘన మీ) శక్తి కలిగిన రిఫైనరీ, ఎరువుల తయారీ కంపెనీ (యూరియా, అమోనియా), ఒక స్టీల్ ప్లాంట్, ఒక పెట్రో కెమికల్ కంపెనీ ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ ఫ్యూయల్ కొరకు గ్యాస్‌ను ఉపయోగిస్తున్నాయి. వీటిలో యురేపియన్, జపాన్ సంస్థలు భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న కంపెనీలలో అధికభాగం, దేశానికి స్వంతమైన ఖతార్ పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి. ఖతార్ ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులకు అవసరమైన ఉపకరణాలను అత్యధికంగా యు.ఎస్. నుండి సరఫరా చేయబడుతున్నాయి. నార్త్ ఫీల్డ్ గ్యాస్ అభివృద్ధి పనులలో యు.ఎస్ ప్రధానపాత్ర వహిస్తుంది.[100] ఖతార్ ప్రభుత్వం రాబోయే రెండు దశాబ్ధాల అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని " ఖతార్ నేషనల్ విషన్ 2030 " వనరుల పునరుద్ధరణ కొరకు పెట్టుబడులు అధికం చేసింది. [83] ఖతార్ భాగస్వామ్య సంస్థలు, ఖతార్ ప్రభుత్వశాఖలకు ఖతార్ పౌరుల ఆధిపత్యంలో నిర్వహించాలని ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్య పూర్తిచేసుకున్న పలువురు యువకులు ఖతార్‌లో కీలకమైన స్థానాలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా ప్రవాహంగా వస్తున్న విదేశీనిపుణుల రాకను అరికట్టడానికి ఖతార్ విదేశీమానవవనరుల ఉపయోగం నిబంధనలను క్లిష్టం చేసింది. ఖతార్‌లో ప్రవేశించడానికి, ఇమ్మిగ్రేషన్ రూల్స్ క్లిష్టం చేయబడ్డాయి.[100]

గణాంకాలు

[మార్చు]

ఖతార్ వలస ఉద్యోగులమీద ఆధారపడిన తరువాత జనసంఖ్య సీజన్ అనుసరించి హెచ్చుతగ్గులకు గురౌతూ ఉంటుంది. 2013 ఖతార్ జనసంఖ్య 1.8 మిలియన్లు. వీరిలో ఖతార్ పౌరులు 2,78,000 (13%), 1.5 మిలియన్లు విదేశీఉద్యోగులు ఉన్నారు.[8] ఖతార్ జనసంఖ్యలో అరబ్‌చెందని వారు అధికంగా ఉన్నారు. 2013 గణాంకాలు అనుసరించి ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 5,45,000 ఉన్నారు.[8] నేపాలీయులు 3,41,000, ఫిలిప్పైన్లు 1,85,000, బంగ్లాదేశీయులు 1,37,000, శ్రీలంకన్లు 1,00,000, పాకిస్థానీయులు 90,000 మంది ఉన్నారు.[8] ఖతార్ జనసంఖ్య మొదటి సారిగా ప్రాంతీయ ఓట్టమన్ గవర్నర్లు 1892లో నిర్వహించారు. ఈ గణాంకాలను అనుసరించి ఖతార్ జనసంఖ్య 9,830.

