శ్రీలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு
ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర శ్రీలంక
Flag of శ్రీలంక శ్రీలంక యొక్క చిహ్నం
జాతీయగీతం
శ్రీలంక జాతీయగీతం

శ్రీలంక యొక్క స్థానం
శ్రీలంక యొక్క స్థానం
రాజధానిశ్రీ జయవర్ధనపుర-కొట్టె
6°54′N 79°54′E / 6.900°N 79.900°E / 6.900; 79.900
అతి పెద్ద నగరం కొలంబో
అధికార భాషలు సింహళ, తమిళం
ప్రభుత్వం ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యము
 -  అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష (2019 ఎన్నికల ఫలితం)
 -  ప్రధానమంత్రి 2019 ఎన్నిక
స్వాతంత్ర్యము యునైటెడ్ కింగ్‌డం నుండి 
 -  ప్రకటన ఫిబ్రవరి 4 1948 
 -  గణతంత్రము మే 22 1972 
విస్తీర్ణం
 -  మొత్తం 65,610 కి.మీ² (122వ)
25,332 చ.మై 
 -  జలాలు (%) 4.4
జనాభా
 -  2005 అంచనా 19,668,000[1] (52వ)
 -  2001 జన గణన 18,732,255 
 -  జన సాంద్రత 310 /కి.మీ² (35వ)
818 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $86.72 బిలియన్ (61వ)
 -  తలసరి $4,600 (111వ)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $26.794 బిలియన్ (78వ)
 -  తలసరి $1,355 (119వ)
జినీ? (1999–00) 33.2 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase0.755 (medium) (93వ)
కరెన్సీ శ్రీలంక రూపాయి (LKR)
కాలాంశం (UTC+5:30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .lk
కాలింగ్ కోడ్ +94

శ్రీలంక (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు, ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు, సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు, ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. టీ, కాఫీ, రబ్బరు,, కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు,, అడవులు ఘనమైన సంస్కృతి, నాగరికతలు దీనిని పర్యటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు, 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948 లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న తమిళ పులులు.

పేరు

[మార్చు]

పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి. పురాతన గ్రీకులు టాప్రొబేన్ అని, అరబ్బులు సేరేండిబ్ అని పిలిచేవారు. శ్రీలంకకు శిలయో అని 1505లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీసు వారు నామకరణం చేశారు. అదే ఆంగ్లంలో 'సిలోన్' గా అనువదింపబడింది. 1972లో శ్రీలంక ఆధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. 1978 లో, శ్రీలంకను ఆధికారికంగా 'డెమాక్రెటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు.

ప్రస్తుత పేరు లోని 'లంక' సంస్కృతం నుండి వచ్చింది. లంక అంటే 'తేజస్సుగల భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు రామాయణం, మహాభారతం లలో కూడా కనిపిస్తుంది. సంస్కృతంలో 'శ్రీ' అంటే భవ్యమైనది అని అర్ధం.

చరిత్ర

[మార్చు]

పడమర పీఠ భూముల లోనూ, మధ్య పర్వతాల యొక్క నైరుతి వైపూ ఉన్న పలు గుహ స్థలాలలో జరిగిన త్రవ్వకాల లో, పురాతన రాతి యుగపు మానవ స్థిరావాసాలు కనుగొనబడినవి. బయట పడిన కొన్ని పాతి పెట్టబడిన,, అలంకరణ సామగ్రిని బట్టి ఈ ద్వీపపు మొదటి నివాసులకూ, దక్షిణ భారతదేశపు తొలి నివాసులకూ సారూప్యత ఉన్నదని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

చార్తిత్రక కాలాను 125 వేల సంవత్సరాలకు ముందు అలాగే ప్రస్తుత కాలానికి మునుపు 5,00,000 బి.పి (బి.పి అంటే బిఫోర్ ప్రజంట్) పాలియోలిథిక్, మెసోలిథిక్, ఇనుప యుగానికి ముందు శ్రీలంక రూపుద్దికున్నట్లు విశ్వసించబడూంది. శ్రీలంకలో 37,000 బి.పికి చెందిన పాలియోలిథిక్, పాహియాంగలా (చైనా యాత్రికుడు సన్యాసి ఫా-హ్సియన్ విజయం తరువాత ఈ పేరు వచ్చింది) బాటడాబమీనా (28,000 బి.పి),, బెలిలేనా (12,000 బి.పి) మానవ అవశేషాలు బయల్పడ్డాయి. ఈ గుహలలో కనుగొనబడిన బలంగోడా మానవ అవశేషాలు ఆకారంలో ఆధునిక మానవుని పోలి ఉన్నాయి. వారు వ్యవసాయం చేసారని, క్రీడలలో పాల్గొనడానికి శునకాలను కూడా పెంచారని విశ్వసిస్తున్నారు.

Frescos on the Sigiriya rock fortress in Matale District, 5th century.

శ్రీలంక గురించి వ్రాతపూర్వకంగా హిందూ కావ్యం రామాయణంలో ఆధారాలు లభించాయి. అందులో ఈ భూభాగం లంకగా వర్ణించబడిది. సాధారణంగా అంక అంటే జలావృత భూభాగం అని అర్ధం. ఈ రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాధిదేవత కుబేరుడి కొరకు నిర్మించాడు. కుబేరుడు దుస్టుడైన సవతి తమ్ముడైన రానణుడి చేత రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆధినిక నగరమైన వారియపోలా రావణుడికి విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది.

శ్రీలంకలో నివసించిన పూర్వీకులు వేదకాలానికి ముందు కాలానికి చెందినవారని భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో నివసిస్తున్న స్థానికుల సంఖ్య 2,500. ప్రస్తుత పురాతన సముద్రతీర నగరమైన టార్షిహ్ భూభాగంలో ఏనుగుదంతాలు, నెమళ్ళు ఇతర విలువైన వస్తువులు పుష్కలంగా లభిచాయని సోలాన్ రాజు చెప్పాడని ఐరోపా చరిత్రకారుడు జేంస్ ఎమర్సన్ వర్ణించాడు.

పురాతనం

[మార్చు]
Avukana Buddha statue, a 12m standing Buddha statue belongs to the reign of Dhatusena, 5th century AD

పాలి భాషలో వ్రాయబడిన చరిత్రసంబధిత మహావంశ గ్రంథం ఆధారంగా శ్రీలంక పురతన కాలం క్రీ.పూ 543 లో ప్రారంభం అయిందని విశ్వసిస్తున్నారు. పురాణంలో వర్ణించబడిన రాజైన విజయ 8 నావలలో 700 మంది అనుచరులతో 860 నాటికల్ మైళ్ళు సముద్రయానం చేసి ఈ భూమి మీద అడుగుపెట్టాడని భావిస్తున్నారు. పశ్చిమబెంగాలు నుండి వచ్చిన విజయ ప్రస్తుత శ్రీలంక దక్షిణ తీరంలో ఉన్న రాహ్ నగరంలో ప్రవేశించాడని భావిస్తున్నారు. విజయ తంబాపన్ని ప్రస్తుత మన్నార్ భూభాగంలో రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీలంకలో రాజ్యస్థాపన చేసిన సుమారు 189 రాజ్యాలలో విజయ స్థాపించిన తంబాపన్ని మొదటిదని విశ్వసిస్తున్నారు. దీపవంశ, మహావంశ, చూళవంశ, రాజవాలియా వంటి చారిత్రక గ్రంథాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. శ్రీలంక పురాతన రాజ్యాల చరిత్ర క్రీ.పూ 543 నుండి సా.శ.్ 1845 (దాదాపు 2359 సంవత్సరాలు) వరకు విస్తరించి బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కావడంతో ముగింపుకు వచ్చి తరువాత ఆధునిక చరిత్ర మొదలైంది.

The Sigiriya rock fortress.

పండుకభేయ కాలంలో క్రీ.పూ 380 లో శ్రీలంక రాజ్యం అనూరాధాపురానికి తరలించబడింది. తరువాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనూరాధాపురం రాజధానిగా ఉంది. పురాతన శ్రీలంక వాసులు చెరువులు, డగోబాస్, సుందర ప్రదేశాలు వంటి వివిధ నిర్మాణాలు నిర్మించడంలో సిద్ధహస్తులు. దేవానాంపియ కాలంలో భారతదేశం నుండి శ్రీలంకలో ప్రవేశించిన బౌద్ధమతం కారణంగా శ్రీలంకలో అత్యధిక మార్పులు సంభవించాయి. మౌర్యచక్రవర్తి ఆశోకుని కుమారుడైన మహేంద్ర భిక్షు బౌద్ధమత సందేశాన్ని మోదుకుని మహింతలెలో ప్రవేశించాడు. ఆయన మతప్రచారకులు రాజ్యమంతా బుద్ధిజాన్ని ప్రచారం చేసి శ్రీలంకలో బుద్ధమతాన్ని స్థిరంగా స్థాపించారు. తరువాత సామ్రాజ్యాలు శ్రీలంకలో పలు బుద్ధమఠాలు, బౌద్ధ ఆరామాలు నిర్మించారు. అలాగే వారు ఆగ్నేయాసియాలోని ఇతర రాజ్యాలలో బుద్ధమతం విస్తరించడానికి సహకరించారు. శ్రీలంక భిక్షువులు భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ బద్ధ విశ్వవిద్యాలయమైన నలందా విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం చేసారు. నలందా విశ్వవిద్యాలయం మహామ్మద్ ఖిల్జి చేత ధ్వంసం చేయబడింది. నలందాలోని అనేక వ్రాతప్రతులు శ్రీలంకలోని ఆరామాలలో భద్రపరచబడ్డాయని విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 245 లో భిక్షుకి ప్రియదర్శిని " జయశ్రీ మహాభోది వృక్షంతో " శ్రీలంకలో ప్రవేశించింది. ఇది గౌతమబుద్ధునికి ఙానం ప్రసాదించిన భోదివృక్షం యక్క సంతానమైని విశ్వసిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో మానవుడు నాటిన మొదటి వృక్షం ఇదే నని భావిస్తున్నారు.

Claudius Ptolemy's map of Ceylon, 1st century AD in a 1535 publication.

శ్రీ లంక భూభాగంలో మొదటిసారిగా శూరటిస్సా కాలంలో విదేశీదండయాత్ర జరిగింది. దక్షిణ భారతదేశానికి చెందిన సేనా, గుత్తికా అనే అశ్వవ్యాపారులు శూరటిస్సాను ఓడించారు. క్రీ.పూ2005 లో చోళరాజైన ఎలారా ఆధ్వర్యంలో రెండవ దండయాత్ర జరిగింది. అసెలాను ఓడించిన ఎలెరా 44 సంవత్సరాల కాలం పాలన సాగించాడు. దక్షిణప్రాంత సామంత ప్రభువైన కావన్-తిస్సా పెద్దకుమారుడైన దూతుజెమును విజితపురా యుద్ధంలో ఎలరాను ఓడించాడు. దూతుజెమును పురాతన శ్రీలంక, లోవావామహాపాయాలలో రెండవది అయిన రువాంవేలిస్యా స్థూపం నిర్మించాడు. 2500 సంవత్సరాల చరిత్రలో శ్రిలంక కనీసం 8 సార్లు దక్షిణభారతీయ రాజులచేత దండయాత్రకు గురైంది. శ్రీలంక మీద చోళులు, పాండ్యులు, చేర, పల్లవుల కాలంలో దండయాత్రలు కొనసాగాయి. అయినప్పటికీ దండయాత్రదారులందరూ వెనుకకు పంపబడ్డారు. కళింగులు, మలాయ్ ద్వీపకల్పం నుండి కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు. ధతుసేనా పాలనా సమయంలో కాలవేవ, ఆవుకానా బుద్ధుని విగ్రహం నిర్మించబడింది.

