భారతీయ సంస్కృతి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సుదీర్ఘ చరిత్ర, విలక్షణ భౌగోళిక స్వరూపం, విభిన్న జనాభాలు మరియు వేషధారణలు, సంప్రదాయాలు, సింధూ లోయ నాగరికత సమయంలో ఏర్పడి వేద యుగాల సందర్భంగా అభివృద్ధి చెందిన పురాతన వారసత్వం, కొన్ని పొరుగుదేశాల నుంచి స్వీకరించిన భావాలు, బౌద్ధ మత ఉన్నతి, పతనం, స్వర్ణ యుగం, భారత్ లో ముస్లింల ప్రవేశం మరియు ఐరోపా కాలనీల ఏర్పాటులచే భారతదేశ సంస్కృతి మలచబడింది.

గొప్ప భిన్నత్వం కలిగివున్న భారతదేశ మతాచారాలు, భాషలు, వేషధారణలు మరియు సంప్రదాయాలు గత ఐదు వేల సంవత్సరాలుగా ఇక్కడ నిరుపమాన సహజీవనానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ సమ్మేళనాల ద్వారా సృష్టించబడిన భారతదేశంలోని వివిధ మతాలు మరియు సంప్రదాయాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను కూడా ప్రభావితం చేశాయి.

మతం[మార్చు]

హిందూ, బౌద్ధ, జైన మరియు సిక్కు వంటి ధార్మిక మతాలకు భారతదేశం పుట్టినిల్లు.[1] అబ్రహమిక్ శ్రేణి తరువాత ప్రధాన ప్రపంచ మత రూపంగా పరిగణించబడుతున్న ధార్మిక మతాలను భారతీయ మతాలుగా కూడా గుర్తిస్తారు. హిందూమతం మరియు బౌద్ధమతం వరుసగా ప్రపంచంలో మూడు మరియు నాలుగో అతిపెద్ద మతాలుగా ఉన్నాయి, 1.4 బిలియన్ల మంది పౌరులు ఈ రెండు మతాలను ఆచరిస్తున్నారు.

మత సమాజాలు మరియు సంస్కృతులు బాగా లోతుగా పాతుకుపోయి ఉండటంతో ప్రపంచంలో బాగా ఎక్కువగా మత భిన్నత్వం ఉన్న దేశాల్లో ఒకదానిగా భారతదేశం గుర్తింపు పొందింది. ఎక్కువ మంది ప్రజల జీవితాల్లో మతం ఇప్పటికీ ప్రధాన, నిశ్చయాత్మక పాత్ర పోషిస్తుంది.

భారతదేశంలో 80.4% మందికిపైగా పౌరులు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. మొత్తం భారతీయుల్లో 13.4% మంది ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు.[2] సిక్కుమతం, జైనమతం మరియు ముఖ్యంగా బౌద్ధమతం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ప్రభావితం చేశాయి. క్రైస్తవమతం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం మరియు బహాయిజంలు కూడా ఇక్కడ ప్రభావాత్మకంగా ఉన్నాయి, అయితే వీరి జనాభా తక్కువగా ఉంది. భారతీయుల జీవితంలో మతం బలమైన పాత్ర కలిగివున్నప్పటికీ, ఇతర విశ్వాసాలతో స్వీయ-ఆపాదిత సహనాన్ని పాటించేవారితోపాటు, నాస్తికవాదులు మరియు అజ్ఞేయవాదులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

సమాజం[మార్చు]

పర్యావలోకనం[మార్చు]

ఎజెన్ M. మేకర్ ప్రకారం, సంప్రదాయ భారత సంస్కృతి పరస్పర నిర్ణిబద్ధ సామాజిక అధిక్రమంచే నిర్వచించబడింది. ప్రారంభ జీవితం నుంచి పిల్లలకు సమాజంలో వారి యొక్క పాత్రలు, స్థానాలను గుర్తు చేయడం జరుగుతుందని అతను పేర్కొన్నాడు.[3] దేవతలు మరియు ఆత్మలను విశ్వసించే అనేక మంది వారి యొక్క జీవితాన్ని గుర్తించడంలో సమగ్ర మరియు క్రియాత్మక పాత్ర కలిగివుంటారనే వాస్తవం దీనికి బలం చేకూరుస్తుంది.[3] మతం వంటి అనేక భేదాలు సంస్కృతిని విభజిస్తున్నాయి.[3] అయితే, బాగా శక్తివంతమైన విభజన ఏమిటంటే పవిత్ర మరియు అపవిత్ర వృత్తులుగా సంప్రదాయ హిందూ సమద్వి ఖండనం జరిగింది.[3] వేల సంవత్సరాలపాటు ఈ సమూహాలను కఠినమైన సామాజిక బహిష్కరణలు పాలించాయి.[3] ఇటీవలి సంవత్సరాల్లో, ముఖ్యంగా నగరాల్లో, కొన్ని హద్దులు చెరిపేయబడటం, కొన్ని సందర్భాల్లో కనిపించకుండా పోవడం జరిగింది.[3] వ్యష్టి కుటుంబం భారత సంస్కృతికి కేంద్రస్థానంగా మారుతోంది. ముఖ్యమైన కుటుంబ సంబంధాలు గోత్రం వరకు విస్తరించబడివుంటాయి, ప్రధానంగా ఒక హిందువుకు పుట్టినప్పుడు పురుష వంశక్రమం లేదా గోత్రం నియుక్తించబడుతుంది.[3] గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబం మూడు లేదా నాలుగు తరాలపాటు ఒకే ఇంటిలో ఉండటం సాధారణంగా కనిపిస్తుంది.[3] కుటుంబ తగాదాలను తరచుగా కులపెద్ద పరిష్కరిస్తుంటాడు.[3]

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, భారత్ చాలా తక్కువ స్థాయిల్లో వృత్తిపరమైన మరియు భౌగోళిక చలనశీలత కలిగివుంది. పౌరులు ఎక్కువగా వారి తల్లిదండ్రుల వృత్తులనే స్వీకరిస్తుంటారు మరియు సమాజంలో వారి భౌగోళిక చలనం అరుదుగా కనిపిస్తుంటుంది.[4] జాతీయవాద ఉద్యమ సందర్భంగా, డాంబికమైన ప్రవర్తనను తొలగించాలని భావించారు. అనవసర వ్యయం పట్ల అయిష్టత చూపడం, గర్వపూరిత ధన వ్యయాన్ని అవలక్షణంగా చూస్తూ సమతావాద ప్రవర్తన మరియు సమాజ సేవ ప్రోత్సహించబడ్డాయి. కొంత మంది రాజకీయ నాయకులు సాధారణంగా కనిపించే / సంప్రదాయబద్ధమైన గ్రామీణ వస్త్రాలు ధరించడంతో ఈ తరహా ప్రవర్తన రాజకీయాల్లో కొనసాగింది.

కుటుంబం[మార్చు]

సంప్రదాయ పంజాబీ హిందు వివాహ వేడుకలో పెళ్ళికూతురు.

భారతదేశంలో యుగాల తరబడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రబల సంప్రదాయంగా వస్తోంది. ఈ వ్యవస్థలో, ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, పిల్లలు, పిల్లల జీవిత భాగస్వాములు మరియు వారి యొక్క వారసులు, తదితరులు, కుటుంబ సభ్యులుగా కలిసి జీవనం సాగిస్తుంటారు. అందరికంటే పెద్ద వ్యక్తి, సాధారణంగా పురుషుడు భారత ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబపెద్దగా వ్యవహరిస్తుంటాడు, అతనే అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, ఇంటిలో పెత్తనం చెలాయిస్తాడు, ఇతర సభ్యులు దీనికి లోబడి నడుచుకుంటారు.

శతాబ్దాలుగా భారత సమాజంలో నిశ్చయ వివాహాల సంప్రదాయం పాటించబడుతోంది. ఈ రోజుకు కూడా, ఎక్కువ మంది భారతీయుల వివాహాలు వధూవరుల అంగీకారంతోపాటు, వారి తల్లిదండ్రులు మరియు ఇతర గౌరవనీయ కుటుంబ సభ్యులు నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి.[5] వయస్సు, ఎత్తు, వ్యక్తిగత విలువలు మరియు అభిరుచులు, కుటుంబ నేపథ్యాలు (సంపద, సామాజిక స్థితి), కులాలు మరియు జంటల జాతకచక్రాలకు జ్యోతిషశాస్త్ర అనుకూలతల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతుంటాయి.

