Jump to content

ఆటో రిక్షా

వికీపీడియా నుండి
ప్రపంచం లోని పలు దేశాలలో ఆటోరిక్షాలు
India Thailand
El Salvador Peru
Ethiopia China
Auto rickshaw, also called Tuk-Tuk,[1] tempo, mototaxi and three wheeler, carry people and goods in many developing countries. Above are six examples.

ఆటో రిక్షా భారత దేశంలో ఒక ప్రాచుర్యం పొందిన ప్రజా రవాణా వాహనం. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సూడాన్ దేశాలలో కూడా బహుళ ప్రజాదరణ పొందిన రవాణా మాధ్యమం. సంప్రదాయిక రిక్షా వంటి ఆటోరిక్షాలు మోటారుయంత్రం సహాయంతో నడుస్తాయి. వీటి వలన ఇప్పటీ ప్రయాణం అతి సులభం అంరియు మారుమూలలకు కూడా సులభంగా చేరుకొనుటకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి.

ఆటో రిక్షా
బెంగళూరు నగర వీధుల్లో ఆటో రిక్షా

ఆటో రిక్షా ప్రారంభ చరిత్ర

[మార్చు]

ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ అయిన కర్రడినో డి అస్కానియో (Corradino D'Ascanio) పియొగ్గియో వద్ద పనిచేస్తున్నపుడు 1947 లో వచ్చిన ఆలోచనకు రూపం ఈ మూడు చక్రాల బండి. దీనిని 1957లో ధాయ్‌హత్సు ద్వారా మొదట సౌత్ ఈస్ట్ ఏసియాలో ప్రారంభించారు.

ప్రముఖ ఆటో రిక్షా కంపెనీలు

[మార్చు]

ఆటో రకాలు

[మార్చు]

ఆటోలలో ముఖ్యంగా రెండూ రకాలు ఉనాయి అవి

  • మూడూ చక్రాల ఆటోలు
  • నాలుగు చక్రాల ఆటో

ఇటీవల సహజ వాయువుతో నడిచే ఆటోలు కూడా వచ్చాయి. ఇవి నలుగురు, ఏడు మంది కూర్చోవడానికి అనువైన రకాలు. ప్రయాణీకులు ప్రయాణించిన దూరాన్ని గణన యంత్రము (మీటర్) ద్వారా నిర్థారించి తదనుగుణంగా రుసుము వసూలు చేస్తారు.

భారతీయ ఆటో రిక్షా

[మార్చు]

భారతీయ ఆటో రిక్షాలు వివిధ రకాలు, వీటిని మొదటగా వాడినది కలకత్తాలో. చౌకగా రావడం వలన వీటిని కొనుగోలు చేసి రవాణాకు వాడటం భారతదేశంలో ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతున్నది.

వాడకం ద్వారా కలుషితం

[మార్చు]

వాహనాలలో అత్యధిక పొగ కాలుష్యం వచ్చే వాహనాల్లో ఇది ఒకటి. దీని పొగ నుండి సీసం ఉన్న పదార్థాలు గాలిలో కలుస్తుండటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు చ్పుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. History of Tuk-Tuk

బయటి లింకులు

[మార్చు]