మద్యయుగం

[మార్చు]
A Buddhist statue in the ancient capital city of Polonnaruwa, 12th century

అనురాధపురా పతనం తరువాత శ్రీలంకలో మద్యయుగం ప్రారంభం అయింది. సా.శ. 993 లో చోళచక్రవర్తి అయిన మొదటి రాజరాజ అప్పటి శ్రీలంక రాజైన ఐదవ మహీందను దక్షిణ భూభాగానికి వెళ్ళమని వత్తిడి చేసాడు. మొదటి రాజరాజ కుమారుడైన మొదటి రాజేంద్ర ఈ అవకాశాన్ని ఆధారం చేసుకుని సా.శ. 1017లో పెద్ద ఎత్తున దండయాత్ర కొనసాగించాడు. ఐదవ మహీద్ర పట్టుబడి భారతదేశానికి తీసుకుని రాబడ్డాడు. చోళులు అనూరాధపురాన్ని స్వాధీనంచేసుకున్నారు. చోళులు రాజధానిని పొలోన్నరువాకు మార్చారు. అంతటితో శ్రీలంకకు చెందిన మొరియా, లంబాకన్న అనే రెండు అత్యున్నత సామ్రాజ్యాలు ముగింపుకు దశకు చేరుకున్నాయి. ఏడు సనత్సరాల నిరతర యుద్ధం తరువాత 1070 లో మొదటి విజయబాహు విజయవంతంగా చోళులను శ్రీలంక నుండి వెలుపలకు పంపాడు. తరువాత సమైక్యపచబడిన శ్రీలంకలో ఒక శతాబ్ధకాలం శాంతి నెలకొన్నది. చోళుల పాలనా సమయంలో తుడిచిపెట్టబడిన భౌద్ధమతాన్ని పునరుద్ధరించడానికి మొదటి విజయబాహు బర్మా నుండి బుద్ధ సన్యాసులను శ్రీలంకకు రప్పించాడు. మద్యయుగంలో శ్రీలంక రుహ్ను, పిహితి, మాయా అనే మూడు భూభాగాలుగా విభజించబడింది.

శ్రీలంక నీటిపారుదల విధానం పరాక్రమబాహు (సా.శ. 1153-1186) (పరాక్రమబాహు ది గ్రేట్) కాలంలో దేశమంతటా విస్తరించబడింది. శ్రీలంక రాజకీయంగా శక్తివంతగా విలసిల్లిన కాలం ఇదే అని భావించబడుతుంది. పరాక్రమబాహు శ్రీలంకలో 1470 చెరువులను త్రవ్వించాడు. శ్రీలంక చరిత్రలో మిగిలినరాజులకటే ఇది అత్యధికం. 165 ఆనకట్టలు, 3919 కాలువలు, 163 ప్రధాన చెరువులు, 2376 చిన్నపాటి చెరువులు మరమ్మత్తు చెయ్యబడ్డాయి. పరాక్రమ సముద్రా నిర్మాణం పరాక్రమబాహువుకు కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చాయి. శ్రీలంకలో ఇది మద్యయుగంలో బృహత్తర నీటిపారుదల ప్రణాళికగా గుర్తింపు పొందింది. పరాక్రమబాహు భూభాగంలో గుర్తించతగిన రెండు యుద్ధాలు జరిగాయి. ఒకటి దక్షిణ భారతదేశం నుండి పాడ్యరాజుల దండయాత్ర కాగ రెండవది రామన్నా (మాయాన్మార్) రాజుల దండయాత్ర.

తరువాతి కాలంలో శ్రీలంక రాజ్యాంగశక్తి క్షీణదశకు చేరుకుంది. సా.శ. 1215 లో కళింగ మాగన్ అనే దక్షిణభారతీయుడు శ్రీలంక భూభాగంపై 24,000 శక్తివంతులైన సైనిక సేకరణ ద్వారా దండేత్తి పొలోన్నరువా రాజ్యాన్ని కైవశం చేసుకున్నాడు. ఈ దండయాత్ర కొరకు కళింగ మాగన్ 100 నౌకలలో 690 నాటికల్ మైళ్ళు ప్రయాణించి శ్రిలంక భూభాగం చేరుకున్నారు. కళింగ మాగన్ జాఫ్నా రాజ్య స్థాపకుడుగా భావిస్తున్నారు. గతంలో శ్రిలంక మీద జరిగిన దండయాత్రలకు విరుద్ధంగా ఈ దండయాత్రలో సర్వం దోచుకోవడమే కాక పురాతన అనూరాధపురం, పొలోన్నరువా రాజ్యాలను సర్వనాశనం చేసాడు. కళింగ మాగన్ పాలనలో శ్రీలంక భూభాగం పీల్చిపిప్పి చేయబడడమే కాక రాజారత సంప్రదాయాలలో వీలైనంతగా మార్పులు చోటు చేసుకున్నాయి. కళింగ మాగన్ పాలనకు భీతిచెందిన శ్రిలంక భూభాగంలోని స్థానిక సింహళీయులు సామూహికంగా పడమర, దక్షిణ భూభాగాలకు, పర్వతాంతర్భాగాలకు తరలి వెళ్ళారు. శ్రీలంక కళింగ మాగన్ దండయాత్ర నుండి తిరిగి కోలుకోలేక పోయింది. 1470లో మూడవ విజయబాహు సాగించిన తిరుగుబాటు ఫలితంగా శ్రీలంక భూభాగం డంబదేనియా ఆధీనంలోకి వచ్చింది. ఉత్తర భూభాగం జాఫ్నా రాజ్యాంగం విస్తరించింది. ఒక సందర్భంలో తప్ప తరువాత ఎప్పుడూ జాఫ్నా దక్షిణరాజ్యాల అధీనంలోకి తీసుకురాబడలేదు. 1450లో ఆరవ పరాక్రాబాహు దత్తపుత్రుడైన శాంపుమాల్ రాజకుమారుడు శ్రీలంక భూభాగం మీద దండయాత్రసాగించి ఉత్తర భూభాగాన్ని 1450-1467 వరకు పాలించాడు. 1225 నుండి దాదాపు మూడుదశాబ్ధాల కాలం శ్రీలంకలోని దక్షిణ, మద్య భూభాగాన్ని డంబదేనియా, యపాహువా, గంపోలా, రైగమా, కొట్టే, సిత్వాకా, క్యాండీ రాజ్యాలు పాలినాయి.

సింహళం-ఆంధ్ర సంస్కృతి

[మార్చు]

ఆంధ్ర దేశానికి క్రీ.పూ.1000 సం.పూర్వమే ఆంధ్రులు వలసవచ్చి రాజ్యాలు స్థాపించినట్లు, సింహళులు క్రీ.పూ.500పూర్వమే సింహళానికి వలసవెళ్ళినారు. వీరికీ వారికీ గాథలలో సింహసంబంధం ఉంది. శాతుడనే గంధర్వుడు సింహమై మొదటి శాతవాహని పెంచాడు కాబట్టి వీరుశాతవాహనులు. సింహపతాకులు కాబట్టి వారు సింహళులు.ఆంధ్రమహాకవి గుణాఢ్యుడు సేకరించి వ్రాసిన గాథల సంపుటి బృహత్కథ.ఆ బృహత్కథలో ఆంధ్రులు సింహళ రాజధానితో బాగావర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. తామ్రపర్ణి రేవులో ఆంధ్రుల ఓడలు దిగేవట. సింహళం నుండి దాల్చిన, కొబ్బరి, లవంగాలు, కర్పూరము, లక్క, మిరియాలు, పచ్చ రత్నాలు దిగుమతి చేస్తే ఆంధ్రులు బంగారము, రంగులు, పోకలు, యాలకలు, లోహసామానులు, వస్త్రాలు శిల్పసామానులు సింహళానికి ఎగుమతి చేసేవారు.ఆంధ్రులూ సింహళలూ బౌద్ధులు వారిదేశంలో వారి ద్వీపంలో స్థివిరవాదమే ఎక్కువ. ప్రాబల్యం వహించింది. ఆతర్వాత ఆంధ్రుడైన శ్రీనాగార్జున బోధి సత్వుడు మహాయానము జనకులు. నాగార్జునుడు సింహళంలో కొంతకాలం నివసించినట్లు గాథలునాయి. ఆతని మహాయాన విధానం సింహళం నిండింది. ధాన్యకటకం లోనూ, ఇక్ష్వాకులు రాజధాని అయిన నాగార్జున కొండ అయిన విజయపురిలోనూ, సింహళుల సంఘారామాలు ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. సింహళం సాంచీ స్తూపాలు, ఆంధ్రుల స్తూపాలూ ఒకే రూపంలో ఉన్నాయి. పవిత్రమైన బుద్ధుని దంతధాతువు ఆంధ్రదేశంనుండే సింహళం వెళ్ళింది.

సింహళం దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శిల్పులను సింహళం తీసుకువెళ్ళి ఉంటారని అంటారు. పల్లవభోగంలో (పల్నాడు) దొరికే పాలరాయి గంధపు చెక్కపై శిల్పం మలచినట్లు, విన్యసించడానికి అనువైన మెత్తనిరాయి. అలాంటిరాయి సింహళంలో దొరకలేదు. ఆంధ్రదేశంనుండి ఆరాయిని కొనిపోవడం కష్టం. కాబట్టి ఆంధ్రదేశాన్నుండి వెళ్ళిన శిల్పులు అలాంటి రాయిని సింహళంలో వెదికినారు. సింహళం రాజధాని అయిన అనూరాధాపురం చుట్టు నల్లరాయి కావలసినంత ఉంది.అయినా ఆ శిల్పులు దానితో శిల్పం మలచడానికి ఇష్టంలేక పల్నాటిరాయిని పోలిన ఒక విధమైనప్పటి కపురాయిని అనూరాధాపురానికి కొదిమైళ్ళ దూరంలో కనిపెట్టి ఆరాతిని విరివిగా వారి శిల్పానికి ఉపయోగించారు.అనురాధాపురంలో దర్శనమిచ్చే ప్రాచీన బుద్ధ విగ్రహాలన్నీ ధాన్యకటకాది ఆంధ్రబౌద్ధ శిల్ప క్షేత్రాలలో దొరికే బుద్ధవిగ్రహాలకు ప్రతిరూపాలు.

చోళులు సా.శ.16వ శాతాబ్దంలో అనూరాధాపురం నాశనం చేసి పాలనారువాలో రాజ్యం స్థాపించారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పాలూ అహ్హ్ట ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ఆనగరానికి నేటిపేరు కీండే.ఆరాజులు దండెత్తివచ్చి పూర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు సహాయం చేసారు. చివర సింహళరాజులు ఇల్లడంవెళ్ళిన మధుర ఆంధ్రనాయకరజవంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింగాలీ భాష పాలిభాషబిడ్డ.

వలస ప్రభుత్వం

[మార్చు]
A 17th-century painting of Dutch explorer Joris van Spilbergen meeting with King Vimaladharmasuriya in 1602.

అధునికయుగ ఆరంభకాలంలో 1505 లో పోర్చుగీసు వారు, అన్వేషకుడు ల్యూరెన్‌కో డీ అల్మేడియా, ఫ్రాంసిస్కో డీ అల్మేడియా రాకతో శ్రీలంకలో యురేపియన్ శకం మొదలైంది. 1557 లో పోర్చుగీసువారు ఫోర్ట్ సిటీ కొలంబియాలో కోటను నిర్మించారు. క్రమంగా ద్వీపంలోని తీరప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1592లో దశాబ్ధాలకాలంలో అప్పుడప్పుడూ పోర్చుగీసువారితో యుద్ధాలు కొనసాగాయి. మొదటి విమలాధర్మసూర్య తన సామ్రాజ్యాన్ని శత్రువులు దాడిచేయడానికి వీలుకాని సురక్షిత స్థానమైన క్యాండీ నగరానికి తరలించాడు. సముద్రతీరానికి దూరంగా ఉన్నందున ఈ నగరం సురక్షితమని భావించడమే ఇందుకు కారణం. 1619లో పోర్చుగీసు దాడులకు లొంగిపోయిన తరువాత జాఫ్నా స్వతంత్రం ముగింపుకు వచ్చింది.

డచ్ వలస ప్రభుత్వం

[మార్చు]
Shield shape with an elephant center and four palm trees on each side
Colonial coat of arms of British Ceylon.