[57]

Populations
సంవత్సరంజనాభా±%
1904 27,000—    
1970 1,11,133+311.6%
1986 3,69,079+232.1%
1997 5,22,023+41.4%
2004 7,44,029+42.5%
2010 16,99,435+128.4%
2013 19,03,447+12.0%
2016 25,45,000+33.7%
Source: Qatar Statistics Authority (1904–2004);[101] 2010 Census;[102] 2013 est.[103][104] 2016[105]

2010 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 16,99,435.[102] 2013 జనవరిలో ఖతార్ గణాంకాల అధికారులు ఖతార్ జసంఖ్య 19,03,447 అని నిర్ధారించారు. వీరిలో 14,05,164 స్త్రీలు 4,98,283.[103] 1970లో మొదటి గణాంకాలు అనుసరించి జనసంఖ్య 1,11,133.[101] 2001 ఖతార్ జనసంఖ్య 6,00,000 ఉండగా 2011 నాటికి జనసంఖ్య మూడురెట్లు అధికం అయ్యారు. వీరిలో ఖతార్ స్థానికులు 15% మాత్రమే ఉన్నారు.[104] పురుష ఉద్యోగుల ప్రవాహం కారణంగా స్త్రీ:పురుష నిష్పత్తిలో భేదం అధికం అయింది. ప్రస్తుతం జనసంఖ్యలో స్త్రీలు నాలుగవ వంతు మాత్రమే ఉన్నారు. ఖతార్ గణామాల సేకరణాధికారులు 2020 నాటికి ఖతార్ జసంఖ్య 2.8 మిలియన్లకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఖతార్ నేషనల్ డెవెలెప్మెంటు స్ట్రాటజీ (2011-16) ఖతార్ జనసంఖ్య 2013 నాటికి 1.78 మిలియన్లు 2014 నాటికి 1.81 2015 నాటికి 1.84, 2016 నాటికి 1.86 కాగలదని అంచనావేసారు. జనసంఖ్య వార్షికాభివృద్ధి 2.1 %. [106] అయినప్పటికీ 2015 నాటికి ఖతార్ జనసంఖ్య 2.46 మిలియన్లకు చేరుకుని గత సంవత్సరం కంటే 8.5% అభివృద్ధి చెందింది.[107]

Religion in Qatar (2010)[108][109]

  Islam (67.7%)
  Hinduism (13.8%)
  Christianity (13.8%)
  Buddhism (3.1%)
  Others (0.7%)
  Unaffiliated (0.9%)
Mosque in Qatar

ఖతార్‌లో సున్నీ ఇస్లాం మతం ఆధిక్యత కలిగి ఉండి దేశీయమతం అంతస్తును కలిగి ఉంది.[110] ఖతార్ పౌరులు సున్ని ఇలాంకు చెందిన సలాఫి ముస్లిం ఉద్యమవాదులుగా ఉన్నారు.[111][112][113] షియా ముస్లిములు 5% ఉన్నారు.[114] 2004 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 71,5% మంది సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు, 8,5% విదేశీ క్రైస్తవులు, 10% ఇతర విదేశీ మతస్థులు ఉన్నారు.[76][115][116] ఖతార్ రాజ్యాంగం అనుసరించి షరియా చట్టం ఖతార్ లెజిస్లేషన్‌కు ఆధారంగా ఉంది.[117][118] 2010 లో ఖతార్ రిలీజియస్ అఫ్లియేషన్ ప్యూ ఫోరం ద్వారా నిర్వహించిన గణాంకాల ఆధారంగా 6.7% ముస్లిములు, 13.8% క్రైస్తవులు, 13.8% హిందువులు, 3.1% బౌద్ధులు ఉన్నారు. ఇతర మతస్థులు, ఏ మతానికి చెందని వారు 1.6% ఉన్నారు.[119] క్రైస్తవులు పూర్తిగా విదేశీయులే 2015 నాటికి 200 మంది ముస్లిములు క్రైస్తవమతానికి మార్పిడి చెందారు.[120] 2008 నుండి క్రైస్తవులు ప్రభుత్వ నిధి సహాయంతో చర్చీలు నిర్మించుకోవడానికి అనుమతి పొందారు.[121] అయినప్పటికీ విదేశీ మిషనరీ చర్యలు అధికారికంకా ప్రోత్సాహం లభించడం లేదు.[122] ఖతార్‌లో మలంకర మార్ థోమా సిరియన్ చర్చి, మలంకర ఆర్ధడాక్స్ సిరియన్ చర్చి, ది రోమన్ కాథలిక్ చర్చి, కాథలిక్ చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ (దోహా), ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ది ఎపిఫని చర్చిలు క్రియాశీలకంగా ఉన్నాయి.[123][124][125] ఖతార్‌లో రెండు మొర్మన్ వార్డులు ఉన్నాయి.[123][124][125] గణానీయమైన హిందువులు, బుద్ధిస్ట్ సంఖ్య ఉన్నప్పటికీ ఆరాధనామందిరాలు మాత్రం లేవు.

