భారతదేశ చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
North Gateway - Rear Side - Stupa 1 - Sanchi Hill 2013-02-21 4480-4481.JPG
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యము
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యము
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్య పోరాటం
భారత దేశ గణతంత్ర చరిత్ర

భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది. భారత దేశ చరిత్ర అంటే భారతదేశం, పాకిస్తాన్,ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లతో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర.

విషయ సూచిక

పాతరాతి (పాలియోలితిక్) యుగము[మార్చు]

భింబెట్కా లోని రాతి-రంగుచిత్రాలు.

మధ్య భారతదేశము లోని నర్మద నదీ పరివాహ ప్రాంతము లోని హత్నోరా లోని హొమినిడ్ అవశేషాల వల్ల భారతదేశ భూభాగమునందు పాతరాతి యుగము నుండే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవశేషాల యొక్క సరియైన కాలము తెలియకున్నప్పటికినీ, పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం రెండు నుండి ఏడు లక్షల సంవత్సరాల కాలము నాటి క్రిందవని తెలియుచున్నది. ఈ శిలాజాలు దక్షిణ ఆసియా లోనే లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశము లోని కలడ్గి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవల కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవులు ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచు యుగము నుండే ఉన్నట్లు తెలియుచున్నది. మధ్య ప్రదేశ్ లోని బింబెట్కా అను ప్రదేశములోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మనుషులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ అవుచున్నది.

కొత్తరాతి (నియోలితిక్) యుగము[మార్చు]

దక్షిణాసియా ప్రాంతంలో, కొత్తరాతి యుగపు తొలి సంస్కృతి మెహర్‌గఢ్లో క్రీ.పూ.7000 లో వర్ద్ధిల్లింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌లో ఉంది. మెహర్గఢ్‌ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు, మట్టి ఇళ్ళలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ, గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీ.పూ.5500 నాటికి, వీరు కుండలు చెయ్యడము మొదలు పెట్టినారు. అలాగే రాగి పనిముట్ల వాడకం కూడా మొదలైంది. క్రీ.పూ.2000 నాటికి వీరు అదృశ్యం అయినారు.

కంచు యుగము[మార్చు]

సరస్వతీ, సింధూ నదీ లోయల నాగరికత[మార్చు]

దస్త్రం:Indusvalleyexcavation.jpg
సింధునది ఒడ్డు పొడుగునా గల సింధూ నాగరికత. మొహంజోదారో శిథిలాలు, ప్రాచీన సమాజ కేంద్రంగా వెలసిల్లినదని చెప్పటానికి తార్కాణాలు.

వ్యవసాయాధారిత జనపదాల నుండి, పట్టణ జనావాసాల వైపు పురోగమనం మెహర్‌గఢ్‌ కాలానికీ, క్రీ.పూ.3000కు మధ్య ప్రారంభమైంది. ఈ కాలంలోనే భారతదేశపు మొట్టమొదటి పట్టణ సంస్కృతి ప్రారంభమైంది. అదే సింధు లోయ నాగరికత. హరప్పా నాగరికత అని కూడా పిలువబడే ఈ నాగరికత క్రీ.పూ. 2800 నుండి, క్రీ.పూ 1800 వరకు విలసిల్లింది. సరస్వతి, సింధు నదులూ, వాటి ఉపనదుల తీరాల వెంబడి కేంద్రీకృతమైన ఈ నాగరికత గంగ, యమున మధ్య ప్రాంతం లోను, గుజరాత్‌‌‌లోను, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోను కూడా వ్యాపించింది.

ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకూ, రోడ్లకూ, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజి పద్ధతికీ, బహుళ అంతస్తుల భవనాలకూ, పేరుగాంచింది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మేలుహ్హా అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటి సారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. సమకాలీన నాగరికతలైన సుమేరియను, ఈజిప్టు లతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దదీ, చక్కని ప్రణాళీకాబద్దమైనదీ, మరియూ బహుశా ఒకే రాజు క్రింది ఉండి ఉండవచ్చు, ఎందుకంటే ఇక్కడి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడినాయి, ఉదాహరణకు ఇటుకల కొలత, మొత్తము అన్ని సైటులలోనూ ఒకేరకముగా ఉన్నాయి!

