ఢిల్లీ
?ఢిల్లీ ఢిల్లీ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 28°37′N 77°14′E / 28.61°N 77.23°ECoordinates: 28°37′N 77°14′E / 28.61°N 77.23°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
1,484 కి.మీ² (573 sq mi) • 239 మీ (784 అడుగులు)[1] |
జిల్లా (లు) | |
జనాభా • జనసాంద్రత • Metro |
11,954,217 (2nd) (2007 నాటికి) • 11,463/కి.మీ² (29,689/చ.మై) • 1.7 కోటి[2] (2007) |
అధికార భాష | హిందీ, పంజాబీ, ఉర్దూ |
ముఖ్యమంత్రి | అరవింద్ కేజ్రివాల్ |
లెఫ్టినెంట్ గవర్నర్ | |
మేయర్ | ఆర్తిమెహ్రా |
Legislature (seats) | ఒకే చట్టసభతో కూడిన ప్రభుత్వం (70) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 110 xxx • +011 • INDEL • DL-xx |
వెబ్‌సైటు: delhigovt.nic.in |
ఢిల్లీ వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి.జాతీయ రాజధాని ప్రదేశం (నేషనల్ కేపిటల్ టెర్రిటరీ). ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇందులో ప్రధాన విభాగాలు. జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. దేశం నలుమూలలనుండి రాజధాని నగరానికి ప్రజలు వలస వస్తుండడంవల్ల అక్కడ జనం వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అందువలన చుట్టుప్రక్కల నగరాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయంతో జాతీయ రాజధాని ప్రదేశాన్ని ఏర్పరచారు.
- భారతదేశం రాజధాని: క్రొత్త ఢిల్లీ నగరం క్రొత్త ఢిల్లీ (ఆంగ్లం:New Delhi) (హిందీ: नई दिल्ली (నయీ దిల్లీ) ఇది భారతదేశపు రాజధాని. దీని విస్తీర్ణం 42.7 చదరపు కి.మీ. క్రొత్త ఢిల్లీ, ఢిల్లీ మెట్రోపాలిత ప్రాంతంలో ఉంది. ఇది భారత ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంది.ఈ నగరాన్ని 20వ శతాబ్దంలో యునైటెడ్ కింగ్ డంకు చెందిన ఎడ్విన్ లుట్‌యెన్స్ నిర్మాణ నమూనా తయారుచేశాడు. ఈ నగరం తన విశాల మార్గాలు, వృక్ష-వరుసలు, అనేక సౌధాల కొరకు ప్రసిద్ధి.
- పాత ఢిల్లీ :ఇది ఢిల్లీ నగరం లోని ఒక భాగం.దీనిని 1639 లో షాజహానాబాద్ పేరుతో షాజహాన్ దీనిని తన రాజధానిని ఆగ్రా నుండి మార్చుటకు దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1639 లో ప్రారంభమై 1648 లో పూర్తయింది. అప్పటి నుండి 1857 లో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ ఇది వారికి రాజధానిగా ఉంది.[3]
- ఢిల్లీ కంటోన్మెంటు :దీనిని ఢిల్లీ కాంట్ అని కూడా పిలుస్తారు.ఇది 1914 లో స్థాపించబడింది.1938 ఫిబ్రవరి వరకు, కంటోన్మెంట్ బోర్డు ఢిల్లీని, కాంట్ అథారిటీ అని పిలుస్తారు.కంటోన్మెంట్ వైశాల్యం సుమారు 4,258 హెక్టార్లు (10,521 ఎకరాలు) లలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం దీని పరిధిలో 59 పట్టణాలు, 165 గ్రామాలు ఉన్నాయి.2006 భారత కంటోన్మెంట్సు చట్టంప్రకారం, కంటోన్మెంట్ బోర్డుచే నిర్వహించబడుతుంది.[4]
సమీప పట్టణాలు[మార్చు]
- హర్యానా లోని ఫరీదాబాద్, గుర్‌గావ్ పట్టణాలు
- ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, నోయిడా (న్యూ ఒక్లహా ఇండస్ట్రియల్ డెవెలెప్మెంట్ అధారిటీ - నోయిడా) ప్రాంతాలు
చరిత్ర[మార్చు]
ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలసినాయి, పతనమైనాయి. మహాభారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు "ఇందర్‌పాత్" అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగయ్యింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో బయటపడినాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే "ఏడు సామ్రాజ్యాల రాజధాని"గా ఢిల్లీని వర్ణిస్తారు.
