విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008లో విమానాశ్రయము పంపిణి
విమానాశ్రయ చిహ్నము
విమానాశ్రయ ట్రాఫిక్ చిహ్నము
ఒక నేపాలి స్వదేశీ విమానాశ్రయ రన్ వే

స్థిర-రెక్కల విమానాలు, హెలికాప్టర్లు మరియు బ్లింప్ లు వంటి విమానాలు బయలుదేరు మరియు లాండ్ అయ్యే చోటును విమానాశ్రయం (Airport) అంటారు. విమానాశ్రయము వద్ద విమానాలను నిలుపుతారు లేక వాటి నిర్వహణ చేస్తారు. ప్రతి విమానాశ్రయములో విమానము బయలుదేరుటకు మరియు ల్యాండ్ అగుటకు ఒక రన్ వే, ఒక హెలిప్యాడ్ లేక టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ లకు నీరు మరియు తరచుగా నియంత్రణా భవనములు, హాంగర్లు మరియు టర్మినల్ భవనాలు కలిగి ఉంటుంది.

పెద్ద విమానాశ్రయాలు ఫిక్సడ్ బేస్ ఆపరేటర్ సేవలు, సీప్లేన్ డాక్స్ మరియు రాంప్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మరియు రెస్టారెంట్, లాంజెస్ మరియు అత్యవసర సేవల వంటి ప్రయాణీకుని సౌకర్యాలు కలిగి ఉండచ్చు. సైనిక విమానాశ్రయాన్ని ఎయిర్ బేస్ లేదా ఎయిర్ స్టేషను అని అంటారు. ఏరోడ్రోం, ఎయిర్ డ్రోం, ఎయిర్ ఫీల్డ్, మరియు ఎయిర్ స్ట్రిప్ అనే పదాలు కూడా ఎయిర్ పోర్ట్ లను సూచించడానికే వాడతారు. హెలిపోర్ట్, సీప్లేన్ బేస్, మరియు SLOT పోర్ట్ అనే పదాలు హెలికాప్టర్లు, సీప్లేన్లు లేక షార్ట్ టెక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ గల విమానాలకు ఉపయోగించే ఎయిర్ పోర్ట్ లను సూచించడానికి వాడతారు.

వాడుక భాషలో, ఎయిర్ పోర్ట్ మరియు ఏరోడ్రోం అనే పదాలు పరస్పరం మార్చదగినవిగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఎయిర్ పోర్ట్ అనే పదము విమానయాన సేవలలో ఒక స్థానం ఏర్పర్చుకుంది, కాని ఏరోడ్రోం ఇంకా అలాంటి స్థానాన్ని చేరుకోలేదు. కొన్ని న్యాయస్థానాలలో, ఎయిర్ పోర్ట్ అనేది న్యాయబద్దమైన ఆర్ట్ పదము. ఇది ప్రత్యేకంగా ఆ విమానాశ్రయాలకు ఉంచబడుతుంది ఏవైతే విమానాశ్రయాలుగా సంబంధిత పాలక సంస్థలచే[ఉల్లేఖన అవసరం] అవసరమైన ధ్రువీకరణ నిబంధనలు లేక రెగ్యులేటరీ అవసరాలను పూర్తి చేసిన తరువాత ధ్రువీకరించబడినవి లేదా లైసెన్సు ఇవ్వబడినవి. (ఉదా. ది U.S. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఫా), లేక ట్రాన్స్పోర్ట్ కెనడా) అంటే, అన్ని ఎయిర్ పోర్ట్ లు ఏరోడ్రోములే కాని అన్ని ఏరోడ్రోములు విమానాశ్రయాలు కావు. ఇతర న్యాయస్థానాలు ఎయిర్పోర్ట్ ను ఎక్కడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రి[ఉల్లేఖన అవసరం] ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసులు కలిగి ఉంటాయి అవి వివరిస్తాయి. అయినప్పటికీ ఇటువంటి ఎరోడ్రోంలకు సామాన్య పదము ఎయిర్పోర్ట్ ఆఫ్ ఎంట్రి . ఎరోడ్రోం మరియు ఎయిర్పోర్ట్ లకు భేదము లేని న్యాయస్థానాలలో ఈ పదాలను వాడుకదారుల లేక నిర్వాహాకుల ఇష్టము ప్రకారము ఉపయోగించ బడతాయి.

విషయ సూచిక

మౌలిక సదుపాయాలు[మార్చు]

ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద ప్రయాణీకుల టర్మినల్ భవానాలు, ఇంచియాన్, దక్షిణ కొరియా

చిన్నపాటి లేక అభివృద్ధి చెందని విమానాశ్రయాలు మామూలుగా 1,000 m (3,300 ft) కంటే చిన్నదైన ఏకైక రన్ వేను కలిగివుంటాయి. ఇలాంటి విమానాశ్రయాలు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఎయిర్ లైన్ విమానాల కోసం ఉన్న పెద్ద విమానాశ్రయాలు మామూలుగా పెవ్ద్ రన్ వేలు 2,000 m (6,600 ft) లేక పెద్ద రన్ వేలు కలిగి ఉంటాయి చాలావరకు చిన్న విమానాశ్రయాలు కాంక్రీట్ మరియు అస్ఫాల్ట్ ల బదులు మురికి, గడ్డి లేక గ్రావెల్ రన్ వే కలిగిఉంటాయి.

యునైటెడ్ స్టేట్స్ లో, FAR ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ఫీల్డ్ లెంత్స్ ప్రకారం తడి లేని, గట్టి ల్యాండింగ్ పరిసరాలకు కనిష్ఠ కొలతను నిర్ణయిస్తారు. ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ సమయంలోని సంరక్షణా అంశాలు కూడా ఇందులో ఉంటాయి. భారీ విమానాలకు పొడువైన రన్ వేలు అవసరమవుతాయి.

ప్రపంచంలో అతిపొడవైన ప్రజా ఉపయోగార్ధమైన రన్ వే చైనా లోని క్యామ్దో బాన్గడా విమానాశ్రయము. ఇది 5,500 m (18,045 ft) పొడవు కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక వెడల్పు కలిగిన పెవ్ద్ రన్ వే ఉల్యనోవ్ వోటొస్చి విమానాశ్రయము రష్యాలో ఉంది, మరియు దాని వెడల్పు 105 m (344 ft).

2009లో, CIA ప్రకారం ప్రపంచం మొత్తం మీద 'ఆకాశం నుండి చూడదగ్గ విమానాశ్రయాలు లేక ఎయిర్‌ఫీల్దులు' సుమారు 44,000 ఉన్నాయి. వీటిల్లో US లోని 15,095 కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు లేక ఎయిర్‌ఫీల్దులు అస్ లో ఉన్నాయి.[1][2]

విమానాశ్రయాల యాజమాన్యము మరియు కార్యకలాపాలు[మార్చు]

ప్రపంచంలోని ఎక్కువ శాతం విమానాశ్రయాలు స్థానిక, ప్రాంతీయ, లేక జాతీయ ప్రభుత్వ సంస్థలచే నిర్వహించబడతాయి. అవి తరువాత ప్రైవేట్ కార్పోరేషన్ లకు లీజుకు ఇస్తాయి. ఈ సంస్థలు విమానాశ్రయము యొక్క కార్యకలాపాలను చూస్తాయి. ఉదాహరణకు, BAA లిమిటెడ్ (BAA) యునైటెడ్ కింగ్డం లోని వాణిజ్య విమానాశ్రయములలో ఐదింటి కార్యకలాపాలను చూస్తుంది. అలాగే, UK జర్మనీ' స్ ఫ్రాన్క్ఫుర్ట్ విమానాశ్రయము వెలుపల ఉన్న వివిధ విమానాశ్రయాలను క్వాజి-ప్రైవేట్ సంస్థ అయిన ఫ్రాపోర్ట్ చూస్తుంది. భారత దేశంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము మరియు రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయము ల నిర్వహణ సంయుక్త సంస్థల ద్వారా GMR గ్రూప్ చూస్తుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము మరియు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయము రెండు GVK గ్రూప్ నియంత్రణలో ఉంటాయి. భారత దేశం యొక్క మిగతా విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడతాయి.

యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా లలో, వాణిజ్య విమానాశ్రయాలు సాధారణంగా ప్రభుత్వ సంస్థలచే లేదా ప్రభుత్వము-సృష్టించిన ఎయిర్పోర్ట్ అథారిటీలు (పోర్ట్ అథారిటీలు అని కూడా అంటారు) నేరుగా నిర్వహించ బడతాయి.

చాలా US విమానాశ్రయాలు ఇంకా తమ సేవలను కొన్నింటిని బయటి సంస్థలకు లీజుకు ఇస్తున్నాయి. ఈ సంస్థలు రీటెయిల్ మానేజ్మెంట్ మరియు పార్కింగ్ వంటి పనులు చూస్తాయి. USలో, అన్ని వాణిజ్య విమానాశ్రయ రన్ వేలు FAAచే కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ టైటిల్ 14 భాగము 139, "సర్టిఫికేషన్ ఆఫ్ కమర్షియల్ సర్వీస్ ఎయిర్పోర్ట్స్"[3] క్రింద ధ్రువీకరించబడతాయి కాని FAA యొక్క రెగ్యులేటరీ అథారిటి క్రింద స్థానిక విమానాశ్రయముచే నిర్వహించబడతాయి.

US లోని విమానాశ్రయాలను ప్రైవేటీకరించుటకు వ్యతిరేకత ఉన్నాకూడా (FAA ఒక ప్రైవేటీకరణ కార్యక్రమమును 1996 నుండి సమర్పిస్తున్నా కూడా), ప్రభుత్వ-యాజమాన్యము కలిగన కాంట్రాక్టర్-ఆపరేటెడ్ (GOCO) వ్యవస్థ ప్రపంచంలోని మిగతా వాణిజ్య విమానాశ్రయాల కార్యకలాపాలకు ప్రామాణికమైనది.

విమానాశ్రయం నిర్మాణం[మార్చు]

తాన్ సన్ న్హాట్ అంతర్జాతీయ విమానాశ్రయము యొక్క వెలుపలి భాగము, హో ఛి మిన్హ నగరము, వియెత్నాం.ఈ విమానాశ్రయము త్వరలోనే లాంగ్ థన్హ అంతర్జాతీయ విమానాశ్రయము చేత హో ఛి మిన్హ నగరము యొక్క ప్రధానాన్ విమానాశ్రయముగా మార్చబడుతుంది.
ఓర్లాండో, U.S. లోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద ఈస్ట్ అట్రియం యొక్క దృశ్యం. ఇందులో టర్మినల్ పరిధిలో ఉన్న హ్యాట్ రీజెన్సి హోటల్ కూడా ఉంది.