భారతదేశంలో, వివాహాన్ని జీవితంగా భావిస్తారు[6], విడాకుల శాతం చాలా తక్కువగా ఉంటుంది — అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విడాకుల రేటు 50% మేర ఉండగా, ఇక్కడ 2.1% మాత్రమే ఉంది.[7] సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహాల్లో విడాకుల శాతం చాలా తక్కువగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో విడాకుల శాతం గణనీయంగా పెరిగింది:

"దీనికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి: సంప్రదాయవాదులు విడాకుల శాతం పెరగడం సమాజ పతనానికి సంకేతమని వాదిస్తుండగా, కొందరు ఆధునికవాదులు మాత్రం మహిళలకు కొత్త ఆరోగ్యకర ప్రాధికారత గురించి మాట్లాడుతున్నారు."[8]

1860లోనే బాల్య వివాహాలను చట్టవిరుద్ధం చేసినప్పటికీ, భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.[9] UNICEF యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్- 2009 నివేదిక ప్రకారం, 20–24 మధ్య వయస్సున్న భారతీయ మహిళల్లో 47% మందికి చట్టబద్ధ వివాహ వయస్సు 18 ఏళ్ల కంటే ముందుగానే వివాహం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 56% వద్ద ఉంది.[10] అంతేకాకుండా ప్రపంచంలో 40% బాల్య వివాహాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.[11]

భారతీయుల పేర్లు వివిధ పద్ధతుల ఆధారంగా ఉంటాయి మరియు నామకరణాలు ప్రాంతాన్నిబట్టి మారుతుంటాయి. పేర్లపై కూడా మతం మరియు కులం ప్రభావం ఉంటుంది, మతం లేదా పురాణేతిహాసాల్లోని పేర్లు కూడా కనిపిస్తుంటాయి. భారతదేశం యొక్క జనాభా మాట్లాడే భాషల్లో విస్తృత వైవిధ్యం ఉంటుంది.

చట్టం ముందు మహిళలు మరియు పురుషులు సమానమైనప్పటికీ, లింగ సమానత్వ పోకడ సూచనప్రాయంగా ఉంటుంది, భారత సమాజంలో మహిళలు, పురుషులు ఇప్పటికీ వివక్షపూరిత విధులు నిర్వహిస్తున్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎక్కువగా ఇంటిపనులు, కుటుంబ సంక్షేమానికి ఉద్దేశించిన పనులకు పరిమితమై ఉంటుంది[3]. మహిళా భాగస్వామ్యం తక్కువ ఉండటానికి సిద్ధాంతపరమైన మరియు చారిత్రక కారణాలు ఉన్నాయి. వార్తా కార్యక్రమాల్లోనూ మహిళలు మరియు మహిళల సమస్యలు 7-14% మాత్రమే కనిపిస్తుంటాయి.[3] ఎక్కువ భారతీయ కుటుంబాల్లో, మహిళలు వారిపేర్లపై ఎటువంటి ఆస్తిని కలిగివుండరు, తల్లిదండ్రుల ఆస్తిలో వాటాను కూడా పొందరు.[12] వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలు అమలు బలహీనంగా ఉన్న కారణంగా, మహిళలకు భూమి మరియు ఆస్తిలో వాటాను దక్కించుకునే అవకాశం తక్కువగానే ఉంది.[13] అనేక కుటుంబాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, బాలికలు మరియు మహిళలు కుటుంబంలోనే పోషకాహార వివక్ష ఎదుర్కొంటున్నారు, వారు శక్తిహీనత మరియు పోషకాహారలోపాన్ని చూస్తున్నారు.[12] ఆదాయం మరియు ఉద్యోగ హోదా విషయాల్లో వారు ఇప్పటికీ పురుషుల కంటే వెనుకబడి ఉన్నారు. రంగోలి (లేదా కోలం) వంటి సంప్రదాయ హిందూ కళ భారతీయ మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఫెమినా, గృహశోభ మరియు వుమన్స్ ఎరా, తదితరాలు ఇక్కడ ప్రసిద్ధ మరియు ప్రభావాత్మకమైన మహిళా మేగజైన్లు.

జంతువులు[మార్చు]

చెన్నైలోని కపాలీశ్వర ఆలయ అలంకారిత గోపురంలో వృషభాలు.

వైవిధ్యభరితమైన మరియు అపార భారతదేశ అటవీసంపద ఈ ప్రాంత ప్రసిద్ధ సంస్కృతిపై లోతైన ప్రభావం కలిగివుంది. భారతదేశంలో అరణ్యానికి సాధారణ పేరు జంగిల్, ఈ పదాన్ని బ్రిటీష్ కాలనీల వాసులు ఆంగ్ల భాషలోకి స్వీకరించారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ది జంగిల్ బుక్ అనే పుస్తకంతో కూడా ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. పంచతంత్రం మరియు జాతక కథలు వంటి అనేక ఇతర కథలు మరియు అద్భుతగాథల్లో భారతదేశం యొక్క అటవీ సంపద కథావస్తువుగా ఉంది.[14]

హిందూమతంలో, ఆవును అహింస (నాన్-వయిలెన్స్)కు గుర్తుగా, దేవతల తల్లి గా, భోగభాగ్యాల ప్రదాతగా పరిగణిస్తారు.[15] ఈ కారణంగా, హిందూ సంస్కృతిలో ఆవులను పూజిస్తారు మరియు ఆవుకు ఆహారం అందించడాన్ని ఆరాధనగా పరిగణిస్తారు.[16]

నమస్తే[మార్చు]

భారత ఉపఖండంలో పలకరింపు లేదా వందనం చేసేందుకు సాధారణంగా నమస్తే, నమస్కార్ లేదా నమస్కారం అనే పదాలను ఉపయోగిస్తారు. నమస్కార్‌ను నమస్తే కంటే కొద్దిగా ఎక్కువగా ఉపయోగిస్తారు, అయితే రెండు రూపాలను ప్రగాఢ గౌరవాన్ని తెలియజేసేందుకు వాడతారు. సాధారణంగా దీనిని భారతదేశం మరియు నేపాల్‌లలో హిందువులు, జైనులు, బౌద్ధులు ఉపయోగిస్తారు, భారత ఉపఖండం వెలుపల కూడా అనేక మంది దీనిని ఉపయోగిస్తున్నారు. భారత మరియు నేపాలీ సంస్కృతుల్లో, రాయడం లేదా మాట్లాడటం మొదలు పెట్టే సమయంలో ఈ పదాన్ని వాడతారు. అయితే, నిష్క్రమణ సమయంలో సాధారణంగా దీనినే మాటలు లేకుండా చేతులు జోడించి తెలియజేస్తారు. యోగాలో, నమస్తే అంటే "నాలోని వెలుగు నీలోని వెలుగును గౌరవిస్తుంది" అని అర్థం, దీనిని యోగా గురువులు మరియు యోగా విద్యార్థులు ఇద్దరూ దీనిని ఉచ్ఛరిస్తారు.

ఉన్నదున్నట్లుగా తీసుకుంటే, దీనర్థం, "మీకు నేను వినమ్రంగా ఉంటాను". ఈ పదం సంస్కృతం (నమస్) నుంచి ఉత్పాదించబడింది: వినమ్రత, విధేయత, పూజ్యభావం, వందనం, గౌరవం మరియు (te): "మీకు".

మరో వ్యక్తితో మాట్లాడే సమయంలో, చేతులు రెండూ జోడించి, అరచేతులను కలిపి, వేళ్లను పైకిచూపుతూ, వాటిని ఛాతీకి ఎదురుగా ఉంచి, కొద్దిగా వంగి నమస్కరించడం సాధారణ ఆచారంగా పాటించబడుతుంది. మాటలులేకుండా లేదా దేవుడిని, ఉదాహరణకు: "జై శ్రీకృష్ణా" అని, పిలిచే సమయంలో మరియు ఇదే అర్థాన్ని సూచించేందుకు ఈ అభినయాన్ని ప్రదర్శిస్తారు.