ఖతార్ అధికార భాష ప్రాంతీయ యాసతో కూడిన ఖతార్ అరబిక్. చెవిటివారి కొరకు కతరి సంఙా భాషా రూపొందించబడింది. ఆంగ్లభాష దేశమంతటా రెండవ భాషగా ఉంది. [126] వాణిజ్యంలో ఫ్రాంకా భాష వాడుకగా ఉంది. ఆంగ్లభాష ఆధిక్యత నుండి అరబిక్ భాషను సంరక్షించడానికి ఫ్రాంకా భాష అభివృద్ధి చేయబడింది.[127] ఖతార్ లోని విదేశీ ఉద్యోగులకు ఆంగ్లభాష సంభాషణా సౌలభ్యానికి ఉపయోగిస్తున్నారు. 2012 ఖతార్ ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ - స్పీకింగ్ ఆర్గనైజేషన్‌కు చెందిన లా ఫ్రాంకోఫొనీ సభ్యత్వం పొందింది.[128] ఖతార్ ప్రజలలో 10% ఫ్రెంచ్ మాట్లాడే వారు ఉన్నారు.[129][130] ఖతార్‌లో నివసిస్తున్న బహుళజాతి ప్రజల కారణంగా దేశంలో బలూచి, హిందీ, ఉర్దూ, పష్తొ, తమిళం, తెలుగు, నేపాలీ, సింహళీ, బెంగాలీ, తగలాగ్ భాషలు వాడుకలో ఉన్నాయి.[131]

ఇవి కూడా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Qatar Airways: the Art of Flight Redefined]
  2. "CMU Pronouncing Dictionary". CS. Archived from the original on 11 మే 2011. Retrieved 28 March 2010.
  3. 3.0 3.1 Johnstone, T. M. (2008). "Encyclopaedia of Islam". Ķaṭar. Brill Online. Retrieved 22 January 2013. (subscription required)
  4. "How do you say 'Qatar'? Senate hearing has the answer". Washington Post. 12 June 2014. Retrieved 12 March 2015.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-16. Retrieved 2017-03-18.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-05-13. Retrieved 2017-03-18.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-10. Retrieved 2017-03-18.
  8. 8.0 8.1 8.2 8.3 "Population of Qatar". Archived from the original on 2013-12-22.
  9. "Qatar: Revolution From the Top Down". National Geographic. Retrieved 7 March 2014.
  10. "For Qatari Women, Change Slow in Coming". ABC News. Retrieved 7 March 2014.
  11. "Indices & Data | Human Development Reports". United Nations Development Programme. 14 March 2013. Archived from the original on 12 January 2013. Retrieved 27 June 2013.
  12. "Qatar human development". Archived from the original on 2017-02-01.
  13. Dagher, Sam (17 October 2011). "Tiny Kingdom's Huge Role in Libya Draws Concern". Online.wsj.com. Retrieved 30 December 2013.
  14. "Qatar: Rise of an Underdog". Politicsandpolicy.org. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 30 December 2013.
  15. Ian Black in Tripoli. "Qatar admits sending hundreds of troops to support Libya rebels". Theguardian.com. Retrieved 30 December 2013.
  16. Cooper, Andrew F. "Middle Powers: Squeezed out or Adaptive?". Public Diplomacy Magazine. Archived from the original on 29 జూన్ 2017. Retrieved 12 March 2015.
  17. Kamrava, Mehran. "Mediation and Qatari Foreign Policy" (PDF). Archived from the original (PDF) on 7 అక్టోబరు 2013. Retrieved 12 March 2015.
  18. Paul Rhys in Doha. "Blatter reaches out to Arabia". Aljazeera.com. Retrieved 30 December 2013.
  19. Casey, Paula; Vine, Peter (1992). The heritage of Qatar. Immel Publishing. pp. 17.
  20. 20.0 20.1 "History of Qatar". Qatar Statistics Authority. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 11 May 2015.
  21. "Maps". Qatar National Library. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 11 May 2015.
  22. 22.0 22.1 22.2 "About us". Katara. Archived from the original on 22 జూలై 2015. Retrieved 11 May 2015.
  23. Hazlitt, William (1851). The Classical Gazetteer: A Dictionary of Ancient Geography, Sacred and Profane. Whittaker & co.