విమానాశ్రయాలు ల్యాండ్ సైడ్ మరియు ఎయిర్ సైడ్ లుగా విభజించబడ్డాయి. ల్యాండ్ సైడ్ ప్రాంతాలలో పార్కింగ్ లాట్ లు, ప్రజా రవాణా వ్యవస్థలు, ట్రైన్ స్టేషన్లు, ట్యాంక్ ఫార్ములు మరియు రోడ్లకు ప్రవేశం అందిస్తుంది. ఎయిర్ సైడ్ ప్రాంతాలలో విమానము చేరుకోవడానికి అన్ని ప్రాంతాలు, రన్ వేలు, టాక్సీ వేలు, ర్యాంపులు మరియు ట్యాంక్ ఫార్ములు ఉంటాయి. చాలా విమానాశ్రయాలలో ల్యాండ్ సైడ్ ప్రాంతం నుండి ఎయిర్ సైడ్ ప్రాంతానికి గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. వాణిజ్య విమానాల ప్రయాణీకులు ఎయిర్ సైడ్ ప్రాంతాలలోకి టర్మినల్స్ ద్వారా ప్రవేశించగలరు. ఇక్కడ వారు టికెట్లను కొనుగోలు చేయడం, భద్రతా అంశాలను సరిచూసుకోవడం, సామాన్లను సరిచూసుకొని క్లెయిమ్ చేయడం, మరియు గేట్ల ద్వారా విమానాలలోకి ప్రవేశించడం చేయవచ్చు. ప్రయాణీకులకు విమానాల ప్రవేశం అందించే వెయిటింగ్ ప్రదేశాలను కాంకోర్సేస్ అని అంటారు. కాని మామూలుగా ఈ పదాన్ని టర్మినల్ తో పరస్పర మార్పు జరుపుతూ వాడతారు.

హాలిఫాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయము, కెనడా లోని పై అంతస్తు పరిశీలనా గది నుండి ఆప్రాన్.

ప్రయాణీకులు మరియు సామాన్లను ఎక్కించుకునేందుకు టర్మినల్ పక్కన విమానాలు పార్క్ చేసే చోటును రాంప్ (లేక టార్మాక్) అని అంటారు. టర్మినల్స్ కి దూరంగా ఉన్న విమానాల పార్కింగ్ స్థలాలను అప్రాన్స్ అంటారు.

విమానాశ్రయాలు టవరు సహితమైన లేక టవరు-రహిత విమానశ్రయాలుగా ఉండచ్చు. వైమానిక ట్రాఫిక్ సాంద్రత మరియు లభించే ధనము పై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సామర్ధ్యము మరియు రద్దీ ఎయిర్ స్పేస్ కారణంగా, ఎన్నో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆన్ సైట్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణా వ్యవస్థలు కలిగి ఉంటాయి.

అంతర్జాతీయ సౌకర్యాలున్న విమానాశ్రయాలలో కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని దేశాల మధ్య కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ అంశాల అవసరం లేకుండానే ప్రయాణం చేయగలిగేటట్లు ఒప్పందాలు జరిగి ఉంటాయి. కాబట్టి అలాంటి సౌకర్యాలు అంతర్జాతీయ విమానాశ్రయానికి కచ్చితంగా ఉంటాయని చెప్పలేము. అంతర్జాతీయ విమానాలకు మామూలుగా పైస్థాయి భౌతిక సంరక్షణా సిబ్బంది అవసరమవుతారు. కాని కొన్ని సంవత్సరాలుగా, చాలా దేశాలు దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలకి ఒకే స్థాయిలోని సంరక్షణా పద్ధతులను అనుసరిస్తున్నాయి.

విమానాశ్రయ కట్టడాలలో ముఖ్యమైనవి ఆన్-సైట్ హోటళ్ళు. ఇవి టర్మినల్ భవనానికి ఆనుకొని గాని, లోపల గాని నిర్మించబడ్డాయి. విమానాశ్రయ హోటళ్ళు వచ్చిపోయే ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండటం, విమానాశ్రయ టర్మినల్ కు దగ్గరగా ఉండటం వలన అవి బాగా ప్రాచుర్యం పొందాయి. గతి తప్పిన ప్రయాణీకులకు రాత్రిపూట బస అందించేందుకు ఎన్నో విమానాశ్రయ హోటళ్ళు విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

తేలుతూ ఉండే విమానాశ్రయాలు తయారు చేయబడుతున్నాయి. ఇవి సముద్రము పై కూడా ఉంచగలిగేలాగా తయారు చేస్తున్నారు. న్యుమాటిక్ స్టెబిలైస్ద్ ప్లాట్ఫార్మ్ సాంకేతికతను ఉపయోగించి ఈ విమానాశ్రయాలను తయారు చేస్తున్నారు.

దుకాణాలు మరియు ఆహార సేవలు[మార్చు]

ఫుడ్ కోర్ట్ మరియు దుకాణాలు, హాలిఫాక్స్ స్టాన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయము, కెనడా
టెల్ అవివ్, ఇస్రాయెల్ లోని బెన్ గ్యురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద సుంక రహిత దుకాణాల సముదాయ ప్రాంతము.

విమానాశ్రయములో ఆహారము యొక్క ధరలు సాధారణంగా బయటి కంటే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, కొన్ని విమానాశ్రయాలు "వీధి ధరలు"తో పోల్చుకునే విధంగా ఆహారము యొక్క ధరలను నియంత్రిస్తున్నాయి. ఈ పదము తప్పు త్రోవ పట్టిస్తుంది ఎందుకంటే, ధరలు తరచుగా ఉత్పత్తిదారుల సజెస్టెడ్ రీటెయిల్ ప్రైస్ (MSRP) తో సమానంగా ఉంటుంది మరియు ఎటువంటి రాయితీ ఇవ్వబడదు.

కొన్ని విమానాశ్రయ రెస్టారెంట్లు ప్రయాణంలో ఉన్న వారికి ప్రాంతీయ ప్రత్యేక రుచులను అందించి విమానాశ్రయము బయటికి వెళ్ళకుండానే ప్రాంతీయ ఆహారము మరియు సంస్కృతిని రుచి చూసేట్టు చేస్తున్నాయి.[4]

ప్రీమియం మరియు VIP సేవలు[మార్చు]

షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయము యొక్క ప్రముఖుల టర్మినల్, ఢాకా, బంగ్లాదేశ్

విమానాశ్రయాలలో ప్రీమియం మరియు VIP సేవలు కూడా ఉండవచ్చు. ప్రీమియం మరియు VIP సేవలలో ఉండేవి ఎక్స్ప్రెస్ చెక్-ఇన్, అంకితమైన చెక్-ఇన్ కౌంటర్లు, బయలుదేరుటకు మరియు/లేదా ఆగమనమునకు వేరువేరు లాంజీలు, ప్రాధాన్యత బోర్డింగ్, విడిగా ఉన్నటువంటి ఎయిర్ బ్రిడ్జ్ లు మరియు ప్రాధాన్యతా సామాను నిర్వహణ.

ఈ సేవలు సాధారణంగా ప్రథమ మరియు వ్యాపార తరగతి ప్రయాణీకులకు, ప్రీమియం ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ మరియు విమానయాన సంస్థ క్లబ్ సభ్యులకు కేటాయించి ఉంచబడతాయి. ప్రీమియం సేవలు కొన్నిసార్లు వేరొక విమానయాన సంస్థ యొక్క ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రాములో సభ్యులైన ప్రయాణీకులకు కూడా అందించబడతాయి. ఇది కొన్నిసార్లు ఒక ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంలో భాగం కావచ్చు. ఎందుకంటే చాలా విమానయాన సంస్థలు ఒకే అలియన్స్ లోని భాగాలైనప్పుడు లేదా పోటీ విమానాయాన సంస్థల నుండి ప్రీమియం వినియోగదారులను ఆకర్షించేందుకు ఒక తంత్రము లాగా కూడా ఉపయోగపడుతుంది.

కొన్నిసార్లు ఈ ప్రీమియం సేవలు సంస్థ ప్రయాణీకుని విషయంలో పొరపాటు పడినపుడు ప్రీమియం ప్రయాణీకుడు కాని వానికి అందించబడతాయి. ఉదాహరణకు తనిఖీ చేయబడిన సామాను అకారణంగా ఆలస్యం చేయబడినపుడు లేదా నిర్వహణలో పొరపాటు జరిగినపుడు.

విమానయాన సంస్థ తరచుగా ఉచితముగా కానీ తగ్గింపు ధరలతో కానీ ఆహారము అందిస్తుంది మరియు ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ పానీయాలను కూడా అందిస్తుంది. లాజీలలో సాంప్రదాయకంగా కూర్చోనుటకు వసతి, షవర్లు, నిశ్శబ్ద ప్రదేశాలు, టెలివిజన్లు, కంప్యూటర్లు, Wi-Fi మరియు అంతర్జాల సదుపాయము మరియు ప్రయాణీకులు తమ ఎలెక్ట్రానిక్ ఉపకరణాల కొరకు ఉపయోగించుకొనుటకు విద్యుత్ అవుట్ లెట్లు మొదలైనవి ఉంటాయి. కొన్ని విమానయాన సంస్థలలోని లాంజీలు బరిస్టాలు, బార్టెండర్లు మరియు గోర్మేట్ షెఫ్లను నియమిస్తుంది.

విమానయాన సంస్థలు కొన్నిసార్లు బహుళ లాంజ్ లను ఒకే విమానాశ్రయ టర్మినల్ లో నిర్వహిస్తుంది. దీని వలన అల్ట్రా ప్రీమియం వినియోగదారులకు, అంటే మొదటి తరగతి వినియోగదారులు, మిగతా ప్రీమియం వినియోగదారులకు అందని అదనపు సేవలను అందిస్తుంది. బహుళ లాంజీలు, లాంజీ సౌకర్యాలలో అధికముగా గుమిగూడటాన్ని నివారించవచ్చు.

కార్గో మరియు ఫ్రీట్ సేవలు[మార్చు]

ప్రజలు మాత్రమే కాకుండా, విమానాశ్రయాలు కార్గోను కూడా 24 గంటలు రవాణా చేస్తాయి. కార్గో ఎయిర్లైన్స్ తరచూ పార్సెళ్ళను గ్రౌండ్ మరియు గాలిలో బదిలీ చేయుటకు తమ సొంత ఆన్-సైట్ మరియు అవస్థాపన సౌకర్యాలు కలిగి ఉంటాయి. కార్గో టర్మినల్ సౌకర్యాలు అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఎగుమతి కార్గోను కస్టమ్స్ క్లియరెన్స్ తరువాత మరియు విమానములోనికి చేరవేసేంత వరకు నిలువ చేసుకునేందుకు చోటు కావాలి. అలాగే దిగుమతి చేసుకోబడ్డ కార్గో, సంబంధిత వ్యక్తి తన సరుకు యొక్క డెలివరి తీసుకునేంత వరకు సురక్షితంగా ఉండాలి. విమానాశ్రయ అధికారులచే కొన్ని ప్రాంతాలు ఎగుమతి మరియు దిగుమతి కార్గో యొక్క తనిఖీ కొరకు ఉంచాలి. గుర్తించిన ప్రదేశాలు లేక షెడ్లు విమానయాన సంస్థలకుగాని లేదా ఫ్రీట్ ఫార్వార్డ్ రింగ్ ఏజన్సీలకు గాని ఇవ్వాలి. ప్రతి ఒక కార్గో ఒక లాండ్‌సైడ్ మరియు ఒక ఎయిర్ సైడ్ కలిగి ఉంటుంది. లాండ్‌సైడ్ అంటే ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు వారి ఏజన్సీల ద్వారా కాని లేదా వారు సొంతంగా కాని తమ షిప్‌మెంట్లను అందించడము కాని తీసుకొనడము కాని చేయు చోటు. ఎయిర్ సైడ్ అంటే సరుకును విమానమునకు తీసుకొని వెళ్ళడం లేదా విమానము నుండి తీసుకొనడం జరిగే చోటు. ఇంతే కాకుండా కార్గో టర్మినళ్ళు నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజించబడతాయి - ఎగుమతి, దిగుమతి మరియు ఇంటర్లైన్ లేదా ట్రాన్షిప్‌మెంట్.