భారతదేశవ్యాప్తంగా హిందువులు ప్రమిదలు వెలిగించడం మరియు ముగ్గులు వేయడం వంటి ఆచారాలతో జరుపుకునే, దీపోత్సవం, దీపావళి.

అస్సలాము అలైకుమ్[మార్చు]

ముస్లింలు పరస్పర అభివాదాలకు ఈ వాక్యం ఉపయోగిస్తారు. జవాబుగా " వ అలైకుం అస్సలాం " అని పలుకుతారు.

ఆదాబ్ అర్జ్ హై[మార్చు]

ఆదాబ్ అనగా గౌరవం, అర్జ్ హై అనగా ప్రకటిస్తున్నాను, అని అర్థము. అనగా గౌరవ ప్రకటన.

సత్ శ్రీ అకాల్[మార్చు]

సిక్కు మతస్తులు పరస్పర అభివాదాలకు ఈ వాక్యం పలుకుతారు.

పండుగలు[మార్చు]

బహుళ-సంస్కృతులు మరియు బహుళ-మత సమాజాన్ని కలిగివున్న భారతదేశంలో వివిధ మతాలకు చెందిన పర్వదినాలు మరియు పండగలు జరుపుకుంటారు. స్వాతంత్ర్యదినం, గణతంత్రదినం, గాంధీ జయంతి మూడు రోజులు భారతదేశంలో జాతీయ సెలవుదినాలు, వీటిని దేశవ్యాప్తంగా ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. అంతేకాకుండా, ప్రబలమైన మత మరియు భాష జనాభాల ఆధారంగా అనేక రాష్ట్రాలు మరియు ప్రాంతాలు స్థానిక పండగులు జరుపుకుంటాయి. దీపావళి, వినాయక చవితి, దుర్గ పూజ, హోలీ, రక్షాబంధన్ మరియు దసరా ప్రసిద్ధ హిందూ మత పండుగలుగా గుర్తింపు పొందాయి. సంక్రాంతి, పొంగల్ మరియు ఓనమ్ వంటి అనేక వ్యవసాయ పండుగలు కూడా బాగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో కొన్నిరకాల పండుగలను వివిధ మతాలవారు కలిసి జరుపుకుంటారు. దీనికి మంచి ఉదాహరణ దీపావళి, దీనిని హిందువులు, సిక్కులు, జైనులు జరుపుకుంటారు మరియు బుద్ధ పూర్ణిమను హిందువులు, బౌద్ధమతస్తులు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్, ఈద్ అల్ అధా మరియు రంజాన్ వంటి ఇస్లాం పండుగలను జరుపుకుంటారు. ఈ దేశ సంస్కృతిని మరింత వర్ణమయం చేస్తూ, భారతదేశంలో జరుపుకునే కొన్ని గిరిజన పండుగల్లో డ్రి పండుగ ఒకటి, దీనిని దేశానికి తూర్పు అగ్రభాగాన ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో లోయలో ఉండే అపాటనీయన్ తెగవారు జరుపుకుంటారు.

వంటకాలు[మార్చు]

ప్రధాన వ్యాసం: భారతీయ వంటకాలు
వివిధ భారతీయ కూరలు మరియు కూరగాయ వంటకాలు.

విభిన్న రకాల భారతీయ వంటకాలను అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, మూలికల ఆడంబర మరియు సూక్ష్మ వినియోగంతో వర్ణించవచ్చు. ప్రతిరకం వంటక పద్ధతిలో విస్తృతస్థాయి వంటకాలు మరియు వండే పద్ధతులు ఉంటాయి. భారతీయ ఆహారంలో సింహభాగం శాఖాహారమే అయినప్పటికీ, కోడి, మేక, గొర్రె, చేపలు మరియు ఇతర రకాల మాంసంతో చేసే సంప్రదాయ భారతీయ వంటకాలు కూడా ఉన్నాయి.

భారతీయ సంస్కృతిలో ఆహారం ముఖ్యమైన భాగం, రోజువారీ జీవితంతోపాటు, పండుగల్లో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. భారతీయ వంటకాలు ప్రాంతానికి ప్రాంతానికి మారుతుంటాయి, జాతివైవిధ్యం ఉన్న ఉపఖండంలో జనాభాల వైవిధ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది . సాధారణంగా, భారతీయ వంటకాలను ఐదు భాగాలుగా విభజించవచ్చు: అవి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతీయ వంటకాలు మరియు ఈశాన్య భారతదేశ వంటకాలు.

ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ, కొన్ని ఏకీకరణ భావాలు ఉద్భవించాయి. ఆహార తయారీలో వైవిధ్యభరిత సుగంధ ద్రవ్యాల (మసాలాలు) వినియోగానికి అగ్రస్థానం దక్కుతుంది, వీటిని వంటకపు రుచిని పెంచేందుకు, విలక్షణ రుచులు మరియు పరిమళాలను సృష్టించేందుకు ఉపయోగిస్తారు. పర్షియన్లు, మొఘలులు, యూరోపియన్ వలసదారులు మాదిరిగా చరిత్రవ్యాప్తంగా భారతదేశంలోకి ప్రవేశించిన వివిధ సంస్కృతుల ప్రజలచే ఇక్కడి వంటకాలు కూడా ప్రభావితమయ్యాయి. తందూర్ (మట్టి కమటం) మధ్య ఆసియా ప్రాంతానికి చెందినప్పుటికీ, భారతీయ మసాలాదినుసులతో చేసే చికెన్ టిక్కా వంటి భారత తందూరి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.[17]

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందిన వంటకాల్లో భారతీయ వంటకాలు కూడా ఉన్నాయి.[18] చారిత్రాత్మకంగా, వాణిజ్య సరకుల తరువాత బాగా గిరాకీ ఉన్న వస్తువుల్లో భారతీయ సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు ఉంటాయి. భారత్ మరియు ఐరోపా మధ్య సుగంధ ద్రవ్యాల వాణిజ్యం అరబ్ వ్యాపారుల పురోగమనానికి, ఆధిపత్యానికి దారితీయడంతో, వీరి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వాస్కోడిగామా, క్రిస్టోఫర్ కొలంబస్ వంటి ఐరోపా నావికులు అన్వేషణ యుగంలో భారత్‌కు కొత్త వాణిజ్య మార్గాలను కనుగొనేందుకు కారణమైంది.[19] భారతదేశంలో పుట్టిన కర్రీకి ప్రజాదరణ లభించడంతో, ఆసియావ్యాప్తంగా ఇది "పాన్-ఏషియన్" వంటగా గుర్తింపు పొందింది.[20]

వస్త్రధారణ[మార్చు]