మొహెంజో దారో ఈ నాగరికతకు కేంద్రం. దక్షిణాన బొంబాయి వరకూ, ఉత్తరాన ఢిల్లీ వరకూ, పశ్చిమాన ఇరాన్ ఎల్లల వరకూ, ఉత్తరాన హిమాలయాల వరకూ ఈ నాగరికత వ్యాపించింది. హరప్పా, దొలవీర, గన్వేరివాలా, లోథాల్‌, అనునవి ఇక్కడి ముఖ్యమైన కనుగొన్న పట్టాణాలు. సుమారుగా యాబై లక్షల జనాభా వరకూ ఉండి ఉండవచ్చు అని ఓ అభిప్రాయము. ఇప్పటివరకూ 2,500 నగరాలు కనుగొనబడ్డాయి! ముఖ్యముగా లుప్తమైన సరస్వతీ నదీ పరివాహ ప్రదేశమున ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతీ నది యొక్క మరణమే ఈ నాగరికత యొక్క మరణానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు.

వైదిక నాగరికత[మార్చు]

వేదాలతో ముడిపడ్డ ఇండో-ఆర్యన్‌ నాగరికతే వైదిక నాగరికత. వైదిక సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో-యూరోపియను రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల యొక్క ఆర్యుల ఆగమన సిద్దాంతము పై భిన్నాభిప్రాయాలున్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువుల కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. సమాజం నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు, జాతులు విలీనమై కొన్ని పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు.

వేదాలతో పాటు రామాయణము, భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుచున్నది. భగవద్గీత కూడా ఈ కాలములోనే వ్రాయబడింది.

కురు వంశం సామ్రాజ్యము వేదిక నాగరికత కాలానికి చెందినదే! ఇదే మహాభారతము లోని పోరాట భూమికను పోషించింది. క్రీ.పూ.7 వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడింది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహా జనపదాల ప్రస్తావన ఉంది.

మహాజనపదములు[మార్చు]

క్రీ.శ. 1వ శతాబ్దం నాటి నిలిచివున్న బుద్ధ విగ్రహము, గాంధారము.

క్రీ. పూ. 600నాటికి భారతదేశము లోని గంగా పరీవాహక ప్రదేశములో మరియూ సింధూ పరీవాహక ప్రదేశములలో పదహారు రాజ్యాలు విస్తరించినాయి. వీటిని మహా జనపదాలు అని పిలవడం కద్దు. ఇందులో ముఖ్యమైనవి, కురు, కోశల, మగధ, గాంధార. ఇవి ఎంత ముఖ్యమైనవంటే ఇప్పటికీ చందమామ కథలలో మనము ఈ పేర్లే చూస్తుంటాము! ఉపనిషత్తులు ఈ కాలములోనే వ్రాయబడినాయని ఓ అభిప్రాయము. ఈ కాలములో రాజ భాష సంస్కృతము. సాధారణ జన భాష మాత్రము ప్రాకృతము. గౌతమ బుద్ధుడు ఈ కాలము నాటి వాడే. జైన మతము స్థాపించిన మహా వీరుడు కూడా ఈకాలము వాడే. ఈ రెండు మతాలూ సులభంగా ఉండి ప్రాకృత భాషలో బోధించినాయి, అందువల్ల సామాన్యులు వీటిని ఎక్కువగా ఆదరించారు. జైన మతము భౌగోళికంగా ఎక్కువ వ్యాపించకపోయినప్పటికీ, బౌద్ధ మతము మాత్రము టిబెట్, జపాన్, శ్రీలంక దక్షిణ ఆసియా దేశాలుకు వ్యాపించింది.

క్రీ. పూ. 500 సంవత్సరమున ఈ ప్రాంతమును పర్షియన్లు ఆక్రమించారు. వీరు ప్రభువైన డేరియస్ 1 ఇందుకు ఆద్యుడు. పర్షియన్లు తక్షశిలను తమ రాజధానిగా చేసుకున్నప్పటికీ వీరి ప్రభావము నామ మాత్రమే. వీరు 150 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత అలెగ్జాండరు వీరిని ఓడించాడు.

మగధ సామ్రాజ్యము[మార్చు]

పదహారు జనపదాలలో మగధ ముఖ్యమైన స్థానమునకు చేరుకున్నది. మగధ తన రెండు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకొని చాలా పెద్ద సామ్రాజ్యముగా రూపొందినది, ఇది ఓ గొప్ప సైనిక శక్తిగా కూడా వెలుగొందినది.

శిశునాగ సామ్రాజ్యము[మార్చు]

శిశునాగ వంశము మగధ సామ్రాజ్యాన్ని క్రీ. పూ. 684 వ సంవత్సరాన నెలకొల్పినది. దీని రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత పాట్నా . ఈ వంశము క్రీ. పూ. 424 వరకూ పరిపాలన సాగించింది. తరువాత నంద వంశముచేత ఓడింపబడింది. ఈ కాలములో బౌద్ద మతమూ, జైన మతమూ స్థాపించబడినాయి.