సహాయ సేవలు[మార్చు]

విమానాల నిర్వహణ, పైలట్ సేవలు, విమానాల బాడుగ, మరియు హాంగర్ బాడుగ వంటివి స్థిర బేస్ ఆపరేటరు (FBO) చే చేయబడుతుంది. పెద్ద విమానాశ్రయాల వద్ద, ముఖ్యంగా హబ్బులుగా ఉపయోగించే వాటి వద్ద, వైమానిక సేవా సంస్థలు తమ సొంత సహాయ సేవలను అందించవచ్చు.

కొన్ని విమానాశ్రయాలు, సాంప్రదాయకంగా సైన్య వైమానిక దళాలు, పొడవైన రన్ వేలు కలిగి ఉంటాయి. ఇవి అత్యవసర ల్యాండింగ్ ప్రదేశములుగా ఉపయోగించబడతాయి. చాలా ఎయిర్‌బేసులలో వేగ విమానము కొరకు అడ్డుకునే పరికరాలు ఉంటాయి. వీటిని అరెస్టింగ్ గేర్ అంటారు. ఒక బలమైన తీగ రన్ వేకు కొద్దిగా పైకి కట్టబడుతుంది మరియు ఒక హైడ్రాలిక్ రిడక్షన్ గేర్ మెకానిజానికి కలపబడుతుంది. లాండ్ అవుతున్న విమానము యొక్క అరెస్టింగ్ హుక్ తో కలిసి, విమానము యొక్క బ్రేక్ లు తమకు తాము సరిపోనప్పుడు ఉపయోగించబడతాయి.

విమానాశ్రయ ప్రవేశము[మార్చు]

చాలా పెద్ద విమానాశ్రయాలు రైల్వే ట్రంక్ రూట్ల సమీపంలో బహుళ నమూనా రవాణా యొక్క అతుకులులేని సంధానము కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదాహరణకు, ఫ్రెంక్ఫుర్ట్ విమానాశ్రయము, ఆమ్స్టర్డాం విమానాశ్రయము స్చిపోల్, లండన్ హీత్రో విమానాశ్రయము, లండన్ గట్విక్ విమానాశ్రయము మరియు లండన్ స్టాన్స్టెడ్ విమానాశ్రయము. ఒక విమానాశ్రయము మరియు ఒక నగరమును రాపిడ్ ట్రాన్సిట్ తో కలుపుట కూడా సామాన్యమే, లైట్ రెయిల్ లైన్స్ లేక ఇతర నాన్-రోడ్ పబ్లిక్ రవాణా వ్యవస్థలు, ఉదాహరణకు న్యూయార్క్ లో ఉన్న జాన్ ఎఫ్.కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద ఉన్నది ఎయిర్ ట్రెయిన్ JFK మరియు మస్సచుసేట్ట్స్ బే ట్రాన్స్పోర్టేషన్ అథారిటి (MBTA) చే బాస్టన్' స్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద సిల్వర్ లైన్ T. ఇటువంటి అనుసంధానాలు ట్రాఫిక్ కంజెషన్ వలన తప్పిపోయిన ఫ్లైట్లను తగ్గిస్తుంది. పెద్ద విమానాశ్రయాలు సాధారణంగా ఎక్స్ప్రెస్ వే ల ద్వారా కూడా ప్రవేశము కలిగి ఉంటాయి. వీటి ద్వారా మోటార్ వాహనాలు డిపార్చర్ లూప్ వద్దకు కాని అరైవల్ లూప్ వద్దకు కాని వెళ్తాయి.

అంతర్ రవాణా[మార్చు]

ఒక పెద్ద విమానాశ్రయములో ప్రయాణీకులు తిరగవలసిన దూరాలు ఎక్కువగానే ఉంటాయి. కదిలే వాక్ వేలు మరియు బస్సులను అందించడము విమానాశ్రయములలో సామాన్యమే. హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయములో ప్రయాణీకులను సమూహముల నుండి బయటికి తీసుకువెళ్ళటానికి మరియు సామాను తీసుకొనేందుకు వెళ్ళుటకు ట్రాంలు ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ టర్మినళ్ళు ఉన్న ముఖ్య విమానాశ్రయాలు అంతర్-టర్మినల్ రవాణా అందిస్తాయి. ఉదాహరణకు మెక్సికో నగర అంతర్జాతీయ విమానాశ్రయము. ఇందులో స్వదేశీ టర్మినల్ 1 భవనము విమానాశ్రయము యొక్క అవతలి వైపు ఉన్న టర్మినల్ 2 భవనము ఎరోట్రెన్ చే కలపబడ్డాయి.

చరిత్ర మరియు అభివృద్ధి[మార్చు]

"ఎయిర్పోర్ట్" అనే పదము మొట్టమొదటగా సౌతాంప్టన్, ఇంగ్లాండ్ లో ఉపయోగించబడింది. అక్కడ సౌతాంప్టన్ పోర్ట్ లో ఎగిరే పడవలు ల్యాండ్ అయ్యే మరియు బయలుదేరే చోటును, సౌతాంప్టన్ యొక్క మేయరు ఎయిర్-పోర్ట్ గా నామకరణం చేశాడు.

పాత తరము విమానాల టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాలు గడ్డి ప్రాంతాలు. అనుకూల వాయు దిశను అందించే ఏ కోణంలో అయినా విమానము అప్రోచ్ అవ్వగలదు. కేవలం-డర్ట్ ఫీల్డ్ కొంత మెరుగైనది, ఇది గడ్డి నుండి డ్రాగ్ ను వేరుచేసేది. కాని, ఇవి ఎండిన పరిస్థితులలో మాత్రమే బాగా పనిచేస్తాయి. తరువాత, కాంక్రీట్ చదనుకు ల్యాండింగ్ కు అనుకూలము, వానపడినా, వెలుతురు ఉన్నా, పగలైన లేక రాత్రైనా.

"ప్రపంచంలో అతిపురాతన విమానాశ్రయం" అనే బిరుదు వివాదాస్పదంగా మారింది. కాని, 1909లో విల్బర్ రైట్ చే స్థాపించబడ్డ USలో మేరీలాండ్ లోని కాలేజ్ పార్క్ ఎయిర్పోర్ట్ అతిపురాతనమైన ఎల్లపుడూ పనిచేసే ఎయిర్ ఫీల్డ్ అని ఎక్కువమంది అంగీకరిస్తారు.[5] ఈ విమానాశ్రయము సాధారణ ఏవియేషన్ ట్రాఫిక్ కు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో అతిపురాతన విమానాశ్రయం అని ఆరోపించుకొనే మరొక విమానాశ్రయం, USలోని అరిజోనాలోని డగ్లస్ లో బిస్బీ-డో గ్లస్ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్ట్. 1908లో, డోగ్లస్ ఏరోనాటికల్ క్లబ్ స్థాపించబడింది. మెయిల్ ఆర్డర్ ప్లాన్ల ఆధారంగా గ్లైడర్ తో మొదలైంది. ఈ గ్లైడరు గాల్లోకి రెండు గుర్రాలతో లాగబడేది. డోగ్లస్ YMCA భవనం వెన్నక్కి నెట్టబడేవి. 1909లో, విమానము పై ఒక మోటారు మరియు ప్రొపెల్లర్ ఉంచడంతో అది ఆరిజోనా లోని మొదటి పవర్-ఆధారిత విహంగము అయింది. US లో మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం అనే ఖ్యాతి ప్రెసిడెంట్ రూస్వెల్ట్ నుండి వచ్చిన లేఖ ద్వారా నిర్ధారణ అవుతుంది. ఆ లేఖలో ప్రెసిడెంట్ దీనిని అమెరికా లోని మొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివర్ణించాడు.

యునైటెడ్ స్టేట్స్ లో అల్బానీ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్ట్ అనే విమానాశ్రయం అతిపురాతనమైన మునిసిపల్ విమానాశ్రయము.[6]

షోర్హాం విమానాశ్రయమును ఇంగ్లాండ్ లో ససెక్స్ లోని బ్రైటన్ వద్ద 1910లో నిర్మించారు. ఇది ఇప్పుడు బ్రిటన్ లోని అతిపురాతన మునిసిపల్ విమానాశ్రయము.

1913లో ప్రారంభమైన బ్రిమేన్ విమానాశ్రయం ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. కాని 1945 నుండి 1949 మధ్య కాలంలో అమెరికా సైనిక ఫీల్డ్ గా ఉపయోగించబడింది. ఆంస్టర్‌డాం ఎయిర్పోర్ట్ షిఫోల్ 1916లో సెప్టెంబరు 16న సైనిక ఎయిర్ ఫీల్డ్ గా ప్రారంభించబడింది. కాని 1920 డిసెంబరు 17 నుండి మాత్రమే పౌర విమానాలను అనుమతించింది. దీని వల్ల ఇప్పుడు పనిచేస్తున్నవాటిల్లో అత్యంత పురాతనమైన వాణిజ్య విమానాశ్రయంగా జనవరి 1920లో ప్రారంభమైన ఆస్ట్రేలియాలో సిడ్నీలోని సిడ్నీ ఎయిర్పోర్ట్ ను పరిగణిస్తారు.[7] 1920లో మిన్నియాపోలిస్-సెయింట్ పాల్, మిన్నెసోటా లో మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్ట్ స్థాపించబడింది. అప్పటినుండి వాణిజ్యపరమైన సేవలను అందిస్తున్నది. ప్రతి సంవత్సరము ఇది 35,000,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది. నిత్యమూ విస్తరిస్తున్న ఈ విమానాశ్రయంలో కొద్ది కాలం క్రితము 11,000 అడుగుల (3,355 మీటరు) పొడవు గల రన్ వే ప్రారంభించబడింది. ఏవియేషన్ యొక్క మొదటి రోజుల్లో నిర్మించబడిన విమానాశ్రయాలలో, ఇది పెద్దది మరియు అధిక రద్దీ కలది. ఈ విమానాశ్రయము ఇంకా వాడుకలో ఉంది. 1916లో తెరవబడ్డ రోం సింపినో విమానాశ్రయము కూడా ప్రతికూలతలను ఎదుర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పెరిగిన వైమానిక రద్దీ ల్యాండింగ్ ఫీల్డ్స్ నిర్మించడానికి దోహదపడింది. విమానాలు వీటిని కొన్ని దిశలనుండి చేరుకోవలసి వచ్చేది. ఈ కారణంగా దిశా మార్గదర్శకాలు మరియు ల్యాండింగ్ స్లోప్ కొరకు ఉపకరణాలు అభివృద్ధి పరచబడ్డాయి.

