Jump to content

సంస్కృతి

వికీపీడియా నుండి
ప్రాచీన ఈజిప్ట్ కళ.
అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

సంస్కృతి అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.[1] ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.[2]

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.[3] ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

సంస్కృతి నిర్వచనం

[మార్చు]

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.[4] ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.[5] వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు , సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది , ఏ ఇతర సామర్థ్యాలు , అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం") [6]

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.[7] ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ[8] సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

సంస్కృతి, నాగరికత

[మార్చు]

సంస్కృతిలో మార్పులు

[మార్చు]

భారతీయ సంస్కృతి

[మార్చు]

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది

తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం)

[మార్చు]
పుట్టింటి సారె
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Harper, Douglas (2001). Online Etymology Dictionary.
  2. Findley, Carther Vaughn and John Alexander Rothney (2006). Twentieth-century World. Sixth edition, p. 14. ISBN 978-0-618-52263-7.
  3. Williams, Raymond. Keywords, "Culture"
  4. [[:en:Raymond Williams|]] (1976) en:Keywords: A Vocabulary of Culture and Society. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8.
  5. John Berger, Peter Smith Pub. Inc., (1971) Ways of Seeing
  6. Tylor, E.B. 1874. Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom.
  7. UNESCO. 2002. [1] Universal Declaration on Cultural Diversity.
  8. Culture: A Critical Review of Concepts and Definitions అనే Kroeber, A. L. and C. Kluckhohn, 1952. Culture: A Critical Review of Concepts and Definitions.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సంస్కృతి&oldid=4270865" నుండి వెలికితీశారు