  24. 24.0 24.1 24.2 Toth, Anthony. "Qatar: Historical Background." A Country Study: Qatar (Helen Chapin Metz, editor). Library of Congress Federal Research Division (January 1993). This article incorporates text from this source, which is in the public domain.
  25. 25.0 25.1 Khalifa, Haya; Rice, Michael (1986). Bahrain Through the Ages: The Archaeology. Routledge. pp. 79, 215. ISBN 978-0710301123.
  26. 26.0 26.1 "History of Qatar" (PDF). www.qatarembassy.or.th. Ministry of Foreign Affairs. Qatar. London: Stacey International, 2000. Retrieved 9 January 2015.
  27. Rice, Michael (1994). Archaeology of the Persian Gulf. Routledge. pp. 206, 232–233. ISBN 978-0415032681.
  28. Magee, Peter (2014). The Archaeology of Prehistoric Arabia. Cambridge Press. pp. 50, 178. ISBN 9780521862318.
  29. Sterman, Baruch (2012). Rarest Blue: The Remarkable Story Of An Ancient Color Lost To History And Rediscovered. Lyons Press. pp. 21–22. ISBN 978-0762782222.
  30. Cadène, Philippe (2013). Atlas of the Gulf States. BRILL. p. 10. ISBN 978-9004245600.
  31. "Qatar – Early history". globalsecurity.org. Retrieved 17 January 2015.
  32. Gillman, Ian; Klimkeit, Hans-Joachim (1999). Christians in Asia Before 1500. University of Michigan Press. pp. 87, 121. ISBN 978-0472110407.
  33. Commins, David (2012). The Gulf States: A Modern History. I. B. Tauris. p. 16. ISBN 978-1848852785.
  34. Habibur Rahman, p. 33
  35. "AUB academics awarded $850,000 grant for project on the Syriac writers of Qatar in the 7th century AD" (PDF). American University of Beirut. 31 May 2011. Retrieved 12 May 2015.
  36. Kozah, Mario; Abu-Husayn, Abdulrahim; Al-Murikhi, Saif Shaheen (2014). The Syriac Writers of Qatar in the Seventh Century. Gorgias Press LLC. p. 24. ISBN 978-1463203559.
  37. "Bahrain". maritimeheritage.org. Retrieved 17 January 2015.
  38. 38.0 38.1 38.2 Fromherz, Allen (13 April 2012). Qatar: A Modern History. Georgetown University Press. pp. 44, 60, 98. ISBN 978-1-58901-910-2. Retrieved 7 December 2014.
  39. 39.0 39.1 Rahman, Habibur (2006). The Emergence Of Qatar. Routledge. p. 34. ISBN 978-0710312136.
  40. A political chronology of the Middle East. Routledge / Europa Publications. 2001. p. 192. ISBN 978-1857431155.
  41. Page, Kogan (2004). Middle East Review 2003–04: The Economic and Business Report. Kogan Page Ltd. p. 169. ISBN 978-0749440664.
  42. Qatar, 2012 (The Report: Qatar). Oxford Business Group. 2012. p. 233. ISBN 978-1907065682.
  43. Casey, Paula; Vine, Peter (1992). The heritage of Qatar. Immel Publishing. pp. 184–185.
  44. Russell, Malcolm (2014). The Middle East and South Asia 2014. Rowman & Littlefield Publishers. p. 151. ISBN 978-1475812350.
  45. "History". qatarembassy.net. Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 18 January 2015.
  46. Larsen, Curtis (1984). Life and Land Use on the Bahrain Islands: The Geoarchaeology of an Ancient Society (Prehistoric Archeology and Ecology series). University of Chicago Press. p. 54. ISBN 978-0226469065.
  47. 47.0 47.1 Althani, Mohamed (2013). Jassim the Leader: Founder of Qatar. Profile Books. p. 16. ISBN 978-1781250709.
  48. Gillespie, Carol Ann (2002). Bahrain (Modern World Nations). Chelsea House Publications. p. 31. ISBN 978-0791067796.
  49. Anscombe, Frederick (1997). The Ottoman Gulf: The Creation of Kuwait, Saudia Arabia, and Qatar. Columbia University Press. p. 12. ISBN 978-0231108393.