చీరలు మరియు గాగ్రా చోళీలు (లెహంగాలు) భారతీయ మహిళల సంప్రదాయ వస్త్రధారణగా ఉన్నాయి. పురుషులకైతే సంప్రదాయ దుస్తులు దోతీ, పంచ / వేష్టి, కుర్తా. ఢిల్లీని భారత నాగరిక రాజధానిగా పరిగణిస్తున్నారు, వార్షిక ఫ్యాషన్ వీక్‌లు ఇక్కడే జరుగుతుంటాయి. భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ దుస్తులనే ధరిస్తుంటారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ మరియు పూణే నగరాలు ప్రధాన కొనుగోలు కేంద్రాలుగా ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. దక్షిణ భారతదేశంలో పురుషులు ఆంగ్లంలో మరియు తమిళ భాషలో దోతీ అని పిలిచే పొడవైన తెల్లటి వస్త్రాన్ని ధరిస్తారు. దోతీపై పురుషులు చొక్కాలు, టి-షర్టులు లేదా మరేదైనా ధరిస్తారు. మహిళలు చీర కట్టుకుంటారు, ఇది గళ్లతో ఉండే వర్ణమయ వస్త్రం. సాధారణ లేదా ఫ్యాన్సీ రవికపై దీనిని ధరిస్తారు. యువతులు మరియు మహిళలు ఈ వస్త్రధారణలో కనిపిస్తారు. బాలికలు పావడాలు ధరిస్తారు. చోళీకి కింద ధరించే పరికిణీని పావడా అని పిలుస్తారు. సాధారణంగా ఇవి రెండూ గళ్లతో నిండివుంటాయి. మహిళల అలంకరణలో బొట్టు భాగంగా ఉంటుంది. సంప్రదాయబద్ధంగా, ఎర్రటి నుదుటిబొట్టు (లేదా సింధూరం)ను కేవలం పెళ్లయిన హిందూ మహిళలు మాత్రమే పెట్టుకుంటారు, అయితే ఇప్పుడు అది మహిళల అలంకరణలో భాగమైంది. కొందరు బొట్టును మూడో నేత్రంగా భావిస్తూ పెట్టుకుంటారు. ఇది ఇతర కళ్లు చూడలేనివి కూడా గ్రహిస్తుందని, సూర్యుడు, బయటివైపు నుంచి మెదడును కాపాడుతుందని భావిస్తారు.[21] పాశ్చాత్య మరియు ఉపఖండ అలంకరణల కలయికతో భారత-పాశ్చాత్య వస్త్రధారణ ఏర్పడింది. చూడీదార్, దుపట్టా, గంచా, కుర్తా, ముందం నెరియాథమ్, షెర్వానీ, ఉత్తారియా వంటి వస్త్రాలు కూడా భారతీయుల వస్త్రధారణలో కనిపిస్తాయి.

సాహిత్యం[మార్చు]

చరిత్ర[మార్చు]

రవీంద్రనాథ్ ఠాగూర్, ఆసియా ఖండంలో మొదటి నోబెల్ గ్రహీత.[22]

భారతీయ సాహిత్యంలో ప్రారంభ భాగాలు వాక్‌పూర్వకంగా బదిలీ అయ్యాయి. సంస్కృత సాహిత్యం రుగ్వేదంతో ప్రారంభమైంది, ఇది 1500–1200 BCE కాలానికి చెందిన యజ్ఞ మంత్రాల సమాహారం. సంస్కృత ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం మొదటి సహస్రాబ్ది BCE ముగిసే సమయానికి రూపుదిద్దుకున్నాయి. సంప్రదాయ సంస్కృత సాహిత్యం మొదటి సహస్రాబ్ది CEలోని తొలి రెండు శతాబ్దాల్లో వర్థిల్లింది, తమిళ సంఘం సాహిత్యం కూడా ఇదే కాలంలో వృద్ధి చెందింది.

మధ్యయుగ కాలంలో, అంటే వరుసగా 9 మరియు 11వ శతాబ్దాల్లో కన్నడ, తెలుగు భాషా సాహిత్యాలు అభివృద్ధి చెందాయి,[23] 12వ శతాబ్దంలో మలయాళ సాహిత్యం అభివృద్ధి పరచబడింది. ఈ కాలంలోనే, బెంగాలీ, మరాఠీ భాషల్లో సాహిత్యం, హిందీ, పర్షియా మరియు ఉర్దూ మాండలికాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.

భారతదేశానికి చెందిన ప్రముఖ రచయితల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, రామ్‌ధేరి సింగ్ దినకర్, సుబ్రహ్మణ్య భారతి, కువెంపు, మిర్జా గాలిబ్, బంకించంద్ర చటర్జీ, మైఖేల్ మధుసూదన్ దత్, మున్షీ ప్రేమ్‌చంద్, ముహమ్మద్ ఇక్బాల్, దేవకి నందన్ ఖాత్రి బాగా ఖ్యాతిగాంచారు. సమకాలీన భారతదేశంలో, బాగా మన్ననలు అందుకున్న రచయితలుగా: గిరీష్ కర్నాడ్, అగ్యేయా, నిర్మల్ వర్మ, కమలేశ్వర్, వైకోమ్ ముహమ్మద్ బషీర్, ఇందిరా గోస్వామి, మహాశ్వేతా దేవి, అమృతా ప్రీతం, మాస్తి వెంకటేష్ అయ్యంగార్, ఖుర్రతుల్ ఐన్ హైదర్, తకాజీ శివశంకర పిళ్లై మరియు ఇతరులు ప్రసిద్ధులయ్యారు.

సమకాలీన భారత సాహిత్యంలో, రెండు ప్రధాన సాహితీ పురస్కారాలు ఉన్నాయి; అవి సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం మరియు జ్ఞానపీఠ్ అవార్డు. కన్నడ మరియు హిందీ ఒక్కో భాషలో ఏడు జ్ఞానపీఠ్ అవార్డులు, బెంగాలీలో ఐదు, మలయాళంలో నాలుగు, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, ఒరియా భాషల్లో మూడేసి అవార్డులు అందజేస్తారు.[24]

కావ్యాలు[మార్చు]

కురుక్షేత్ర యుద్ధం యొక్క వ్యాఖ్యాచిత్రం.ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాస కావ్యాల్లో మహాభారతం కూడా ఒకటి, ఇది 74,000లకుపైగా పద్యాలు, గద్య భాగాలు, మొత్తంమీద 1.8 మిలియన్ల పదాలు కలిగివుంది.

భారతదేశం రుగ్వేద కాలం నుంచి కావ్యాలతోపాటు, గద్య రచననకు సంబంధించిన ప్రబలమైన సంప్రదాయాలు కలిగివుంది. కావ్యాలకు తరచుగా సంగీత సంప్రదాయాలతో దగ్గరి సంబంధం ఉండేది, ఎక్కువ కావ్యాలు మతానికి ఉద్దేశించబడి ఉండేవి. రచయితలు మరియు తాత్వికులు తరచుగా కవిపండితులుగా కూడా ప్రావీణ్యత చూపించేవారు. ఆధునిక రోజుల్లో, భారత స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా కావ్యాలు జాతీయవాదం యొక్క ముఖ్యమైన అహింసా సాధనంగా పనిచేశాయి. ఈ సంప్రదాయానికి సంబంధించిన ప్రఖ్యాత ఆధునిక ఉదాహరణలను రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు K. S. నరసింహస్వామి రచనల్లో చూడవచ్చు, మధ్యయుగ కాలంలో బసవ (వచనాలు ), కబీర్ మరియు పురందరదాస్ (పాదాస్ మరియు దేవరనామాస్ ) వంటి కవులు, పురాతన కాలానికి చెందిన పురాణేతిహాసాల్లో కూడా కావ్య సంప్రదాయాన్ని గుర్తించవచ్చు. ఠాగూర్ రాసిన గీతాంజలిలోని రెండు కావ్యాలు భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయగీతాలు అయ్యాయి.

ఇతిహాసాలు[మార్చు]

రామాయణం, మహాభారతాలు భారతదేశం యొక్క అత్యంత పురాతన మరియు బాగా ప్రసిద్ధ ఇతిహాసాలుగా గుర్తింపు పొందాయి; థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలు కూడా వీటి యొక్క కొన్ని భాషాంతరాలను పురాణాలుగా స్వీకరించాయి. అంతేకాకుండా, సంప్రదాయ తమిళ భాషలో ఐదు పురాణాలు ఉన్నాయి, అవి శిలప్పధిగారం, మణిమేఘలై, చీవక చింతామణి, తిరుక్కతేవారం, కుండలకేశి.

ఇతర ప్రాంతీయ, అసంబంధ పురాణాల్లో తమిళంలో కంబ రామాయణం, కన్నడంలో ఆదికవి పంపా రచించిన పంపా భారత, కుమార వాల్మీకి రాసిన తోరవే రామాయణం, కుమారవ్యాస రచించిన కర్ణాట భారత కథా మంజరి, హిందీలో రామచరితమానస, మలయాళంలో ఆధ్యాత్మరామాయణం ఉన్నాయి.

