కోసల
కోసలరాజ్యం
Kingdom of Kosal कोसल राज्य | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
c. 7th century BCE[1]–5th century BCE | |||||||||
Kosal and other kingdoms of the late Vedic period. | |||||||||
Kosal and other Mahajanapadas in the Post Vedic period. | |||||||||
రాజధాని | Shravasti and Ayodhya | ||||||||
సామాన్య భాషలు | Sanskrit | ||||||||
మతం | Hinduism Buddhism Jainism | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
Maharaja | |||||||||
చారిత్రిక కాలం | Bronze Age, Iron Age | ||||||||
• స్థాపన | c. 7th century BCE[1] | ||||||||
• పతనం | 5th century BCE | ||||||||
| |||||||||
Today part of | India Nepal |
కోశల రాజ్యం ఒక పురాతన భారతీయ రాజ్యం. ఇది ప్రస్తుత ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ [2] ప్రాంతంలో ఉంటుంది. వేద కాలం చివరలో ఇది ఒక చిన్న రాజ్యంగా ఉద్భవించింది. పొరుగున ఉన్న విదేహ రాజ్యానికి అనుసంధానితమై ఉన్నాయి.[3][4] కోశల " నార్తర్ను బ్లాకు పాలిష్డు వేర్ " (ఉత్తర మెరుగుపెట్టబడిన నల్లని పాత్రలు) సంస్కృతికి చెందినది (క్రీ.పూ. 700-300),. [1] కోశల ప్రాంతం జైన మతం, బౌద్ధమతంతో సహా శ్రమణ ఉద్యమాలకు నాంది పలికింది. [5] పట్టణీకరణ, ఇనుము వాడకం వంటి స్వతంత్ర అభివృద్ధి తరువాత పశ్చిమాన కురు-పంచాల వేద ఆర్యుల " పెయింటెడ్ గ్రే వేర్ " (చిత్రీకరించిన బూడిదవర్ణ పాత్రలు) సంస్కృతి నుండి ఇది సాంస్కృతికంగా భిన్నంగా ఉంది.[6]
క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో కోశల భూభాగాన్ని శాక్య వంశం (బుద్ధునికి చెందిన వంశం) చేర్చుకుంది. బౌద్ధ గ్రంధాలు అంగుత్తర నికాయ, జైన గ్రంథం, భగవతి సూత్రం ప్రకారం, కోశల క్రీస్తుపూర్వం 6 - 5 వ శతాబ్దాలలో సోలాసా (పదహారు) మహాజనపదాలలో (శక్తివంతమైన రాజ్యాలలో) ఒకటిగా ఉండేది.[7] దాని సాంస్కృతిక, రాజకీయ బలం దీనికి హోదాను, గొప్పశక్తిని ఇచ్చింది. ఏదేమైనా తరువాత ఇది పొరుగు రాజ్యమైన మగధతో వరుస యుద్ధాల ద్వారా బలహీనపడింది. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో చివరకు దాని ద్వారా ఆక్రమించబడింది. మౌర్య సామ్రాజ్యం పతనం తరువాత, కుషాను సామ్రాజ్యం విస్తరించడానికి ముందు కోశలను దేవా రాజవంశం, దత్తా రాజవంశం, మిత్రా రాజవంశం పాలించాయి.