ఒక ప్రక్క గంగా-యమునా మైదానానికి, మరొక ప్రక్క ఆరావళీ-వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో ఉన్నందున పురాతన కాలం నుండి ఢిల్లీ ప్రధాన వర్తక మార్గాలకు కూడలిగా ఉంది. ఆ కారణంగానే అక్కడ రాజ్యాధికారాలు, విద్య, సంస్కృతి వర్ధిల్లాయి.
మౌర్యసామ్రాజ్యం కాలం నాటి (క్రీ.పూ. 300) ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పటినుండి ఢిల్లీ అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లింది. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలంనాటి శాసనం 1966లో కనుగొన్నారు. ఫిరోజ్‌షా తుగ్లక్ రెండు అశోకుని కాలంనాటి శాసన స్తంభాలను ఢిల్లీకి తెచ్చాడు. కుతుబ్ మినార్ వద్ద ప్రసిద్ధి చెందిన ఉక్కు స్తంభం గుప్తవంశము, కుమారగుప్తుడు సా.శ. 320-540 మధ్యకాలంలో తయారు చేయించబడింది. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీకి తెచ్చారు.
ఢిల్లీ ప్రాంతంలో 8 ప్రధాన నగరాలు వర్ధిల్లాయి. వాటిలో 4 ఇప్పటి ఢిల్లీకి దక్షిణాన ఉన్నాయి.
మధ్యకాలపు చరిత్రనుండి చూస్తే ఢిల్లీలో 7 నగరాలను గుర్తింపవచ్చును. కొన్నింటి అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి.
- కిలా రాయి పితోడా- పృథ్వీరాజ్ చౌహాన్ చే నిర్మితం - లాల్‌కోట వద్ద పాత రాజపుత్ సెటిల్‌మెంటు వద్ద;
- సిరి - 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించినది;
- తుగ్లకాబాద్ - 1321-1325 మధ్య ఘియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించింది;
- జహానపనా - 1325-1351 మధ్య ముహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించింది;
- కోట్లా ఫిరోజ్ షా - 1351-1388 మధ్య ఫిరోజ్‌షా తుగ్లక్ నిర్మించింది;
- పురానా కిలా - 1538-1545 మధ్య షేర్ షా సూరి నిర్మించింది, అదే ప్రాంతంలో హుమాయూన్ నిర్మించిన దిన్‌పనా (ఇదే ఇంద్రప్రస్థం అని అంటారు);
- షాజహానాబాద్ - 1638-1649 మధ్య షాజహాన్ నిర్మించింది. ఆగ్రా కోట, ఎఱ్ఱకోట, చాందినీచౌక్ ఇందులోనివే.
1857 నుండి, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత, ఢిల్లీ బ్రిటిష్‌వారి అధీనంలోకి వచ్చింది. అప్పుడు బ్రిటిషువారు కలకత్తానుండి రాజ్యం చేస్తున్నందువలన ఢిల్లీ రాజధాని నగరం హోదాను కోల్పోయింది. మళ్ళీ 1911 లో కలకత్తానుండి రాజధాని ఢిల్లీకి మార్చారు. ఎడ్విన్ లుట్యెన్స్ అనే భవననిర్మాణశిల్పి పాతనగరంలో కొంతభాగాన్ని పూర్తిగా కూలద్రోయించి క్రొత్త ఢిల్లీలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని చేయించాడు.