యుద్ధం తరువాత, సైనిక ఎయిర్ ఫీల్డులలో కొన్నింటిని పౌర సౌకర్యాలను ప్రయాణీకుల ట్రాఫిక్ నిర్వహించడానికి ఉపయోగించారు. ఇలాంటి మొదటి తరం విమానాశ్రయాలలో పారిస్ సమీపంలోని లీ బోర్గేట్ లోని పారిస్-లీ బోర్గేట్ విమానాశ్రయం ఒకటి. హౌన్స్లో హెల్త్ ఏరోడ్రోం ప్రణాళిక అంతర్జాతీయ వాణిజ్య సేవల విమానాలను నిర్వహించుటకు ఏర్పాటు చేసిన మొదటి విమానాశ్రయము. దీనిని ఆగస్టు 1919లో స్థాపించినప్పటికీ తరువాత మూసివేయబడింది. మార్చి 1920లో క్రోయ్దాన్ విమానాశ్రయము నకు ఉప-విమానాశ్రయముగా నెలకొల్పారు.[8] 1922లో, అప్పటి కొనిగ్స్బర్గ్, ఈస్ట్ ప్రషియ సమీపంలోని ఫ్లుఘఫెన్ డివ వద్ద వాణిజ్యపరమైన ఏవియేషన్ కు అంకితంగా మొదటి శాశ్వత విమానాశ్రయము మరియు వాణిజ్య టర్మినల్ ను స్థాపించారు. ఈ యుగం యొక్క విమానాశ్రయాలు పెవ్డ్ "అప్రోన్" ఉపయోగించేవి. ఇవి భారి విమానాల ల్యాండింగ్ తో పాటు రాత్రిపూట విమానయాన్ని సుసాధ్యం చేసింది.

1920 తరువాతి భాగంలో మొట్టమొదటి సారిగా విమానాశ్రయంలో దీపాలను వాడారు. 1930లలో అప్రోచ్ లైటింగ్ వాడుకలోకి వచ్చింది. ఇవి సరైన దిశ మరియు డిసెంట్ కోణాన్ని సూచించాయి. ఇంటర్నెషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధ్వర్యంలో ఈ దీపాల యొక్క రంగులు మరియు ఫ్లాష్ విరామాలు ప్రామాణికతను సంతరించుకున్నాయి. 1940లలో, స్లోప్ లైన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది రెండు వరుసలలో దీపాలను కలిగి ఉంటుంది. ఇవి గొట్టం ఆకారంలో ఉంది గ్లైడ్ స్లోప్ పై విమానం యొక్క స్థానాన్ని సూచిస్తాయి. అదనపు దీపాలు అసమంజస ఎత్తును మరియు దిశను సూచిస్తాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత విమానాశ్రయ నిర్మాణము మరింత ఆధునికత సంతరించుకున్నాయి. ప్యాసెంజర్ భవనాలు సమూహాలుగా దీవి వద్ద ఏర్పాటు చేయబడేవి, మరియు రన్ వేలు టర్మినల్ వద్ద సమూహాలుగా ఏర్పాటు చేయబడేవి. ఈ రకమైన ఏర్పాటు సౌకర్యాల విస్తరణకు అనుమతించింది. కాని దీని వల్ల ప్రయాణీకులు విమానాన్ని చేరుటకు మరింతగా ప్రయాణించ వలసి వచ్చేది.

కాంక్రీట్ మైదానంపై పట్టీలను ఏర్పాటు చేయడం ల్యాండింగ్ ఫీల్డ్ మెరుగుపరచడానికి దారితీసింది. ఇవి ల్యాండ్ అయ్యే విమానాల దారికి అడ్డంగా నిర్మించబడతాయి. వానా కాలంలో విమానం యొక్క చక్రాల ముందు నిలిచే అధిక నీటిని నిర్మూలించడానికి ఈ పట్టీలు ఉపయోగపడతాయి.

జెట్ విమానాల ట్రాఫిక్ మూలంగా 1960లలో విమానాశ్రయ నిర్మాణానికి మహర్దశ కలిగింది. రన్ వే లను 3,000 m (9,800 ft) వరకు పోడిగించేవారు. స్లిప్ ఫార్మ్ పరికరాన్ని ఉపయోగించి రిఇంఫోర్సేడ్ కాంక్రీట్ తో ఈ ప్రాంతాన్ని నిర్మిస్తారు. ఈ పరికరము దారి పొడుగునా అడ్డంకులు లేకుండా ఏకథాటిన స్లాబ్ ను నిర్మిస్తుంది. 1960ల మొదట్లో జెట్ బ్రిడ్జ్ వ్యవస్థలను ఆధునిక వైమానిక టర్మినల్స్ కు పరిచయం చేయడం జరిగింది. ఈ వ్యవస్థ అవుట్-డోర్ ప్యాసెంజర్ బోర్డింగ్ ను నిర్మూలించింది. 1970ల కల్లా యునైటెడ్ స్టేట్స్ లో ఈ వ్యవస్థలు సామాన్య ప్రదేశాలుగా మారాయి.

ఆధునిక రన్ వేలు విమానాలు మెల్లగా కదిలే ప్రాంతములో మందముగా ఉంటాయి. వీటిని రన్ వే ఎండ్స్ అని అంటారు. ఇవి ఎక్కువ లోడ్ ను భరించగలుగుతాయి అని అభిప్రాయం. ల్యాండింగ్ యొక్క ఇంపాక్ట్ వల్ల విమానాలు ల్యాండింగ్ సమయంలో బిగ్గరగా ధ్వని వెలువరుస్తాయని సామాన్య అభిప్రాయాము. లిఫ్ట్ వల్ల విమానం యొక్క బరువు ఎక్కువగా దాని రెక్కలపై పడుతుంది కాబట్టి ఈ అభిప్రాయంలో నిజం లేదు. రన్ వేలు వీలైనంత చదునుగా మరియు నున్నంగా తయారు చేయబడతాయి.

విమానాశ్రయ గుర్తింపు మరియు నామకరణము.[మార్చు]

విమానాశ్రయాలు ప్రత్యేకంగా తమ అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్ విమానాశ్రయ కోడ్మరియు CAO విమానాశ్రయ కోడ్ లతో సూచింపబడతాయి. ఒక అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్ (IATA) విమానాశ్రయ కోడ్ తరచూ విమానాశ్రయము యొక్క సాధారణ నామము యొక్క సంకేతాక్షరములతో ఉన్నది ముఖ్యంగా పాతవి. ఉదాహరణకు PHL అంటే ఫిలడెల్ఫియ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయము యొక్క ప్రాంతము కాని పేరుకాని మారినపుడు కొన్నిసార్లు తన పూర్వపు IATA కోడ్ ను అలాగే ఉంచుకుంటుంది. బీరట్ లోని బీరట్ రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయము తన పాత IATA కోడ్ అయిన BEYను అలాగే ఉంచుకుంది. ఆ విమానాశ్రయము యొక్క పురాతన పేరు బీరట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (BEY అనేది దాని ఫ్రెంచ్ నామము ఎయిరోపోర్ట్ ఇంటర్నేషనల్ దే బెరౌత్ నుండి వచ్చింది). హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయము కాయ్ తక్ నుండి చెక్ లాప్ కోక్ కు 1998లో మారినపుడు తన పేరు మరియు IATA కోడ్ రెండింటిని అలాగే కొనసాగించింది.

విమానాశ్రయము యొక్క పేరులోనే దాని ప్రాంతము పేరుకూడా కావొచ్చు. ఉదాహరణకు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విమానాశ్రయాలకు ఇలా పేరు నిర్ణయించవచ్చు: ఒక ప్రముఖ వ్యక్తి పేరుతో, సామాన్యంగా ఒక రాజకీయవేత్త, ఉదా. పారిస్-చార్లెస్ దే గుల్లే ఎయిర్పోర్ట్, లేక అది ఉన్న ప్రాంతమునకు సంబంధించిన ఒక వ్యక్తి పేరుతో కాని లేదా, ఏవియేషన్ చరిత్రలో ప్రముఖుల పేరుతో, ఉదా; నార్మన్ వై. మినేట శాన్ జోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విల్ రోజర్స్ ప్రపంచ ఎయిర్పోర్ట్, లివర్పూల్ జాన్ లేన్నాన్ ఎయిర్పోర్ట్, రియో దే జానీరో-గాలియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టెహ్రాన్ ఇమాం ఖొమేని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేక ఈ మధ్యలో, బెల్ఫాస్ట్ సిటి ఎయిర్పోర్ట్ తిరిగి జార్జ్ బెస్ట్ బెల్ఫాస్ట్ సిటి ఎయిర్పోర్ట్ అని ఉత్తర ఐర్లాండ్ లో జన్మించిన ఒక ఫుట్బాల్ తార సంస్మరణార్ధం మార్చబడింది.

కొన్ని విమానాశ్రయాలు అనధికార పేర్లు కలిగి ఉంటాయి. ఈ పేర్లు ఎంతగా ప్రాచుర్యం పొండుతాయంటే వాటి అధికారిక పేరు చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది.

విమానాశ్రయ పేరులో "ఇంటర్నేషనల్" అనే పదము ఉండవచ్చు. దీని వలన ఆ విమానాశ్రయము నిజానికి అటువంటి విమానాలను నిర్వహించకపోయినా అంతర్జాతీయ వైమానిక ట్రాఫిక్ ను నిర్వహించగల వాటి సామర్ధ్యము ప్రతిబింబిస్తుంది, ఉదాహరణకు టేక్సేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతర్జాతీయ వలస సౌకర్యాలు ఉన్న కొన్ని విమానాశ్రయాలు తమ పేరులో ఆ పదాన్ని వదులుకొనుట ఎంచుకోవచ్చు. ( ఉదా: పర్త్ ఎయిర్పోర్ట్, సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్.

తక్కువ ఖర్చు విమానాశ్రయాలు[మార్చు]

21వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో, తక్కువ ఖర్చు టర్మినళ్ళు, లేక మొత్తం విమానాశ్రయాలు రేయినర్ వంటి రాయితీ విమానయాన సంస్థలకు సేవలనందించుటకు నిర్మాణము చేయబడ్డాయి.

విమానాశ్రయ భద్రత[మార్చు]

ప్రయాణీకులు లోహపు పరిశోధక యంత్రాల గుండా నడవాలి మరియు వారి సామాను X-రే యంత్రాల ద్వారా స్కాన్ చేయబడుతుంది.

విమానాశ్రయ భద్రత సాధారణంగా సామాను తనిఖీలు, వ్యక్తుల యొక్క లోహపు యంత్రాల స్క్రీనింగులు మరియు ఆయుధముగా వాడబడే ఎ వస్తువునైనా అడ్డుకోవడం మొదలైనవి కలిగి ఉంటుంది. 2001 సెప్టెంబరు 11 దాడులు తరువాత, విమానాశ్రయ భద్రత నాటకీయంగా పెరిగింది.