మతగ్రంధాల ఆధారాలు
[మార్చు]పురాణాలలో
[మార్చు]ప్రారంభ వేద సాహిత్యంలో కోశల గురించి ప్రస్తావించబడలేదు. కాని తరువాత చివరి సతపాత బ్రాహ్మణ (క్రీస్తుపూర్వం 7 వ -6 వ శతాబ్దాలు [8]గ్రంధం క్రీ.పూ. 300,[9]) కల్పసూత్రాలు (క్రీ.పూ 6 వ శతాబ్దం)).[10]
రామాయణం, మహాభారతం, పురాణాలలో కోశల రాజ్యాన్ని పాలించిన కుటుంబం ఇక్ష్వాకు రాజవంశానికి ఇక్ష్వాకు రాజు మూలపురుషుడుగా ఉన్నాడు.[11] పురాణాలు ఇక్ష్వాకు రాజవంశం రాజుల జాబితాలను ఇక్ష్వాకు నుండి ప్రసేనాజిత్తు (పాలి: పసేనాడి) వరకు ఇస్తాయి. రామాయణం ఆధారంగా రాముడు తన రాజధాని అయోధ్య నుండి కోసల రాజ్యాన్ని పరిపాలించాడు.[12]
బుద్ధ, జైన గ్రంధాలు
[మార్చు]24 వ తీర్థంకరుడు మహావీరుడు కోశలలో బోధించాడు. బౌద్ధ గ్రంథం, మజ్జిమా నికాయ బుద్ధుడిని కోశల పౌరుడుగా పేర్కొంది. ఇది కోసల శాక్య వంశం కోశలను ఆక్రమించి ఉండవచ్చని సూచిస్తుంది. ఇది బుద్ధుడు కోశల పౌరుడనిసాంప్రదాయకంగా విశ్వసిస్తారు. [14]
చరిత్ర
[మార్చు]మౌర్యులకు - పూర్వం
[మార్చు]మహాకోసల కాలంలో పొరుగున ఉన్న కాశీ రాజ్యం కోసల రాజ్యంలో అంతర్భాగంగా మారింది.[15]మహాకోసల కుమార్తె కోసలదేవు మగధ రాజు బింబిసారా (క్రీ.పూ. 5 వ శతాబ్దం) తో వివాహం చేసుకుంది.[16] మహాకోసల తరువాత అతని కుమారుడు ప్రసేనజిత్తు (ప్రసేనాజిత్) (క్రీ.పూ 5 వ శతాబ్దం) బుద్ధుని అనుచరుడు. ప్రసేనజిత్తు రాజధానిలో లేనప్పుడు అతని మంత్రి దిఘా చారాయణ ప్రసేనజిత్తు కుమారుడు విరూధకని సింహాసనాధిష్టుని చేసాడు.[17]
విరూధకుని పాలనలో బాగోచియా రాజవంశానికి చెందిన రాజా బిరు సేను బుద్ధుడికి చెందిన శాక్య వంశం మీద దాడి చేసి ఈ భూభాగాన్ని కోశల సార్వభౌమత్వానికి తీసుకువచ్చాడు.[18]చాలా కాలం తరువాత కోసల రాజ్యాన్ని మగధ హర్యంకా రాజవంశంలోని అజతశత్రు (క్రీ.పూ 5 వ లేదా 4 వ శతాబ్దం) చేతిలో ఓడించి [19] మౌర్య సామ్రాజ్యానికి ఆధారం అయిన మగధ రాజ్యంలో చేర్చబడి కోసలా చివరకు శిశునాగా చేత విలీనం చేయబడింది.[20]
మౌర్య పాలనలో
[మార్చు]మౌర్యపరిపాలనలో పరిపాలనాపరంగా కోశల కౌశాంబి వైస్రాయు పాలనలో ఉంది.[21] చంద్రగుప్త మౌర్య పాలనలో జారీ చేయబడిన సోహ్గౌరా తాంర శాసనంలో శ్రావస్తిలో కరువు గురిజ్చి అధికారులు అనుసరించాల్సిన సహాయక చర్యల గురించి వివరిస్తుంది.[22] గార్గ సంహితలోని యుగ పురాణ విభాగం చివరి మౌర్య పాలకుడు బృహద్రాత పాలనలో యవన (ఇండో-గ్రీకు) దండయాత్ర, తరువాత సాకేతు ఆక్రమణ గురించి ప్రస్తావించింది. [23]
మౌర్యుల - తరువాత కాలం
[మార్చు]అయోధ్యలో అధికంగా కనుగొనబడిన మౌర్యానంతర కాలంలోని కోశల పాలకుల జారీ చేసిన చదరపు రాగి నాణేల నుండి కోశల పాలకుల వంశానికి చెందిన పలువురి పాలకుల పేర్లు తెలుసుకొనవచ్చు.[24] దేవ రాజవంశ పాలకులు: ములదేవ, వాయుదేవ, విశాఖదేవ, ధనదేవ, నారదత్త, జ్యస్తదత్త, శివదత్త. శుంగ పాలకుడు వసుమిత్ర హంతకుడైన ములాదేవుడితో నాణేల రాజు ములాదేవ గుర్తించబడతాడో లేదో తెలుసుకోవడానికి మార్గం లేదు (చరిత్రకారుడు జగన్నాథు అలా చేయడానికి ప్రయత్నించాడు).[25] నాణేల రాజు ధనదేవను అయోధ్య శాసనం రాజు ధనదేవ (క్రీ.పూ. 1 వ శతాబ్దం)గా గుర్తించారు. ఈ సంస్కృత శాసనంలో కౌశికీపుత్ర ధనదేవ రాజు తన తండ్రి ఫల్గుదేవా జ్ఞాపకార్థం కేతనా (జెండా-సిబ్బంది) ను అమర్చడం గురించి ప్రస్తావించాడు. ఈ శాసనంలో అతను పుష్యమిత్ర శుంగా వంశానికి చెందిన ఆరవ వ్యక్తిగా పేర్కొన్నాడు. ధనదేవ పోత నాణేలు, డై-స్ట్రకు నాణాలు తయారు చేసాడు. రెండు రకాలు ఒక ఎద్దును కలిగి ఉన్నాయి.[26][27]