రెండవ రాజాసింఘే కాలంలో 1648లో డచ్ అన్వేషకులు ద్వీపంలో ప్రవేశించారు. అత్యధిక తీరప్రాంతాలలో ఆధిక్యత కలిగిఉన్న పోర్చుగీసువారిని తరిమికొట్టడానికి రెండవ రాజసింఘే రాజు డచ్ ఈస్టిండియా కంపెనీ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. తరువాత సాగిన దచ్-పోర్చుగీసు యుద్ధంలో డచ్ విజయం సాగించిన కారణంగా 1656 వరకు కొలంబో డచ్ ఆధీనంలో ఉండి పోయింది. 1638లో జరిగిన ఒప్పందాన్ని అతిక్రమించి డచ్ వారు ఆక్రమించిన ప్రాంతాలను వారి ఆడీనంలోకి తీసుకుంది. డచ్ పాలనా ఫలితంగా సరికొత్తగా శ్రీలంకలో బర్గర్ పీపుల్స్ (బర్గర్ ప్రజలు) అనే స్థానికజాతి అవతరించింది. క్యాండీ సామ్రాజ్యం శ్రీలంకలో చివరి సామ్రాజ్యంగా చరిత్రలో మిగిలి పోయింది. 1595లో విమలధర్మసూర్య క్యాండీ సామ్రాజ్య చిహ్నంగా పవిత్రమైన " టూత్ రెలిక్ "ని తీసుకువచ్చాడు. ఇది సింహళీయుల మద్య రాజరీక , మతపరంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే దతానికి ఆలయం కూడా నిర్మించాడు. తరచుగా యురేపియన్లతో కొనసాగిన యుద్ధాల మధ్య సామ్రాజ్యం నిలకడ కొనసాగింది. 1739లో వీర నరేంద్రసింఘా మరణం తరువాత క్యాండీ సాంరాజ్యానికి గండకాలం మొదలైంది. ఆయన తెలుగు మాట్లాడే దక్షిణభారతంలోని నాయక్కర్ రాజకుమారిని వివాహం చేసుకున్నప్పటికీ వారికి సంతానం కలగలేదు. చివరికి బిక్కు వెలివితా సరంకరా మద్దతుతో కిరీటం నరేంద్రసింఘా భార్య సోదరునికి దక్కింది. నరేంద్రసింఘా , సింహళస్త్రీకి జన్మించిన ఆయన స్వంతకుమారుడు " ఉనంబువే బందారా " రాజ్యాంగ వ్యవహారాలు చూసుకునేవాడు. అదే సంవత్సరంలో " శ్రీ విజయ రాజసింఘా " కిరీటధారణ చేసాడు. నాయక్కర్ చక్రవర్తి డచ్ పాలిత ప్రాంతాలపై పలు దండయాత్రలు కొనసాగించినప్పటికీ అన్ని అపజయాలుగా మిగిలిపోయాయి.

బ్రిటిష్ వలసప్రభుత్వం

[మార్చు]
Tea plantation was introduced to Sri Lanka by James Taylor, a British planter, in 1867.

1796లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వీపం తీరప్రాంతాలను ఆక్రమించుకున్నది. దీనిని వారు సిలోన్ అని అనేవారు. రెండు సంవత్సరాల తరువాత 1798లో శ్రీలంకా నాయకర్ రాజులలో నలుగురిలో మూడవవాడైన రాజాధి రాజసింహా జ్వరంతో మరణించాడు. రాజాధి రాజసింహా మరణం తరువాత రాజసింహా మేనల్లుడు 18 సంవత్సరాల వయసున్న కన్నసామీ కిరీటధారణ చేసాడు. యుక్తవయస్కుడైన రాజు తరువాత శ్రీ విక్రమసింహాగా పిలువబడ్డాడు. 1803లో విక్రమసింహా మీద బ్రిటిష్ ప్రభుత్వం దండయాత్రచేసి విజయంసాధించింది. తరువాత ద్వీపంలోని తీరప్రాంతం మొత్తం బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. తతువాత అమియంస్ ఒప్పందం జరిగింది. 1815 ఫిబ్రవరి 14 న క్యాండీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వజ్ం ఆకేమించుకుంది. రెండవ క్యాండియన్ యుద్ధంతో శ్రీలంక పరిపూర్ణంగ స్వతంత్రాన్ని కోల్పోయింది. శ్రీలంక కడపటి చక్రవర్తి భారతదేశానికి పారిపోయాడు. క్యాండియన్ సంప్రదాయంకంగా పూర్తిగా బ్రిటిష్ వశం అయింది. 1818లో శ్రిలంక నాయకులు సాగించిన తిరుగుబాటు బ్రిటిష్ గవర్నర్ బ్రున్‌రిగ్ నాయకత్వంలో అణిచివేయబడింది.

ఆధునిక కాలం

[మార్చు]

1883లో కోల్‌బ్రోక్ - కేమియోన్ సంస్కరణలు ఆరంభం అయ్యాయి. శ్రీలంకలో వారు ప్రయోజనకరమైన, స్వతంత్ర రాజకీత సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలో భాగంగా క్యాండియన్, తీరప్రాంత భూభాగాలు ఒకటి చేసి ఒకే ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఒక ఎగ్జిక్యూటివ్ కౌంసిల్, లెజిస్లేటివ్ కౌంసిల్ స్థాపినచబడ్డాయి. తరువాత లెజిస్లేటివ్ ప్రతినిధుల స్థాపన జరిగింది. తరువాత ప్రయోగాత్మకంగా జరిగిన కాఫీతోటల పెంపకం విజయవంతమైంది. త్వరితగతిలో దేశేగుమతులలో కాఫీ ప్రధానస్థానం వహించింది. 1847లో కఫీ ధరలు పతనం కావడం ఆర్థిక వత్తిడికి దారితీసింది. ఫలితంగా గవర్నర్ తుపాకులు, కుక్కలు, షాపులు, బోట్లు మొదలైన వాటిమీద సరికొత్తగా పన్నులు విధించాడు. అలాగే ఆరురోజుల ఉచిత శ్రమదానం లేక శ్రమకు తగిన వేతనం ఇచ్చే రాజకార్య విధానం తిరిగి ప్రవేశపెట్టాడు. ఈ కఠినవధానాలు ప్రజలలో కలవరం రేకిత్తించిన కారణంగా 1848లో మరొక తిరుగుబాటు ఆరంభం అయింది.1869లో వినాశకారిక ఆకు వ్యాధి, హెమిలియా వాస్టాట్రిక్స్ కాఫీతోటలను దెబ్బతీయడంతో పారిశ్రామిక రంగం మొత్తం 15 సంవత్సరాలలో క్షీణదశకు చేరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం త్వరితగతిలో కాఫీ స్థానంలో టీ తోటల పెంపకం చేపట్టింది. శ్రీలంకలో తరువాతి దశాబ్ధాలలో టీ ఉత్పత్తి చక్కగా వర్ధిల్లింది. 20వ శతాబ్దంలో రబ్బర్ తోటల పెంపకం బృహత్తర ప్రణాళికలో మొదలైంది.

19వ శతాబ్దం చివరిదశలో బ్రిటిష్ ప్రభుత్వం సిలోన్ సివిల్ సర్వీసులు, న్యాయశాఖ, విద్యాశాఖ,, విద్యాశాఖలలో నియామకాలు ప్రారంభించడంతో సమాజంలో సరికొత్త విద్యావేత్తల వర్గం ఆధిక్యత ఆరంభం అయింది. వివిధసంప్రదాయాలకు చెందిన ప్రజల నుండి లెజిస్లేటివ్ కౌంసిల్ కొరకు జాతి ఆధారితంగా ప్రయినిధులు నియమించబడ్డారు. హిందూ, బౌద్ధులుకు క్రిస్టియన్ మిషనరీ ఉద్యమకారులకు వ్యతిరేకంగ విరోధం ఆరంభం అయింది. 20వ శతాబ్దంలో సింహళీయులు, తమిళుల నాయకత్వంతో ఐక్యత కొనసాగింది. కాలనీ నాయకులు రాజ్యాంగ పరమైన సంస్కరణలకు వత్తిడి చేయడంతో 1919లో ప్రధాన సింహళీయ, తమిళ సంస్థలు పొన్నంబలం అరుణాచలం నాయకత్వంలో సమైక్యమై సిలోన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. అయినప్పటికీ ప్రజల మద్దతు లేనప్పటికీ గవర్నర్ మద్దతుతో జాతిఆధారిత కొలంబో స్థానం నిర్ణయించబడడం ద్వారా సింహళ, తమిళుల మద్య విభేదాలు తలెత్తాయి. 1920 నాటికి కాంగ్రస్ కాత్యకలాపాలు స్థభించాయి. 1931లో డోనోఘ్‌మోర్ సంస్కరణలు జాతి ఆధారిత ప్రాతినిధ్యాన్ని నిరాకరించి సార్వజనీన పెద్దల ప్రాతినిత్యం ప్రవేశపెట్టబడిది ( సంస్కరణలకు ముందు ఈ ప్రాతినిధ్యం 4% ) ఉండేది. ఈ సంస్కరణలు తమిళులను కొత్తగా ఏర్పాటు చేయబడిన " స్టేట్ కౌంసిల్ ఆఫ్ సిలోన్ "లో అల్పసంఖ్యాకులుగా మార్చాయని తమిళులు భావించిన తమిళులు సంస్కరణలను తీవ్రంగా విమర్శించారు. 1937లో తమిళ నాయకుడు జి.జి పొన్నంబలం స్టేట్ కౌంసిల్‌లో 50%-50% ప్రాతినిధ్యం (సింహళీయులకు 50% , 50% ఇతర సంప్రదాయకులకు ) కావాలని పట్టుబట్టాడు. అయినప్పటికీ ఈ నిర్బంధం 19444-1945 సంస్కరణలు లక్ష్యపెట్టలేదు.

స్వాతంత్ర్యం

[మార్చు]

1948 ఫిబ్రవరి 4 న సౌల్‌బ్యూరీ నియోజకవర్గానికి స్వాతంత్ర్యం ప్రకటించబడింది. డి.ఎస్ సేనానాయకే మొదటి పధానమంత్రిగా నియమించబడ్డాడు. ప్రముఖ తమిళ , సింహళ నాయకులు మంత్రిమండలిలో భాగస్వామ్యం వహించారు. 1956 వరకు ట్రిన్‌కోన్ మలైలో బ్రిటిష్ నౌకాదళం నిలిచిపోయింది. బియ్యం రేషన్ ఎత్తివేత దేశవ్యాప్త వివాదమై చివరకు ప్రధాని డి సేనానయక రాజీనామాకు దారితీసింది. ఎస్.డబ్ల్యూ.ఆర్.డి బండారు నాయకే 1956లో ప్రధానిగా ఎన్నిక అయ్యాడు. ఆయన 3 సవత్సరాల పాలన తరువాత తనకుతానే " సింహళీ సంస్కృతి రక్షకుడు "గా ప్రకటించుకున్నాడు. ఆయన వివాదాదాదమైన " సింహళ మాత్రమే " ప్రకటించడం సింహళభాషను అధికారిక భాషగా ప్రకటించడు. 1958లో కొంత సవరణలు జరిగినప్పటికీ తమిళులకు తమ భవిష్యత్తు అగమ్యగోచరం అయింది. అది తమిళ భాషకు , సంస్కృతికి గొడ్డలిపెట్టు వంటిదని తమిళులు భావించారు. చట్టానికి వ్యతిరేకంగా ఫెడరల్ సత్యాగ్రహం ప్రారంభింవిది. ఫలితంగా బండరానాయకా తమిళ నాయకుడు ఎస్.జె.వి. చెల్వనాయకంతో సంస్కృతిక సంఘర్షణలు పరిష్కారానికి ఒక ఒప్పందానికి ( బండారనాయకే చెల్వనాయకే పాక్ట్) వచ్చాడు. అయినప్పటికీ నిష్ఫలమయ్యాయి. ఈ ఒప్పందం గురించి ప్రతిపక్షాలు , బౌద్ధమఠాధిపతులు అసంతృప్తి వెలిబుచ్చారు. చట్టంలో పేర్కొనబడిన కాలనీసంబంధిత వివిధ ప్రణాళికలు తమిళ , సింహళ నాయకుల వివాదాలకు కారణమై రాజకీయ అస్థిరతకు దారితీసాయి.

సిరిమావో బండారనాయకే

[మార్చు]
The formal ceremony marking the start of self-rule, with the opening of the first parliament at Independence Square.

1959లో ఒక బౌద్ధఉద్యమకారూడు బండారనాయకేను కాల్చివేసాడు. 1960 లో ఎస్.డబ్ల్యూ. ఆర్.డి బండారనాయకే భార్య సిరిమావో బండారనాయకే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతను చేపట్టారు. బండారనాయకే 1962లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినపోరాటానికి ఎదురునిలిచి నిలబడింది. రెండవ విడత ప్రధానమంత్రిగా పదవీ వహించిన తరువాత ప్రభుత్వ సాంఘిక, ఆర్థిక విధానాలను రూపొందించి అలాగే సోవియట్ మరియూ చైనాలతో సంబధాలను బలపరచబడ్డాయి. 1972లో దేశం శ్రీలంక రిపబ్లిక్ పేరుతో సార్వభౌత్వాధికారంతో కూడిన సరికొత్త స్థాయిని ఏర్పరచుకుంది. సింహళీయులు , తమిళులు జాతివిబేధాలను ఎన్నికలలో ప్రచారస్థంగా ఉపయోగించడం అల్పసంఖ్యాక సమస్యలను తీవ్రం చేసాయి. స్థిరత్వం పేరుతో సిరిమావో బండారనాయకే ప్రభుత్వం చేపట్టిన విశ్వవిద్యాలయ నియామకాలు అసమానతలను రెండింతలు చేసాయి. ప్రభుత్వం సరికొత్తగా చేపట్టిన వెనుకబడిన విద్యార్థులు పైచదువులు సాగించడానికి అవరోధం కలిగించిది.ఫలితంగా తమిళ విద్యార్థులు విశ్వవిద్యాలయస్థాయి కొనసాగించ లేకపోవడం తీవ్రవాదానికి మరింత ఆజ్యం పోసింది. 1975లో జాఫ్నా గవర్నర్ ఆల్ఫర్డ్ దురైయప్పన్ కాల్చివేత పరిస్థితి తీవ్రతకు ఒక చిహ్నంగా మారింది.