విమానాశ్రయ కార్యకలాపాలు[మార్చు]

ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ[మార్చు]

ప్రపంచంలోని ఎక్కువ శాతం విమానాశ్రయాలు టవరు-రహితమైనవి మరియు వీటిల్లో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ ఉండదు. కాని, ముఖ్యంగా రద్దీ ఉన్న విమానాశ్రయాలలో, లేక ప్రత్యేక అవసరాలున్న విమానాశ్రయాలలో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా కంట్రోలర్లు (మామూలుగా భూ-ఆధారితమైన) విమానాల కదలికలను రేడియో మరియు ఇతర సమాచార మార్పిడి మార్గాల ద్వారా నియంత్రిస్తారు. ఈ రకమైన పరస్పర సహకార-ఆధారిత సౌకర్యాలు క్లిష్ట కార్యాలలో సంరక్షణ మరియు వేగాన్ని చేకూరుస్తాయి. వీటి ద్వారా మూడు దిశలలోనూ ట్రాఫిక్ కదలిక సాధ్యమవుతుంది. విమానాశ్రయాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణా వ్యవస్థల యొక్క బాధ్యతలు ఈ కింది రెండు విభాగాలుగా విభజించబడ్డాయి: గ్రౌండ్ మరియు టవర్ ; ఒకే కంట్రోలర్ ఈ రెండు విభాగాలకూ పనిచేయవచ్చు. రద్దీ ఎక్కువ ఉన్న విమానాశ్రయాలలో క్లియరెన్స్ డెలివరీ, ఆప్రాన్ కంట్రోల్ మరియు ఇతర ప్రత్యేకమైన ATC స్టేషన్లు ఉంటాయి.

రన్ వేలపై ఉన్న ట్రాఫిక్ తప్ప మిగితా అన్ని గ్రౌండ్ ట్రాఫిక్లను "మోవ్మేంట్ ప్రదేశాల"కు తరలించడం గ్రౌండ్ కంట్రోల్ విభాగము యొక్క బాధ్యత. ఇందులో విమానాలు, సామాను ట్రైనులు, స్నోప్లో లు, గ్రాస్ కట్టర్లు, ఇంధన ట్యాంకులు, మరియు వివిధ రకాల ఇతర వాహనాలు. గ్రౌండ్ కంట్రోల్ విభాగము ఈ వాహనాలకు ఏ టాక్సీ మార్గాలను ఉపయోగించాలాో, ఏ రన్ వేను ఉపయోగించాలాో (విమానాల విషయంలో), ఎక్కడ ఆపి ఉంచాలాో, ఎప్పుడు రన్ వే లను దాటితే మంచిదో చెబుతుంది. విమానము టెక్ ఆఫ్ కి ముందు రన్ వేకి కొంచం ముందు ఆగుతుంది. ఇక్కడ అది టవర్ కంట్రోల్ విభాగాని ఆధీనంలోకి వస్తుంది. విమానము ల్యాండ్ అయిన తరువాత రన్ వేను వదిలి గ్రౌండ్ కంట్రోల్ కు వస్తుంది.

టవర్ కంట్రోల్ విభాగము రన్ వే పై మరియు విమానాశ్రయ చుట్టు పక్కల నియంత్రించబడ్డ వైమానిక ప్రాంతంలో విమానాలను నియంత్రిస్తుంది. టవర్ కాంట్రోల్లర్లు మూడు దిశలలో విమాన గమనాన్ని రాడార్ ఉపయోగించి కనుకోవచ్చు. లేక వారు పైలట్ స్థాన రిపోర్టులను మరియు వీక్షణా పరిశీలన ఉపయోగించి కనుకోవచ్చు. వారు ట్రాఫిక్ ను బట్టి విమానాల వరుసక్రమాన్ని తెలుపుటలో సహకరిస్తాయి. విమానాలను ఈ క్రమములో జాగ్రత్తగా చేరుటకు మరియు విడుచుటకు మార్గాలను తెలుపుతాయి. వైమానిక ప్రాంతంలో మాత్రమే తిరిగే విమానాలు కూడా టవర్ కంట్రోల్ ను సంప్రదించాలా్సి ఉంటుంది. దీనివల్ల ఆ విమానము వచ్చే మార్గములో ఇతర ట్రాఫిక్ లేదని నిర్ధారించుకోవచ్చు.

ట్రాఫిక్ నిర్మాణక్రమము[మార్చు]

ఎడమ-చేతి పథము నమూనా

అన్ని విమానాశ్రయాలు వచ్చే మరియు పోయే విమానాల సుళువైన ట్రాఫిక్ ఒరవడి కొరకు ఒక ట్రాఫిక్ నిర్మాణక్రమము (తరచుగా U.S. బయట ట్రాఫిక్ సర్క్యూట్ అని పిలువబడే) ఉపయోగిస్తాయి. ఈ నిర్మాణక్రమముఅయిదు "లెగ్స్" ఉన్న ఒక సర్క్యూటు. అన్నిఒక దీర్ఘచతురస్రాకారములో ఉంటాయి (రెండు కాళ్ళు మరియు రన్ వే ఒక వైపు మరియు మిగిలిన కాళ్ళు మూడు వైపులా ఉండేట్టు). ప్రతి కాలుకు ఒక పేరు ఇవ్వబడింది (చిత్రపటము చూడండి) మరియు ATC పైలట్లకు సర్క్యూటులోనికి వెళ్ళుటకు మరియు బయటికి వచ్చుటకు సూచనలిస్తుంది. ట్రాఫిక్ నిర్మాణక్రమములు ఒక నిర్దుష్టమైన ఎత్తులో ఉంటాయి సాధారణంగా 800 or 1,000 ft (244 or 305 m) నేలమట్టమునకు పైన (AGL) ప్రామాణిక ట్రాఫిక్ నిర్మాణక్రమములు ఎడమచేతి వాటము కలిగినవి, అంటే అన్నిమళ్లింపులు ఎడమ చేతివైపుకు జరగాలి. తరచూ పర్వతాలు వంటి అడ్డంకులు ఉన్నప్పుడు లేదా ప్రాంతీయ వాస్తవ్యులకు శబ్దములు తగ్గించుటకు కొన్ని కుడిచేతి వాటము కలిగినవి కూడా ఉన్నాయి. ముందు నిర్ణయించబడిన సర్క్యూటు ట్రాఫిక్ సాఫీగా సాగుటకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పైలట్లందరికి అది తెలిసి ఉంటుంది మరియు మిడ్-ఎయిర్ తాకిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

అతి పెద్ద విమానాశ్రయాలలో, ఒక సర్క్యూటు దాని స్థానంలో ఉంటుంది కాని సాధారణంగా ఉపయోగించబడదు. అయితే, విమానాలు (తరచూ పొడవైన దారులు కలిగిన వాణిజ్య విమానాలు) విమానాశ్రయము నుండి కొన్ని గంటల దూరంలో ఉండగానే అప్రొఛ్ క్లియరెన్స్ అడుగుతాయి, కొన్ని తమ డిపార్చర్ పాయింట్ నుండి టేక్-ఆఫ్ కాకమునుపే. పెద్ద విమానాశ్రయాలలో క్లియరెన్స్ డెలివరి అనే ఫ్రీక్వెంసి ఉంటుంది. ఇది బయటికి వెళ్తున్న విమానాలచే ఉపయోగించబడుతుంది. ఇది ఆ తరువాత విమానాలను నేరు మార్గమున రన్ వేపైకి వచ్చి ఇతర విమానాలు అడ్డుపడతాయనే భయము లేకుండా లాండ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. ఈ పద్ద్హతి ఎయిర్ స్పేస్ ను స్వేచ్ఛగా ఉంచి పైలట్లకు సుళువుగా ఉన్నా కూడా, దీనికి ముందుముందు కాలంలో విమానాలు విమానాశ్రయాలను ఎలా ఉపయోగించుకుంటాయో అన్న దాని గురించి పూర్తి వివ్షయ జ్ఞానము కలిగి ఉండాలి. కాబట్టి ఇది ముందుగా ప్రణాళిక చేయబడ్డ ఫ్లైట్లు ఉన్న పెద్ద వాణిజ్య విమానయాన సంస్థలకు మాత్రమే సాధ్యము. ఈ మధ్యకాలంలో ఈ పద్ధతి చాలా అభివృద్ధి చెందింది. నిర్వాహకులు ఒక విమానము టేక్ ఆఫ్ కాకముందే అది లాండ్ అవ్వడం ఆలస్యమౌతుందని; మరియు గాలిలో ఇంధనము వృధా చేసుకోనదము కనతే విమానమును గ్రౌండ్ పైనే ఆలస్యము చేయబడవచ్చు అని చెప్పగలరు

ప్రయాణ ఉపకరణాలు[మార్చు]

స్టాండర్డ్ విషువల్ అప్రోచ్ స్లోప్ ఇండికేటర్

అన్ని విమానాశ్రయాలు వాటిని కలిగి ఉండపోయినా పైలట్లకు ఎన్నో ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. ఒక విజువల్ అప్రోచ్ స్లోప్ ఇండికేటర్ (VASI) పైలట్లకు లాండింగ్ కొరకు అప్ర్రోచ్ కై ఉపయోగపడుతుంది. కొన్ని విమానాశ్రయాలు VHF ఆమ్నిడైరెక్షనల్ రేంజ్ (VOR) కలిగి ఉంటాయి. ఇది పైలట్లకు విమానాశ్రయమునకు దిశా నిర్దేశము చేస్తుంది. VORలు తరచుగా ఒక డిస్టెన్స్ మెషరింగ్ ఎక్విప్మెంట్ (DME) తో కలిసి ఉంటాయి. దీని వలన VORకు దూరాన్ని నిర్ణయించ వచ్చు. VORలు విమానాశ్రయము బయట కూడా ఉంటాయి. అక్కడ విమానాలకు ఎయిర్ వేలను అందిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో, పైలట్లు ఇంస్ట్రుమెంట్ లాండింగ్ వ్యవస్థ (ILS) ను ఉపయోగించి గ్రౌండ్ ను చూడకున్న కూడా రన్ వేను తెలుసుకొని సరైన అర్పోచ్ కు వెళ్తారు. గ్లోబల్ పోసిషనింగ్ వ్యవస్థ (GPS) యొక్క వాడకముపై ఆధారపడిన ఇంస్ట్రుమెంట్ అప్రోచ్ త్వరితగతిన పెరుగుతోంది మరియు ముందుముందు ఇంస్ట్రుమెంట్ లాండింగ్ లకు ప్రాథమిక మాధ్యమముగా ఉండవచ్చు.

పెద్ద విమానాశ్రయాలు కొన్నిసార్లు ప్రెసిషన్ అప్రోచ్ రాడార్ (PAR) లను అందిస్తాయి కాని ఈ వ్యవస్థలు ఎక్కువగా పౌర విమానాశ్రయముల కంటే సైన్యపు ఎయిర్ బేస్ ల వద్ద ఉపయోగించ బడతాయి. విమానము యొక్క నిలువు మరియు అడ్డ చలనాలు రాడార్ ద్వారా పథము చూపబడతాయి మరియు కంట్రోలర్ పైలట్ కు అప్రోచ్ స్లోప్ కు సంబంధించి తన స్థానము గురించి చెప్తాడు. ఒకసారి పైలట్లు రన్ వే లైట్లను చూడగలిగితే, వారు వీక్షణ లాండింగ్ కొనసాగించ వచ్చు.

