అశోకుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అశోక చక్రవర్తి (హిందీ: अशोक) (Ashoka The Great); (క్రీ.పూ.304క్రీ.పూ.232) (రాచరిక ముకుటము: "దేవానాంపియ పియదస్సీ'" అనగా "దేవతల ప్రీతిపాత్రుడు మరియు చూపులకు అందమైనవాడు")

క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది.

ప్రసిద్ధ ఇంగ్లీషు రచయిత హెచ్ జి వెల్స్ తన ఔట్‌లైన్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో అశోకుడి గురించి ఇలా రాసాడు: "వేలాది రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సామ్రాట్టులూ వగైరాలతో క్రిక్కిరిసిపోయిన చరిత్ర పుటల్లో అశోకుడి పేరు ఒక తార లాగా తళుకులీనుతూంటుంది."

చారిత్రక మూలాలు[మార్చు]

అశోకుడి గురించిన చాలా సమాచారం ప్రధానంగా కొద్దిపాటి బౌద్ధమతానికి సంబంధించిన మూలాల నుంచి లభ్యమైనదే. ప్రత్యేకించి 2వ శతాబ్దంలో సంస్కృతంలో రాయబడిన అశోకవదనం, మరియు పాళీ భాషలో రాయబడిన దీప వంశం, మహావంశం అనే శ్రీలంకకు చెందిన గ్రంథాలలో ఇప్పుటి వరకు అశోకుని గురించి తెలిసిన సమాచారం అందుబాటులో ఉంది. మిగతా సమాచారం అశోకుడు రాయించిన శాసనాల నుండి లభ్యమవుతున్నది.

మౌర్య సామ్రాజ్యంలోని వెండి నాణాలు. క్రీ.పూ. 3వ శతాబ్దం

మరణం, వారసత్వం[మార్చు]

అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య, పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంకకు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు కచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.


ఇంతకు ముందు ఉన్నవారు:
బిందుసారుడు
మౌర్య చక్రవర్తి
272BC—232BC
తరువాత వచ్చినవారు:
దశరథుడు
మౌర్య వంశపు కాలం
చక్రవర్తి రాజ్యకాల ఆరంభం పరిసమాప్తి
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 322 క్రీ.పూ. 298
బిందుసారుడు క్రీ.పూ. 297 క్రీ.పూ. 272
అశోకుడు క్రీ.పూ. 273 క్రీ.పూ. 232
దశరథుడు క్రీ.పూ. 232 క్రీ.పూ. 224
సంప్రాతి క్రీ.పూ. 224 క్రీ.పూ. 215
శాలిసూక క్రీ.పూ. 215 క్రీ.పూ. 202
దేవవర్మన్ క్రీ.పూ. 202 క్రీ.పూ. 195
శతధన్వాన్ క్రీ.పూ. 195 క్రీ.పూ. 187
బృహద్రథుడు క్రీ.పూ. 187 క్రీ.పూ. 185

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=అశోకుడు&oldid=2067625" నుండి వెలికితీశారు