జయవర్ధనే

[మార్చు]

జె.ఆర్ జయవర్ధనే 1977లో ప్రజాదరణ కోల్పోయిన " యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం " మీద విజయం సాధించి పదవీబాధ్యతలు చేపట్టారు. తరువాత జయవర్ధనే ధారాణ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ శక్తివంతమైన పాలన కొరకు అధ్యక్షపాలనా విధానం ప్రవేశపెట్టాడు. 1883లో సంప్రదాయక ప్రజల మద్య చెలరేగిన ఉద్రుక్తతలను తమిళ ఈళ స్వాతంత్ర్య పులులు (లిబరలైజేషన్ టగర్స్ ఆఫ్ తమిళ ఈళం) ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమంగా మార్చారు. 1983 జూలైన 1,50,000 తిరుగుబాటుదారులు ఇతరదేశాల ఆశ్రయం కోరుతూ ద్వీపం వదిలి వెళ్ళారు. విదేశీవిధానాలలో ఉన్న లోపాల కారణంగా తమిళ ఈళ పులులు ఆయుధాలను , యుద్ధశిక్షణ సమకూర్చుకుని బలపడ్డారు. 1987లో ఇండో-శ్రీలంకా ఒప్పందం మీద సంతకాలు చేయబడి ఇండియన్ పీస్ కీపింగ్ దళం ఉత్తర శ్రీలంకకు పరిస్థితి సరిచేయడానికి పంపబడింది. అదే సంవత్సరం దక్షిణ శ్రీలంకలో " ఇండియన్ పీస్ కీపింగ్ దళం " వెనుతిరగాలని కోరుతూ తిరుగుబాటు మొదలైంది. 2002 లో నార్వేజియన్ మద్యస్థంతో ఇరు పక్షాలు యుద్ధవిరమణ ఒప్పందం మీద సంతకం చేసారు.

చివరిపోరు

[మార్చు]

2004లో ఆసియన్ " టిసునామీ " ప్రభావానికి 35,000 శ్రీలంక ప్రజలు మరణించారు. 1995 నుండి 2006 శ్రీలంక ప్రభుత్వం , తమిళ తిరుగుబాటుదారులు 4 దఫాలుగా జరిపిన శాంతి చర్చలు నిస్ఫలమయ్యాయి. 2006లో శ్రీలంక ప్రభుత్వం , తమిళ తిరుగుబాటుదారులు కూడదీసుకుని తిరిగి యుద్ధం కొనసాగించారు. 2008 నాటికి ప్రభుత్వం అధికాతికంగా యుద్ధవిరమణ ప్రకటించింది. 2009 అధ్యక్షుడు మహీంద్రా రాజభక్షే ఆధ్వర్యంలో శ్రీలంక సైన్యాలు తమిళ ఈళ పులుల మీద విజయం సాధించాయి. తరువాత శ్రీలంకన్ ప్రభుత్వం దేశమంతటినీ తన స్వాధీనానికి తీసుకుంది. 26 సంవత్సరాల సంఘర్షణలో దాదాపు 60,000-1,00,000 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. 4,000 తమిళ ప్రజలు చివరిదశలో శ్రీలంకలో సాగిన అంతర్యుద్ధంలో మరణించారు. యు.ఎన్ సెక్రెటరీ జనరల్ బ్యాన్ కి-మూన్ మాటలలో " అతర్యుద్ధంలో మరణించిన తమిళుల సంఖ్య ఇంకా పరిశీలించి నిర్ధారించవలసిన అవసరం ఉందని " అభిప్రాయం వెలువడింది. తమిళ ఈళ ఓటమి తరువాత " తమిళ నేషనల్ అలయంస్ " ప్రత్యేక రాష్ట్ర కోరికను వదులివేసింది. 2,94,000 మందిని తరలిస్తూ చివరి పోరు ముగింపుకు వచ్చింది. 2011లో పునరావాస మంత్రిత్వశాఖ 6,651మందిని మాత్రం శిబిరాలలో వదిలి మిగిలిన ప్రజలు వారి, వారి నివాసాలకు తిరిగివెళ్ళారు. శ్రీలంక 26 సంవత్సరాల అంతర్యుద్ధం తరువాత శ్రీలంక తిరిగి ఆర్థికాభివృద్ధి వైపు వేగవంతమైన నడక సాగించింది.

భౌగోళికం , వాతావరణం

[మార్చు]
A roughly oval island with a mountainous center
శ్రీలంక యొక్క నైసర్గిక రేఖా చిత్రం.
View of Sri Lanka from the Space Shuttle.
A view of Sripada from Maskeliya.

శ్రీలంక ద్వీపం హిందూ మహాసముద్రం లో, హిందూమహాసముద్రానికి ఈశాన్య దిక్కులో ఉంది. భంగాళాఖాతానికి అగేయదిశలో ఉంది. భారత ఉపఖండాన్ని, 5°, 10°, అక్షాంశ, రేఖాంశాలలో ఉంది. పాక్, మన్నర్ జల సంధి (గల్ఫ్ ఆఫ్ మన్నార్) శ్రీలంకని భారతపఖండం నుండి వేరు చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో, భారత ఉపఖండాన్ని, శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్ళ వంతెన కట్టబడిందని ప్రతీతి. అది ప్రస్తుతం సున్నపురాతి రాశిగా కనిపిస్తుంది. తరువాతి కాలంలో తుఫానులు సముద్రాన్ని లోతుచేసాయని భావిస్తున్నారు. పాక్ జల సంధి యొక్క వెడల్పు చాలా తక్కువ అయినందువల్ల రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. కన్నీటి చుక్క ఆకారం ఉన్న ఈ ద్వీపపు భూవృత్తాంతము ఎక్కువగా చదునుగా ఉంటుంది. పర్వతాలు దక్షిణ మధ్య ప్రాంతంలోనే కనిపిస్తాయి. పర్వతశ్రేణుల్లో చెప్పుకో దగ్గవి శ్రీ పద (ఆడమ్స్ పీక్), దేశంలోనే ఎత్తైన పర్వతం పిధురుతాలంగళ (2,524 మీటర్లు). మహావేలీ నది అధిక శాతం నీటిని సరఫరా చేస్తుంది. ఇది దాదాపు 1480 ఎ.డిలో నిర్మించబడి ఉండచ్చని భావిస్తున్నారు.

వాతావరణం

[మార్చు]

శ్రీలంక ద్వీపంలో చదునైన తీరప్రాంతమైదానాలు అధికంగా ఉన్నాయి. దక్షిణ మద్యప్రాంతాలలో మాత్రమే పర్వతపంక్తులు ఉన్నాయి. సముద్రమట్టానికి 2,524 మీటర్లు (8,281అడుగులు )ఎత్తులో ఉన్న పిదురుతలగల పర్వతశిఖరం ద్వీపంలో అత్యంత ఎత్తైన ప్రాంతమని భావిస్తున్నారు. సముద్రపుగాలులు మితంగా వీచేసమయంలో ఉష్ణమండల వెచ్చని వాతావరణం కలిగి ఉంటుంది. మద్యలో ఉండే ఎగువభూములలో 17°సెంటీగ్రేడ్ (62.6 °ఫారెంహీట్) సుమారుగాఉంటుంది. అలాగే శితాకాలలో ఇక్కడ గడ్డకట్టిన మంచుకూడా పేరుకుంటుంది. ఇతర దిగువభూములలో ఉష్ణోగ్రతలు 33°సెంటీగ్రేడ్ (91.4°ఫారెంహీట్), సంవత్సర సరాసరి ఉష్ణోగ్రత 28°సెంటీగ్రేడ్ (82.4 °ఫారెంహీట్) నుండి 31° సెంటీగ్రేడ్ (87.8 °ఫారెంహీట్) ఉంటుంది. రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు 14° సెంటీగ్రేడ్ (25.2°ఫారెంహీట్) నుండి 18° సెంటీగ్రేడ్ (32.4 °ఫారెంహీట్) వ్యత్యాసం కలిగి ఉంటుంది.

వర్షపాతం

[మార్చు]

హిందూమహాసముద్రం, బంగాళాఖాతం నుండి వీచే ఋతుపవనాల ఆధారంగా వర్షపాతం ఉంటుంది. మద్య ఎగువభూములలో ఉన్న తడిభూములు, ఏటవాలు భూములలో ప్రతిమాసం 2,500 మిల్లీమీటర్ల (98.4 అంగుళాల) వర్షపాతం ఉండగా తూర్పు, ఈశాన్య ఏటవాలుభూములలో వర్షపాతం స్వల్పంగా ఉంటుంది. తూర్పు ప్రాంతంలో అధికభాగం ఉత్తర భూభాగంలో 1,200 మిల్లీమీటర్ల వర్షపాతంతో (47 అంగుళాల), 1,900 మిల్లీమీటర్ల వర్షపాతంతో (95 అంగుళాల) మద్య సంవత్సర వర్షపాతంతో తడిలేని భూములుగా ఉన్నాయి. అ నిర్జల వాయవ్య, ఆగ్నేయ తీరభూములలో అత్యల్పంగా 800 మిల్లీమీటర్ల వర్షపాతంతో (31అంగుళాల) నుండి 1,200 మిల్లీమీటర్ల వర్షపాతంతో (47 అంగుళాల) సరాసరి సంవత్సర వర్షపాతం ఉంటుంది. ద్వీపంలోని వాయవ్య, నైరుతి, తూర్పుభాగాలలో కాలానుగత గాలివానలు సంభవిస్తూ కొన్నిసమయాలలో తుఫానుల కారణంగా ఆకాశం మేఘావృతమై భారీవర్షాలు కురుస్తుంటాయి. సాధారణంగా ఆగ్నేయప్రాంతం, పర్వతప్రాంతాలలో వర్షపాతం ఆధారంగా గాలిలోతేమ అధికంగా ఉంటుంది.

నదులు

[మార్చు]

దేశంలో 103 నదులు ఉన్నాయి. మహావెలి నది వీటిలో అయి పొడవైనది. మహావెలి నది పొడవు 335 కిలోమీటర్లు (208 మైళ్ళు). ఈ నదీప్రవాహం 10 మీటర్లు అంతకంటే ఎత్తైన 51 సహజసిద్ధ జలపాతాల సృష్టికి మూలకారణంగా ఉంది. ఈ జలపాతాలలో అత్యంత ఎత్తైనది 263 మీటర్ల (863 అడుగుల) ఎత్తైన బంబరకాండ జలపాతం. శ్రీలంకా సముద్రతీరం మొత్తం పొడవు 1,585 కిలోమీటర్లు. 200 నాటికల్ కిలోమీటర్ల విశిష్టమైన వాణిజ్య జలభాగం శ్రీలంక ఆధీనంలో ఉంది. ఈ జలభాగం వైశాల్యం దేశవైశాల్యం కంటే 6.7 రెట్లు అధికంగా ఉండడం విశేషం. తీరప్రాంతాలు దానిని ఆనుకుని ఉన్న సముద్రజాలాలు పగడపు దీవులు, షాలో దిబ్బలు, దట్టంగా ఉన్న సముద్రపు గడ్డి వంటి సమృద్ధమైన సముద్రపర్యావరణానికి దోహదంచేస్తుంది. శ్రీలంకలో 45 నదీముఖాలు, 40 నీటి మడుగులు ఉన్నాయి. వీటి వైశాల్యం 7,000 హెక్టార్లు. 2004 హిందూమహాసముద్రంలో సంభవించిన టీ సునామీ సమయంలో ఈ జలాశయాలు ప్రముఖపాత్ర వహించాయి. శ్రీలంక ఇల్మేనైట్, ఫెల్స్పార్, గ్రాఫైట్, సిలికా, చైన మట్టి, మైకా, థోరియం వంటి ఖనిజ సంపన్నమై ఉంది. మన్నార్ గల్ఫ్ లో పెట్రోలియం ఉనికి కూడా నిర్ధారించబడడమే కాక వెలికితీత ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]
The Sri Lankan Leopard (Panthera pardus kotiya) is an endangered subspecies of leopard native to Sri Lanka.