మార్గదర్శక చిహ్నములు[మార్చు]

విమానాశ్రయ మార్గదర్శక చిహ్నములు టాక్సీయింగ్ విమానము మరియు విమానాశ్రయ వాహనములకు దిశను మరియు సమాచారమును అందిస్తాయి. చిన్న విమానాశ్రయములు కొన్ని చిహ్నములు కలిగి ఉంటాయి లేదా అసలు ఉండవు. వీటికి బదులుగా అవి విమానాశ్రయ బొమ్మలు మరియు చిత్రపటాలపై ఆధార పడతాయి.

విమానాశ్రయములలో రెండు తరగతుల సైనేజులు ఉంటాయి. వాటిలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి.

కార్యాచరణ మార్గదర్శక చిహ్నములు[మార్చు]

టాక్సీ వే కొరకు ఒక స్థావర చిహ్నము
టాక్సీ వే బ్రేవోనకు దిశా చిహ్నము
 • స్థాన చిహ్నములు - నలుపు నేపథ్యముపై పసుపుపచ్చ. ప్రస్తుతము ఉన్న రన్ వేను కాని ప్రవేశిస్తున్న టాక్సీవేను కాని గుర్తిస్తుంది.
 • దిశ/రన్ వే బయటకు దారి చిహ్నములు - పసుపుపచ్చాపై నలుపు. విమానము ప్రవేశిస్తున్నటువంటి కలుస్తున్న టాక్సీ వేలను తిరుగుమనే సూచనను ఇచ్చీ ఒక బాణం గుర్తుతో తెలుపుతుంది.
 • ఇతర - చాలా విమానాశ్రయములు సాంప్రదాయక ట్రాఫిక్ చిహ్నము లైన ఆగుము మరియు ఈల్డ్ చిహ్నములను విమానాశ్రయము అంతటా వాడుతారు.

అధీశక సూచన చిహ్నములు[మార్చు]

ప్రవేశము లేదు చిహ్నము.

అధీశక సూచన చిహ్నములు ఎరుపు రంగుపై తెలుపు రంగుతో ఉంటాయి. అవి రన్ వేలు లేక సంక్లిష్టమైన ప్రాంతాలకు ప్రవేశాలను చూపిస్తాయి. వాహనములు మరియు విమానాలు నియంత్రణా భవనము నుండి ముందుకు సాగుటకు ఆదేశము వచ్చు వరకు ఈ చిహ్నముల వద్ద నిలపాలి.

 • రన్ వే చిహ్నములు - ఎరుపు నేపథ్యముపై తెలుపు అక్షరాలు. ఈ చిహ్నములు ముందు ఉన్న రన్ వే చీలికను సూచిస్తాయి.
 • ఫ్రీక్వెంసి మార్పు చిహ్నములు - సాధారణంగా ఒక ఆగుము చిహ్నము మరియు ఇంకొక ఫ్రీక్వెంసికి మారుమని సూచన. ఈ చిహ్నములు వివిధ గ్రౌండ్ నియంత్రణ ప్రాంతాలు ఉన్న విమానాశ్రయముల వద్ద ఉపయోగిస్తారు.
 • ధారణ స్థాన చిహ్నములు - టాక్సీ వే గుండా ఒక ఏకైక పసుపు పచ్చని బార్. ఇది గ్రౌండ్ నియంత్రణకు అవసరమయ్యే ఒక నిలువుము అనే స్థానమును సూచిస్తుంది. ఒక వేళ రెండు పసుపు పచ్చని బార్లు మరియు రెండు అడ్డగీతలున్నపసుపు పచ్చని బార్లు ఉన్నట్టైతే ముందు రాబోతున్న రన్ వే కలయికపై హోల్డింగ్ స్థానమును సూచిస్తుంది; ఇలాంటి హోల్డింగ్ గీతలు అనుమతి లేనిదే దాటరాదు. మరికొన్ని విమానాశ్రయములలో, తక్కువ వీక్షణ కార్యకలాపాల సమయంలో హోల్డింగ్ స్థానమును సూచించుటకు ఒక టాక్సీ వే గుండా ఎరుపు లైట్ల వరుస ఉపయోగిస్తారు. "ILS" చిహ్నముతో ఉన్న "ఇంటరప్టెడ్ లాడర్" లాంటి గుర్తులు ఎరుపుపై తెలుపుతో ఉన్నటువంటివి ILS క్లిష్ట ప్రాంతము ముందు ఉన్న హోల్డింగ్ స్థానమును సూచిస్తాయి.

లైటింగ్[మార్చు]

చాలా విమానాశ్రయాలలో రాత్రి సమయములో లేక వర్షములో లేక మంచు కురిసేప్పుడు కాని రన్ వేలు మరియు టాక్సీవేలు ఉపయోగించుటకు దారిచూపే లైటింగ్ వ్యవస్థ ఉంటుంది.

లాండింగ్ర సమయంలో రన్ వేలపై, ఆకుపచ్చని లైట్లు రన్ వే యొక్క ప్రారంభమును సూచిస్తాయి మరియు ఎరుపు లైట్లు రన్ వేయొక్క చివరిబాగామును సూచిస్తాయి. రన్ వే ఎడ్జ్ లైటింగ్ లో రన్ వేకు రెండు వైపులా తెల్లని లైట్లు ఉంటాయి. ఇది అంచులను సూచిస్తాయి. కొన్నివిమానాశ్రయాలు రన్ వేలపై చాలా క్లిష్టమైన లైటింగ్ కలిగి ఉంటాయి. వీటిలో రన్ వే మధ్య గుండా ఉండే లైట్లు మరియు సమీపించుటను సూచించే లైట్లు ఉంటాయి (అప్రోచ్ లైటింగ్ సిస్టం లేక ALS) తక్కువ-ట్రాఫిక్ ఉన్న విమానాశ్రయాలు విద్యుచ్చక్తి మరియు సిబ్బంది ఖర్చులను పొడుపు చేయుటకు పైలట్ కంట్రోల్డ్ లైటింగ్ ను ఉపయోగిస్తాయి.

టాక్సీ వేల గుండా, నీలి రంగు లైట్లు టాక్సీ వేల అంచులను సూచిస్తాయి. కొన్ని విమానాశ్రయాలలో మధ్య గీతను సూచించే పొదగబడిన ఆకుపచ్చని లైట్లు ఉంటాయి.

 • ఆటంక లైటింగ్
  • అపాయాలను సూచించుటకు ఏర్పాటుచేయబడినది
  • పైలట్లకు ఒక దర్శన ఉపయోగమైన ఉపకారముగా సహాయపడుతుంది (సాధారణంగా ఒక పథమును సృష్టిస్తుంది)
  • పైలట్లకు కనబడే విధంగా ఉంటుంది కాని ప్రజలకు గ్రౌండ్ పై ఎటువంటి ఇబ్బందిని కలిగించదు.

వాతావరణ పరిశీలనలు[మార్చు]

సురక్షితమైన టేక్ ఆఫ్ మరియు లాండింగ్ లకు వాతావరణ పరిశీలనలు చాలా ముఖ్యమైనవి. US మరియు కెనడా లలో, ఎక్కువ భాగం విమానాశ్రయాలు, పెద్దవి మరియు చిన్నవి, స్వయంచాలాక విమానాశ్రయ వాతావరణ స్టేషను, AWOS, ASOS, లేక AWSS, కాని మానవ పరిశీలకులు గాని లేక రెండింటి కలయిక కాని కలిగి ఉంటాయి. ఈ వాతావరణ పరిశీలనలు, ప్రధానంగా METAR ఆకృతిలో, రెడియోపై లభిస్తాయి. ఇవి ఆటోమాటిక్ టర్మినల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ATIS) ద్వారా కాని, ATC ద్వారా కాని లేక ఫ్లైట్ సర్వీస్ స్టేషను ద్వారా కాని అందించబడతాయి.

గరిష్ఠ పనితీరును సాధించుటకు విమానాలు గాలి లోనికి టేక్ ఆఫ్ మరియు లాండ్ అవుతాయి. పైలట్లకు లాండింగ్ సమయములో తక్షణ సమాచారము అవసరము అవుతుంది కాబట్టి ఒక విండ్ సాక్ కూడా ఏర్పాటు చేయబడుతుంది.

భద్రతా వ్యవస్థ[మార్చు]

విమానాశ్రయ నిర్వహణలో వాయు భద్రత ముఖ్యమైన అంశము మరియు ప్రతి ఎయిర్‌ఫీల్డ్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరికరాలు మరియు పద్ధతులతో తయారుగా ఉంటుంది. వ్యాపార ఎయిర్‌ఫీల్డ్ లలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అత్యవసర వాహనములు మరియు ఎయిర్‌ఫీల్డ్ ప్రమాదము లు, సిఇబ్బంది మరియు ప్రయాణీకుల ఎక్స్త్రాక్షన్లు మరియు ఏవియేషన్ ఇంధనము యొక్క ప్రమాదాలు ఎదుర్కొనే పరికరాలతో సహా సిబ్బంది కలిగి ఉంటాయి. సిబ్బందికి బాంబు బెదిరింపు లు, హైజాకింగ్ మరియు టెర్రరిస్టు చర్యల పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వబడుతుంది.

NASA వాయు రక్షణ ప్రయోగము (CID ప్రాజెక్టు)

విమనమునకు వచ్చే ప్రమాదాలలో చెత్తచెదారము, పక్షి గూళ్ళు, ఘర్షణ స్థాయిలను తగ్గించే పర్యావరణ పరిస్థితులైన మంచుగడ్డలు, మంచు లేక వర్షము వంటివి ఉన్నాయి. రన్ వే నిర్వహణలో పాక్షికంగా ఎయిర్‌ఫీల్డ్ రబ్బర్ తీసివేత ఉంటుంది. దీనివలన ఘర్షణ స్థాయిలు నిర్వహించ వీలౌతుంది. ఏదైనా పదార్థము ఇంజను పైపులలోనికి వెళ్ళకుండా చెత్త చెదారము లేకుండా శుభ్రపరిచే పరికరాలతో ఫీల్డులను శుభ్రము చేయాలి (ఫారిన్ ఆబ్జెక్ట్ డామేజ్ ను చూడండి) ప్రతికూల వాతావరణ పరిస్థితులలో, హిమము మరియు మంచు తొలగించే పరికరాలను ఉపయోగించి లాండింగ్ ప్రదేశముపై కర్షణను పెంచవచ్చు. నిలిచి ఉన్న విమానము కొరకు రెక్కలపై చల్లుటకు ప్రత్యేకమైన డీసింగ్ ద్రవాలను చాలా్లే పరికరాలను ఉపయోగించవచ్చు.

చాలా విమానాశ్రయాలు బహిరంగ భూములలో లేదా తడిప్రదేశము ల సమీపములో నిర్మిస్తారు. దీనివలన పక్షి జనాభా ఆకార్షిత మౌతుంది మరియు విమానమునకు పక్షి ఘాతము ల రూపంలో ప్రమాదము పొంచి ఉంటుంది. విమానాశ్రయ సిబ్బంది తరచూ పక్షులు గూళ్ళు కట్టకుండా చూడవలసి ఉంటుంది.

