పుట్టపర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


పుట్టపర్తి
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో పుట్టపర్తి మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో పుట్టపర్తి మండలం యొక్క స్థానము
పుట్టపర్తి is located in Andhra Pradesh
పుట్టపర్తి
ఆంధ్రప్రదేశ్ పటములో పుట్టపర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°09′55″N 77°48′42″E / 14.1651671°N 77.811667°E / 14.1651671; 77.811667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము పుట్టపర్తి
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,000
 - పురుషులు 29,954
 - స్త్రీలు 29,046
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.63%
 - పురుషులు 68.96%
 - స్త్రీలు 43.75%
పిన్ కోడ్ 515134

పుట్టపర్తి (ఆంగ్లం: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 515134. [1]

ఈ పట్టణమునకు ముఖ్య ఆకర్షణ శ్రీ సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఆశ్రమము. ఈ ఆశ్రమము చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.

చరిత్ర[మార్చు]

పుట్టపర్తి కి తొలుత ఉన్న పేరు గొల్ల పల్లి . ఆ తరువాత దాన్ని వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది.

రోడ్ మార్గం[మార్చు]

పుట్టపర్తి నగరమునకు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. బెంగుళూరు నుండి బస్సులో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది.

బెంగుళూరు నుండి సొంత వాహనము పై వచ్చేవారు జాతీయ రహదారి నం.7 (NH 7) మీద కోడూరు గ్రామం చేరుకుని, ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.

రైలు మార్గం[మార్చు]

పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను కలదు. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో కలదు. ఇక్కడికి బెంగుళూరు, హైదరాబాదు, విశాఖపట్టణం, భుభణేశ్వర్, ముంబయి, కొత్త ఢిల్లీ మొదలగు పట్టణముల నుండి రైళ్ళు కలవు. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, ఇండియాలో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు కలవు. ధర్మవరం స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న బస్సులు కూడా కలవు.

విమాన మార్గం[మార్చు]

పుట్టపర్తి నగరములో శ్రీ సత్యసాయి విమానాశ్రయం కలదు. ఇచ్చటి నుండి ముంబయి మరియు చెన్నై పట్టణములకు హైదరాబాదు మరియు విశాఖపట్టణం మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు కలవు. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో కలదు. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.

పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్ల కు అమ్మకమునకు పెట్టారు.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]
  • Script error: No such module "Side box".