భారతీయమలయా భూభాగంలో ఉపస్థితమై ఉన్నందున శ్రీలంక వైవిధ్యమైన ఉష్ణమండల వాతావరణం దేశాలలో ఒకటిగా ఉంది. వైశాల్యంలో చిన్నదేశం అయినప్పటికీ శ్రీలంక ఆసియాలో అత్యధిక వైవిధ్యమైన వాతావరణం కలిగిఉంది. శ్రీలంకలోని వృక్షజాలం, జంతుజాలం కూడా బృహత్తర స్థాయిలో వైవిధ్యం కలిగిఉంది. 3,210 పుష్పించే జాతి వృక్షాలలో 27%, క్షీరదాలలో 22% శ్రీలంకలో ఉండడం ఒక ప్రత్యేకత. శ్రీలంక 24 వన్యప్రాణి సంరక్షణారణ్యాలను ప్రకటించింది. వీటిలో స్థానిక జంతుజాలం అత్యధికంగా శ్రీలంకలో ఉంది. ఆసియన్ ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, చిన్న లోరిస్, జింకలు, ఉదా రంగు లాంగూర్, అంతరించి పోతున్న బోయర్, ముళ్ళపందులు, చీమలభక్షిణులు ( ఏంట్‌ఈటర్) ఉన్నాయి.

జాఫ్నాలో వృక్షజాలం

[మార్చు]
The శ్రీలంక ఏనుగు

సారహీనమైన జాఫ్నా ద్వీపంలో అధికంగా పుష్పించే తుమ్మచెట్లు అధికంగా ఉన్నాయి. ఆరినభూమి అరణ్యాల మద్య విలువైన సాటిన్ వుడు, నల్లచేవ మాను, ఈరన్‌వుడ్, మహోగనీ, టేకు చెట్లు కూడా ఉన్నాయి. తడి భూములలో ఉష్ణమండల సతతహరితారణ్యాలు పొడవైన చెట్లు, బోర్డ్ ఫాయిలేజ్, దట్టంగా పెరిగిన ద్రాక్ష, ఇతర లతలు ఉన్నాయి. సమశీతోష్ణ సతతహరితారణ్యాలలో ఉండే వృక్షాలవంటివి పర్వతవాతప్రాంతాలలో ఉన్నాయి. ఈశాన్యంలో ఉన్న " యాలా నేషనల్ పార్క్ "లో ఏనుగుల మందలు , నెమళ్ళు సంరక్షించబడుతున్నాయి. ఈశాన్యంలో ఉన్న నేషనల్ పార్కులలో అతిపెద్దదైన " ది విల్‌పట్టు నేషనల్ పార్క్ " కొంగలు, గూడబాతులు, కంకణాలు,, కొంగ వంటి అనేక నీటిపక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ద్వీపంలో : బండ్లా, హుర్లూ అభయారణ్యం, ది కన్నెలియా-డేదియాగలా-నకియదేనియా, సింహరాజా అనే 4 జీవావరణ సంరక్షణాకేంద్రాలు ఉన్నాయి. సింహరాజా అభయారణ్యంలో 26 స్థానిక పక్షిజాతులు, 20 వర్షారణ్య జాతి పక్షులు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన రెడ్ ఫేస్డ్ మల్‌కోహా, ది గ్రీన్-బిల్లెడ్ కాకల్, శ్రీలంకా బ్లూమాగ్పీ ఉన్నాయి.

అభయారణ్యాలు

[మార్చు]

శ్రీలంకలో ఎవరూ స్పృజించని వృక్షజాతులు అనేకం ఉన్నాయి. చెట్లసంబంధిత జాతిలు 211 ఉండగా అభయారణ్య పరిధిలో లియానాస్ లేక స్థానిక జాతి వృక్షాలు 139 ఉన్నాయి. చెట్లు, పొదలు, ఔషధమొక్కలు, మొలకలు కలిపి హెక్టారుకు 2,40,000 చెట్లు ఉంటాయని అంచనా. మిన్నెలేకా సరసు, సరసు తీరంలో ఉన్న మిన్నేరియా నేషనల్ పార్క్ ఇక్కడ విస్తారంగా ఉన్న ఏనుగులకు అవసరమైన నీటి, ఆహార వనరుగా ఉన్నాయి. సరోవర ప్రాంతం ఏనుగులు గుంపులు గుంపులుగా కూడిజీవించడానికి ఇది సహజాధారంగా ఉంది. ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో సరసులో నీరు కొంచెంకొంచెంగా తగ్గుముఖం ఔతుంది. ఈ సమయంలో ఉష్ణమండల సతతహరిత మొక్కలైన రాక్షస వెదురు, పర్వత గరిక జాతులు, పచ్చిక బయళ్ళు జీవం పోసుకుంటాయి.శ్రీలంకలో 250 జాతుల స్థానిక పక్షులు ఉన్నాయి. శ్రీలంక ప్రభుత్వ ఆధ్వర్యంలో కుమానా వంటి పక్షుల సంరక్షణాలయం ఏర్పాటు చేయబడింది. 1970-1980 మహావెలీ సమయంలో శ్రీలంక ప్రభుత్వం ఉత్తర శ్రీలంక ప్రాంతంలో 1,900 చదరపు కిలోమీటర్ల భూమిని నేషనల్ పార్క్ ఏర్పాటుకు మంజూరు చేసింది. ఏదిఏమైనప్పటికీ 1920లో దేశవైశాల్యంలో 49% అరణ్యాలు ఆక్రమించి ఉండగా 2009 నాటికి 24% స్థాయికి తగ్గొంది.

విదేశీ సంబంధాలు , సైన్యం

[మార్చు]
President Mahinda Rajapaksa with Russian President Dmitry Medvedev, at St. Petersburg Economic Forum, in June 2011.

అలీనోద్యమ (ఎన్.ఎ.ఎం) దేశాలలో శ్రీలంకకు సభ్యత్వం ఉంది. ఒకవైపు స్వాతంత్ర్యం కాపాడుకుంటూనే శ్రీలంక భారతదేశంతో సత్సంబంధాలను మెరుగుపాచుకుంటుంది. 1955లో శ్రీలంకా ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందింది. ప్రస్తుతం శ్రీలంక కామంవెల్త్ దేశాలలో కూడా సభ్యత్వం కలిగిఉంది. ప్రస్తుతం శ్రీలంక సార్క్ (ఎస్.ఎ.ఎ.ఆర్.కె), ది వరల్డ్ బ్యాంక్, ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ది ఏషియన్ డెవాప్మెంట్ బ్యాంక్, కొలంబో ప్లాన్ లలో సభ్యత్వం కలిగి ఉంది. శ్రీలంక స్వాతంత్ర్యం పొందిన తరువాత అధికారంలో ఉన్న రెండు ప్రధానపార్టీలలో " ది యునైటెడ్ నేషనల్ పార్టీ " పశ్చిమదేశాలకు అనుకూలంగా ఉండగా దానికి మద్దతు ఇస్తున్న వామపక్ష పార్టీ తూర్పు దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. 1950లో శ్రీలంకా ఆర్థిక మంత్రి జె.ఆర్ జయవర్ధనే ఆస్ట్రేలియన్ విదృశాంగ మంత్రి సర్ పెర్సీ స్పెంసర్ కొలంబోలో జరిగిన కామంవెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కొలంబో ప్లాన్ ప్రతిపాదన చేసాడు. 1951లో శాన్ ఫ్రాన్సిస్కో శాంతి సమావేశంలో పలుదేశల అయిష్టత అసమ్మతి మద్య రెండవప్రపంచ యుద్ధసమయంలో నష్టపరిహారం ఇవ్వడం నుండి జపాన్ దేశాన్ని విడిపించాలని వాదించింది. జపాన్ ఆర్థికరంగానికి ఈ ఒప్పందం హాని చేస్తుందని శ్రీలంక భావించడమే ఇందుకు కారణం. 1949లో పి.ఆర్.సి రూపుదిద్దుకోగానే చైనా- శ్రీలంకల మద్య సత్సంబధాలు ఆరంభమయ్యాయి. 1952లో చైనా-శ్రీలంక రబ్బర్-బియ్యం ఒప్పందం మీద సంతకం చేసాయి. 1955లో ఆసియన్ - ఆఫ్రికన్ సమావేశంలో శ్రీలంక ముఖ్యమైన పాత్రవహించింది. అది ఎన్.ఎ.ఎం స్పష్టతకు ముందడుగు వేయడానికి ఉపకరించింది.

1956 శ్రీలంకలో బండారనాయకే ప్రభుత్వం గతంలో యు.ఎన్.పి ప్రభుత్వం అనుసరించిన పాశ్చాత విధానాలలో మార్పులను ప్రవేశపెట్టింది. 1959లో శ్రీలంక ఫిడేల్ కాస్ట్రో అధ్యక్షత వహించిన క్యూబాకు గుర్తింపు ఇచ్చింది. తరువాత స్వల్పకాలంలోనే క్యూబా తిరుగుబాటు నాయకుడు ఎమెస్టో చీ గ్యువారా శ్రీలంకకు పర్యటించాడు. భారతీయపూర్వీకత కలిగి శ్రీలంకలో దీర్ఘకాలంగా తోటపని వారి స్థితిని నిర్ణయించడానికి వివాదాల పరిస్కారానికి 1964లో " ది సిరిమా - షస్త్రి ఒప్పందం, 1974లో సిరిమా - గాంధీ ఒప్పందం మీద శ్రీలంక, భారతీయ నాయకుల సమక్షంలో సంతకాలు చేయబడ్డాయి. 1974లో పాక్ జలసంధిలో ఉన్న కచ్చదీవు అధికరయుతంగా శ్రీలంకకు స్వాధీనం చేయబడింది. ఈ కాలంలో శ్రీలంక అలీనోద్యమం కొరకు తీవ్రంగా అలీనోద్యమ సమావేశం కొలంబోలో జరగడానికి కృషిచేస్తూ. జయవర్ధనే అధ్యక్షతలో శ్రీలంక, భారతదేశం మద్య సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 1987లో భారతదేశం శ్రీలంక అంతర్యుద్ధంలో జోక్యం చేసుకొనవలసిన పరిస్థితి ఎదురుకావడమే కాక భారతదేశం శాంతిదళాలను శ్రీలంకకు పంపవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక, చైనా,రష్యా, పాకిస్తాన్ల మద్య సర్వామోదిత సుహృద్భావ వాతావరణం నెలకొని ఉంది. శ్రీలంక సైనికదళాలను శ్రీలంకసైన్యం అనివ్యవహరిస్తారు. శ్రీలంక వాయుసేన రక్షణమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సైనిక సేవలలో నియమితులైన వారి సంఖ్య 2,59,000. వీరిలో 36,000 మంది రిజర్వ్ దళాలలో ఉన్నారు. శ్రీలంకలో నిర్భంధ సైనిక శిక్షణ అమలులో లేదు. పారా మిలటిరీ దళాలలో అంతర్భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ శ్రీలంకా కోస్టల్ గార్డ్స్ ఉంటారు.

సైన్యం

[మార్చు]

1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సైనికదళాల ప్రధానబాధ్యతలలో అతర్గతరక్షణ, రెండు మార్కిస్ట్ తిరుగుబాటు (జె.వి.పి) దారులు, 30 సంవత్సరాల కాలంగా సాగుతున్న 32 దేశాలలో బహిష్కరించిన ఈళపులుల తిరుగుబాటుదారుల అణిచివేత. 30 సంవత్సరాలుగా సైనికదళాలు నిరంతరాయంగా ఒకప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించబడుతూనే ఉన్నాయి. 2009 మే మాసంలో శ్రీలంక సైన్యాలు అంతర్యుద్ధానికి ముగింపు తీసుకు వచ్చిన తరువాత ఆధునిక శ్రీలంక సైన్యం శక్తిసామర్ధ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. 1960 నుండి శ్రీలంక సైన్యాలను ఐక్యరాజ్యసమితి శాంతిదళాలతో చాద్, లెబనాన్, హైతి వంటి దేశాలలో నిరంతరం నియమిస్తూనే ఉంది.

ఆర్ధికరంగం

[మార్చు]
Graphical depiction of Sri Lanka's product exports in 28 colour-coded categories

ఇంటర్నేషనల్ మాంటరీ ఫండ్ నిఏదికలను అనుసరించి 2010 శ్రీలంక దేశీయ ఉత్పత్తి 590 కోట్ల అమెరికన్ డాలర్లు. శ్రీలంక జి.డి.పి 1,160 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని అధికం చేస్తుంది. 2011 శ్రీలంక జి.డి.పి 8.3% పెరిగింది.