భౌగోళికం[మార్చు]
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రదేశం 1483 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ప్రదేశం అత్యధిక పొడవు 51.9 కి.మీ., అత్యధిక వెడల్పు 48.48 కి.మీ. మొత్తం 1483 చ.కి.మీ.లలో 783 చ.కి.మీ. గ్రామీణ ప్రాంతం, 700 చ.కి.మీ. పట్టణ ప్రాంతం. మూడు స్థానిక నగర పాలనా సంస్థలున్నాయి. అవి
- ఢిల్లీ నగర మునిసిపల్ కార్పొరేషన్ - 1397.9 చ.కి.మీ.
- క్రొత్తఢిల్లీ నగర మునిసిపల్ కార్పొరేషన్ - 42.78 చ.కి.మీ.
- ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు - 43 చ.కి.మీ.
జిల్లాలు, ముఖ్య పట్టణాలు[మార్చు]
ఢిల్లీ జిల్లాలు[మార్చు]
# | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | CD | మధ్య ఢిల్లీ | దర్యాగంజ్ | 5,82,320 | 25 | 27,730 |
2 | ED | తూర్పు ఢిల్లీ | ప్రీత్ విహార్ | 17,09,346 | 440 | 27,132 |
3 | ND | న్యూ ఢిల్లీ | కన్నాట్ ప్లేస్ | 1,42,004 | 22 | 4,057 |
4 | NO | ఉత్తర ఢిల్లీ | సదర్, ఢిల్లీ | 8,87,978 | 59 | 14,557 |
5 | NE | ఈశాన్య ఢిల్లీ | నంద్ నగరి | 22,41,624 | 52 | 36,155 |
6 | NW | వాయవ్య ఢిల్లీ | కంఝావాలా | 36,56,539 | 130 | 8,254 |
7 | – | షహదారా | నంద్ నగరి | – | 59.75 | – |
8 | SD | దక్షిణ ఢిల్లీ | సాకేత్ | 27,31,929 | 250 | 11,060 |
9 | SE | ఆగ్నేయ ఢిల్లీ | డిఫెన్స్ కాలనీ | – | – | – |
10 | SW | నైరుతి ఢిల్లీ | కపషేరా | 22,92,958 | 395 | 5,446 |
11 | WD | పశ్చిమ ఢిల్లీ | రాజౌరీ గార్డెన్ | 25,43,243 | 112 | 19,563 |
పెద్ద పట్టణాలు[మార్చు]
పట్టణం | జనాభా (2001) |
---|---|
ఢిల్లీ | 9,817,439 |
క్రొత్తఢిల్లీ | 294,783 |
సుల్తాన్‌పుర్ మజ్రా | 163,716 |
కిరారీ సులేమాన్ నగర్ | 153,874 |
భల్స్వా జహంగీర్ పూర్ | 151,427 |
నంగ్లోయి జాత్ | 150,371 |
కరవల్ నగర్ | 148,549 |
దల్లోపురా | 132,628 |
ఢిల్లీ కంటోన్మెంట్ | 124,452 |
దెవోలి | 119,432 |
గోకల్ పూర్ | 90,564 |
ముస్తఫాబాద్ | 89,117 |
హస్త్‌సాల్ | 85,848 |
బురారి | 69,182 |
ఘరోలి | 68,978 |
చిల్లా సరోదా బంగర్ | 65,969 |
తాజ్‌పుల్ | 58,220 |
జఫ్రాబాద్ | 57,460 |
పుత్‌కలన్ | 50,587 |
ఆధారం: 2001 జనాభా లెక్కలు Archived 2007-06-07 at the Wayback Machine
పాలన, విభాగాలు[మార్చు]
జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. 1991లో జాతీయ రాజధాని ప్రదేశానికి (ఢిల్లీకి) ఒక అసెంబ్లీ (విధాన సభ), ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు ఆమోదింపబడింది. ఈ విధమైన విధానం ఢిల్లీకి, పుదుచ్చేరికి మాత్రమే ఉంది. కనుక ఢిల్లీ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమనిగాని, పూర్తిగా రాష్ట్రమనిగాని అనడం కుదరదు.కాలక్రమంగా ఢిల్లీ ఒక పూర్తి రాష్ట్రం కావాలని ప్రణాళిక
జాతీయ రాజధాని ప్రదేశం ప్రత్యేకత ఏమంటే - పోలీసు, పాలన వంటి కొన్ని ప్రధాన బాధ్యతలు ప్రధానంగా కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటాయి. మునిసిపల్ వ్యవహారాలు స్థానికంగా ఎన్నుకొనబడిన ప్రభుత్వం చూస్తుంది.