ప్రదర్శన కళలు[మార్చు]

సంగీతం[మార్చు]

కేరళలో పంచవాద్య ఆలయ సంగీతం.
ప్రధాన వ్యాసం: భారతీయ సంగీతం

భారతదేశ సంగీతం ధార్మిక, జానపద, జనరంజక, పాశ్చాత్య మరియు శాస్త్రీయ సంగీతం వంటి బహుళ వైవిధ్యాలు కలిగివుంది. పురాతన కాలం నుంచి సంరక్షించబడుతున్న భారతీయ సంగీతానికి ఉదాహరణలు సామవేదం లోని శ్లోకాలు, వీటిని ఇప్పటికీ కొన్ని వేద శ్రౌత నైవేద్యాలలో పాడుతుంటారు. భారతదేశ శాస్త్రీయ సంగీత సంప్రదాయం హిందూ వాచకాలచే బాగా ప్రభావితమయింది. ఇందులో రెండు వేర్వేరు శైలులు ఉన్నాయి: అవి కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతం. అనేక రాగ, శ్రావ్య పద్ధతులు ఉపయోగానికి ఇది ప్రసిద్ధి చెందింది. సహస్రాబ్దికిపైగా చరిత్రను కలిగివుండటంతోపాటు, దీనిని అనేక యుగాలుగా అభివృద్ధి పరచారు. మతపరమైన స్ఫూర్తికి, సాంస్కృతిక వ్యక్తీకరణ మరియు స్వచ్ఛమైన వినోదానికి ఇది సాధనంగా నిలిచిపోయింది.

పురందరదాస్‌ను "కర్ణాటక సంగీత పితామహుడి"గా పరిగణిస్తారు (కర్ణాటక సంగీత పితామహ ).[25][26][27] భగవంతుడు పురందర విఠలా వందనంతో అతని పాటలు ముగుస్తాయి, కన్నడ భాషలో ఆయన సుమారు 475,000[28] పాటలు కూర్చినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ రోజు వీటిలో వెయ్యి మాత్రమే తెలుసు.[25][29]

నృత్యం[మార్చు]

ప్రధాన వ్యాసం: భారతీయ నృత్యం
కూచిపూడి నృత్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారిణి, సాహితీ రవళి
రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గర ఆలయ నృత్యక్షేత్రంలో ఆలయ నృత్యస్తూపం

భారతీయ నృత్యం కూడా జానపద మరియు శాస్త్రీయ రూపాలుగా విభజించబడింది. బాగా ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాల్లో పంజాబ్‌కు చెందిన భాంగ్రా, అస్సాంకు చెందిన బిహు, జార్ఖండ్, ఒడిషాలకు చెందిన చాహో, రాజస్థాన్‌కు చెందిన ఘోమర్, గుజరాత్‌కు చెందిన దాండియా, గార్బా, కర్ణాటకకు చెందిన యక్షగాన, మహారాష్ట్రకు చెందిన లావణి, గోవాకు చెందిన దెఖ్ని ఉన్నాయి. భారతదేశానికి చెందిన జాతీయ సంగీత, నృత్య, నాటక అకాడమీచే ఎనిమిది నృత్య రీతులు, ఎక్కువగా కథనాత్మక రూపాలు మరియు పురాణ అంశాలతో కూడిన రీతులు, మాత్రమే శాస్త్రీయ నృత్య హోదా పొందాయి. అవి: తమిళనాడుకు చెందిన భరతనాట్యం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కథక్, కేరళకు చెందిన కథాకళి మరియు మోహినీయాట్టం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి, మణిపూర్‌కు చెందిన మణిపూరి, ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒడిస్సి, అస్సాంకు చెందిన సత్రియా నృత్యం.

కలరిప్పయాట్టు లేదా క్లుప్తంగా కళారి ప్రపంచంలోని అత్యంత పురాతన యుద్ధ కళల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. మల్లాపురాణంలో దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయి. బౌద్ధమతం మాదిరిగానే కళారి మరియు తరువాత ఏర్పడిన ఇతర యుద్ధ కళలు చైనాకు తీసుకెళ్లబడినట్లు, దీని ఫలితంగా అక్కడ చివరకు కుంగ్-ఫు అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు. కళారి తరువాత వృద్ధి చెందిన ఇతర యుద్ధ కళల్లో గోట్కా, పెహ్లవానీ మరియు మల్ల-యుద్ధం ఉన్నాయి. ఇలా ఇక్కడ చాలా గొప్ప గర్వకారక అంశాలు ఉన్నాయి.

నాటక మరియు రంగస్థల కళలు[మార్చు]

సంగీతం, నృత్యం మాదిరిగానే భారతీయ నాటక మరియు రంగస్థల కళలకు కూడా సుదీర్ఘ చరిత్ర ఉంది. కొన్ని పురాతన నాటక రూపాల్లో కాళిదాసు యొక్క శకుంతల మరియు మేఘదూత ప్రఖ్యాతిగాంచాయి, వీటికి పూర్వం భాష నాటకరూపాలు కూడా ఉన్నాయి. పురాతనకాలం నుంచి సంరక్షించబడుతున్న రంగస్థల సంప్రదాయాల్లో 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న కేరళకు చెందిన ప్రాచీన కుటియాట్టం కూడా ఒకటి. ఇది పూర్తిగా నాట్యశాస్త్రాన్ని[30] పాటిస్తుంది. భాష యొక్క నాటకాలు ఈ కళారూపంలో బాగా ప్రసిద్ధి చెందాయి. నాట్యాచార్య (దివంగత) పద్మశ్రీ మణి మాధవ చక్యార్-ఈ కళారూపంలో సాటిలేని కళాకారుడిగా ప్రసిద్ధి చెందాడు, అభినయ ఈ ప్రాచీన నాటక సంప్రదాయం అంతరించిపోకుండా చేసింది. రాస అభినయ కళారూపంలో అతని ప్రావీణ్యత సాటిలేనిది. అభిజ్ఞానశాకుంతల, విక్రమౌర్వశియా మరియు మాళవికాగ్నిమిత్ర వంటి కాళిదాసు నాటకాలు ; భాష యొక్క స్వప్నవాసవదత్తా మరియు పంచరాత్ర ; హర్షవర్ధునుడి నాగనందను కుటియాట్టం రూపంలో ప్రదర్శించడం అతను ప్రారంభించాడు[31][32]

జానపద రంగస్థల కళా సంప్రదాయం భారతదేశంలోని చాలా భాషా ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా, గ్రామీణ భారతంలో రంగస్థల బొమ్మలాట సంప్రదాయం కూడా బాగా ప్రసిద్ధ చెందింది, దీని యొక్క చరిత్ర రెండో శతాబ్దం BCE కాలం నుంచి ఉంది. (పనినిపై పతాంజలి యొక్క వ్యాఖ్యానంలో ఇది ప్రస్తావించబడింది). సమూహ రంగస్థల కళ కూడా నగరాల్లో వర్థిల్లుతోంది, గుబ్బి వీరన్న,[33] ఉత్పాల్ దత్, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, K. V. సుబ్బన్న వంటివారు దీనిని ప్రారంభించారు మరియు నందికార్, నినాసం మరియు పృథ్వీ థియేటర్ వంటి గ్రూపులు ఇప్పటికీ ప్రదర్శనలు ఇస్తున్నాయి.

దృశ్యమాన కళలు[మార్చు]

చిత్రలేఖనం[మార్చు]

అజంతా గుహల్లోని జాతక కథలు.

ప్రారంభ భారతీయ చిత్రలేఖనాలు శిలా చిత్రలేఖనాలు, ఇవి చరిత్ర ముందు కాలానికి చెందినవి, ఈ శిలా చిత్రలేఖనాలను భీమబేక్తా వంటి ప్రదేశాల్లో గుర్తించారు, వీటిలో కొన్ని శిలాయుగానికి చెందినవి ఉన్నాయి. పురాతన గ్రంథాలు డొరాగ్ సిద్ధాంతాలను రూపురేఖలను వివరిస్తున్నాయి మరియు ఇంటి గుమ్మాలు లేదా అతిథులు ఉండే లోపలి గదులను చిత్రలేఖనాలతో అలంకరించడం సర్వసాధారణంగా ఉండేదని వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి.