ఎగుమతులు దిగుమతులు

[మార్చు]

19వ, 20వ శతాబ్ధాలలో మొక్కల పెంపకం శ్రీలంక ఆర్థిక రంగానికి ఎంతగానో సహకరించింది. యాలకులు, రబ్బర్, దేశీయ ఎగుమతులలో ప్రధానపాత్ర వహిస్తున్న సిలోన్ టీ ముఖ్యమైనవి. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించబడిన నౌకాశ్రయాలు ద్విపాన్ని వ్యూహామకంగా వాణిజ్యకేంద్రంగా మార్చాయి. 1948 నుండి 1977 వరకు ప్రభుత్వవిధానాలను సోషలిజం బలంగా ప్రభావితం చేసింది. కాలనీ మొక్కల తోటలు విచ్ఛిన్నం చేయబడ్డాయి. పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. దేశంలో 1977లో ప్రైవేటీకరణ, నియంత్రణ సడలింపు, ప్రైవేట్ సంస్థల ప్రమోషన్ వంటి అంశాలతో స్వేచ్ఛా విఫణి ఆర్థికవిధానం ప్రవేశపెట్టబడింది..ఒకవైపు టీ ఉత్పత్తి, ఎగుమతి, రబ్బర్, కాఫీ, చక్కెర, ఇతర వస్తువులు వాణిజ్యంలో ముఖ్యత్వం వహిస్తున్నా, ఆహారతాయారీ, వస్త్రాలు, సమాచారరంగం, ఫైనాంస్ వంటి పరిశ్రాలకు సంస్థలకు ముఖ్యత్వం ఇవ్వబడింది. దేశం ప్రధాన ఆదాయవనరులలో పర్యాటకరంగం, టీ ఎగూతి, బియ్యం తయారీ, ఇతర వ్యవసాయోత్పత్తులు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా విదేశీ ఉద్యోగాల ( ప్రత్యేకంగా మద్య ఐరోపా) ద్వారా దేశానికి అవసరమైన విదేశీమారకం లభిస్తుంది. 2010 గణాంకాలను అనుసరించి సేవారంగం జి.డి.పిలో 60%, పారిశ్రామిక రంగం ద్వారా 28% వ్యవసాయరంగం 12% భాగస్వామ్యం అహిస్తుంది. ఆర్థికరంగంలో 85% ప్రైవేట్ యాజమాన్యం ఆధీనంలో ఉంది. శ్రీలంకతో వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భూభాగపరంగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. జి.డి.పి అభివృద్ధిలో పడమటి భూభాగాలు 45.1% భాగస్వామ్యం వహిస్తుండగా, దక్షిణ, మద్య భూభాగాలు వరుసగా 10.7%, 10% భాగస్వామ్యం వహిస్తున్నాయి. 2010లో యుద్ధం ముగిసేనాటికి ఉత్తరభూభాగ జి.డి.పి అభివృద్ధి 22.9% మని నమోదైంది. శ్రీలంకా ఎగుమతులలో ప్రధానపాత్ర వహిస్తున్న సిలోన్ టీ ప్రపంచంలో " క్లీనెస్ట్ టీ "గా ప్రసిద్ధి చెందింది. అంతేకాక శ్రీలంకా టీ ఉతపత్తి ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.

ప్రజాజీవిత ఆదాయ వివరాలు

[మార్చు]

2005 నుండి శ్రీలంకా తలసరి ఆదాయం రెండింతలు అయింది. అదేసమయం పేదరికం 7.2% నుండి 4.9% తగ్గడం గుర్తించతగిన విషయం. సి.ఇ.ఎస్.లో పెట్టుబడులు 4 రెట్లు కాగా అలాగే ప్రణాళికలోటు రెండింతలు అయింది. శ్రీలంక ప్రజలలో 87.3% మందికి రక్షితనీటి వసతి లభిస్తుండగా వారిలో 39% ప్రజలకు పైపుల ద్వారా నీటిని పొందుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆర్థిక అసమానతలు కూడా తగ్గుముఖం పట్టాయి.2005-2010 నాటికి సెల్‌ఫోన్ వాడకందారుల సంఖ్య 550% అభివృద్ధి చెందింది. దక్షిణాసియాలో మూడవతరం (3జి), 3.5జి హెచ్.ఎఫ్.యు.పి.ఎ, 4జి ఎల్.టి.ఇ మొబైల్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ ప్రవేశపెట్టిన దేశాలలో శ్రీలంక ప్రథమస్థానం వహిస్తుంది.

అంతర్జాతీయంగా దేశస్థాయి

[మార్చు]

పోటీతత్వంలో శ్రీలంక 142 ప్రపంచదేశాలలో 52వ స్థానంలో, ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో 45 వ స్థానంలో ఉంది, వ్యాపారాభివృద్ధిలో 32 స్థానంలో ఉంది, సరికొత్త పరిశోధనలకు 42 వ స్థానంలో ఉంది, వస్తువిక్రయంలో 31వ స్థానంలో ఉంది. సంఘజీవితంలో సంతృప్తికరం, దానధర్మాల ప్రాధాన్యమిస్తున్న దేశాలలో శ్రీలంక ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. 2010 లో న్యూయార్క్ టైంస్ దర్శనీయ ప్రదేశాలలో శ్రీలంక అత్యుత్తమ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నది. డౌజోంస్ 2010 నుండి అభివృద్ధిచెందుతున్న దేశాలవరుసలో శ్రీలంకను పేర్కొనగా,2011లో సిటీగ్రూపు క్లాసిఫైడ్ శ్రీలంకను 3జి దేశంగా పేర్కొన్నది. దక్షిణాసియా దేశాలలో మానవవనరులకు శ్రీలంక ఉత్తమ స్థాయిలో ఉంది.

ఆరోగ్యం

[మార్చు]

ఐదు సంవత్సరాలలో పేదరికం 50% తగ్గుముఖం పట్టినా పిల్లలలో పోషకాహార లోపం సమస్యగానే మిగిలిపోయింది. 5% సంవత్సరాలకు లోబడిన పిల్లలలో 29% బరువు తక్కువ సమస్యతో బాధపడుతున్నారు, 6-11 మాసాలమద్య శిశువులలో 58%, 12-20 మాసాల శిశువులలో 38% రక్తహీనతతో బాధపడుతున్నారు. డెంగ్యూ అంటు వ్యాధులలో ప్రధానమైనదిగా ఉన్నది, ఆరూగ్యహీనత,బలహీనం, దురితమరణం 85% శిశువులను వేధిస్తుంది. శ్రీలంక ప్రజల సగటు ఆయిర్ధాయం 77.9 సంచత్సరాలు. ప్రపంచ సరాసరి కంటే ఇది 10% అధికం. శిశుమరణాల నిషోత్తి 1000:8.5. ప్రసవసమయంలో మాతృ మరణాల నిష్పత్తి 1000.039%. ఇది అభివృద్ధిచెందుతున్న దేశాలకు సమానం.

రవాణా

[మార్చు]

శ్రీలంక రహదారులలో మొదటిస్థాయి రహదార్ల సంఖ్య 35, అలాగే దేశాన్నంతటినీ అనుసంధానం చేసే రహదారి ఒకటి ఉంది. శ్రీలంక రైలుమార్గం మొత్తం పొడవు 1,447 కిలోమీటర్లు ( 900 మైళ్ళు). శ్రీలంకలో కొలంబో, గల్లే, ట్రింకోన్ మలై లలో 3 డీప్-వాటర్ పోర్ట్లులు ఉన్నాయి. అదనంగా హంబన్‌తోట వద్ద సరికొత్త నౌకాశ్రయం నిర్మాణదశలో ఉంది. ట్రింకోన్ మలై నౌకాశ్రయం ప్రపంచం లోని సహజసిద్ధ నౌకాశ్రయాలలో 6వ స్థానంలో ఉంది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ నౌకాదళం అంతా ఈ నౌకాశ్రయంలో నిలిపి ఉంచబడ్డారు. శ్రీలంక విమానాల మీద శ్రీలంక జండా ముద్రితమై ఉంటుంది. యు.ఎస్, చైనాలు చేసిన 200 లక్షల అమెరికన్ డాలర్ల సహాయంతో స్పేస్ అకాడమీ స్థాపించబడింది. స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపించే ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. అలాగే మిస్సైల్ సాంకేతిక అభివృద్ధిచేయడానికి ఇది ఉద్దేశించబడింది.

గణాంకాలు

[మార్చు]
Population growth in Sri Lanka.

శ్రీలంక ప్రపంచదేశాలలో జనసాధ్రతలో 57వ స్థానంలో ఉంది. సవత్సర జనసంఖ్యాభివృద్ధి 0.73. శ్రీలంక జననాల నిష్పత్తి 1000:17.6, మరణాల నిష్పత్తి 1000:6.2. పడమటి శ్రీలంక జనసాంద్రత అత్యధికంగా ఉంది ప్రత్యేకంగా రాజధాని కొలంబో లోపల, వెలుపల మరీ అధికంగా ఉంటుంది. దేశంలో సింహళీయుల సంఖ్య 74.88%. మొత్తం జనసంఖ్యలో సంప్రదాయక ప్రజలసంఖ్యలో సింహళీయులు మొదటి స్థానంలో ఉన్నారు. శ్రీలంక తమిళులు 11.2%తో సంప్రదాయక ప్రజలసంఖ్యలో రెండవ స్థానంలో ఉన్నారు. శ్రీలంకన్ గిరిజనుల సంఖ్య 9.2%. శ్రీలంకలోని భారతీయ సంతతికి చెందిన తమిళులను బ్రిటిష్ ప్రభుత్వం మొక్కల పెంపకం పనులు చేయడానికి ఇక్కడకు తీసుకువచ్చారని అంచనా. వారిలో 50% ప్రజలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1948లో తిరిగి భారతదేశానికి పంపబడ్డారని భావించబడుతుంది. శ్రీలంకలోని తమిళులు దీర్ఘకాలం నుండి ఇక్కడే నివసిస్తున్నారు. శ్రీలంకలో బర్గర్స్ సంప్రదాయక ప్రజలు ( ఐరోపా సంతతికి చెందిన మిశ్రిత వర్గం), దక్షిణాసియాకు చెందిన ఆస్ట్రోనేషియన్ ప్రజలు కూడా గుర్తించతగినంతగా ఉన్నారు. శ్రీలంక స్థానిక ప్రజలు అని విశ్వసించబడుతున్న వేదాప్రజలు కూడా స్వల్పంగా ఉన్నారు.

నగర జనాభా వివరాలు

[మార్చు]
జాఫ్నా
కొలంబో
గల్లె
క్యాండీ
  • పడమర కొలంబో 752,933 ( 1వ స్థానం)
  • దేహివల - పడమర లవినియ 245,974 (2వ స్థానం)
  • పడమర మరోతువ 207,755 (3వ స్థానం)
  • పడమర శ్రీ జయవర్ధనే కోట 135,806 (4వ స్థానం)
  • పడమర నెగోంబో 127,754 ( 5వ స్థానం)
  • మధ్య క్యాండీ 125,351 (6వ స్థానం)
  • తూర్పు కాల్మునై 106,783 ( 7వ స్థానం)
  • ఉత్తర వవున్యా 99,653 (8వ స్థానం)
  • దక్షిణ గల్లే 99,478 (9వ స్థానం)
  • తూర్పు త్రికోణమలై 99,135 (10వ స్థానం)
  • తూర్పు బాటికలోయా 92,332 (11వ స్థానం)
  • ఉత్తర జాఫ్నా 88,138 (12వ స్థానం)
  • పడమర కతునాయకే 76,816 (13వ స్థానం)
  • మద్య డంబుల్లా 68,821 (14వ స్థానం)
  • పడమర కొలోన్నవా 64,887 (15వ స్థానం)
  • ఉత్తర మధ్య అనూరాధపురా 63,208 (16వ స్థానం)
  • ఎంబిలిపిటియ సబరగమువ 58,371 (17వ స్థానం)
  • రత్నపుర సబరగమువ 52,170 (18వ స్థానం)
  • బడుల్లా ఉవా 47,587 (19వ స్థానం)
  • దక్షిణ మాతరా 47,420 (20వ స్థానం)
Distribution of languages and religious groups in Sri Lanka according to the 1981 census.

శ్రీలంకలో సింహళం, తమిళం అధికారభాషలుగా గుర్తింపు పొందాయి. దేశమంతటా ఆంగ్లభాషను ప్రజలు అనుసంధాన భాషగా ఉపయోగిస్తుంటారు. విద్యా, సైన్సు .అరియు వ్యాపార రంగాలలో ఆంగ్లం విరివిగా మాట్లాడబడుతుంది. బర్గర్ సంతతి ప్రజలు ప్రత్యేకరూపంలో ఉండే పోర్చ్ గీస్ క్రియోల్, డచ్ మాట్లాడుతుంటారు. అలాగే దేసమంటా ఉన్న మలాయ్ ప్రజలు ఒకవిధమైన క్రియోల్ మలాయ్ మాట్లాడుతున్నారు.

శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది తరవాడా బుద్ధిజానికి చెందిన వారు. బౌద్ధులలో అత్యధికులు సింహళ సంప్రదాయానికి చెందిన ప్రజలు. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్దంలో గౌరవనీయులైన మహీందా చేత బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. బుద్ధునికి ఙానోదయం అయిన బోధివృక్షం నుండి తీసుకురాబడిన మొక్కను తీసుకురాబడింది. శాబ్ధికంగా మాత్రమే అచరించబడుతున్న పాలి కెనాన్ (త్రిపీఠిక) కు శ్రీలంకలో క్రీ.పూ 30లో లిఖితరూపం ఇవ్వబడింది. బుద్ధమతం నిరంతరాయంగా ఆచరించబడుతూన్న దేశాలలో శ్రీలంక ప్రథమస్థానంలో ఉంది. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్దంలో ఆరంభించబడిన సంఘ గురుశిష్య సంప్రదాయం ఆటంకం లేకుండా నిరంతరంగా కొనసాగుతుంది. క్షీణదశలో ఉన్నకాలంలో శ్రీలంక మతపరమైన గురుశిష్య వారసత్వం తాయ్‌లాండ్, బర్మా దేశాల సహకారంతో కొనసాగించబడింది. శ్రీలంకలో బుద్ధిజానికి ప్రత్యేక గుర్తింపు లభించడమే కాక " బుద్ధమతానికి శ్రీలంకలో " రక్షణ, పోషణ " లభిస్తుంది.

The Temple of the Tooth, built during the 16th century, is the focal point of Buddhism in Sri Lanka.

శ్రీలంకలో హిందూమతం రెండవ స్థానంలో ప్రాబల్యం వహిస్తున్నది. అంతేకాక హిందూమతం బుద్ధమతాని కంటే పురాతనమైంది. ప్రస్తుతం తూర్పు, మద్య శ్రీలంకలో హిందూమతం ఆధిక్యతవహిస్తింది. తమిళులు ప్రధానంగ హిందూమతాన్ని అవలంబిస్తున్నారు. దేశంలో మూడవ స్థానంలో ఉన్నది ఇస్లాం మతం. దేశంలోఇస్లాం మతాన్ని మొదటిసారిగా సా.శ. 7వ శతాబ్దంలోంఅరబ్ వ్యాపారులు ఆరంభించారు. ముస్లిం మతస్థులలో అత్యధికులు షాఫీసంప్రదాయాన్ని అనుసరిస్తున్న సూఫీమతస్థులు. శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న ముస్లిములు అరబ్, శ్రీలంక దంపతులకు జన్మించినవారని అంచనా.

Dating from the 10th century, the Nallur Kandaswamy Kovil in Jaffna is one of the most sacred places for Hinduism in Sri Lanka.

16వ శతాబ్దంలో పశ్చిమదేశాలు శ్రీలంకలో క్రిస్టియానిటీని ప్రవేశపెట్టాయి. శ్రీలంక ప్రజలలో 7.4% ప్రజలు క్రిశ్టియన్లు. వీరిలో 82% రోమన్ కాథలిక్కులు. మిగిలిన వారు ఆంగ్లికన్ చర్చరియు ప్రోటెస్టెంట్ వర్గానికి చెందిన వారు. శ్రీలంకలో స్వల్పంగా భారతదాఏశానికి చెందిన జోరాస్ట్రియన్ వలస ప్రజలు నివసిస్తున్నారు. వీరు బ్రిటిష్ పాలనా కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నట్లు అంచనా. అయినా వారిసంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది. శ్రీలంక ప్రజాజీవితంలో మతం అతిముఖ్యమైన పాత్రవహిస్తుంది. బౌద్ధులు చాంద్రమాసానికి ఒకసారి పొయా దినం అనుసరిస్తుండగా, హిందువులు, ముస్లిములు వారి వారి ప్రత్యేక దినాలను ఆచరిస్తున్నారు. గాలప్ ఎన్నిక నివేదికలు మతవైవిధ్యం అధికంగా ఉన్న ప్రపంచదేశాలలో శ్రీలంక 3వ స్థానంలో ఉందని వివరిస్తుంది.. అలాగే శ్రీలంక ప్రజలలో 99% ప్రజలు వారిజీవితంలో మతానికి ప్రధానభాగం ఉందని తెలియజేస్తున్నారు.

మానహక్కులు మాధ్యమం

[మార్చు]

శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ( గతంలో రేడియో సిలోన్ ) ఆసియాలో అతి పురాతన సుదీర్ఘమైన రేడియో స్టేషను‌గా గుర్తింపు పొందింది. శ్రీలంక రేడియో స్టేషను ఐరోపాలో రేడియో ప్రసారం ప్రారంభమైన తరువాత కేవలం మూడు సంవత్సరాల తర్వాత ఎడ్వర్డ్ హార్పర్ 1923 లో స్థాపించబడింది . శ్రీలంక రేడియో స్టేషను ఇంగ్లీష్, హిందీ,సింహళ, తమిళంలో ప్రసారాలు సేవలు అందిస్తుంది . 1980 నుండి పెద్దసంఖ్యలో ప్రైవేటు రేడియో స్టేషనులు పెద్ద సంఖ్యలో కూడా ప్రవేశపెట్టబడ్డాయి .1979 లో ఇండిపెండెంట్ టెలివిజన్ స్థాపించిన తరువాత దేశంలో టెలివిజన్ ప్రసారాలు ప్రవేశపెట్టారు . ప్రారంభంలో అన్ని టెలివిజన్ స్టేషనులు రాష్ట్ర నియంత్రణలో ఉంటూ వచ్చాయి. 1992 లో ప్రైవేటు టెలివిజన్ నెట్వర్క్లు ప్రసారాలు ప్రారంభించాయి.. 2010 నాటికి, 51 వార్తాపత్రికలు ( 30 సింహళ, 10 తమిళ, 11 ఇంగ్లీష్ ) ప్రచురించబడ్డాయి. అలాగే 34 టి.వి స్టేషనులు, 52 రేడియో స్టేషనులు ప్రసారకాత్యక్రాలు నిర్వహిస్తూ ఉన్నాయి . అయితే ఇటీవల సంవత్సరాల్లో ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో శ్రీలంకలో పత్రికా స్వాతంత్ర్యం తక్కువస్థాయిలో ఉందని ప్రభుత్వాన్ని శ్రీలంక మాధ్యమం తీవ్రంగా విమర్శిస్తుంది.ఒక సీనియర్ ప్రభుత్వ మంత్రి మీద వార్తా పత్రిక సంపాదకుడు చేసిన ఆరోపణల కారణంగా అధికార దుర్వినియోగంతో జరిగిన సంపాదకుని హత్య పరిష్కరినచ లేకపోవడం ప్రభుత్వానికి అంతర్జాతీయ అపఖ్యాతిని తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం విమర్శకుడు లసంత విక్రెమతుంగే మరణాంతరము ప్రచురించిన వ్యాసమూ అతని మరణం అశుభసూచకంగా భావించబడింది. శ్రీలంక రాజ్యాంగం అధికారికంగా మానవ హక్కుల హామీ మీద చేసిన సంతకాన్ని యునైటెడ్ నేషన్స్ ఆమోదించింది. మానవ హక్కుల అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ శ్రీలంకలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనను తీవ్రంగా విమర్శించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని విమర్శించింది . వేర్పాటువాద తమిళ ఈలం (ఎల్.టి.టి.ఇ ) లిబరేషన్ టైగర్స్, శ్రీ లంక మానవ హక్కుల ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు . ఎల్.టి.టి.ఇ., శ్రీలంక ప్రభుత్వం రెండు పౌర యుద్ధం చివరి దశలో చేసిన యుద్ధ నేరాలను ఐక్యరాజ్యసమితి కార్యదర్శి సలహా కమిటీ తమ నివేదికలో తీవ్రంగా విమర్శించింది. 1980 లో యు.ఎన్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వర్కింగ్ గ్రూప్ భద్రతా దళాల సమర్పించిన లిఖిత పూర్వక నివేదికలో 12,000 మంది కనిపించకుండా పోయారని తెలియజేసింది. శ్రీలంక ప్రభుత్వం వీటిలో 6.445 చనిపోయిన అని నిర్ధారించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు జాతిపర సంఘర్షణలకు తరువాత కూడా ముగియ లేదు.

2013 యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్, నవనీతం పిళ్ళై మేలో శ్రీలంక సందర్శించిన తరువాత ఆమె ఇలా అన్నారు సందర్శించండి " యుద్ధం ( శ్రీలంక లో ), అయినా ఈ సమయంలో ప్రజాస్వామ్యం నిర్లక్ష్యం చేయబడింది , చట్టం నియమం దెబ్బతిన్నాయి. " ఆమె కూడా పౌర జీవితంలో సైకుల జోక్యం చేసుకోవడం. సైనికులు భూమిని ఆక్రమించాయని పేర్కొన్నది. నవనీతం పిళ్ళై కోరిన తరువాత ఆమెను శ్రీలంకకు వెళ్ళడానికి అనుమతించినా భద్రతా దళాలు ఆమె ఎక్కడకు వెళ్ళడానికి యుద్ధబాధితులను చూడడానికి అనుమతి లేదని చెప్పారు

సంస్కృతి

[మార్చు]
Hindu devotees engaging in Kavadi at a temple in Vavuniya.

శ్రీలంక సంస్కృతి 2,500 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీలంక సంస్కృతిపై బౌద్ధ, హిందూమత ప్రభావం అత్యధికంగా ఉంది. ఇస్లామిక్ జానపదకథనాలు ఆదమ్-ఈవ్ లను ఈడెన్ గార్డెన్ నుండి బహిష్కరించిన తరువాత ఈ దీవి ఆశ్రయం ఇచ్చిందని తెలియజేస్తున్నాయి. శ్రీలంక రెండు ప్రధానసంప్రదాయాలకు నిలయంగా ఉంది. పురాతన నగరాలైన క్యాండీ, అనూరాధపుర నగరాలలో సింహళీయులు కాఏంద్రీకాఋతమై ఉండగా జాఫ్నానారంలో తమిళులు కేంద్రీకృతమై ఉన్నారు. తరువాతి కాలంలో బ్రిటిష్ కాలనీ సంస్కృతి కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. శ్రీలంక మిగిలిన అభివృద్ధిచెందన దేశాల మాదిరిగా స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అనేకంగా క్రీ.పూ 3 వ శతాబ్దంలో మొదటిసారిగా తమిళులు ఈ దీవిలో ప్రవేశించినట్లుగా అంచనా. అప్పటి నుండి తమిళులు సింహళీయులతో కలిసి జీవించారు. ఆరంభకాలంలో వీరి కలయిక అస్పష్టంగా ఉంది. పురాతన శ్రీలంక హైడ్రాలిక్ మిక్సింగ్, నిర్మాణరంగాలలో మేధావులని గుర్తింపు పొందింది. సంపన్న సంస్కృతి శ్రీలంకలోని మొత్తం సాంస్కృతిక ప్రజలకు సమానంగా పంచబడింది. దేశం దీర్ఘాయుషు, ఆరోగ్యం, అత్యధిక శాతంలో ఉన్న అక్షరాస్యత.

ఆహార సంస్కృతి

[మార్చు]
Traditional dish of Kiribath with lunumiris.

శ్రీలంక ఆహారంలో బియ్యం, కూర, పిట్టు, కిర్బాత్, హోల్‌మీల్ రోటీ, స్ట్రింగ్ హోపర్స్, వట్టలప్పం ( టెకాయ పాలు, బెల్లం, జీడిపప్పు, గుడ్డు, సుగంధద్రవ్యాలు చేర్చిన ఆహారం), కొట్టు, హాపర్స్ ప్రధాన్యత వహిస్తాయి. కొన్నిసార్లు బియ్యం, కూరలకు ప్రత్యామ్నాయ ఆహారంగా భావించబడుతుంది. సంప్రదాయకంగా ఆహారం అరటాకులో వడ్డించబడుతుంది. సంప్రదాయక మూర్ వంటకాలలో తూర్పుమద్యప్రాంత ప్రభావం కనిపిస్తుంది. ద్వీపంలో లభిస్తున్న బర్గర్ లో పోర్చ్‌గీస్, డచ్ సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంది.బర్గర్ పప్రజలు వారి సంప్రదాయ ఆహారాలైన లాంప్రియాస్ ( బియ్యం కొన్ని రసాలతో వండి అరిటాకులో కాల్చడం) బ్ర్యూదర్ (డచ్ హాలిడే బిస్కట్), బొలో ఫియాడో ( పోర్చ్‌గీస్ శైలి పొరల కేకు), డచ్ శైలి తేనెలో ముంచిన తీపిపదార్ధాలు). ఏప్రిల్‌లో శ్రీలంక బుద్ధ, హిందూ సంవత్సరాదులను జరుపుకుంటుంది. అదనంగా ఆగస్టు మాసంలో క్యాండీలో ఎల్సా పరేరా, నృత్యాలు, అలంకరించిన ఏనుగులు భాగస్వామ్యం వహిస్తున్న బౌద్ధుల పండుగ జరుపుకుంటారు. అగ్నినృత్యం, కొరడా నృత్యం, క్యాండియన్ నృత్యం, ఇతర సాంస్కృతిక నృత్యాలు వంటివి ఈ పండుగ ఉత్సవాలలో చోటుచేసుకుంటాయి. తమిళులు తై పొంగల్, మహాశివరాత్రి పండుగలను జరుపుకుంటుండగా ముస్లింలు హజ్, రందాన్ పండుగలను జరుఔకుంటారు.