కోశలాలో లభించిన ఇతర స్థానిక పాలకుల నాణాలు: "-మిత్రా" తో ముగుస్తున్న పాలకుల బృందం వారి నాణేల నుండి కూడా పిలుస్తారు: సత్యమిత్ర, ఆర్యమిత్ర, విజయమిత్ర, దేవమిత్ర, కొన్నిసార్లు "కోశల లేట్ మిత్రా రాజవంశం" అని పిలుస్తారు.[28] వారి నాణేల నుండి తెలిసిన ఇతర పాలకులు: కుముదసేన, అజవర్మ, సంఘమిత్ర.[29]
భౌగోళికం
[మార్చు]కోశల ప్రాంతంలో మూడు ప్రధాన నగరాలు ఉన్నాయి. అయోధ్య, సాకేతు, శ్రావస్తి నగరాలతో సేతావ్య, ఉకత్తా [30] దండకప్ప, నలకపన, పంకధ వంటి అనేక చిన్న పట్టణాలు ఉన్నాయి.[31] పురాణాలు, రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇక్ష్వాకు, అతని వారసుల పాలనలో అయోధ్య కోసల రాజధానిగా ఉంది.[32]మహాజనపద కాలంలో (క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దాలు)శ్రావస్తిని కోసల రాజధానిగా ఉంది. [33] కాని మౌర్యానంతర (క్రీస్తుపూర్వం 2 వ -1 వ శతాబ్దాలు) రాజులు తమ నాణేలను అయోధ్య నుండి విడుదల చేశారు.
సంస్కృతి, మతం
[మార్చు]కోసల " నార్తరను బ్లాక్ పాలిషు వేర్ " (ఉత్తర మెరుగుపెట్టిన నల్లని పాత్రలు) సంస్కృతికి చెందినది (క్రీ.పూ. 700-300), [1] దీనికి ముందు బ్లాక్ అండ్ రెడ్ వేర్ కల్చర్ (క్రీ.పూ. 1450-1200 క్రీ.పూ. 700-500 వరకు). సెంట్రలు గంగా మైదానం దక్షిణ ఆసియాలో తొలి సారిగా వరి సాగిన ప్రాంతంగా గుర్తించబడుతుంది. క్రీస్తుపూర్వం 700 లో ఇనుప యుగంలోకి ప్రవేశించింది.[1] జెఫ్రీ శామ్యూలు అభిప్రాయం ఆధారంగా టిం హాప్కిన్సు తరువాత, సెంట్రలు గంగా మైదానం సాంస్కృతికంగా కురు-పంచాలాలోని వేద ఆర్యుల " పెయింటెడ్ గ్రే వేర్ " చిత్రీకరించిన బూడిద వర్ణ పాత్రలు " సంస్కృతికి భిన్నంగా ఉంది. పట్టణీకరణ, ఇనుము వాడకం అభివృద్ధిని చూసింది.[6]
స్థానిక మతాలు, బౌద్ధమతం పెరుగుదలకు ముందు, తరువాత వేద-బ్రాహ్మణ సంప్రదాయాల ప్రభావం యౌకా, సంరక్షక దేవతలతో సహా లౌకికా లేదా ప్రాపంచిక దేవతల మీద కేంద్రీకృతమై ఉన్నాయి.[34] శామ్యూలు అభిప్రాయం ఆధారంగా "సంతానోత్పత్తి, పవిత్రత మతానికి విస్తృతమైన ఐకానోగ్రాఫికలు ఆధారాలు ఉన్నాయి.[35]హాప్కిన్సు అభిప్రాయం ఆధారంగా ఈ ప్రాంతం
... స్త్రీ శక్తుల ప్రపంచం, సహజ పరివర్తన, పవిత్ర భూమి, పవిత్ర స్థలాలు, రక్తబలి, వారి సమాజం తరపున కాలుష్యాన్ని అంగీకరించిన కర్మవాదులు.[35]
కురు-పంచాల ప్రాంతాలలో అభివృద్ధి చెందుతున్న బ్రాహ్మణ సంప్రదాయాలకు విరుద్ధంగా కోసల ప్రాంతం "బౌద్ధులు, జైనులతో సహా ప్రారంభ సన్యాసి ఉద్యమాలు ఏర్పడ్డాయి. ఇది ఉపనిషత్తులకు, బ్రాహ్మణ సంప్రదాయాలలో అభివృద్ధికి కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం . "[5] శామ్యూల్సు అభిప్రాయం ఆధారంగా బౌద్ధమతం ఇప్పటికే స్థాపించబడిన వేద-బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రదర్శితమైన నిరసన కాదు. ఇది కురు-పంచాలలో అభివృద్ధి చెందింది. కానీ ఈ వేద-బ్రాహ్మణ వ్యవస్థ పెరుగుతున్న ప్రభావానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణులు అందుకున్న ఉన్నత స్థానంపట్ల చూపించిన వ్యతిరేకత " భావించవచ్చు. [36]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Samuel 2010, p. 50.
