ఒంగోలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?ఒంగోలు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 10 మీ (33 అడుగులు)
దూరాలు
నెల్లూరు నుండి
గుంటూరు నుండి
హైదరాబాదు నుండి

• 125 కి.మీలు ఉ (భూమార్గం)
• 110 కి.మీలు ద (భూమార్గం)
• 320 కి.మీలు ఆ (భూమార్గం)
ముఖ్య పట్టణము ఒంగోలు
ప్రాంతం కోస్తా
జిల్లా(లు) ప్రకాశం జిల్లా
జనాభా 1,49,589 (2001)
మునిసిపల్ కమీషనర్ చల్లా అనురాధ[1]
శాసన సభ ప్రతినిధి Damacharla Janardhan
లోక్ సభ ప్రతినిధి Y V Subba Reddy
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 523001
• +08592
• ఎపి-27

ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యెక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము.

ఒంగోలు పట్టణ చరిత్ర[మార్చు]

పూర్వము దీని పేరు వంగవోలు.

దస్త్రం:ఒంగోలు Hillview.jpg
ఒంగోలు nagaramu - శ్రీగిరి కొండ పైనుండి

ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకి ని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది . కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[2] ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు.[3] ఆంధ్ర కేసరి గా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.

ఒంగోలు పట్టణo పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వము దీని పేరు వంగవోలు.

ఒంగోలు పట్టణ భౌగోళికం[మార్చు]

ఒంగోలు పట్టణ రవాణా సౌకర్యం[మార్చు]

రహదారి మార్గము[మార్చు]

దస్త్రం:ఒంగోలు Busstand.jpg
ఒంగోలు బస్ స్టాండు వెనక వైపు

ఒంగోలు పట్టణం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద నెల్లూరు - గుంటూరు నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి ఆరు మార్గములు గా విస్తరించపడినది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, శ్రీశైలం, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

ఒంగోలుకు తూర్పువైపున ముక్తినూతలపాడు నుంచి పెళ్లూరు వరకు 10 కి.మీ. జాతీయ రహదారి మంజూరైంది.ముక్తినూతలపాడు , ఆగ్రహారం , కొప్పోలు , పెళ్ళూరు పరిసర ప్రాంతాలలో భూముల ధరలు ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగాయి.ఒంగోలు పరిసరాలలో నిన్న మొన్నటి వరకు విమానా శ్రయం, కోస్తా కారిడార్ పేరుతో జరిగిన రియల్ వ్యాపారం బైపాస్ రోడ్డు ప్రతిపాదనతో మరింత ఊపందుకుంది.కొత్తపట్నం రోడ్డుకు ఇరువైపుల ఎకరా రూ. 50 లక్షల ఉన్న భూమి ప్రస్తుతం కోటి రూపాయలకు పైన పలుకుతుంది.

రైలు మార్గము[మార్చు]

ఒంగోలు రైలు స్టేషను
దస్త్రం:ఒంగోలు Station.jpg
ఒంగోలు రైలు స్టేషను( లోపలి)

ఒంగోలు పట్టణం గూడూరు - విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

ఒంగోలు పట్టణములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 • ఇందిర ప్రియదర్శిని లా కాలేజ్, అంజయ్యరోడ్డు.
 • చైతన్య కాలేజ్, నారాయణా కాలేజ్,శర్మా డిగ్రీ కాలేజ్.
 • ప్రతిభ కాలెజ్.
 • ఆదర్శ పాఠశాల.
 • పావులూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 • పి.వి.ఆర్.బాలుర ఉన్నత పాఠశాల, అంజయ్యరోడ్డు.
 • సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల, కర్నూలురోడ్డు.
 • సెయింట్ మేరీస్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల, క్లౌ పేట.
 • బధిరుల పాఠశాల.
 • అన్నవరప్పాడులోని సూరా విద్యా నికేతన్.

ఒంగోలు పట్టణములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

సమావేశ మందిరం, ఒంగోలు

ఆశ్రమములు[మార్చు]

 1. సమతా మహిళా వృద్ధాశ్రమం:- ఈ ఆశ్రమం స్థానిక సీతారాంపురంలో ఉన్నది.
 2. ఉషోదయా వృద్ధాశ్రమం:- ఈ ఆశ్రమం స్థానిక బలరాం కాలనీలో ఉన్నది.

బ్యాంకులు[మార్చు]

సాయిబాబా మందిరం, సంతపేట, ఒంగోలు.