కళా సంస్కృతి

[మార్చు]
A Low Country drummer playing the traditional Yak Béra.

1947లో చిత్రకళా మూవీటోన్ సంస్థ తరఫున " కడవువును పొరందువా " (ది బ్రోకెన్ ప్రామిస్) ఉత్సవాలతో శ్రీలంక చలనచిత్ర చరిత్ర ఆరంభం అయింది. రన్‌ముత్తు డువా ( ఐలాండ్ ఆఫ్ ట్రెషర్స్, 1962) చిత్రంతో శ్రీలంక చలన చిత్రాలు నలుపు-తెలుపు నుండి వర్ణచిత్రాల స్థాయికి ఎదిగాయి. ప్రస్తుత చలనచిత్రాలు కుటుంబ కథలు, సాంఘిక మార్పులు, తరువాత సన్యం-ఈళ పులుల మద్య దీర్ఘకాలం సాగిన యుద్ధం సంఘటనలు ఆధారం చేసుకుని నిర్మించబడుతున్నాయి. వీరి చలనచిత్రాలు బాలీవుడ్ శైలిని పోలి ఉంటాయి. 1979లో చలనచిత్ర పేక్షకుల సంఖ్య తారస్థాయికి చేరుకుంది. తరువాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీలంక చరిత్రను ప్రభావితం చేసిన దర్శకుడు లెస్టర్ జేంస్ పెరిస్ అన్నది నిస్సందేహం. ఆయన అనర్జాతీయ గుర్తింపు పొందిన రెకవా (లైన్ ఆఫ్ డిస్టినీ,1956), గంపెరలియా ( ది చేంజింగ్ విలేజ్, 1964), నిధనయా ( ది ట్రెషర్, 1970), గొలు హదవత (కోల్డ్ హార్ట్, 1968).

సంగీతం

[మార్చు]

శ్రీలంకలో ఆరంభకాల సంగీతం రంగస్థల ప్రదర్శనలైన కొలం, సొకారి, నాటకాల ద్వారా మొదలైంది. తమ్మతమ, దౌల,, రాబన్ మొదలైన సంప్రదాయ సంగీత పరికరాలు ఈ ప్రదర్శనలలో చోటు చేసుకున్నాయి. 1903లో సిలోన్ రేడియో శ్రీలంక మొదటి సంగీత ఆల్బం " నూర్తి " విడుదల చేయబడింది. మహాగమా శేఖర, ఆనంద సమరకూన్ వంటి పాటల రచయితలు, డబల్యూ.డి. అమరదేవా, హెచ్.ఆర్ జ్యోతిపాలా, క్లారెంస్ విజెవర్ధనే వంటి సంగీతదర్శకులు శ్రీలంక సంగీతంలో చరిత్ర సృష్టించారు.దేశంలో ఇతర సంగీతకారులలో ఆఫ్రో సింహళీయుల ఆదరణ పొందిన బైలకు ప్రాముఖ్యత ఉంది.

నృత్యం

[మార్చు]

శ్రీలంక శాస్త్రీయ నృత్యంలో మూడు ప్రధానరీతులు ఉన్నాయి. అవి వరుసగా క్యాండియన్ నృత్యం, దిగువ జానపద నృత్యం, సబరగమువా నృత్యం.క్యాండియన్ నృత్యం క్యాండియా రాజులచేత పోషించబడింది. అత్యంత ప్రధానమైన క్యాండీ నృత్యంలో వెస్ నృత్యం, నైయాండి నృత్యం, ఉదిక్కి నృత్యం, పంతేరు నృత్యం, 18 వణ్ణం అనే రీతులు ఉన్నాయి. వెడల్పైన శిరోభూషణం ధరించిన పురుషులకు గెటా ( మద్దెల వంటిది ) నృత్యకారుడికి తాళగతిలో సహకరించడానికి ఉపయోగించబడుతుంది. అదనంగా వారితో సొక్రి, కొలం, నాడగం, పశు, సన్ని, యకుమా, కంకారియా వంటి పలు దేవి నృత్యకారులు ఇందులో పాలుపంచుకుంటారు. శ్రీలంక చరిత్రలో చిత్రలేఖనం, శిల్పం చెక్కడం వంటి కళారీతులు క్రీ.పూ 2వ శతాబ్దంలో ఆరంభమైందని అంచనా. చిత్రలేఖనం గురించి మొదటిసారిగా మహావంశలో ప్రస్తావించబడింది. బౌద్ధ సన్యాసుల మఠాలలో శిలాస్ఫటికం ఉపయోగించి " వస్త్రం మీద చిత్రించిన ఒక రాజభవనం " ఒకటి ఉంది. బౌద్ధ స్థూపాల, సన్యాస నివాసంలో స్మారకంగా-గదులు వివిధ పురాణ గాథాచిత్రాలు వివరణలు ఉన్నాయి.

రంగస్థలం

[మార్చు]

ముంబాయిలో ఉన్న పార్శీ కంపనీ శ్రీలంకలో నూర్తి దియేటర్ ఆరంభించడంతో శ్రీలంక రంగస్థల సంప్రదాయం ఆరంభం అయింది. ఈ కంపనీ 19వ శతాబ్దంలో కొలంబో ప్రేక్షకులకు యురేపియన్, భారతీయ సంప్రదాయాల మిశ్రితరూపాన్ని అందించింది. 1956లో ఎదిరివీర సరాచంద్ర విరచిత మనమే నాటకప్రదర్శనతో డ్రీలంక నాటకం, రంగస్థల స్వర్ణయుగం ఆరంభం అయింది. తరువాత వచ్చిన సింహబాహు, పబవతి, మహాసారా, మూడు పుదుదు, శుభ సహ యాసా వంటి ప్రబల నాటకాల ప్రదర్శన కొనసాగింది. భుగ్వేదంలోని శ్లోకాలతో శ్రీలంకలో 2000 సంవత్సరాలకంటే ముందు నుండి సాహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్యన్ సంప్రదాయంతో సాహిత్యం ఆరంభమైనట్లు తెలుస్తుంది. పాలికెనాన్ సంగ్రహాలలో తెరవాడ బుద్ధిజ సంప్రదాయానికి చెందిన వ్రాతపతులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. శ్రీలంకలోని అల్యూలెనా గుహాలయం కెగల్లే కుడ్యాలు మీద 4వ బౌద్ధ కౌంసిల్ కాలంలో లిఖించబడ్డాయని భావిస్తున్నారు. మహావంశ వంటి పురాతన గాథలు 6వ శతాబ్దంలో లిఖించడింది. ఇందులో శ్రీలంకా సామ్రాజ్యాల గురించిన పలు విషయాలు అభ్యమౌతున్నాయి. జర్మన్ తత్వవేత్త విలియం గాగర్ సింహళ అట్టకథ (భాష్యం) ఆధారిత గాథలు మరికొన్ని శతాబ్ధాల ముందే వ్రాయబడ్డాయని వివరిస్తున్నాడు. శ్రీలంకలో ప్రస్తుతం లభిస్తున్న పురాతన వచనసాహిత్యం 9వ శతాబ్దంలో వ్రాయాడిన ధాంపియా-అతువా-గెటపాదయా అని భావిస్తున్నారు. శ్రీలంక మద్యయుగానికి చెందిన సాహిత్యంలో సందేష కావ్యా (పద్య సాహిత్యం), గిరా సందేస్యా (రామచిలక సందేశం), హంస సందేశ్య, సలలిహిని సందేశ్య (గోరింక సందేశం) మొదలైన ప్రధానమైనవి. అలాగే కవ్సిలూమిన, కావ్య-శేఖర్యా వంటి పద్యకావ్యాలు, సద్ధర్మ- రత్న వలియ, అమవాతుర (మకరంద వరద), పూజవలియ మొదలైనవి మద్యయుగ సాహిత్యంలో ప్రధానమైనవి. శ్రీలంక సాహిత్యంలో మద్యయుగం స్వర్ణయుగం వంటిదని భావిస్తున్నారు. ఆధునిక కాల నవలాసాహిత్యంలో 1905లో సైమన్ డీ సిల్వా వ్రాసిన మీనా, తరువాత వచ్చిన అనేక విప్లవాత్మకమైన రచనలు ముఖ్యమైనవి. మాదల్ దూవా వ్రాసిన మార్టిన్ విక్రమాదింఘే శ్రీలంక సాహిత్యానికి వన్నె తెచ్చిన సాహిత్యమని కీర్తించబడుతుంది.

విద్య

[మార్చు]
The University of Peradeniya's Sarachchandra open air theatre, named in memory of Ediriweera Sarachchandra, Sri Lanka's premier playwright.

శ్రీలంక 92.5 % శాతం అక్షరాస్యత రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అత్యధిక అక్షరాస్యత జనాభాను కలిగి ఉంది . శ్రీలంక యువకుల అక్షరాస్యత రేటు 98 %, కంప్యూటర్ అక్షరాస్యత రేటు 35 %, ప్రాథమిక పాఠశాల నమోదు 99% . దేశంలోం 9 సంవత్సరాల వరకు పిల్లలకు నిర్బంధ విద్య విద్యా విధానం అమలులో ఉంది . (సి.డబ్ల్యూ.డబ్ల్యూ కన్నంగరా ), A. రత్నాయకే చొరవ ఫలితంగా 1945 లో స్థాపించబడిన ఉచిత విద్య వ్యవస్థ అందుబాటులో ఉంది . ప్రాథమిక స్థాయి నుండి ఉచిత విద్యను అందించే కొన్ని ప్రపంచదేశాలలో దేశాలలో శ్రీలంక ఒకటి .

గ్రామీణ శ్రీలంక పిల్లలకు విద్య అందించడానికి కన్నంగరా మాద్గదర్శకంగా ఉంది. కన్నంగరా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర పాఠశాలలు ( సెంట్రల్ స్కూల్స్) ఏర్పాటుకు దారితీసింది. 1942 లో ఒక ప్రత్యేక విద్య కమిటీ సమర్థవంతమైన, నాణ్యత కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు కొరకు విస్తృత సంస్కరణలు ప్రతిపాదించారు . అయితే ఈ వ్యవస్థ 1980లో విద్యావ్యవస్థలో తీసుకురాబడిన మార్పుల వలన దేశంలోని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలుగా వేరు చేయబడ్డాయి. అందువలన జాతీయ పాఠశాలలు, ప్రాంతీయ పాఠశాలలు అన్నింటినీ నేరుగా విద్యామంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేతున్నాయి . శ్రీలంకలో సుమారు 9675 ప్రభుత్వ పాఠశాలలు, 817 ప్రైవేట్ పాఠశాలలు, పరివెనాలు ఉన్నాయి. శ్రీలంకలో 15 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి . అయితే విద్యావ్యవస్థలో నెలకొన్న బాధ్యతారాహిత్యం, అసమానతల కారణంగా నాణ్యమైన విద్యను పొందలేక పోవడం, ద్వితీయ, తృతీయ విద్య మధ్య సమర్థవంతమైన అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు విద్య రంగం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి . ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అంటి సంస్థలు అనేకం ఈ ఖాళీని పూరించడానికి ఇటీవలి కాలంలో ఉద్భవించాయి . అయినప్పటికీ 5.1% తృతీయ స్థాయి విద్య గాలికి ఊగిసలాడుతుంది. కానీ ఇప్పటికీ, 5.1 % తృతీయ స్థాయి విద్య hovers వద్ద పాల్గొనడం . ప్రతిపాదిత ప్రైవేట్ విశ్వవిద్యాలయం బిల్లు విశ్వవిద్యాలయం విద్యార్థులు ' భారీ ప్రదర్శనలు, ప్రతిఘటన తరువాత ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ద్వారా తీసివేయబడింది . బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్ (అత్యంత ప్రసిద్ధ 2001 ఎ స్పేస్ ఒడిస్సీ రచయిత ) శ్రీలంకలో ఉన్న మొరతువా విశ్వవిద్యాలయం చాన్సెలర్ (1979 నుండి 2002 వరకు) పనిచేశాడు.

క్రీడలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీలంక&oldid=4338731" నుండి వెలికితీశారు