ఢిల్లీని 9 జిల్లాలుగా విభజించారు. ఢిల్లీనుండి పార్లమెంటు లోక్‌సభకు 7గురు సభ్యులు, రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ఎన్నుకొనబడుతారు.
ఆర్ధిక రంగం[మార్చు]
ఢిల్లీ స్థూల రాష్ట్రోత్పత్తి (మార్కెట్ ధరల ప్రకారం) క్రిది పట్టికలో ఇవ్వబడింది (మిలియన్ రూపాయలలో).భారత ప్రభుత్వం గణాంక విభాగం అంచనా.
సంవత్సరం | స్థూల ఆర్థిక ఉత్పత్తి |
---|---|
1980 | 26,850 |
1985 | 54,120 |
1990 | 113,280 |
1995 | 283,900 |
2000 | 627,330 |
వాణిజ్య సంస్థలలో 12% సంస్థలకు ప్రధాన కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి.[5] ఆర్థికంగా బాగా సంపన్నమైన నగర ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. ఉదాహరణకు, మిగిలిన 4 మహానగరాలు (బెంగళూరు, కొలకత్తా, చెన్నై, ముంబై) అన్నింటి మొత్తంకంటే ఢిల్లీలో ఎక్కువ కార్లున్నాయని అంచనా. ఇటీవలికాలంలో బహుళజాతి వాణిజ్య సంస్థలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఆకర్క్షణీయమైన ప్రారంభ స్థలాలయ్యాయి. దేశంలో కార్లు, వార్తాసాధనాలు, గృహోపకరణాలు అందించే కంపెనీలు ఢిల్లీ పరిసరాలలో బాగా ఉన్నాయి. ఇక్కడి మంచి విద్యావకాశాలవలన విజ్ఞానం ప్రధానవనరుగా ఉండే పారిశ్రామిక,వాణిజ్య వ్యవస్థలు కూడా ఢిల్లీలో బాగా వృద్ధి చెందుతున్నాయి.
విస్తారమైన పాలనా వ్యవస్థ, ప్రభుత్వోద్యోగులు, అన్నిప్రాంతాలనుండివచ్చిన జనులు, 160 పైగా రాయబార కార్యాలయాలు - ఇవన్నీ ఢిల్లీలో వ్యాపారానికి మంచి ఊపునిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా ఉన్నందున దేశంలో ముఖ్యమైన మార్కెట్లలో ఢిల్లీ ఒకటి.
వాతావరణం[మార్చు]
ఢిల్లీ వాతావరణం చలీ, వేడి కూడా ఎక్కువ. ఉష్ణోగ్రతలు −2 నుండి 47 డిగ్రీలు సెంటీగ్రేడు మధ్యలో ఉంటాయి. [1]
రవాణా సౌకర్యాలు[మార్చు]
ఢిల్లీలో అన్ని విధాలైన రవాణా సౌకర్యాలు ముమ్మరంగా ఉపయోగింపబడుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు- గుఱ్ఱపు బండ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిళ్ళు, కార్లు, బస్సులు, లోకల్ రైళ్ళు - అన్ని విధాలైన వాహనాలు విస్తృతంగా వినియోగిస్తారు.