- ↑ Mahajan 1960, p. 230.
- ↑ Samuel 2010, p. 61–63.
- ↑ Michael Witzel (1989), Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, 97–265.
- ↑ 5.0 5.1 Samuel 2010, p. 48.
- ↑ 6.0 6.1 Samuel 2010, p. 50-51.
- ↑ Raychaudhuri 1972, pp. 85–6.
- ↑ "Early Indian history: Linguistic and textual parametres." in The Indo-Aryans of Ancient South Asia, edited by G. Erdosy (1995), p. 136
- ↑ The Satapatha Brahmana. Sacred Books of the East, Vols. 12, 26, 24, 37, 47, translated by Julius Eggeling [published between 1882 and 1900]
- ↑ Law 1926, pp. 34–85
- ↑ Raychaudhuri 1972, pp. 89–90
- ↑ Raychaudhuri 1972, pp. 68–70
- ↑ Marshall p.59
- ↑ Raychaudhuri 1972, pp. 88–9
- ↑ Raychaudhuri 1972, p. 138
- ↑ what-buddha-said.net, Mahākosala Archived 2018-05-20 at the Wayback Machine
- ↑ Raychaudhuri 1972, p. 186
- ↑ History of Hathwa Raj by G.N.Dutt https://archive.org/stream/historyofhutwara00dutt/historyofhutwara00dutt_djvu.txt
- ↑ Sastri 1988, p. 17.
- ↑ Upinder Singh 2016, p. 272.
- ↑ Mahajan 1960, p. 318
- ↑ Thapar 2001, pp. 7–8
- ↑ Lahiri 1974, pp. 21–4
- ↑ Bhandare (2006)
- ↑ Lahiri 1974, p. 141n
- ↑ Bhandare 2006, pp. 77–8, 87–8
- ↑ Falk 2006, p. 149
- ↑ Proceedings - Indian History Congress - Volume 1 - Page 74
- ↑ Papers on the Date of Kaniṣka, Arthur Llewellyn Basham Brill Archive, 1969, p.118
- ↑ Raychaudhuri 1972, p. 89.
- ↑ Law 1973, p. 132.
- ↑ Pargiter 1972, p. 257.
- ↑ Samuel 2010, p. 71.
- ↑ Samuel 2010, p. 101-113.
- ↑ 35.0 35.1 Samuel 2010, p. 61.
- ↑ Samuel 2010, p. 100.
మూలాధారాలు
[మార్చు]- Bhandare, S. (2006), Numismatic Overview of the Maurya-Gupta Interlude in P. Olivelle (ed.), Between the Empires: Society in India 200 BCE to 400 CE, New York: Oxford University Press, ISBN 0-19-568935-6.
- Falk, H. (2006), The Tidal Waves of Indian History in P. Olivelle (ed.), Between the Empires: Society in India 200 BCE to 400 CE, New York: Oxford University Press, ISBN 0-19-568935-6
- Lahiri, B. (1974), Indigenous States of Northern India (Circa 300 B.C. to 200 A.D.), Calcutta: University of Calcutta
- Law, B. C. (1973), Tribes in Ancient India, Poona: Bhandarkar Oriental Research Institute
- Law, B.C. (1926), Ancient Indian Tribes, Lahore: Motilal Banarsidass, ISBN 9781406751802
- Mahajan, V.D. (1960), Ancient India, New Delhi: S. Chand, ISBN 81-219-0887-6
- Pargiter, F.E. (1972), Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass
- Raychaudhuri, H.C. (1972), Political History of Ancient India, Calcutta: University of Calcutta
- Samuel, Geoffrey (2010), The Origins of Yoga and Tantra: Indic Religions to the Thirteenth Century, Cambridge University Press, pp. 61–63.
- Thapar, R. (2001), Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X
- Sastri, K. A. Nilakanta, ed. (1988) [1967], Age of the Nandas and Mauryas (Second ed.), Delhi: Motilal Banarsidass, ISBN 81-208-0465-1
- Singh, Upinder (2016), A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century, Pearson, ISBN 978-81-317-1677-9