పేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పేరు లేదా నామము (Name)[1]) అనగా ఒక పదార్ధానికి, స్థలానికి, వస్తువుకు, మొక్కలకు, జంతువులకు మొదలగు వాటిని గుర్తించడానికి, పిలవడానికి సంబంధించిన పదం. ఇది ఒకర్ని ఇతరులనుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఒక వర్గానికి లేదా సంస్థకు చెందినది కూడా కావచ్చు. పేరులన్నీ వ్యాకరణ పరంగా నామవాచకం క్రిందకు వస్తాయి.

మొక్కలు మరియు జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. డాల్ఫిన్[2] లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.


జీవశాస్త్రంలో భూమి మీద నివసించే జీవులన్నింటికీ శాస్త్రీయంగా పేరు పెడతారు. దీనిని 'నామీకరణ' అంటారు. కొందరు ద్వినామ నామకరణ విధానాన్ని అంగీకరిస్తే, కొన్నింటికి మాత్రం త్రినామ నామీకరణ అవసరం అయింది. ఈ విధమైన జీవుల వర్గీకరణ విధానానికి ఆద్యుడు లిన్నేయస్.

రకాలు[మార్చు]

  • ఇంటి పేరు (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి. కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు. చాలా దేశాలలో ఇంటి పేరును తండ్రి పేరు నుండి తీసుకోవడం ఆనవాయితీ.
  • ఇవ్వబడిన పేరు (Given Name) లేదా వ్యక్తి పేరు (Personal Name) : వ్యక్తి పేరు సాధారణం ఆ వ్యక్తిని పిలిచే, లేదా నమోదు చేసుకొనే పేరు. ముద్దు పేరుతో కొంతమందిని చిన్నప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా పెద్దయిన తరువాత కూడా ఈ పేరు స్థిరపడిపోతుంది. హిందువులలో పుట్టిన రోజు తర్వాత నామకరణోత్సవం నాడు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పేరు పెడతారు. వ్యక్తి పేరు ఎక్కువగా వారి కుటుంబం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలకు ఇష్టం లేనప్పుడు తన పేరును మార్చుకొనే హక్కు వారికున్నది.[3]
  • ముద్దు పేరు (Pet Name) : ముద్దుగా పిలుచుకొనే పేరు. గాంధీగారిని ముద్దుగా బాపు అని పిలిచినట్లు.
  • పొట్టి పేరు (Short Name) : కొందరు వ్యక్తులకు, ప్రదేశాలకు లేదా సంస్థలకు ఇవి ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పేర్లున్నప్పుడు ఇలా పొట్టి పేర్లు వ్యవహారికమైపోతాయి. ఉదా: ఐరాసా అంటే ఐక్యరాజ్య సమితి. కారా అంటే కాళీపట్నం రామారావు. ఆంగ్లంలో వీటిని 'Abbrevations' అంటారు.
  • ఊరి పేరు (Village Name) : ఒక ఊరి పేరు ఆ ప్రాంతపు రెవిన్యూ అధికార్లు అక్కడ నివసించే ప్రజల ఇష్టాన్ని పరిగణించి నిర్నయిస్తారు.
  • వాహనాల పేరు (Vehicle Name) : కొన్ని ప్రయాణ వాహనాలకు పేర్లు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. రైలు బండ్లను గుర్తించడానికి గుర్తింపు సంఖ్యతో సహా పేర్లు పెడతారు. ఉదా: గోదావరి ఎక్స్ ప్రెస్, కోనార్క ఎక్స్ ప్రెస్ మొ. ఇలాగే బస్సులకు, పడవలకు కూడా పేర్లు పెడతారు.
  • సంస్థల పేరు (Company Name) : ఒక సంస్థను స్థాపించినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ సంస్థ అధిపతి పేరు పెడతారు. కొన్ని పేర్లు అవిచేసే పనిని, విభాగాన్ని తెలియజేస్తూ ఆ రంగంలో ప్రసిద్ధిచెందిన వారిని పేరులో ముందు చేర్చడం కొన్ని సార్లు జరుగుతుంది.
  • కలం పేరు (Pen Name) : కొందరు రచయితలు నిజమైన పేరుకు ప్రత్యామ్నాయంగా వాడుకునే పేరు.

మారు పేర్లు[మార్చు]

| align="center" style="background:#f0f0f0;"|అసలు పేరు | align="center" style="background:#f0f0f0;"|మారుపేరు |- | యూసఫ్‌ఖాన్||దిలీప్‌కుమార్‌ |- | ఫాతిమా ఎ.రషీద్‌||నర్గీస్‌ |- | జతిన్‌ఖన్నా||రాజేష్‌ఖన్నా |- | రవికపూర్||జితేంద్ర |- | బాలరాజ్||సునీల్‌దత్‌ |- | తాయారమ్మ||పుష్పవల్లి |- | మణి||గీతాంజలి |- | ఉప్పు శోభనాచలపతిరావు|| శోభన్‌బాబు |- | సత్యనారాయణ దీక్షిత్||శరత్‌బాబు |- | అప్పలరాజు||రాజబాబు |- | భక్తవత్సలం నాయుడు||మోహన్‌బాబు |- | సుబ్బమ్మ||శాంతకుమారి |- | కుసుమకుమారి||రాజశ్రీ |- | కమలకుమారి||జయంతి |- | రోహిణి||జయచిత్ర |- | సుజాత||జయసుధ |- | అలమేలు||జయమాలిని |- | లలిత||విజయలలిత |- | లలితారాణి||జయప్రద |- | నీరజ||జయలక్ష్మి (ఫటాఫట్‌) |- | విజయ||జయవిజయ |- | లలిత||జయలలిత |- | దైవనాయకి||కె.ఆర్‌.విజయ |- | చంద్రశేఖర్‌రావు||చంద్రమోహన్‌ |- | సరస్వతి||శారద |- | రత్నకుమారి||వాణిశ్రీ |- | వసుంధర|| కాంచన |- | అంజనీకుమారి||అంజలిదేవి |- | ప్రమీల||దేవిక |- | శివశంకర వరప్రసాద్||చిరంజీవి |- | రాజబాబు||మురళీమోహన్‌ |- | శేషగిరిరావు||గిరిబాబు |- | పూర్ణచంద్రరావు||నూతన్‌ప్రసాద్‌ |- | శివాజీరావు||రజనీకాంత్‌ |- | ముత్తురాజు||రాజ్‌కుమార్‌ |- | కొమ్మినేని అప్పారావు||చక్రవర్తి |- | పి.జి.కృష్ణవేణి||జిక్కి |- | రాజేశ్వరి||ఎల్లారీశ్వరి |- | |}

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పేరు&oldid=1194348" నుండి వెలికితీశారు