విద్యా సంస్థలు[మార్చు]
అక్షరాస్యత: పురుషులు 87.3%, స్త్రీలు 74.7%, మొత్తం మీద 81.7%[6] జాతీయ రాజధాని ప్రదేశం విద్యా డైరెక్టరేటు (డైరెక్ట్ర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ ) అధీనంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు నడుస్థాయి.[7].రాజధాని, మహానగరం, వాణిజ్య, వ్యాపార కేంద్రం అయినందున ఢిల్లీలో అన్నివిధాలైన విద్యావకాశాలు, మంచి ప్రమాణాలు గల విద్యాలయాలు - అన్ని రంగాలలోనూ - మెండుగా ఉన్నాయి.
విశ్వ విద్యాలయాలు[మార్చు]
- అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
- ఢిల్లీ విశ్వవిద్యాలయం
- సెయింట్ స్టీఫెన్ కళాశాల
- ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
- ఇంద్రప్రస్ఠ విశ్వవిద్యాలయం; (గురు గోవింద్ సింగ్ విశ్వవిద్యాలయం)
- ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ
- ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఢిల్లీ)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
- జామియా మిలియా ఇస్లామియా
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (ఢిల్లీ)
- నేతాజీ సుభాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్
- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్
స్కూళ్ళు[మార్చు]
- ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్
- అపీజే పబ్లిక్ స్కూల్
- ఆర్మీ పబ్లిక్ స్కూల్
- బాల భారతి పబ్లిక్ స్కూల్
- బ్లూబెల్స్ స్కూల్
- జీసస్ అండ్ మేరీ కాన్వెంట్
- డి.ఎ.వి పబ్లిక్ స్కూల్
- ఢిల్లీ పబ్లిక్ స్కూల్
- డి.టి.ఇ.ఏ సీనియర్ సెకండరీ స్కూల్ (లు)
- ఫెయిత్ అకాడమీ
- గురు హర్కిషన్ పబ్లిక్ స్కూల్
- కేంద్రీయ విద్యాలయ
- కులాచి హన్స్రాజ్ మోడల్ స్కూల్
- లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్
- మానవ్ స్థాలి స్కూల్
- మోడరన్ స్కూల్ (బారకంబా)
- మౌంట్ సెయింట్ మేరీ స్కూల్
- మదర్స్ అంతర్జాతీయ స్కూల్
- సెయింట్ కొలంబస్ స్కూల్
- సెయింట్ జేవియర్స్ స్కూల్
- సర్దార్ పటేల్ విద్యాలయ
- స్ప్రింగ్ డాల్స్ స్కూల్
- వసంత్ వ్యాలీ స్కూల్
చూడదగిన స్థలాలు[మార్చు]
- బిర్లా మందిర్
- చాందినీ చౌక్
- కన్నాట్ ప్లేస్
- జింకల పార్కు,ఢిల్లీ
- ఎఱ్ఱకోట
- పంచేంద్రియాల తోట (గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెంసెస్)
- గురుద్వారా బంగ్లా సాహిబ్
- హుమాయూన్ సమాధి
- ఇండియా గేటు
- అంతర్జాతీయ బొమ్మల మ్యూజియం
- జామా మస్జిద్ (ఢిల్లీ)|జామా మసీదు
- జంతర్ మంతర్
- కాళిందీ కుంజ్
- లోధీ తోటలు
- బహాయి పూజాగృహం/ పద్మమందిరం (లోటస్ టెంపుల్)
- అక్షరధామ్
- ముఘల్ తోటలు
- నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్
- జాతీయ మ్యూజియం