1. ఆంధ్రా బ్యాంక్, 2. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 3. ఆక్సిస్ బ్యాంకు, 4. బ్యాంక్ ఆఫ్ బరోడా, 5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6. కెనరా బ్యాంక్, 7. కార్పొరేషన్ బ్యాంక్, 8. ఫెడరల్ బ్యాంక్, 9. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, 10.ఇండియన్ బ్యాంక్, 11. కరూర్ వైశ్యా బ్యాంక్, 12. లక్ష్మీ విలాస్ బ్యాంక్, 13. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్&రూరల్ డెవలప్ మేంట్, 14. ఒంగోల్ కోఆపరేషన్ బ్యాంక్, 15. పంజాబ్ నేషనల్ బ్యాంక్, 16. పినాకినీ గ్రామీణ బ్యాంక్, 17. సిండికేట్ బ్యాంక్, 18. విజయ బ్యాంక్, 19. వైశ్యా బ్యాంక్, 20. ఐడిబిఐ బ్యాంక్,

వైద్య సౌకర్యం[మార్చు]

ఆత్రేయ ఆయుర్వేద ఆసుపత్రి:- ఈ ఆసుపత్రి స్థానిక రాజా పానగల్ రహదారిపై ఉన్నది.

ఒంగోలు పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

 1. శివాలయం - విష్ణాలయం.
 2. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం, కేశవస్వామిపేట.
 3. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- కమ్మపాలెం - దశరాజుపల్లె రహదారిపైన, అప్పాయిగుంట సమీపంలోని ఈ ఆలయ ప్రథమ ప్రతిష్ఠా మహోత్సవం, 2016,మే-20వ తేదీ శుక్రవారంనాడుℳ మరియు 21వ తెదీ శనివారం (వైశాఖ శుద్ధపౌర్ణమి) నాడు, వైభవంగా నిర్వహించెదరు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మంగళవాయిద్యాలు, వేదపఠనం, రాత్రి 8 గంటలకు హనుమత్ హోమం, శనివారం ఉదయం 8 గంటలకు సహస్రనామ సహిత తమలపాకుల పూజ, 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. [14]
 4. శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, గద్దలగుంట.
 5. శ్రీ చిట్టి ఆంజనేయస్వామివారి ఆలయం:- రైతుబజారు కూడలిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రంఆలు, 2015,మార్చ్-27, శుక్రవారం నుండి, 29వ తేదీ ఆదివారం వరకు నిర్వహించెదరు. 50 సంవత్సరాల క్రితం, స్థానిక అశ్వత్ఠ వృక్షం క్రింద విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. సదరు ప్రదేశాన్ని నూతన మందిరంగా తీర్చి దిద్ది, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించినారు. [5]
 6. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం:- కొత్తపట్నం బస్సుస్టాండు కూడలిలోని ఈ ఆలయంలో, అమ్మవారి త్రయోదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు, 2015,జూన్-21వ తేదీ ఆదివారం నుండి, 23వ తేదీ మంగళవారం వరకు వైభవంగా నిర్వహించినారు.ఈ కార్యక్రామాలలో భాగంగా, 23వ తేదీ మంగళవారంనాడు, శిఖర, కలశ కుంభాభిషేకాలు ఘనంగా నిర్వహించినారు. వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషహోమాలు నిర్వహించినారు. ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి, శాంతికళ్యాణం, గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [6]
 7. శ్రీ లలితాశ్రమం, కేశవస్వామిపేట.
 8. శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయం, మంగమూరు రహదారి.
 9. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- 15వ శతాబ్దానికి చెందిన ఒంగోలు రాజు శ్రీ మందపాటి రామచంద్రరాజు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిపించినారు. ఆయన తన గుర్తుగా, ఈ ఆలయానికి ఒక ఖడ్గాన్ని బహూకరించినారు, ఆ ఖడ్గం ఇప్పటికీ ఆలయంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉన్నది. [7]
 10. భగవాన్ మురళీకృష్ణ మందిరము. మంగమూరు రహదారి, ఐశ్వర్యనగర్.
 11. రాధాగోవిందజీ సత్సంగ మందిరం:- ఈ మందిరం స్థానిక మంగమూరు రహదారిలో, మర్రిచెట్లకాలనీ సమీపంలో ఉన్నది.
 12. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం, కొత్తపట్నం బస్ స్టాండ్ రోడ్.
 13. శ్రీ అనంత కోదండ రామస్వామివారి ఆలయం:- గాంధీ రోడ్డులో ఉన్న ఈ ఆలయంలో శ్రీ గోదా రంగనాయకస్వామివారల ఉత్సవమూర్తుల సంప్రోక్షణ కార్యక్రమం, 2015,డిసెంబరు-4,5.6 తేదీలలో (కార్తీకమాసంలో) వైభవంగా నిర్వహించినారు. ఇందులో భాగంగా పంచామృత స్నపన, తిరుమంజనం, గోదర్శనం, యఙ పూర్ణాహుతి భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. [10]
 14. శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయం రైల్వే గేటు అవతల ప్రక్కన ఉన్న బాలాజీనగర్ లో ఉన్నది. ఈ ఆలయ ఆవరణలో, 2015,డిసెంబరు-11వ తేదీ శుక్రవారంనాడు, లోకకళ్యాణార్ధం, అశ్వద్ధనారాయణ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించినారు. [11]
 15. శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయం, ఒంగోలు పట్టణంలోని చేజెర్ల లక్ష్మణాచారి వీధిలో ఉన్నది.
 16. గుర్రము వారి ఆలయం.
 17. మామిడి పాలెం కొండమీద రాముల వారి ఆలయం.
 18. శ్రీగిరి వేంకటేశ్వరాలయం.
 19. శ్రీ వల్లూరమ్మ అమ్మవారి ఆలయం.
 20. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (సంత పేట):- ఈ ఆలయంలో ఉపాలయంగా ఉన్న శివాలయంలో 2016,ఫిబ్రవరి-19వ తేదీ శుక్రవారంనాడు నూతనంగా ప్రతిష్ఠించనున్న ధ్వజస్థంభానికి, 18వ తేదీ గురువారంనాడు నగరోత్సవం నిర్వహించినారు. [13]
 21. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (రింగు రోడ్డు).
 22. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం,(లాయరుపేట).
 23. పావులూరు శ్రీ పొలిమేర వీరఆంజనేయ స్వామివారి ఆలయం.
 24. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ట్రంకు రోడ్డుపై ఉన్నది.
 25. శ్రీ గురు రాఘవేంద్ర మూల మృత్తికా బృందావనం:- స్థానిక సంతపేటలో ఉన్న ఈ క్షేత్రంలో, 2015,ఆగష్టు-30వ తేదీనుండి మూడురోజులపాటు శ్రీ రాఘవేంద్రస్వామివారి 344వ ఆరాధనా మహోత్సవాలు నిర్వహించినారు. [8]
 26. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- స్థానిక కర్నూలు రహదారిమీద ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమి నాడు కన్నులపండువగా నిర్వహీంచినారు. మొదట ఆలయప్రాంగణంలోని మహాగణపతి, తదితర విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగినది. [12]
 27. భగవాన్ గొలగమూడి వెంకయ్యస్వామి అందిరం, సంతపేట.
 28. మసీదు.
 29. చర్చి.
సాయిబాబ మందిరం, ఒంగోలు