నంద సామ్రాజ్యము నందవంశ స్థాపకుడు[మార్చు]

నంద వంశము మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు, నంద రాజులు నాయీబ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు.కాలాశోకుడు మరియు అతని పది మంది కుమారులను సంహరించి రాజ్యానికి వచ్చాడు. ఇతనికి మహాక్షాత్రపతి అనే బిరుదు ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మహాపద్మనందుడు (2వ పరుశురాముడిగా ప్రసిద్ధి) తెలంగాణ ప్రాంతాన్ని మగధ రాజ్యంలో విలీనం చేశాడు. కరీంనగర్ రామడుగు వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట. ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది. క్రీస్తునకు పూర్వం 5-4 శతాబ్ది నాటి నంద వంశ పాలనకు శ్రీకారం చుట్టిన.మహా పద్మనందుడు ఇలా నిధిని భూగర్భంలో నిక్షిప్తం చేసినట్టు ప్రసిద్ధమైన కథ ప్రచారంలో ఉంది.ఈ మహాపద్మనందుడు వారసుడే మౌర్య చంద్రగుప్తుడు. లక్ష కోట్ల సువర్ణ ముద్రికలను సేకరించిన.నందరాజు ఆ నిధిని గంగానది అడుగున నిక్షిప్తం చేశాడట! ‘మహాపద్మము’ ఒక సంఖ్య. దీని విలువ లక్ష కోట్లని ‘బ్రౌన్’ నిఘంటుకారుడు నిర్ణయించాడు! గంగానదికి ఆనకట్ట కట్టి నీటిని మళ్లించి ఇసుక తేలిన.నదిలో తవ్వి ఈ లక్షకోట్ల తులాల బంగారాన్ని నందుడు పూడ్చి పెట్టించాడట! కోటి టన్నుల బంగారమన్న మాట-ఇప్పటి లెక్కల్లో-! ఆ తరువాత.ఆయన నదిని మళ్లీ సువర్ణ నిధి నిక్షిప్త ప్రాంతం మీదకి మళ్లించాడట-కట్టను తెంపి...ఈ చారిత్రక వాస్తవాన్ని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన ‘చంద్రగుప్తుని స్వప్నం’ అన్న చారిత్రక రచనలో పేర్కొన్నారు. మహా పద్మనందుడన్న పేరు క్రీస్తునకు పూర్వం నాటి ఆ చక్రవర్తికి అందుకనే వచ్చిందట!!

మౌర్య వంశపాలన[మార్చు]

మౌర్య సామ్రాజ్యం (321 క్రీ.పూ. to 185 క్రీ.పూ.), మరీముఖ్యంగా క్రీ.పూ. 230 లోని విశాల సామ్రాజ్యం.

క్రీ. పూ. 321చంద్రగుప్త మౌర్యుడు ఆనాటి రాజయిన ధననందుడిని సింహాసనం నుండి పదవీచ్యుతుని చేసి తాను మౌర్య సామ్రాజ్యమును స్థాపించాడు.చంద్రగుప్తుడు ఈ నంద రాజవంశానికి చేందినవాడే చాణిక్యుడిని ధననందుడు అవమానించినందువలన చంద్రగుప్తుడు చేతనే వారి వంశాన్ని నాశానము చేసేలాగ చేశాడు.చంద్రగుప్తుని తరువాత అతని కుమారుడు బిందుసారుడు దేశానికి రాజయినాడు. ఇతని కాలములో భారతదేశము ప్రస్తుత భారతదేశము మొత్తాన్ని ఆక్రమించింది. మొదటిసారిగా ఉపఖండము మొత్తమూ ఓ జెండా క్రిందికి వచ్చినది

తరువాత ఈ సామ్రాజ్యానికి అశోక చక్రవర్తి రాజయినాడు. ఇతను రాజ్యాన్ని విస్తరించడానికి పూనుకొని కళింగ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. కానీ తరువాత ఆ రక్తపాతాన్ని చూసి మనసు మార్చుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. భారతదేశ చరిత్రకు అత్యంత పురాతన ఆధారాలు అశోకుడి కాలం నాటి శాసనాలే. వీటి ఆధారంగానే వివిధ రాజ వంశాల కాలాలు లెక్కించబడ్డాయి. ఈ రాజు వల్లనే బౌద్ధ మతము ప్రస్తుతము ఉన్నటువంటి దేశాలన్నింటిలోనూ వ్యాపించింది. అంతే కాకుండా ఈజిప్టు వంటి దేశాలకు కూడా రాయబారులను పంపించాడు. ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప పరిపాలకులలో ఒకరిగా అశోక చక్రవర్తిని పరిగణిస్తారు.