కొన్ని విమానాశ్రయాలు ఉద్యానవనాలు, గోల్ఫ్ కోర్సులు లేదా లోతట్టు ప్రాంతము ఉపయోగించే వాటి ప్రక్కన ఉన్నాయి. మరికొన్ని విమానాశ్రయాలు అధిక-జనాభా కలిగిన నగర ప్రాంతాలు లేదా సబర్బన్ ప్రాంతాలలో ఉన్నాయి. 1980లలో, శాన్ జోస్, కాలిఫోర్నియాలో ఒక విమానము రీడ్-హిల్వ్యూ విమానాశ్రయము వద్ద (1930లలో నిర్మించబడినది) దిగుతూ ఈస్త్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న మేసి'స్ డిపార్ట్మెంట్ స్టోర్ ను ఢీ కొనడముతో ఒక విరోధము మొదలయ్యింది. చాలామంది ప్రాంతీయ వాస్తవ్యులు అక్కడ అది యాభై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఆ విమానాశ్రయమును మూసి వేయించుటకు ప్రయత్నించారు; దాని ఇరుగుపొరుగులు (మరియు ది మాల్) ఒక దశాబ్దము పురాతనమైనవి.[ఉల్లేఖన అవసరం]

విమానాల మధ్య గ్రౌండ్ పై తాకిడులు సంభవించే ప్రాంతాలలో కూడా ఒక విమానాశ్రయము ఉండవచ్చు. విమానాలు లేదా వాహనాలు విరుద్ధమైన స్థలములో ఉన్నప్పుడు ఏ విధమైన అవాంతరాలు కలిగినా ఆ "హాట్ స్పాట్స్" లను గుర్తించుటకు రికార్డులు ఉంచబడతాయి. ఈ ప్రాంతాలలో ఆ తరువాత రవాణా అధికారులచే మరియు విమానాశ్రయ యాజమాన్యముచే ప్రత్యేక శ్రద్ధ చూపబడుతుంది (US లో FAA మాదిరిగా)

1980ల సమయములో, మైక్రోబర్స్ట్ అనే ఒక ప్రక్రియ చాలా ఆందోళన కలిగించింది. దీనికి కారణం మైక్రోబర్స్ట్ విండ్ షీర్ వలన జరిగే విమాన ప్రమాదములు. ఉదాహరణకు, డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 191. మైక్రోబర్స్ట్ రాడార్ లాండింగ్ సమయంలో భద్రత కొరకు రూపొందించబడింది. ఇది మైక్రోబర్స్ట్ సంఘటన ప్రాంతము పరిధిలో ఉన్నవిమానమునకు రెండు నుండి ఐదు నిమిషాల వరకు హెచ్చరిక ఇస్తుంది.

కొన్నిఎయిర్‌ఫీల్డ్‌లు ఇప్పుడు సాఫ్ట్ కాంక్రీట్ అనే ఒక ప్రత్యేక ఉపరితలం రన్ వే చివరన (స్టాప్ వే లేదా బ్లాస్ట్ పాడ్) కలిగి ఉంటుంది. ఇది స్టైరోఫోం లాగా ప్రవర్తించి విమానమును నిలకడకు తీసుకువస్తుంది. రన్ వే నీటి వద్ద కాని లేక ఏ విధమైన ఇతర అపాయము ప్రక్కన కాని ఉన్నప్పుడు ఈ ఉపరితలాలు ఉపయోగ పడతాయి మరియు విమానాలూ ఆ ప్రదేశము చివరి వరకు వెళ్ళకుండా అడ్డుకుంటాయి.

విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది[మార్చు]

KLM బోయింగ్ 777 ను కదిలించే ఒక ఎయిర్ క్రాఫ్ట్ టోట్రాక్టర్

చాలా విమానాశ్రయాలలో ప్రయాణీకుల, సిబ్బంది, సామాను లోడింగ్ మరియు అన్ లోడింగ్ చేయుటకు మరియు ఇతర సేవలను అందించుటకు గ్రౌండ్ సిబ్బంది ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] కొంత మంది గ్రౌండ్ సిబ్బంది విమానాశ్రయములో ప్రత్యేక వైమానిక కార్యకలాపాలకు ఎంచుకోబడతారు.

పర్యావరణ ఆందోళనలు[మార్చు]

విమానాశ్రయాల పరిసర ప్రాంతాలలో నివసించే వారికి విమాన శబ్దము చాలా పెద్ద శబ్ద ఇబ్బందికి కారణము. రాత్రి సమయాలలో మరియు తెల్లవారు ఝామున విమానాలు పనిచేస్తే నిద్రకు ఆటంకము కలగవచ్చు. టేక్-ఆఫ్ మరియు లాండింగ్ సమయములోనే కాకుండా విమాన శబ్దము గ్రౌండ్ నిర్వహణ సమయములో కూడా ఉంటుంది. ఉదాహరణకు గ్రౌండ్ నిర్వహణ మరియు విమాననాల తనిఖీ. శబ్దము ఇతర శబ్ద సంబంధ ఆరోగ్య ప్రభాలు కూడా కలుగ చేయవచ్చు. విమానాశ్రయమునకు వెళ్ళే దారిలో వాహనాల ట్రాఫిక్ శబ్దము మరియు కాలుష్యము వంటివి ఇతర శబ్ద మరియు పర్యావరణ ఆందోళనలు.

కొత్త విమానాశ్రయాల నిర్మాణము లేదా ఉన్న విమానాశ్రయాలలో కొత్త రన్ వేల చేరిక తరచుగా ప్రాంతీయ నివాసస్తులచే వ్యతిరేకించబడుతుంది. ఎందుకంటే, ఇది గ్రామీణ ప్రాంతాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రాంతీయ పుష్ప సంబంధమైన వాటికి మరియు జంతుజాలములపై ప్రభావము చూపుతుంది. విమానాలు పక్షులతో ఢీకొనే ప్రమాదము ఉన్నందున పెద్ద విమానాశ్రయాలు వాటి జానాభా తగ్గించుటకు వాటిని బెదిరించి చెదరగొట్టటము గాని లేదా వాటి కాల్చడము గాని చేస్తారు.

విమానాశ్రయ నిర్మాణముల వలన ప్రాంతీయ వాతావరణ నిర్మాణక్రమమును మారుస్తుందని ప్రతీతి. ఉదాహరణకు, అవి సాధారణంగా ఎక్కువ విస్తీర్ణములో పరచుకొని ఉంటాయి కాబట్టి, అక్కడ ఎక్కువగా మంచు కురిసే అవకాశము ఉంది. దీనికి తోడుగా, విమానాశ్రయాలలో సాధారణంగా చెట్లు మరియు గడ్డి స్థానంలో పేవ్మెంట్ నిర్మిస్తారు, వ్యవాసాయ భూముల ప్రాంతాలలో నీటి పారుదల క్రమమును మారుస్తాయి. ఇది చుట్టుప్రక్కల ప్రాంతాలలో వరదలు, రన్-ఆఫ్ మరియు క్రమక్షయము నకు దారి తీస్తుంది.

విమానాశ్రయ నిర్వహణా విషయాలలో పర్యావరణ ఆందోళనలను గూర్చి ఎలా శ్రద్ధ తీసుకొంటాయో మరియు పర్యావరణాన్నివిమానాశ్రయ కార్యకలాపాల నుంచి ఎలా రక్షిస్తాయో తెలుపుటకు కొన్ని విమానాశ్రయ పాలక మండలులు వార్షిక పర్యావరణ నివేదికను తయారు చేసి ప్రచురిస్తాయి. ఈ నివేదికలలో విమానాశ్రయ పరిపాలనా మండలి ఆచరంచే అన్ని పర్యావరణ సంరక్షణ పద్ధతులు తెలుపబడతాయి. వీటిలో నీరు, గాలి, మట్టి మరియు శబ్ద కాలుష్యాల విషయాలు, వనరుల సంరక్షణ మరియు విమానాశ్రయము పరిసర ప్రాంతములో సహజ జీవనము యొక్క రక్షణ మొదలగు విషయాల గురించి ప్రస్తావిస్తారు.

సైనిక విమానాశ్రయం[మార్చు]

రోజర్స్ డ్రై లేక్ వద్ద ఉన్న - ముఖ్య బేస్ ప్రాంతము - ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్, కాలిఫోర్నియా యొక్క పైలట్ వీక్షణ

సైనిక విమానాశ్రయం లేక ఎయిర్‌ఫీల్డ్గా కొన్నిసార్లు పిలువబడే ఎయిర్‌బేస్ సైనిక విమానమునకు ఆధారము మరియు సహకారము అందిస్తుంది. కొన్ని ఎయిర్‌బేస్‌లు తమ పౌర సమకాలీనుల వలే వసతులను అందిస్తాయి. ఉదాహరణకు, ఆక్స్‌ఫర్డ్‌షైర్, ఇంగ్లాండ్ లోని RAF బ్రిజ్ నార్టన్ లో ఒక టర్మినల్ ఉంది, ఇది ఫాల్క్లాండ్ ద్వీపాలకు వెళ్ళే ట్రైస్టార్ విమానాలకు రాయల్ ఎయిర్ ఫోర్స్ యొక్క సేవలను అందిస్తుంది. సైన్యపు ఎయిర్‌బేస్‌లు పౌర విమానాశ్రయాలతో కలిసి ఉండవచ్చు. అక్కడ ఉండే టవర్/ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణా వసతులను, రన్ వేలను, టాక్సీవేలను మరియు అత్యవసర సేవలను వాటితో కలిసి పంచుకోవచ్చు కాని వేరువేరు టర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, హాంగర్లు మరియు ఆశ్రయ ప్రాంతాలు ఉండాలి. వీటికి ఉదాహరణలు బర్డుఫోస్స్ విమానాశ్రయము/బర్డుఫోస్స్ ఎయిర్ స్టేషను మరియు గర్దెర్మొఎన్ విమానాశ్రయము/గర్దెర్మొఎన్ ఎయిర్ స్టేషను. రెండూ నార్వేలో ఉన్నాయి. సైన్యపు ఎయిర్‌ఫీల్డ్ యొక్క ముఖ్య వ్యత్యాసము దాని విమాన వాహకము.

విమాన వాహకాలు[మార్చు]

విమాన వాహకము అంటే ఒక యుద్ధనౌక. ఇది సైన్యపు విమానానికి చలన విమానాశ్రయములా పనిచేస్తుంది. విమాన వాహకాలు నావికా దళాలను ఎయిర్ పవర్ ను ఎక్కువ దూరము, భూ-ఆధారిత విమానాలపై ఆధారపడకుండా పంపించడానికి ఉపయోగపడుతుంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి అభివృద్ధి తరువాత, రెండవ ప్రపంచ యుద్ధంలో ఆధునిక ఫ్లీట్ లలో బాటిల్షిప్ స్థానంలో ఇవి ఉపయోగించబడ్డాయి. రక్షణ-రహిత వాహకాలపై క్షిపణి మరియు జలాంతర్గామి దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి వాహక యుద్ధ సమూహములో భాగంగా వెళతాయి. ఈ సమూహంలో వివిధ కార్యకలాపాలు నిర్వహించే చాలా రకాల ఓడలు ఉంటాయి.