పండుగలు[మార్చు]

ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఈ సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలుకే చెందిన శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.[4]

ప్రధాన పంటలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఆర్ధికం[మార్చు]

ఒంగోలు గిత్త

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్తాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు మరియు విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై(80), తొభైయవ(90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్దిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ(80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

ఒంగోలు పట్టణ విశేషాలు[మార్చు]

ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ(Zebu)జాతి ఎద్దులలో ఇవి ఒకటి.

నాటక మరియు చలనచిత్ర రంగము[మార్చు]

ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలకి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు ప్రజలను అలరిస్తారు. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక మరియు చిత్ర రంగమందు ప్రిసిద్ధి చెందారు. దిగ్గజ నటులు "కంచు కంఠం" గా పేరొందిన ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి భారత లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://www.hindu.com/2007/10/10/stories/2007101059740300.htm
 2. Handbook of the Madras Presidency By Edward B. Eastwick, John Murray (Firm) పేజీ.329 [1]
 3. Imperial Gazetteer of India. Provincial series - Madras (1908) పేజీ.338 [2]
 4. ఒంగోలులో నరకాసుర వధ, ఈనాడు ఆదివారం 27, అక్టోబరు 2013

వెలుపలి లింకులు[మార్చు]

[5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,మార్చ్-30; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-24; 8వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,జూన్-25; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగష్టు-29; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,సెప్టెంబరు-2; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,డిసెంబర్-7; 2వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,డిసెంబర్-12; 1వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016.ఫిబ్రవరి-15; 1వపేజీ. [13] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016.ఫిబ్రవరి-19; 2వపేజీ. [14] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016,మే-19; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఒంగోలు&oldid=1886868" నుండి వెలికితీశారు