శుంగ వంశము[మార్చు]

శుంగవంశపుకాలము (సుమారు క్రీ.పూ. 1వ శతాబ్దం)నాటి దుర్గామాత శిలాఫలకము, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో లభించినది

శుంగ వంశము, క్రీ. పూ. 185 వ సంవత్సరములో సుమారుగా అశోకుని మరణానంతరము 50 సంవత్సరాల తరువాత ఏర్పాటుచేయబడింది. అప్పటి మౌర్య రాజు బృహద్రథుడు. ఇతను తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్యచేయబడినాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు. ఇతను సైనిక వందనం స్వీకరించుతున్న రాజు బృహద్రధుని చంపి, తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు.

తొలి మధ్య యుగపు రాజ్యాలు - స్వర్ణ యుగము[మార్చు]

మధ్య యుగము, ముఖ్యముగా గుప్తుల పరిపాలన కాలాన్ని స్వర్ణ యుగము అని పిలుస్తారు, ఈ కాలములో భారతదేశము చాలావరకు భౌగోళికంగా ఏకం చేయబడినది, మరియూ ఈ కాలమున రాజకీయ, సాంస్కృతిక, శాస్త్రీయ విషయములు చాలా అభివృద్ధి చేయబడినాయి. మొదటి శతాబ్దములో కుశానులు భారతదేశమును ఆక్రమించారు. వీరు మధ్య ఆసియా నుండి వచ్చారు. వీరి సామ్రాజ్యము పేశ్వారు నుండి గంగా నదీ పరీవాహక ప్రాంతము వరకూ పరిడవిల్లినది. దీనిలో పాత బాక్ట్రియా కూడా ఓ భాగంగా ఉంది. ఈ కాలంలో దక్షిణ భారత దేశంలో చాలా సామ్రాజ్యాలు పరిడవిల్లినాయి. ముఖ్యముగా తమిళనాడులో పాండ్యులు మధురైని రాజధానిగా చేసుకోని తమ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తరువాత అలెగ్జాండరు దండయాత్రల వల్ల పుట్టిన ఇండో - గ్రీకు రాజ్యాలు గాంధార రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 180 నుండి క్రీస్తు అనంతరం పదవ సంవత్సరం వరకూ పరిపాలించినాయి.

శాతవాహన సామ్రాజ్యము[మార్చు]

ఛిముకుడు శాతవాహనులలో మొదటి రాజు. హాలుడు శాతవాహనులలో గుర్తింపదగిన రాజు.

శాతవాహనులు లేదా ఆంధ్రులు దక్షిణ మరియూ మధ్య భారత దేశాన్ని పరిపాలించిన ఓ గొప్ప సామ్రాజ్యము. వీరి పరిపాలన క్రీస్తు పూర్వం 230 లో మొదలయినది. ఏకాభిప్రాయం లేకున్నప్పటికీ సుమారుగా 450 సంవత్సరాల అనంతరము ఈ సామ్రాజ్యము పరిపాలన కొనసాగినది అని చెప్పవచ్చు. ముఖ్యముగా శక రాజులతో యుద్ధాల వల్ల, సామంతుల తిరుగుబాటుల వల్ల, ఈ రాజ్యము పతనము అయినది. తరువాత చాలా చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొని వచ్చినాయి.

కుషాణు రాజ్యము[మార్చు]

కుషాణ సామ్రాజ్యము మొదటి శతాబ్దము ఆరంభములో స్థాపించబడింది. మూడవ శతాబ్దానికల్లా ఈ సామ్రాజ్యము ఉత్తాన దశకు చేరుకున్నది. ఇది తజకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ గంగానదీ పరీవాహక ప్రదేశాల మధ్య వ్యాపించింది. ఈ సామ్రాజ్యము తోచారియన్లు చే నెలకొల్పబడినది, వీరు ప్రస్తుత చైనా నుండి వచ్చారు. కానీ సాంస్కృతిక పరముగా మాత్రము వీరు భారతీయులే! వీరికి రామ్, సాస్సనియను, పర్షియా, చైనాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీరు బౌద్ద మతాన్ని చాలా దూరం వ్యాప్తి చెందించారు

గుప్త వంశము[మార్చు]

దస్త్రం:GBA16.jpg
4-6 శతాబ్దాలకు చెందిన నిలిచివున్న బుద్ధుని విగ్రహం, గుప్తులకాలం, ఉత్తరప్రదేశ్ లోని మథుర నగరంలోనిది.

నాల్గవ శతాబ్దం నుండి ఐదవ శతాబ్దం వరకూ గుప్తుల స్వర్ణ యుగమును భారతదేశము చవిచూసినది. ఈ కాలములో హిందూ సంస్కృతి, శాస్త్ర సంపద, పరిపాలన, రాజకీయ సాంఘీక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకొన్నాయి. ఆరవ శతాబ్దంలో గుప్తుల రాజ్యం పతనమైన తరువాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది.