  50. Potter, Lawrence (2010). The Persian Gulf in History. Palgrave Macmillan. p. 262. ISBN 978-0230612822.
  51. 51.0 51.1 Heard-Bey, Frauke (2008). From Tribe to State. The Transformation of Political Structure in Five States of the GCC. p. 39. ISBN 978-88-8311-602-5.
  52. 'Gazetteer of the Persian Gulf. Vol I. Historical. Part IA & IB. J G Lorimer. 1915' [1000] (1155/1782), p. 1001
  53. Crystal, Jill (1995). Oil and Politics in the Gulf: Rulers and Merchants in Kuwait and Qatar. Cambridge University Press. p. 27. ISBN 978-0521466356.
  54. Casey, Michael S. (2007). The History of Kuwait (The Greenwood Histories of the Modern Nations). Greenwood. pp. 37–38. ISBN 978-0313340734.
  55. 55.0 55.1 "'Gazetteer of the Persian Gulf. Vol I. Historical. Part IA & IB. J G Lorimer. 1915' [843] (998/1782)". qdl.qa. Retrieved 13 January 2014.
  56. "Qatar". Teachmideast.org. Retrieved 27 June 2013.
  57. 57.0 57.1 57.2 Kursun, Zekeriya (2004). Katar'da Osmanlilar 1871–1916. Turk Tarih Kurumu.
  58. 58.0 58.1 Rogan, Eugene; Murphey, Rhoads; Masalha, Nur; Durac, Vincent; Hinnebusch, Raymond (November 1999). "Review of The Ottoman Gulf: The Creation of Kuwait, Saudi Arabia and Qatar by Frederick F. Anscombe; The Blood-Red Arab Flag: An Investigation into Qasimi Piracy, 1797–1820 by Charles E. Davies; The Politics of Regional Trade in Iraq, Arabia and the Gulf, 1745–1900 by Hala Fattah". British Journal of Middle Eastern Studies. 26 (2): 339–342. doi:10.1080/13530199908705688. JSTOR 195948.
  59. Habibur Rahman, pgs.143–144
  60. Habibur Rahman, pgs.150–151
  61. Habibur Rahman, p. 152
  62. "Battle of Al Wajbah". Qatar Visitor. 2 June 2007. Archived from the original on 17 జనవరి 2013. Retrieved 22 January 2013.
  63. 63.0 63.1 63.2 "Amiri Diwan – Shaikh Abdullah Bin Jassim Al Thani". Diwan.gov.qa. Archived from the original on 10 ఫిబ్రవరి 2012. Retrieved 18 మార్చి 2017.
  64. "History of Qatar". Diwan.gov.qa. Archived from the original on 2 మే 2010. Retrieved 18 మార్చి 2017.
  65. 65.0 65.1 65.2 65.3 nouvelobs.com: "Qatar : "S'ils pouvaient, ils achèteraient la Tour Eiffel" Archived 2017-10-10 at the Wayback Machine, 7 Apr 2013
  66. "History of Qatar". Fanar: Qatar Islamic Cultural Center. Archived from the original on 20 మే 2013. Retrieved 2 July 2013.
  67. fdesouche.com: "Ils ont livré la France au Qatar" Archived 2017-02-14 at the Wayback Machine, 13 Jan 2013
  68. "New Qatari emir Sheikh Tamim 'set to announce reshuffle'". BBC News. 26 June 2013. Retrieved 26 June 2013.
  69. "Qatar (01/10)". State.gov. Retrieved 28 March 2010.
  70. Coman, Julian (21 March 2005). "Egyptian Suicide Bomber Blamed for Attack in Qatar". The Independent.
  71. Analytica, Oxford (25 March 2005). "The Advent of Terrorism in Qatar". Forbes.
  72. "Qatar Timeline". BBC News. 14 June 2012. Retrieved 7 January 2013.
  73. Roula Khalaf and Abigail Fielding Smith (16 May 2013). "Qatar bankrolls Syrian revolt with cash and arms". Financial Times. Retrieved 3 June 2013.
