శ్రీ సత్యసాయి విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sri Sathya Sai Airport
శ్రీ సత్య సాయి విమానాశ్రయం
పుట్టపర్తి
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రైవేట్
ప్రదేశంపుట్టపర్తి
ఎత్తు AMSL1,558 ft / 475 m
అక్షాంశరేఖాంశాలు14°08′57″N 077°47′28″E / 14.14917°N 77.79111°E / 14.14917; 77.79111Coordinates: 14°08′57″N 077°47′28″E / 14.14917°N 77.79111°E / 14.14917; 77.79111
పటం
శ్రీ సత్యసాయి విమానాశ్రయం is located in Andhra Pradesh
శ్రీ సత్యసాయి విమానాశ్రయం
శ్రీ సత్యసాయి విమానాశ్రయం is located in India
శ్రీ సత్యసాయి విమానాశ్రయం
Sri Sathya Sai Airport ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
09/27 7,315 2,230 ఆస్ఫాల్ట్ (తారు)

'శ్రీ సత్య సాయి విమానాశ్రయం' (IATA: PUTICAO: VOPN) (విమానాశ్రయం సంకేతాలు | PUT | VOPN) భారతదేశము లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి వద్ద ఉంది. ఈ విమానాశ్రయమునకు భారతదేశం లోని గురువు సత్య సాయి బాబా పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న విమానాశ్రయం అయినా చార్టర్డ్ విమానాలు కాకుండా వాణిజ్య విమానం కోసం సౌకర్యాలు కలిగి ఉంది . విమానాశ్రయం 1990 సం. నవంబరు 24 న ప్రారంభమయింది. విమానాశ్రయం లోని 1000 మీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ను ఎల్ & టి ఈసిసి అనే సంస్థ నిర్మించింది. ఇది తరువాత జెట్ విమానం ఆపరేషన్ కొరకు విస్తరించబడింది. .[1]

ఎయిర్లైన్స్, గమ్యస్థానాలు[మార్చు]

2007 సంవత్సరం వరకు, శ్రీ సత్య సాయి విమానాశ్రయం షెడ్యూల్ తేదీలలో చెన్నై, ముంబై విమానాశ్రయములకు విమాన సేవలు అందించడము జరిగింది. ఈ విమానాలు ఇండియన్ ఎయిర్లైన్స్ ద్వారా నడుపబడ్డాయి, వారి హైదరాబాద్-విశాఖపట్నం సేవల నుండి ఒక విరామంగా జరిగింది.[2] ఈసమయంలో, ఈ విమానాలు ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాతో వారి విలీనాన్ని పూర్తి తరువాత, ఈ విమానాలు సేవలు పనిచేయడం నిలిపివేశాయి. ఈ సమయానికి, ఎయిర్లైన్స్ మాత్రమే ఒక వారం మూడుసార్లు బెంగుళూర్ విమానాలు నడిపింది.[3][4] 2005 నవంబరు 12 న, తక్కువ ఖర్చుతో నడిచే భారతీయ ఎయిర్ డెక్కన్ ఒక రోజుకు రెండుసార్లు చెన్నై నుండి హైదరాబాద్‌కు, హైదరాబాద్, చెన్నైకు తన కార్యకలాపాలు ప్రారంభించింది.[5] వైమానిక కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ లో విలీనం తదుపరి నుంచి ఈ విమానాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇది కింగ్ ఫిషర్ రెడ్ గా పిలవబడింది. కింగ్ ఫిషర్ రెడ్ బ్రాండ్ పేరు వెంటనే పూర్తిగా కింగ్‌ఫిషర్ విమానాలలో విలీనం అయ్యింది. అయితే, కింగ్‌ఫిషర్, 2008 వరకు కొద్దికాలము సమయం కోసం పుట్టపర్తికి విమానాలు కొనసాగింప చేసింది. ఆ తదుపరి పుట్టపర్తికి అన్ని షెడ్యూల్ విమానాలు అధికారికంగా మూసివేశారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో నిశ్చితమైన విమానాలు సేవలు అందిస్తుందో లేదో అని ప్రస్తుతం మాత్రము తెలియదు. విమానాశ్రయం ఇప్పటికీ, త్వరిత రవాణా అవసరమయ్యే ఎమర్జంసీ సందర్భాల్లో పుట్టపర్తి హయ్యర్ మెడికల్ సైన్సెస్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ద్వారా ఇది పనిచేస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Projects for Sri Sathya Sai Central Trust" (PDF). Larsen and Toubro. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2014. Retrieved 7 August 2014. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. Sri Sathya sSai. Sathya Sai International Organization http://www.sathyasai.org/ashrams/prasanthi/travel.html. Retrieved 27 December 2014. {{cite web}}: Missing or empty |title= (help)
  3. Radio Sai Global Harmony. Sai Global Harmony http://www.radiosai.org/Pages/Airline.htm. Retrieved 27 December 2014. {{cite web}}: Missing or empty |title= (help)
  4. "Air Deccan launches service to Puttaparthi". The Hindu. The Hindu. Archived from the original on 27 డిసెంబర్ 2014. Retrieved 27 December 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "Air Deccan launches services to Puttaparthi". India Aviation. India Aviation. Retrieved 27 December 2014.[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]