గుప్తులు మగధను కేంద్రముగా చేసుకోని పరిపాలన చేసారు. పురాణాలు ఈ కాలములోనే వ్రాయబడినాయి అని ఓ అభిప్రాయము. హూణుల దండయాత్రల వల్ల ఈ సామ్రాజ్యము పతనము అయినది. తరువాత చిన్న సామ్రాజ్యముగా ఉన్న గుప్తులను హర్ష చక్రవర్తి పూర్తిగా ఓడించాడు.

చివరి మధ్య యుగపు రాజులు, సాంప్రదాయ యుగము[మార్చు]

క్రీ.శ7 వశతాబ్దములోని హిందూదేశము. హుయెన్సాంగుత్రోవ

ఈ కాలములో తమిళనాడులో చోళ, కేరళయందు చేర రాజ్యాలు స్థిరపడినాయి. ఇవి సుగంధద్రవ్యాలు వంటివాటిని పశ్చిమాన ఉన్న రోమను రాజ్యానికి ఎగుమతి చేసెవి. ముఖ్యముగా సముద్ర వ్యాపారము బాగా అభివృద్ధి చెందినది. స్వాతంత్ర్యము వరకూ ఏదో ఒక రూపములో నెగ్గుకొని వచ్చిన రాజపుత్ర రాజ్యాలులోని మొదటి రాజ్యము ఇప్పుడే ఏర్పడినది.

హర్షుని సామ్రాజ్యము[మార్చు]

హర్షుడు కనౌజ్ను రాజధానిగా చేసుకోని ఉత్తర భారత దేశమును ఏకం చేసాడు. ఇతను ఏడవ శతాబ్దమునకు చెందిన రాజు. కానీ ఇతని మరణానంతరము సామ్రాజ్యము కుప్పకూలిపోయింది. తరువాత ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దము వరకూ మూడు వంశాలు ఉత్తర భారత దేశముపై ఆధిపత్యముకొరకు యుద్ధాలు చేశాయి. మాల్వ నగరానికి చెందిన ప్రతిహారులు, బెంగాల్ నకు చెందిన పాలులు, దక్కనుకు చెందిన రాష్ట్రకూటులు.

చాళుక్యులు, పల్లవులు[మార్చు]

చాళుక్యులు, దక్షిణ భారతదేశమును 550 - 750 మరల 970- 1190 మధ్యా పరిపాలించారు. వీరికి పల్లవులనుండి చాలా గట్టి పోటీ ఉండేది. ఈ కాలములో రెండు రాజ్యాలూ చిన్న చిన్నయుద్ధాలు చాలా వరకూ పోరాడాయి. రెండూ పరస్పరమూ ఇతర రాజ్యాల రాజధానిని ఆక్రమించుకుంటూ ఉండేవి. శ్రీలంక మరియూ చేర రాజ్యాలు పల్లవులకూ, పాండ్య రాజులు చాళుక్యులకు సహాయము చేసివి. ఈ రెండు రాజ్యాలు కూడా చక్కని దేవాలయాల నిర్మాణాలు చేశాయి

చోళ సామ్రాజ్యము[మార్చు]

తొమ్మిదవ శతాబ్దానికల్లా చోళులు చాలా శక్తివంతమైన సామ్రాజ్యముగా ఆవిర్భవించారు. ఈ సామ్రాజ్యము 13 వ శతాబ్దములో విజయ నగర సామ్రాజ్యము స్థాపించినంత వరకూ ఓ వెలుగు వెలిగినది. వీరి ముందరి, మరియూ తరువాతి రాజుల లాగా వీరు కూడా చక్కని నిర్మాణాలు చేసారు. సాంస్కృతిక పరముగా ఈ కాలమును వీరు ఏలినారు, వీరి నిర్మాణాలను పోలిన నిర్మాణాలు ఇండోనేషియా శ్రీలంక లలో చూడవచ్చు!