అంజతా, బాగ్, ఎల్లోరా మరియు సిట్టనవసాల్‌లోని గుహ చిత్రలేఖనాలు, ఆలయ చిత్రలేఖనాలు ప్రకృతి ఆరాధనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. హిందు, బౌద్ధ లేదా జైన సంప్రదాయాలు ప్రారంభ మరియు మధ్యయుగ కాలంలో భారతదేశంలో ఈ కళను ప్రోత్సహించాయి. ముగ్గులు (రంగోళి) ఇప్పటికీ భారతీయ గుమ్మాల్లో సర్వసాధారణంగా (ఎక్కువగా దక్షిణ భారతదేశంలో) కనిపిస్తుంటాయి. మధ్యయుగ భారతదేశానికి చెందిన సంప్రదాయ చిత్రకారుల్లో రాజా రవి వర్మ ఒకరు.

ప్రసిద్ధి చెందిన కొన్ని భారతీయ కళల్లో మధుబానీ చిత్రలేఖనం, మైసూర్ చిత్రలేఖనం, రాజపుత్ర చిత్రలేఖనం, తంజావూర్ చిత్రలేఖనం, మొఘల్ చిత్రలేఖనం ఉన్నాయి; ఇదిలా ఉంటే నందలాల్ బోస్, M. F. హుస్సేన్, S. H. రాజా, గీతా వధేరా, జామినీ రాయ్ మరియు B.వెంకటప్ప[34] తదితర ఆధునిక చిత్రకారులుగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత రోజు కళాకారుల్లో, అతుల్ దోడియా, బోస్ కృష్ణమాచారి, దేవజ్యోతి రాయ్, శిబు నటేశన్ ఆధునిక యుగంలో భారతీయ కళకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అంతర్జాతీయ కళా రూపాలు కూడా భారతీయ సంప్రదాయ శైలులతో మిళితమయ్యాయి. ఇటీవలి కాలానికి చెందిన కళాకారులు అంతర్జాతీయ గుర్తింపు సాధించగలిగారు. ముంబయిలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, మైసూర్ ప్యాలస్‌లు అనేక భారత చిత్రరాజాలను ప్రదర్శిస్తున్నారు.

శిల్పకళ[మార్చు]

భారతదేశంలో శిల్పకళ మూలాలు సింధూ లోయ నాగరికత కాలంలో ఉన్నాయి, ఆ కాలానికి చెందిన రాతి, కాంస్య శిల్పాలు కూడా గుర్తించబడ్డాయి. ఆ తరువాత, హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం ఈ కళను అభివృద్ధి చేశాయి, ఆలయ శిల్పాలతోపాటు, ఎంతో సంక్లిష్టమైన కాంస్య కళాఖండాలను భారతదేశం ఉత్పత్తి చేసింది. కొన్ని పెద్ద పుణ్యక్షేత్రాలు, ఉదాహరణకు ఎల్లోరా, వివిధ రాతి భాగాలతోకాకుండా, ఒకే రాతి రూపం నుంచి మలచబడ్డాయి.

వాయువ్య ప్రాంతంలో సున్నపురాయి, నాపరాయి లేదా మట్టిలో చెక్కబడిన శిల్పాలు భారతీయ మరియు సంప్రదాయ గ్రీకు నాగరికత శైలులను ప్రతిబింబిస్తాయి, గ్రీక్-రోమన్ ప్రభావం వీటిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. మథురలోని గులాబీ ఇసుకరాయి శిల్పాలు కూడా ఇదే కాలంలో అభివృద్ధి చెందాయి. గుప్తుల కాలంలో (4 నుంచి 6వ శతాబ్దం) శిల్పకళ అత్యున్నత ప్రమాణాలను అందుకోవడంతోపాటు, దీనికి నాజుకుతనం కూడా వచ్చి చేరింది. ఈ కళారీతులు మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు చెందిన శైలులు సంప్రదాయ భారతీయ శిల్పకళను అభివృద్ధి పరిచాయి, ఆగ్నేయ మధ్య మరియు తూర్పు ఆసియావ్యాప్తంగా బౌద్ధ మరియు హిందూ శిల్పాలు ఈ శైలినే ఉపయోగించాయి.

వాస్తుకళ[మార్చు]

ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఒకటైన రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలస్.[35]

భారత వాస్తు శాస్త్రం కాలంతోపాటు, ప్రాంతాలనుబట్టి బహుళ రీతులను కలిగివుంది, ఇది ఎప్పటికప్పుడు కొత్త హంగులతో మార్పు చెందింది. ఫలితంగా చరిత్రవ్యాప్తంగా శోభ కోల్పోకుండా వాస్తు కళారూపాల అభివృద్ధి జరిగింది. భారతీయ వాస్తు కళా ఉత్పత్తుల మూలాలు కూడా సింధూ లోయ నాగరికత (2600-1900 BCE) కాలంలోనే గుర్తించబడ్డాయి, ఆ కాలానికి చెందిన నగరాలు మరియు గృహాల నిర్మాణంలో అద్భుతమైన వాస్తు ప్రణాళికలు ఉపయోగించబడ్డాయి. ఈ పట్టణాల నిర్మాణంలో, ప్రణాళికల్లో మతం లేదా రాచరికం కీలకపాత్ర పోషించినట్లు కనిపించడం లేదు.

మౌర్య మరియు గుప్త చక్రవర్తులు, వారి వారసుల కాలంలో అజంతా, ఎల్లోరా మరియు స్మారక సాంచి స్థూపం వంటి అనేక బౌద్ధ నిర్మాణ సముదాయాలు నిర్మించబడ్డాయి. ఆ తరువాత దక్షిణ భారతదేశంలో బేలూర్ వద్ద చెన్నకేశవ ఆలయం, హాలెబిడు వద్ద హోయసాలేశ్వర ఆలయం, సామంతపురా వద్ద కేశవాలయం, తంజావూర్ వద్ద బృహదీశ్వరాలయం, కోణార్క్‌లో సూర్య దేవాలయం, శ్రీరంగంలో శ్రీ రంగనాథస్వామి ఆలయం, భట్టిప్రోలు వద్ద బుద్ధ స్థూపం (చిన్న లంజ దిబ్బ మరియు విక్రమార్క కోట దిబ్బ) వంటి అనేక హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఆగ్నేయ ఆసియా నిర్మాణశైలి ప్రభావం అంగ్కోర్ వాట్, బోరోబుదూర్ మరియు ఇతర బౌద్ధ, హిందూ ఆలయ నిర్మాణాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, ఇవన్నీ దాదాపుగా సంప్రదాయ భారతీయ మత నిర్మాణాలనే పోలివుంటాయి.

ఢిల్లీలోని అక్షరధామ్, ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం.

సంప్రదాయ వాస్తు శాస్త్ర పద్ధతిని భారతదేశం యొక్క ఫెంగ్ షుయ్‌‌గా పరిగణిస్తారు, పట్టణ ప్రణాళిక, నిర్మాణశైలి, సమర్థతా అధ్యయనాలను ఇది నిర్దేశిస్తుంది. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్‌లలో ఏది పురాతనమైనదో స్పష్టంగా తెలియదు, అయితే ఇవి రెండూ కొన్ని సారూప్యతలు కలిగివుంటాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫెంగ్ షుయ్‌ను ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం కూడా సిద్ధాంతపరంగా ఫెంగ్ షుయ్‌ను పోలి ఉంటుంది, ఇది కూడా ఇంటిలో శక్తి ప్రవాహాన్ని క్రమపరిచేందుకు ప్రయత్నిస్తుంది, (దీనినే సంస్కృతంలో జీవన-శక్తి లేదా ప్రాణ అని, చైనీస్, జపనీస్ భాషల్లో చి/కి అని పిలుస్తారు), వివిధ వస్తువులు, గదులు, పదార్థాలు, తదితరాలు, ఎక్కడ ఉంచాలనే వివరాల్లో మాత్రమే ఈ రెండింటికి భేదం ఉంటుంది.