వినోదములో విమానాశ్రయము[మార్చు]

వాషింగ్టన్ డుల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయము, డై హార్డ్ 2 కొరకు కనబడే సెట్టింగు; ఈ చిత్రము నిజానికి లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయములో చిత్రీకరించబడింది.

ఒక రవాణా హబ్బుగా ఉన్న దాని ప్రత్యేక స్వభావము వలన మరియు వ్యక్తిగత విమానాశ్రయాలకు ఉన్న విభిన్నమైన లక్షణాల వలన సినిమాలు మరియు టెలివిజన్ కార్యక్రమాలు రెండింటిలో విమానాశ్రయాలు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. దీనికి ఒక ఉదాహరణ ది టెర్మినల్ అనే చిత్రం. ఇందులో ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక విమానాశ్రయ టర్మినల్ లో బందీగా ఉండిపోయి విమానాశ్రయము అందించే ఆహారము మరియు వసతిలో బ్రతకవలసి వస్తుంది. ది V.I.P.s, ఎయిర్ప్లేన్, ఎయిర్పోర్ట్, డై హార్డ్, సోల్ ప్లేన్, జాకీ బ్రౌన్, గెట్ షార్ట్లి, హోమ్ ఎలోన్, లయర్ లయర్, పాసెంజర్ 57, ఫైనల్ డెస్టినేషన్, అన్అకంపనీడ్ మైనర్స్, కాచ్ మీ ఈఫ్ యు కాన్, రెండిషియాన్ మరియు ది లాంగోలియర్స్ వంటి ఎన్నో చిత్రాలలో కూడా విమానాశ్రయాలు ముఖ్య అంశాలు. లాస్ట్, ది అమేజింగ్ రేస్, అమెరికాస్ నెక్స్ట్ టాప్ మోడల్, సైకిల్ 10 వంటి ఎన్నో టెలివిజన్ ధారావాహికాలాలో కూడా ఇవి ముఖ్య పాత్రలు పోషించాయి. ఈ ధారావాహికలలో ముఖ్యమైన కథ విమానాశ్రయాల చుట్టూ తిరుగుతుంది. గుడ్ విల్ హంటింగ్ వంటి ఇతర కార్యక్రమాలు మరియు సినిమాలలో విమానాశ్రయాలు కేవలము ప్రయాణమును సూచించేవిగా ఉన్నాయి.

చాలా కంప్యూటర్ ఆటలు ఆటగాళ్లకు విమానాశ్రయములో ఉన్న భ్రమను కల్పిస్తాయి. వీటిలో ఎయిర్పోర్ట్ టైకూన్ మరియు దాని కొనసాగింపు అయిన ఎయిర్పోర్ట్ టైకూన్ 2 మరియు ఎయిర్పోర్ట్ టైకూన్ 3 ల వంటివి ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనే ఒక జపాన్ దేశపు ఆటల ధారావాహిక కూడా ఉంది.

ఎయిర్‌స్ట్రిప్[మార్చు]

RAF నేటిషాల్ గా ఉన్న ఒక వ్యక్తిగత విమానము

ఎయిర్‌స్ట్రిప్ లేక ఎయిర్‌ఫీల్డ్ అనేది ఇంధన సదుపాయాలు కలిగియున్న మరియు కేవలము రన్ వే మాత్రమే కలిగియున్న ఒక విమానాశ్రయము. అవి సాధారణంగా సుదూర ప్రాంతాలలో ఉంటాయి. చాలా ఎయిర్‌స్ట్రిప్‌లు (ఎక్కువ భాగం నిషేధించబడినవి) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వందల కొలది పసిఫిక్ మహాసముద్రము ద్వీపాలపై కట్టబడ్డాయి. కొన్నిసార్లు కొన్ని ఎయిర్‌స్ట్రిప్‌లు ఒక ప్రాంతము కాలక్రమముగా ఎదుగుతున్నప్పుడు వ్యూహాత్మక లేక ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన పూర్తి స్థాయి ఎయిర్ బేసులుగా మారతాయి.

విమానాశ్రయ మార్గదర్శకాలు[మార్చు]

ప్రతి జాతీయ వైమానిక యాజమాన్యము వద్ద తమ దేశములో ఉన్నవిమానాశ్రయాలను గురించిన సమాచార వనరు కలిగి ఉంటుంది. ఇందులో విమానాశ్రయము యొక్క ఎత్తు, విమానాశ్రయము యొక్క లైటింగ్, రన్ వే సమాచారము, సమాచార వ్యవస్థ మరియు ఆవృతాలు, కార్యకలాపాల గంటలు, సమీపములోని NAVAIDలు మరియు లాండింగ్ నకు ముందస్తు ఏర్పాట్లు అవసరమైన సందర్భములో కావలసిన సమాచారము మొదలైనవి ఉంటాయి.

ఎన్ రూట్ సప్లిమెంట్ ఆస్ట్రేలియా (ERSA)[9] లో ఎయిర్ సర్వీసెస్ ఆస్ట్రేలియా వారిచే ప్రచురితమైన ఆన్-లైన్ సమాచారము చూడవచ్చు. ఎయిర్ సర్వీసెస్ ఆస్ట్రేలియా అనేది ఆస్త్రేలియన్ ATC నిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ కార్పోరేషన్ సంస్థ.
ట్రాన్స్పోర్ట్ కెనడా యాజమాన్యం క్రింద NAV CANADA చే ప్రచురింపబడిన రెండు ప్రచురణలు ది కెనడా ఫ్లైట్ సప్లిమెంట్ (CFS) మరియు ది వాటర్ ఏరోడ్రోం సప్లిమెంట్ లు ఇటువంటి సమానమైన సమాచారమును అందిస్తాయి.
ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ఎయిర్ నేవిగేషన్ (EUROCONTROL) సంస్థ ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ (AIP), ఏరోనాటికల్ చార్ట్స్ మరియు NOTAM సేవలను వివిధ యూరోపియన్ దేశాలకు అందిస్తుంది.
లాఫ్త్ఫర్హ్స్ట్-బున్దేసరంట్ (ఫెడరల్ ఆఫీస్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ జర్మని) చే అందించబడింది.
డెల్విల్లె చే సంపాదకీయం జరుపబడి మరియు బ్రీటింగ్ చే ప్రచురించబడిన ఏవియేషన్ జనరేల్ డెలగ్
యునైటెడ్ కింగ్డం సివిల్ ఏవియేషన్ అథారిటి (CAA) యొక్క సహాయ సహకారాలతో సంకలనం చేయబడ్డ పూలే యొక్క ఫ్లైట్ గైడ్ లో సమాచారము దొరుకుతుంది. ఇంతే కాక పూలేలో గ్రేట్ బ్రిటన్ కు దగ్గరగా ఉన్న యురోపియన్ విమానాశ్రయాల గురించి కూడా సమాచారము కలిగి ఉంటుంది. UK ఎయిర్ నేవిగేషన్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యము అయిన నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ కూడా UK కొరకు ఒక ఆన్లైన్ AIP ను ప్రచురిస్తుంది.
U.S. ఏడు సంచికలుగా ప్రచురించబడిన విమానాశ్రయ/సేవల మార్గదర్శకము ను (A/FD) ను ఉపయోగిస్తుంది. DAFIF లో విస్త్రుతమైన విమానాశ్రయ సమాచారము కూడా ఉంది..
ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ (AIP)[10] జపాన్ సివిల్ ఏవియేషన్ బ్యూరో, జపాన్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లాండ్, అంతర్గత నిర్మాణం, రవాణా మరియు టూరిజం వారి యాజమాన్యంలో ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్ చే అందించబడుతుంది.
 • ప్రపంచంలోని వాణిజ్య విమానశ్రయముల గురించన ఒక సమగ్ర వినియోగదారుని/వ్యాపార మార్గదర్శకము (ప్రాథమికంగా పైలట్ల కోసం కంటే వ్యాపారపరంగా విమానాశ్రయాలకు) వాణిజ్య సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే వాణిజ్య సముదాయముచే అందించబడుతుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • స్వదేశీ విమానాశ్రయము
 • ఆకాశాయానాలపై పర్యావరణ ప్రభావము
 • ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితా
 • విమానాశ్రయము లేని దేశాల జాబితా
 • ఆకాశయాన విషయాల జాబితా
 • హబ్ విమానాశ్రయాల జాబితా

 • నమూనా విమానాశ్రయము
 • NIMBY
 • ప్రాంతీయ విమానాశ్రయము
 • మొత్తం విమానాశ్రయ నిర్వహణా వ్యవస్థలు
 • ప్రపంచములో రద్దీ ఎక్కువ ఉన్నవిమానాశ్రయము

చిత్రమాలిక[మార్చు]

World airports
Suvarnabhumi Airport Passenger Terminal Bangkok, Thailand 
Paraparaumu Airport, New Zealand a small airport 
International terminal at Houari Boumediene Airport, Algiers, Algeria 
Beijing Capital International Airport's Terminal 3, one of the largest airport terminals in the world 

గమనికలు[మార్చు]

 1. CIA World Factbook - airport listing
 2. CIA World Factbook - Country Comparison to the World
 3. "Part 139 Airport Certification". FAA. 2009-06-19. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 4. USA టుడే వార్తపత్రిక, అక్టోబరు 17, 2006 p.2D
 5. "College Park Airport". Pgparks.com. మూలం నుండి 2010-07-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 6. Hakes, Chauncey D. "Albany Airport History". albanyairport.com. మూలం నుండి 2008-12-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 7. "Sydney Airport history" (PDF). మూలం (PDF) నుండి 2005-06-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 8. బ్లూఫ్ఫీల్ద్ (2009)
 9. "En route Supplement Australia (ERSA)". Airservices.gov.au. 2010-07-16. Retrieved 2010-07-20. Cite web requires |website= (help)
 10. "Aeronautical Information Publication (AIP), NOTAMs in Japan". Japan Civil Aviation Bureau. మూలం నుండి 2011-07-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14. Cite web requires |website= (help)

గ్రంథ సూచిక[మార్చు]

 • బ్లూఫ్ఫీల్ద్, రాబర్ట్. 2009. ఇంపీరియల్ విమానయానసంస్థలు - బ్రిటిష్ ఎయిర్లైన్ పరిశ్రమ యొక్క ఆవిర్భావము 1914-1940. ఇయన్ అల్లన్ ISBN 978-1906537074
 • సాల్టర్, మార్క్. 2008. విమానాశ్రయము వద్ద రాజకీయాలు . యూనివర్సిటి ఆఫ్ మిన్నెసోట ప్రెస్. విమానాశ్రయాలు ఎలా ఆకృతీకరించబడతాయో మరియు ప్రస్తుత రాజకీయ, సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎలా ఆకృతీకరించ బడతాయో అనే విషయము పరిశీలించుటకు ఈ పుస్తకము ప్రముఖ విద్యావేత్తలను ఒక చోటికి తెస్తుంది.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.