ప్రతిహారులు, పాలులు, రాష్ట్రకూటులు[మార్చు]

ప్రతిహారులు లేదా గుర్జార - ప్రతిహారులు రాజస్థాన్ పరిపాలించిన రాజులు. వీరు ఆరు నుండి పదకొండవ శతాబ్దము వరకూ పరిపాలించారు. ఎనిమిది మరియూ పన్నెండవ శతాబ్దాలలో బీహారును పాల, బెంగాలును కూడా నియంత్రించింది. రాష్ట్రకూటులు దక్కనును పరిపాలించారు. చోళులు దక్షిణాదిలో చక్కగా పరిపాలిస్తుంటే ఈ మూడు రాజ్యాలూ (ప్రతిహార, పాల, రాష్ట్రకూటులు) ఉత్తరాన అధికారం కోసం పోరాటం సాగించాయి

రాజపుత్రులు[మార్చు]

తొలి రాజ పుత్రుల వివరములు రాజస్తాన్లో ఆరవ శతాబ్దములో లభిస్తున్నది. ఆ తరువాత వీరు ఉత్తర భారత దేశాన్ని చాలా వరకూ పరిపాలించారు. ఇందులో గుజరాత్, సోలంకీ, మాళ్వా, పరమారా యొక్క బుందేల్ ఖాండ్, చందేలు యొక్క హర్యానా తోమర రాజు యొక్క తోమర ఉన్నాయి. కాంచీపురాన్ని పల్లవ రాజులు నాలుగు నుండి తొమ్మిదవ శతాబ్దం వరకూ పరిపాలించారు. రాజ పుత్రులకు ముందు ఉత్తర భారత దేశాన్ని ప్రతిహారులు పరిపాలించారు. ఈ కాలములో ఇంకా యాదవ, చేర, హోయసాల, సేన పాల రాజ్యాలు పరిపాలన సాగించినాయి

ముస్లిం పరిపాలకులు[మార్చు]

పర్షియాపై అరబ్, తురుష్కు దండయాత్రల తరువాత భారతదేశంపై సుమారుగా ఓ వెయ్యి సంవత్సరాలు వివిధ చిన్న చిన్న ముస్లిం రాజుల దండయాత్రలు కొనసాగినాయి. తురుష్కు దండయాత్రలకు ముందు అరబ్బు యాత్రికులు దక్షిణ భారత దేశములో చక్కగా వ్యాపార సంబంధములు కొనసాగించారు. ముఖ్యముగా కేరళలో! పదవ పదకొండవ శతాబ్దములలో తురుష్కులు మరియూ ఆఫ్ఘానులు భారతదేశ రాజధానిపై దండెత్తి ఢిల్లీని ఆక్రమించారు. తరువాత బానిస వంశము, ఖిల్జీ వంశమూ పరిపాలన సాగించినాయి. తరువాత ముస్లింలు మొఘల్ పరిపాలకులు

విజయనగర సామ్రాజ్యము[మార్చు]

This 14th century statue depicts Shiva (on the left) and his wife Uma (on the right). It is housed in the Smithsonian Institution in Washington, D.C.

హరిహర బుక్క అను సోదరులు ఇద్దరూ కలసి తు౦గభద నది ఒడ్డున స్థాపించిన సామ్రాజ్యము, దక్షిణ భారతదేశ చరిత్రలో ఓ ఆణిముత్యముగా రూపొందినది. ఈ కాలములో శిలలు మాట్లాడినాయి, కళలు విలసిల్లినాయి, కవిత్వము ధారాళముగా ప్రవహించింది. ఈ సామ్రాజ్యాన్ని విజయ నగర సామ్రాజ్యము అని కూడా అంటారు. దీనిని 1336లో స్థాపించారు. శ్రీ కృష్ణదేవరాయలు ఈ వంశములో ప్రముఖ వ్యక్తి. 1565లో తళ్ళికొటలో బహమనీ సుల్తానుల చెతిలో ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ ఈ రాజ్యము తరువాత ఓ శతాబ్దము వరకూ పరిపాలన కొనసాగినది. వీరి ప్రభావం ఇండోనేషియా వరకూ వ్యాపించింది. వీరు చాలా సముద్ర మార్గాన్ని వారి ఆధీనంలో ఉంచుకొని విదేశాలతో వ్యాపారం చేసేవారు.

మొఘల్ సామ్రాజ్యము[మార్చు]

పదహారో శతాబ్దం తొలి నాళ్ళలో కైబర్ కనుముదాటి వచ్చిన్ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది సుమారుగా రెండు వందల సంవత్సరాలు ఉత్తర భారత దేశంను పరిపాలించినది, చివరినాళ్ళలో ముఖ్యముగా ఔరంగజేబు కాలంలో తన ఉనికిని హైదరాబాదువరకూ వ్యాపించింది. 1707 తరువాత నెమ్మదిగా నాశనమవుతూ, తరువాత పూర్తిగా నిర్మూలింపబడింది. ఈ కాలము భారతదేశము ఓ పెద్ద సాంఘిక మార్పు చవిచూసినది.