పశ్చిమ ప్రాంతం నుంచి ఇస్లామిక్ ప్రభావం కూడా రావడంతో, భారత వాస్తు రూపం కొత్త మత సంప్రదాయాలను స్వీకరించింది. ఫతేపూర్ సిక్రి, తాజ్ మహల్, గోల్ గుంబజ్, కుతుబ్ మినార్, ఢిల్లీ ఎర్రకోట ఈ శకంలో కట్టబడ్డాయి, వీటిని తరచుగా భారతదేశం యొక్క గతానుగతిక చిహ్నాలుగా ఉపయోగిస్తారు. బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క కాలనీల పాలనలో ఇండో-సార్సెనిక్ నిర్మాణశైలి అభివృద్ధి చెందింది, యూరోపియన్ గోతిక్ వంటి అనేక ఇతర నిర్మాణశైలుల కలయికతో ఇది ఏర్పడింది. ఈ తరహా నిర్మాణ శైలికి విక్టోరియా మెమోరియల్ లేదా విక్టోరియా టెర్మినస్ ప్రసిద్ధ ఉదాహరణలు.

బౌద్ధమత వ్యాప్తి కారణంగా భారత నిర్మాణశైలి తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలను ప్రభావితం చేసింది. భారత నిర్మాణశైలికి చెందిన ఆలయ దిబ్బ లేదా స్థూపం, ఆలయ శిఖరం లేదా శిఖర, ఆలయ గోపురం లేదా పగోడా మరియు ఆలయ ద్వారం లేదా తోరణలు ఆసియా సంస్కృతిలో ప్రసిద్ధ చిహ్నాలుగా నిలిచాయి, తూర్పు ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. మధ్య శిఖరాన్ని కొన్ని సందర్భాల్లో విమానంగా పిలుస్తారు. దక్షిణ ఆలయ ద్వారం లేదా గోపురం సూక్ష్మత్వం మరియు మహత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

సమకాలీన భారత నిర్మాణాలు విశ్వజనీన శైలిలో ఉంటున్నాయి. నగరాలు బాగా ఇరుగ్గా మారడంతోపాటు, అధిక జనసాంద్రత కలిగివున్నాయి. భారతదేశంలోని ఆర్ట్ డెకో భవనాలకు ముంబయిలోని నారీమన్ పాయింట్ ప్రఖ్యాతిగాంచింది. లోటస్ టెంపుల్ వంటి ఇటీవలి నిర్మాణాలు, చండీగఢ్ వంటి భారతదేశం యొక్క వివిధ ఆధునిక పట్టణాభివృద్ధులు కూడా ప్రసిద్ధి చెందాయి.

వినోదాలు మరియు క్రీడలు[మార్చు]

ప్రధాన వ్యాసం: భారతదేశంలో క్రీడలు
పతనంతిట్టా సమీపంలో అరన్ములా వద్ద పంబా నదిలో ఓనం వేడుకల సందర్భంగా వార్షిక పడవ పోటీలు.

వినోద కార్యక్రమాలు మరియు క్రీడా రంగంలో భారతదేశం అసంఖ్యాక క్రీడలను అభివృద్ధి పరిచింది. ఆధునిక తూర్పు యుద్ధ కళల మూలాలు భారతదేశంలోని పురాతన క్రీడలు మరియు యుద్ధ కళల్లో ఉన్నాయి, వీటిలో కొన్ని క్రీడలు విదేశాలకు వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు, అనంతరం ఇవి కొత్త హంగులను స్వీకరించి ఆధునికీకరించబడ్డాయి. కబడ్డీ మరియు గిల్లీ-దండా, తదితరాలు సంప్రదాయ దేశీయ క్రీడలుగా పరిగణించబడుతున్నాయి, వీటిని దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆడుతుంటారు.

బ్రిటీష్ హయాంలో ప్రవేశపెట్టబడిన కొన్ని క్రీడలు తదనంతర కాలంలో భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి: అవి ఫీల్డ్ హాకీ, ఫుట్‌బాల్ (సాకర్) మరియు ముఖ్యంగా క్రికెట్. ఫీల్డ్ హాకీ భారత అధికారిక జాతీయ క్రీడ అయినప్పటికీ, భారతదేశంలోనే కాకుండా, మొత్తం ఉపఖండంలో క్రికెట్ ఎంతో ప్రాచుర్యం సాధించింది, వినోదపరంగా, వ్యవహారపరంగా క్రికెట్ బాగా అభివృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలకు క్రికెట్ వేదికగా కూడా ఉపయోగించబడింది. రెండు దేశాల క్రికెట్ జట్లు ఏడాదికొకసారి తలపడుతుంటాయి, ఈ మ్యాచ్‌లు ఇరుపక్షాలకు ఉద్వేగభరితంగా సాగుతాయి. పోలో క్రీడ కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది.

చదరంగం, వైకుంఠపాళి, పేకాట, క్యారమ్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలు ప్రసిద్ధి చెందాయి. చదరంగం భారతదేశంలోనే కనిపెట్టబడింది.

సామర్థ్యం మరియు వేగానికి సంబంధించిన క్రీడలు కూడా భారతదేశంలో వృద్ధి చెందాయి. పురాతన భారతదేశంలో బరువులు, గోళీలు మరియు పాచికలకు రాళ్లను ఉపయోగించేవారు. రథ పోటీలు, విలువిద్య, గుర్రపుస్వారీ, యుద్ధ ఎత్తుగడలు, మల్లయుద్ధం, బరువులెత్తడం, వేట, ఈత మరియు పరుగు పందేల్లో పురాతన భారతీయులు పాల్గొనేవారు.

ప్రసిద్ధ ప్రసార మాధ్యమాలు[మార్చు]

దూరదర్శిని[మార్చు]

భారతీయ దూరదర్శిని న్యూఢిల్లీలో 1959లో ప్రారంభమైంది, ప్రారంభంలో విద్యాపరమైన ప్రసారాలకు ఉపయోగించబడింది.[36] భారతీయ బుల్లితెర కార్యక్రమాలు 1970వ దశకం మధ్యకాలంలో ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో దూరదర్శన్ రూపంలో ఒకేఒక్క జాతీయ ఛానల్ ఉండేది, ఇది ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. 1982లో జరిగిన న్యూఢిల్లీ ఆసియా క్రీడలతో భారతదేశంలో టీవీ కార్యక్రమాల్లో విప్లవం బయలుదేరింది, అదే ఏడాది భారతదేశం కలర్ టీవీని కూడా చూసింది. రామాయణ మరియు మహాభారత టెలివిజన్ ధారావాహికలకు బాగా ప్రాచుర్యం లభించింది. 1980వ దశకం చివరి భాగానికి ఎక్కువ మంది ప్రజలు సొంత టీవీలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఒకేఒక్క ఛానల్ ఉన్నప్పటికీ, టెలివిజన్ కార్యక్రమాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అందువలన ప్రభుత్వం మరో ఛానల్‌ను ప్రారంభించింది, ఇందులో కొంత భాగం జాతీయ కార్యక్రమాలు, మిగిలిన భాగం ప్రాంతీయ కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. ఈ ఛానల్‌ను మొదట DD 2గా ఆ తరువాత DD మెట్రోగా గుర్తింపు పొందింది. ఈ రెండు ఛానళ్లు ప్రాంతీయవారీగా ప్రసారం అయ్యేవి.

1991లో, ప్రభుత్వం దానియొక్క విఫణులను కేబుల్ టెలివిజన్ వరకు సడలించింది. ఆ తరువాత, అనేక టీవీ ఛానళ్లు పుట్టుకొచ్చాయి. ఈ రోజు, భారతీయ వెండితెర ఒక భారీ పరిశ్రమ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలవ్యాప్తంగా వేలాది కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. బుల్లితెర నుంచి అనేక మంది ప్రముఖ కళాకారులు పుట్టుకొచ్చారు, వీరిలో కొందరు దేశవ్యాప్త అభిమానాన్ని పొందగలిగారు. గృహిణులు, ఉద్యోగినులు, అన్నివర్గాల పురుషుల్లో TV కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇవి కొందరు చిన్న నటులను బాలీవుడ్‌లో పెద్ద స్టార్లను చేశాయి. కార్టూన్ నెట్‌వర్క్, నికెలోడెయాన్ మరియు MTV ఇండియా వంటి ఛానళ్లతో భారతీయ TV ఇప్పుడు పాశ్చాత్య TV మాదిరిగానే అనేక ఛానళ్లు కలిగివుంద.