  74. Nordland, Rod (24 June 2013). "In Surprise, Emir of Qatar Plans to Abdicate, Handing Power to Son". NYTimes.com. Retrieved 26 June 2013.
  75. "The World factbook". CIA.Gov. 20 June 2014. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 20 June 2014.
  76. 76.0 76.1 "Qatar". CIA World Factbook. Central Intelligence Agency. 8 February 2012. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 4 March 2012.
  77. "List of Parties". Convention on Biological Diversity. Retrieved 8 December 2012.
  78. "National Biodiversity Strategy and Action Plan. State of Qatar" (PDF). Convention on Biological Diversity. Retrieved 9 December 2012.
  79. A. H. Moubasher (1993). Soil Fungi in Qatar and Other Arab Countries. Centre for Scientific and Applied Research, University of Qatar. p. i–xvi, 570 pp., 86 plates. ISBN 978-99921-21-02-3.
  80. "The Lizards Living in Qatar. 2014. First edition, Published in Doha (Qatar), 2014, 5 June (World Environment Day). 570 pages" (PDF). Archived from the original (PDF) on 2014-07-08. Retrieved 2017-03-18.
  81. "CO2 emissions (metric tons per capita)". Data.worldbank.org. Retrieved 7 January 2013.
  82. Pearce, Fred (14 January 2010). "Qatar to use biofuels? What about the country's energy consumption?". The Guardian. London.
  83. 83.0 83.1 "Qatar National Vision 2030". Ministry of Development Planning and Statistics. Archived from the original on 2012-11-13. Retrieved 2017-03-18.
  84. Rasoul Sorkhabi, Ph.D. (2010). "The Qatar Oil Discoveries". GEO ExPro Magazine. Archived from the original on 2024-01-18. Retrieved 2017-03-18.
  85. Nordland, Rod (25 June 2013). "New Hope for Democracy in a Dynastic Land". NYTimes.com. Retrieved 26 June 2013.
  86. "GDP – per capita (PPP)". The World Factbook, Central Intelligence Agency. Retrieved 25 May 2014.
  87. "The economy: The haves and the have-nots". Economist. 13 July 2013. Retrieved 30 December 2013.
  88. Bill Crane (April 20, 2015). Gravediggers of the Gulf. Jacobin. Retrieved April 20, 2015.
  89. "Qatar: Migrant Construction Workers Face Abuse". Human Rights Watch.
  90. Robert Tuttle (22 May 2014). World Cup Host Qatar Ranked Among Worst Places to Work by Unions. Bloomberg. Retrieved 29 July 2014.
  91. "Qatar tourist guide". Retrieved 14 February 2012.
  92. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; strangepow అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  93. "Doing Business in Qatar: 2012 Country Commercial Guide for U.S. Companies" (PDF). US & Foreign Commercial Service And US Department of State. Archived from the original (PDF) on 16 జనవరి 2013. Retrieved 7 January 2013.
  94. "Qatar". OPEC. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 16 June 2013.
  95. "The World's Richest Countries". Forbes.
  96. Kortekaas, Vanessa (28 October 2013). "New Qatar emir shakes up sovereign wealth fund". Financial Times. Retrieved 30 December 2013.
  97. "Qatar Holding LLC Among Investors in BlackBerrys $1 Billion Convertible Debt". Berryreview.com. 6 November 2013. Retrieved 30 December 2013.
  98. Hall, Camilla (30 October 2013). "Qatar fund quietly builds $1bn Bank of America stake". Financial Times. Retrieved 30 December 2013.
  99. Hall, Camilla (4 July 2013). "Qatar: what's next for the world's most aggressive deal hunter?". Financial Times. Retrieved 30 December 2013.
  100. 100.0 100.1 100.2 Simon Lincoln Reader (12 November 2013). "Qatar shows how money can solve most problems". Bdlive.co.za. Retrieved 30 December 2013.
  101. 101.0 101.1 "History of Census in Qatar". Qatar Statistics Authority. Archived from the original on 11 మార్చి 2017. Retrieved 16 June 2013.
  102. 102.0 102.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census10 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  103. 103.0 103.1 "Population structure". Qatar Statistics Authority. 31 January 2013. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 18 మార్చి 2017.