మౌర్య సామ్రాజ్యము
రాజు మొదలు చివర
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ.322 క్రీ.పూ.298
బింబిసారుడు క్రీ.పూ.297 క్రీ.పూ.272
అశోక చక్రవర్తి క్రీ.పూ.273 క్రీ.పూ.232
దశరథ మౌర్యుడు క్రీ.పూ.232 క్రీ.పూ.224
సంప్రతి క్రీ.పూ.224 క్రీ.పూ.215
శాలిశుక క్రీ.పూ.215 క్రీ.పూ.202
దేవవర్మ క్రీ.పూ.202 క్రీ.పూ.195
శతధన్వుడు క్రీ.పూ.195 క్రీ.పూ.187
బృహద్రధుడు క్రీ.పూ.187 క్రీ.పూ.185
మొఘల్ సామ్రాజ్యం
రాజు మొదలు చివర
బాబర్ 1526 1530
హుమాయూన్ 1530 1556
అక్బర్ 1556 1605
జహాంగీర్ 1605 1627
షాజహాన్ 1627 1658
ఔరంగజేబు 1658 1707

మహారాష్ట్ర పరిపాలకులు[మార్చు]

Extent of the Maratha Confederacy ca. 1760
(shown here in yellow)

మరాఠా సామ్రాజ్యము, మహారాజా శివాజీ చేత 1674లో స్థాపించబడింది. వీరు నాటి బీజాపూరు సుల్తానులను ఓడించారు. ఆ తరువాత శివాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యము పై యుద్దాన్ని ప్రకటించి ముస్లిం పరిపాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలను ఆశయంగా పెట్టుకున్నారు. పద్దెనిమిదవ శతాబ్దంనాటికి పీష్వా పరిపాలన క్రిందికి చాలా వరకు భారతదేశం వచ్చింది. 1760 నాటికి ఈ సామ్రాజ్యం అటో ఇటో ఉపఖండం మొత్తం వ్యాపించింది. ఈ విస్తరణకు అడ్డుకట్ట మూడవ పానిపట్టు యుద్దం వల్ల వచ్చింది. తరువాత చివరి పీష్వా 1761లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపొయినాడు.

మైసూరు సామ్రాజ్యము[మార్చు]

మైసూరు రాజ్యము 1400వ సంవత్సరములో వడైయారులచేత స్థాపించబడింది. ఆ తరువాత వీరి పరిపాలన హైదర్ అలీ చేత ఆటంకబరచబడినది, ముఖ్యముగా టిప్పూ సుల్తాన్ వల్ల చాలా యుద్ధాలలో వీరు ఓడించబడినారు. బ్రిటీషువారిని, మరాఠీలతో ఫ్రెంచి వారి సహాయంతో టిప్పూ సుల్తాన్ చాలా యుద్ధాలతో ఇబ్బంది పెట్టినాడు, కానీ చివరకు బ్రిటీషువారే గెలిచారు. తరువాత వడైయారులు ఈ సామ్రాజ్యమునకు పరిపాలకులుగా పరిమిత అధికారాలతో నియమించబడినారు. స్వాతంత్ర్యానంతరము ఈ రాజ్యము భారతదేశంలో కలపబడినది, ఇది ప్రస్తుత కర్ణాటక రాష్ట్రమునందు ఉంది. ఇప్పటీకీ ఈ వంశపు రాజుల చేతిలోనే మైసూరు ప్యాలస్ కలదు, వీరు మైసూరు దసరా ఉత్సవాలయందు అధికారికంగా పాల్గొంటారు.

పంజాబు చరిత[మార్చు]

పంజాబు రాజ్యము, సిక్కులచేత పరిపాలించబడినది, ఇది ముఖ్యముగా పదిమంది గురువుల ద్వారా వ్యాపించబడిన మత అవలంభికులయిన సిక్కులచేత పరిపాలింపబడింది. ఇది ప్రస్తుత పంజాబును కలిగి ఉన్నది, కానీ మహా రాజా రంజిత్ సింగ్ పరిపాలనలో మాత్రము కాశ్మీరు, పేశ్వారు వరకూ వ్యాపించింది.

తరువాత ఆంగ్లో - సిక్కు యుద్దంలో వీరు ఓడింపబడినారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన[మార్చు]

రాబర్ట్ క్లైవు, బ్రిటిష్ వారి, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ గా.

వాస్కోడిగామ 1498లో భారతదేశానికి దగ్గర దారిని కనుగొని యూరోపు దేశాల కాలనీ పరిపాలనకు ద్వారాలు తెరిచాడు.

1619లో సూరత్లో బ్రిటీషువారు తమ తొలి పోష్టును ఏర్పాటుచేసుకున్నారు. తరువాత పోర్చుగీసువారు, డచ్చి వారు (బుడత కీచులు) కూడా వచ్చే సరికి, తమ పోష్టును మద్రాసునకు మార్చుకున్నారు. ఆ తరువాత బొంబాయి, కలకత్తాలలో కూడా వ్యాపార కేంద్రాలు ఏర్పాటుచేసుకున్నారు. ఇవి అన్నీ కూడా మొదట వాటి వాటి పాలకుల అనుమతితోనే జరిగినాయి.