చలనచిత్రం[మార్చు]

ప్రధాన వ్యాసం: భారతీయ సినిమా
బాలీవుడ్ నృత్యరీతి చిత్రీకరణ.

భారతదేశంలో ముంబయి ఆధారిత ప్రఖ్యాత చలనచిత్ర పరిశ్రమకు ఇవ్వబడిన అనధికారిక పేరు బాలీవుడ్. భారత చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్ మరియు ఇతర ప్రధాన చలనచిత్ర సీమలు (బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ మరియు తెలుగు) కలిసివున్నాయి, నిర్మితమయ్యే చలనచిత్రాలు, విక్రయించే టిక్కెట్ల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ పరిశ్రమగా ఇది గుర్తింపు పొందింది.

సత్యజీత్ రే, రిత్విక్ ఘటక్, గురు దత్, K. విశ్వనాథ్, ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కేసరవల్లి, శేఖర్ కపూర్, హృశికేష్ ముఖర్జీ, శంకర్ నాగ్, గిరీష్ కర్నాడ్, G. V. అయ్యర్, తదితరులు వంటి ప్రఖ్యాత చలనచిత్ర-నిర్మాతలను భారతదేశం అందించింది. (భారత చలనచిత్ర దర్శకులు చూడండి). ఇటీవలి సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ప్రపంచ చలనచిత్ర రంగంవైపు దృష్టి మరలడంతో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. అంతేకాకుండా, అనేక నగరాల్లో మల్టీప్లెక్స్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఆదాయ నమూనాలను మారుస్తున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. ఫైండింగ్ లాస్ట్ - రచన నిక్కీ స్టాఫోర్డ్
 2. "Religions Muslim" (PDF). Registrat General and Census Commissioner, India. Retrieved 2006-06-01. 
 3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 Eugene M. Makar (2007). An American's Guide to Doing Business in India. 
 4. Kaivan Munshi and Mark Rosenzweig (2005). "Why is Mobility in India so Low? Social Insurance, Inequality, and Growth" (PDF). 
 5. http://www.jamaica-gleaner.com/gleaner/20050215/life/life1.html లవ్ వర్సెస్ అరేంజెడ్ మారేజెస్, కైషా షేక్‌స్పియర్
 6. http://www.thepost.co.za/index.php?fSectionId=154&fArticleId=2613258
 7. http://www.divorcerate.org/divorce-rate-in-india.html Divorce Rate In India
 8. http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/1499679/Divorce-soars-in-India's-middle-class.html Divorce soars in India's middle class
 9. BBC న్యూస్ | సౌత్ ఏషియా | చైల్డ్ మారేజెస్ టార్గెటెడ్ ఇన్ ఇండియా
 10. http://www.unicef.org/sowc09/docs/SOWC09_Table_9.pdf
 11. http://www.hindu.com/2009/01/18/stories/2009011855981100.htm
 12. 12.0 12.1 Kalyani Menon-Sen, A. K. Shiva Kumar (2001). "Women in India: How Free? How Equal?". United Nations. Retrieved 2006-12-24. 
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 14. సింబాలిజం ఇన్ ఇండియన్ కల్చర్
 15. సౌత్ ఏషియల్ ఫోక్లోర్ - రచన పీటర్ J. క్లాస్, సారా డైమండ్, మార్గరేట్ అన్ మిల్స్
 16. నేచర్స్ వెబ్ - రచన పీటర్ H. మార్షల్
 17. "Tandoori Village Restaurant Brisbane". AsiaRooms.com. 
 18. "Indian food now attracts wider market.". Archived from the original on 2012-07-19. 
 19. Louise Marie M. Cornillez (Spring 1999). "The History of the Spice Trade in India". 
 20. "Meatless Monday: There's No Curry in India". 
 21. కామత్స్ పాత్‌పూరి: ది సిగ్నిఫికాన్స్ ఆఫ్ ది హోలీ డాట్ (బింది)
 22. http://almaz.com/nobel/literature/1913a.html
 23. "కన్నడ లిటరేచర్," ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా , 2008. ఉల్లేఖనం: "ప్రారంభ సాహిత్యం ఏమిటంటే కవిరాజమార్గ (c. AD 850), ఇది సంస్కృత నమూనాను ఆధారంగా చేసుకొని జరిగిన కావ్యరచన."
 24. "నారాయణ్, కెల్కార్ అండ్ శాస్త్రి చూజెన్ ఫర్ జ్ఞానపీఠ్ అవార్డ్", ఆల్ ఇండియా రేడియా , నవంబరు 22, 2008.
 25. 25.0 25.1 Dr. Jytosna Kamat. "Purandara Dasa". Kamats Potpourri. Retrieved 2006-12-31. 
 26. Madhusudana Rao CR. "Sri Purandara Dasaru". Dvaita Home Page. Retrieved 2006-12-31. 
 27. S. Sowmya, K. N. Shashikiran. "History of Music". Srishti's Carnatica Private Limited. Retrieved 2006-12-31. 
 28. http://www.dvaita.org/haridasa/dasas/purandara/p_dasa1.html
 29. Madhusudana Rao CR. "Sri Purandara Dasaru". Dvaita Home Page (www.dviata.org). Retrieved 2006-12-31. 
 30. Māni Mādhava Chākyār (1996). Nātyakalpadrumam. Sangeet Natak Akademi, New Delhi. పేజి.6
 31. K. A. చంద్రహాసన్, ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ (ఫెర్మామింగ్ ఆర్ట్స్), "ది హిందూ", ఆదివారం మార్చి 26, 1989
 32. మణి మాధవ చక్యార్: ది మాస్టర్ ఎట్ వర్క్ (చలనచిత్రం- ఆంగ్లం), కోవలం N. పానీకర్, సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ, 1994
 33. కామత్ (2003), p282
 34. కామత్ (2003), p283
 35. ఉమైద్ భవన్ ప్యాలస్, జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో ప్రఖ్యాత రాజమందిరంలో విడిది, జోధ్‌పూర్‌లో ప్రఖ్యాత రాజమందరి ఆకర్షణలు
 36. "A Snapshot of Indian Television History". Indian Television Dot Com Pvt Ltd. Retrieved 2006-06-01. 

మరింత చదవడానికి[మార్చు]

 • Nilakanta Sastri, K.A. (2002) [1955]. A history of South India from prehistoric times to the fall of Vijayanagar. New Delhi: Indian Branch, Oxford University Press. ISBN 0-19-560686-8. 
 • Narasimhacharya, R (1988) [1988]. History of Kannada Literature. New Delhi, Madras: Asian Educational Services. ISBN 81-206-0303-6. 
 • Rice, B.L. (2001) [1897]. Mysore Gazatteer Compiled for Government-vol 1. New Delhi, Madras: Asian Educational Services. ISBN 81-206-0977-8. 
 • Kamath, Suryanath U. (2001) [1980]. A concise history of Karnataka: from pre-historic times to the present. Bangalore: Jupiter books. OCLC 7796041. LCCN 809-5179. 
 • వర్మ, పవన్ K. బీయింగ్ ఇండియన్: ఇన్‌సైడ్ ది రియల్ ఇండియా . (ISBN 0-434-01391-9)
 • టుల్లీ, మార్క్. నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా . (ISBN 0-14-010480-1)
 • నైపాల్, V.S. India: A Million Mutinies Now [89] జర్మనీ (ISBN 0-7493-9920-1)
 • గ్రిహాల్ట్, నిక్కీ. ఇండియా - కల్చర్ స్మార్ట్ : ఎ క్విక్ గైడ్ టు కస్టమ్స్ అండ్ ఎంటిక్విటే. (ISBN 1-85733-305-5)
 • మంజరి ఉయిల్, ఫారిన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ ఇండియన్ కల్చర్ (c.600 BC టు AD 320), (ISBN 81-88629-60-X)

బాహ్యలింకులు[మార్చు]