  104. 104.0 104.1 "Qatar's delicate balancing act". BBC News. 16 January 2013. Retrieved 23 May 2013.
  105. http://en.tengrinews.kz/people/Qatar-population-hits-25-million-on-worker-influx-263189/
  106. Pandit, Mobin (5 January 2013). "Population rise will push up rents". The Peninsula Qatar. Archived from the original on 2013-10-29.
  107. Kovessy, Peter. "Though many leave Qatar, there are more people here than ever". DohaNews.Co. Doha News. Archived from the original on 18 జనవరి 2016. Retrieved 17 January 2016.
  108. Global Religious Landscape Archived 2013-01-01 at the Wayback Machine. Pew Forum.
  109. "Population By Religion, Gender And Municipality March 2004". Qatar Statistics Authority. Archived from the original on 2013-05-18. Retrieved 2017-03-18.
  110. "Report on International Religious Freedom – Qatar". US Department of State. Archived from the original on 2014-08-21. Retrieved 2017-03-18. The official state religion follows the conservative Wahhabi tradition of the Hanbali school of Islam
  111. "Tiny Qatar's growing global clout". BBC. 30 April 2011. Retrieved 12 March 2015.
  112. "Qatar's modern future rubs up against conservative traditions". Reuters. 27 September 2012. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 18 మార్చి 2017.
  113. "Rising power Qatar stirs unease among some Mideast neighbors". Reuters. 12 February 2013. Archived from the original on 2 అక్టోబరు 2015. Retrieved 13 June 2013.
  114. "2011 Report on International Religious Freedom – Qatar". US Department of State.
  115. "Population By Religion, Gender And Municipality March 2004". Qatar Statistics Authority. Archived from the original on 2013-05-18. Retrieved 2017-03-18.
  116. "Mapping the Global Muslim Population: A Report on the Size and Distribution of the World's Muslim Population". Pew Research Center. 7 October 2009. Archived from the original on 27 మార్చి 2010. Retrieved 18 మార్చి 2017.
  117. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; con అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  118. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; qat1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  119. "Religious Composition by Country" (PDF). Global Religious Landscape. Pew Forum. Retrieved 9 July 2013.[permanent dead link]
  120. Johnstone, Patrick; Miller, Duane Alexander (2015). "Believers in Christ from a Muslim Background: A Global Census". Interdisciplinary Journal of Research on Religion. 11: 17. Retrieved 28 October 2015.
  121. "Christians to Welcome Qatar's First Christian Church". Christianpost.com. 24 February 2008. Retrieved 22 January 2013.
  122. "CIA The World Fact Book". State.gov. 29 June 2006. Retrieved 28 March 2010.
  123. 123.0 123.1 "Report on Qatar". Cumorah Project. Retrieved 12 March 2015.
  124. 124.0 124.1 "The Anglican Centre in Qatar". Epiphany-qatar.org. Archived from the original on 16 జనవరి 2013. Retrieved 18 మార్చి 2017.
  125. 125.0 125.1 David B. Barrett; George Thomas Kurian; Todd M. Johnson (2001). World Christian encyclopedia: a comparative survey of churches and religions in the modern world. Vol. 1. Oxford University Press. p. 617. ISBN 978-0-19-510318-2.
  126. Baker, Colin; Jones, Sylvia Prys (1998). Encyclopedia of Bilingualism and Bilingual Education. Multilingual Matters. p. 429. ISBN 978-1853593628.
  127. Guttenplan, D. D. (11 June 2012). "Battling to Preserve Arabic From English's Onslaught". The New York Times. Retrieved 24 November 2013.
  128. EurActiv.com (29 October 2012). "OIF defends Qatar's admission to French-speaking club". EurActiv. Retrieved 11 April 2014.
  129. "900 millions de personnes célèbrent la francophonie" (in French). Radio France International. 16 March 2013. Retrieved 12 March 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  130. "OIF defends Qatar's admission to French-speaking club". EurActiv. 29 October 2012. Retrieved 12 March 2015.
  131. "Qatar Facts". First Qatar Orthodontic Conference. Archived from the original on 2014-07-12. Retrieved 2017-03-18.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖతార్&oldid=4324351" నుండి వెలికితీశారు