- నెహ్రూ ప్లానెటేరియం
- పురానా కిలా
- కుతుబ్ మినార్
- రాష్ట్రపతి భవన్
- సఫ్దర్‌జంగ్ సమాధి
- పార్లమెంటు (సంసద్ భవన్)
- తుఘ్లకాబాద్ కోట
- పీతమ్‌పురా టి.వి.టవర్
ప్రముఖులు[మార్చు]
- అమీర్ ఖుస్రో
- మిర్జా గాలిబ్
- ముకేష్
- ఎం.ఎఫ్. హుసేన్
- నిజాముద్దీన్ ఔలియా
- పర్వేజ్ ముషార్రఫ్
- ఖుష్వంత్ సింగ్
- రాజీవ్ సేథి
ఢిల్లీ వార్తాపత్రికలు[మార్చు]
- ఏషియన్ ఏజ్
- బిజినెస్ లైన్
- బిజినెస్ స్టాండర్డ్
- ది ఎకనామిక్ టైమ్స్
- ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్
- ది హిందూ
- ది హిందూస్థాన్ టైమ్స్
- ఇండియన్ ఎక్స్ ప్రెస్
- నవభారత్ టైమ్స్
- పయోనీర్
- సంధ్య టైమ్స్
- ది స్టేట్స్ మన్
- ది టైమ్స్ ఆఫ్ ఇండియా
ఢిల్లీ మార్కెట్లు[మార్చు]
- చాందినీ చౌక్
- చావలా
- దిల్లీహాట్
- కన్నాట్ ప్లేస్
- గ్రేటర్ కైలాష్
- జనపథ్
- జనక్‌పురి
- జ్వాలాహెది
- కరోల్‌బాగ్
- కమలానగర్
- ఖాన్‌మార్కెట్
- లజపత్‌నగర్ సెంట్రల్ మార్కెట్
- నజఫ్‌గర్
- నెహ్రూప్లేస్
- పాలికాబజార్
- రాజోరి గార్డెన్
- సదర్‌బజార్
- సాకేత్
- సరోజినీ నగర్
- దక్షిణ ఎక్స్టెన్షన్
- తిలక్‌నగర్
- వసంతకుంజ్
- వసంతవిహార్
- ఆజాద్‌పురి, ఓఖ్లామండీ - కూరగాయల టోకు మార్కెట్లు
- మెహ్రౌలీ - ధాన్యాల టోకు మార్కెట్టు
ఇవి కూడా చూడండి[మార్చు]
వనరులు[మార్చు]
- ↑ "ఢిల్లీ సాధారణ సమాచారం". భారతప్రభుత్వం. Archived from the original on 2007-04-30. Retrieved 2006-05-03.
- ↑ "Census of India - Projected Population". Registrar General & Census Commissioner, India. Retrieved 2008-11-01.
- ↑ Spear, Percival (2012). "Delhi: A Historical Sketch - The Mogul Empire". The Delhi Omnibus. New Delhi: Oxford University Press. p. 26. ISBN 9780195659832.
- ↑ Document, http://www.cbdelhi.in/Documents/ca2006.pdf Archived 31 మే 2014 at the Wayback Machine
- ↑ "S&P CNX 500, Companies gaining in the S&P CNX 500 on the BSE - Market Stats". www.moneycontrol.com. Retrieved 2020-12-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". web.archive.org. Archived from the original on 2005-05-07. Retrieved 2022-12-12.
- ↑ "DelE Education Department". www.edudel.nic.in. Retrieved 2020-12-17.
బయటి లింకులు[మార్చు]
- ఢిల్లీ ప్రభుత్వం
- పాత ఢిల్లీ నుండి ఛాయాచిత్రాలు
- ఢిల్లీ హోటల్స్
- ఢిల్లీ మెట్రో మ్యాప్
- ఢిల్లీ స్థానిక సమాచారం డైరెక్టరీ
- Y. D. Sharma, Delhi and its neighbourhood (New Delhi, Archaeological Survey of India 1990). -Historical architectural remains.
- William Dalrymple, The City of Djinns:A Year in Delhi