పోర్చుగీసువారు గోవా, డామన్, డయ్యూ, బొంబాయిలలో ఏర్పాటు చేసుకున్నారు. అవి 1962 వరకూ వారి ఆధీనములోనే ఉన్నాయి, తరువాత నెహ్రూగారు తమ యుక్తితో పోలీసు చర్య ద్వారా వాటిని స్వాధీనము చేసుకున్నారు.

ఫ్రెంచివారుకూడా బ్రిటీషు తోపాటు 17 వ శాతాబ్దంలోనే వచ్చారు. కానీ బ్రిటీషువారితో యుద్ధాలతో వీరు పరాజితులై వెనుదిరితినారు, కానీ పాండిచ్చేరి, చందరనగర్ వీరితోనే ఉన్నాయి.

డచ్చివారు, భారతదేశం వచ్చినప్పటికీ ఎక్కువగా ఏమీ సాధించలేదు, ట్రావెనుకోరు మాత్రం వారికి వచ్చినది, ముఖ్యముగా వారు శ్రీలంక పైననే దృష్టిసారించారు. వీరు కేరళలోని రాజులకు యుద్ధ శిక్షణ ఇచ్చారు.

బ్రిటిషు వారి పాలన[మార్చు]

బ్రిటిషు మొదట వ్యాపారం నిమిత్తము దేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు మీద వచ్చి, చంద్రగిరి రాజు దగ్గర అనుమతి తీసుకోని చెన్నై వద్ద ఓ కోట నిర్మించుకోని (తమ సరుకుల రక్షణ కోసం) వ్యాపారం సాగించారు. అప్పటి నుండి ఇక్కడి రాజుల మధ్య తగాదాలలో తలదూరుస్తూ, తమ స్వార్దమే పరమావధిగా మారుతూ, విభజించి పాలిస్తూ ఇతర ఐరోపా కంపెనీలపై పైచేయి సాధిస్తూ తమ కుటిల నీతితో దేశాన్ని ఒక్కో భాగాన్ని కబలించారు. ముఖ్యముగా 1757లోని ప్లాసీ యుద్దంతో మొత్తం అప్పటి బెంగాలు ప్రావిన్సును ఆక్రమించారు. తరువాత తరువాత అవే కుటిలనీతితో మొత్తం దేశాన్ని ఆక్రమించారు.

1857లో భారతీయులు తమ ప్రథమ స్వాతంత్ర్య పోరాటం సాగించారు, కానీ అది విజయం సాధించలేక పోయింది.

భారత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రకే తలమానికమైనది. అహింసాయుత పద్ధతిలో సత్యాగ్రహమే ఆయుధంగా మహాత్మా గాంధీ నడిపించిన పోరాటం ఇతర దేశాలకు మార్గదర్శ కంగా నిలిచి, ప్రపంచాన్ని శాంతిమయం చేయడానికి మార్గం చూపించింది. భారత స్వాతంత్ర్య పోరాటం చాలా కాలం కొనసాగింది. తొలిసారి భ్రిటీషువారు దేశానికి వచ్చినప్పటినుండి రాజులు తమ తమ రాజ్యాలు రక్షించుకోవడానికి చాలా యుద్ధాలు చేసారు. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య పోరాటం దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. తరువాత ఎన్నో పోరాటాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు లాంటి దేశ భక్తులు బ్రిటీషు వారి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, తమ ప్రాణాలను అర్పించారు. వందేమాతరం అంటూ బెంగాలు ప్రజలను కార్యోన్ముఖులను చేసిన వంగ ఐక్యోద్యమం ఇటువంటి పోరాటాల్లో ముఖ్యమైనది. తరువాత జరిగిన పోరులో మహాత్మా గాంధీ కాంగ్రెసు పార్టీ ద్వారా భారతీయులందరినీ ఓ తాటిపై నడిపి, అహింసా పోరాటం జరిపి, భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాడు. ఇదే కాలంలో సుభాస్‌చంద్ర బోసు వంటి వీరులు సాయుధ పోరాటం చేసి, తమ ప్రాణాలను భరత మాత పాదాల చెంత వదిలినారు.

కోట్ల మంది భారతీయుల పోరాట ఫలితంగా '1947ఆగష్టు 15 న భారతదేశం స్వతంత్రం సాధించింది.

ఇంకా చూడండి[మార్చు]

భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర jai hind

బయటి లింకులు[మార్చు]

దోపిడి పాలనకు దండకాలా? an article in eenaadu paper |