Coordinates: 15°37′20″N 80°01′23″E / 15.6222°N 80.02301°E / 15.6222; 80.02301

మద్దిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°37′20″N 80°01′23″E / 15.6222°N 80.02301°E / 15.6222; 80.02301
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
Area
 • మొత్తం11.93 km2 (4.61 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం6,480
 • Density540/km2 (1,400/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి954
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523211 Edit this on Wikidata

మద్దిపాడు ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఒంగోలు నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. ఇది సమీప పట్టణమైన ఒంగోలు నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1733 ఇళ్లతో, 6480 జనాభాతో 1193 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3317, ఆడవారి సంఖ్య 3163. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1908 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 58. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591061[2].పిన్ కోడ్: 523211.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,713. ఇందులో పురుషుల సంఖ్య 2,449, స్త్రీల సంఖ్య 2,264, గ్రామంలో నివాస గృహాలు 1,108 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,193 హెక్టారులు.పటం

సమీప గ్రామాలు[మార్చు]

పెద కొత్తపల్లి 2 కి.మీ, ఏడుగుండ్లపాడు 3 కి.మీ, గుండ్లపల్లి 4 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, ఇనమనమెల్లూరు 4 కి.మీ.

మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

 • మద్దిపాడు గ్రామంలో R.I.M.S అనుసంధాన సంస్థ అయిన ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం వలన ఎంతోమందికి అనేక రకాలయిన చికిత్సలు అందుబాటు లోనికి రాగలవు, ఎంతోమందికి ఉపాధి లభించగలదు.

బ్యాంకులు[మార్చు]

వ్యవసాయ మార్కెట్ కమిటీ[మార్చు]

తహసీల్దారు కార్యాలయo[మార్చు]

గ్రామంలోని తహసీల్దారు కార్యాలయ భవనం, రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసినారు. నూతన భవన నిర్మాణం ప్రారంభించారు. అందులో ఆయా సిబ్బందికి సరిపడేలాగ ప్రత్యేక గదులు, వివిధ పనులకోసం వచ్చేవారికోసం నిరీక్షణ గదులు నిర్మించుచున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ జి.నరసింహారావు ఎన్నికైనారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, 2017, ఏప్రిల్-22న పలువురు నాయకుల ఆధ్వర్యంలో, ఈ గ్రామ సర్పంచ్ శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావుకి, ఉత్తమ సర్పంచ్ పురస్కారాన్ని అందజేసి శుభాకాంక్షలు అందజేసినారు. మద్దిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి, 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఒక నూతన భవననిర్మాణానికై, 2017, జూన్-26న శంకుస్థాపన నిర్వహించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014, జూన్-12, గురువారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుణ్యాహవచనం, తీర్ధ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ వేడుకలలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఈ ఆలయంలో నెలకొన్న స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుటకై, కడియాల వంశీకులు, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయానికి ఒక రథం బహుకరించారు. ఈ సందర్భంగా రథాన్ని, మండలంలోని అన్ని గ్రామాలలోనూ ఊరేగించారు. చివరకు మద్దిపాడు గ్రామంలోని పలువీధులలో, స్వామివారి రథాన్ని, మేళతాళాలతో ఊరేగించి, ఆలయంలోనికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

శివాలయం[మార్చు]

జాతీయరహదారి విస్తరణలో భాగంగా ఈ పురాతన ఆలయంలో కొంత భాగాన్ని తొలగించడంతో, 2015, ఫిబ్రవరి-25వ తేదీనాడు, తి.తి.దె.అర్చకుల ఆధ్వర్యంలో, ఈ ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టినారు. శివాలయంలోని ధ్వజస్తంభం, నవగ్రహాలు, యాగస్థానం పోవడంతో, గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా ఈ కార్యక్రమం చేపట్టినారు. నూతన శివాలయ నిర్మాణం కోసం, విరాళాలు సేకరించుచున్నారు.

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక పడమరపాలెంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2014, జూన్-22, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీ పాలుబోయిన వీరయ్య, నారాయణమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారులు, శ్రీ మురళీకృష్ణ, చైతన్యకృష్ణ ల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగినవి.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

మద్దిపాడు గ్రామంలోని యాదవపాలెంలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలోని యువకులు ప్రభలు ఏర్పాటుచేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ రామాలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజూ ఆలయంలో వసంతనవరాత్రులూ, సుందరకాండ ప్రవచనాలు, నైవేద్యాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

మద్దిపాడు గ్రామంలోని గ్రోత్‌సెంటరులో ఐలా సొసైటీ ఆధ్వర్యంలో, ఒకటిన్నర కోట్ల అంచనావ్యయంతో, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2017, జూన్-6వతేదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయాన్నింపర్యాటక కేంద్రంగా గూడా తీర్చిదిద్దనున్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించెదరు.

జన్మించిన ప్రముఖులు[మార్చు]

 • భూసురపల్లి ఆదిశేషయ్య:సామాన్య కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో డోలు వాయిద్య కళాకారుడిగా రాణించి, అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి ఖ్యాతిని వాటిచెప్పిన విద్వాంసులు. వీరు నాదస్వర విద్వాంసులు పద్మశ్రీ షేక్ మౌలానాసాహెభ్, శ్రీ ఈమని రాఘవయ్యతో అనేక కచ్చేరీలు చేసి, ప్రభుత్వం ద్వారా "లయబ్రహ్మ" అను బిరుదు పొందిన గొప్ప విద్వాంసులు. వీరు జాతీయ స్థాయిలో ప్రధాని ఇందిరాగాంధీ సత్కారం అందుకున్నారు.తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం పొందారు.
 • కడియాల యానాదయ్య:స్వాతంత్ర్యోద్యమంలో ఉద్యమకారులు ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేసిన చిరస్మరణీయులు. మోతుబరిరైతుగా నిరుపేదలకు ఇళ్ళపట్టాలను అందజేసిన ఉదారశీలి. విద్యార్థుల చదువులకు పాఠశాల ప్రాంగణాన్ని ఉచితంగా అందజేసి, విద్యాదాతగా పేరుపొందినారు. స్థానిక కళాశాలలో 2016, ఫిబ్రవరి-10వ తేదీనాడు, వీరి సంతాపసభ నిర్వహించారు.
భూసురపల్లి వెంకటేశ్వర్లు: ప్రముఖ వాగ్గేయకారులు. సాహిత్యరంగంలో పరిశోధనలు చేసిన తెలుగు భాషోపన్యాసకులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో ఒక సేంద్రియ ఎరువుల కుటీరం నిర్మించెదరు.

కళాక్షేత్రం[మార్చు]

మద్దిపాడు ప్రధాన కూడలిలో 1938 లో తెలుగు చలనచిత్ర దిగ్గజాలు ఎస్.వీ.రంగారావు, భానుమతి. అక్కినేని నాగేశ్వరరావు, రాజనాల తదితర పెద్ద కళాకారులు నాటకాలు ప్రదర్సించేవారు. దొడ్డవరం గ్రామానికి చెందిన భానుమతి, తమ ప్రదర్శనలకు మద్దిపాడులో కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని సమాయత్తం చేసారు. 1940 లో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. నాటినుండి ఇక్కడ లెక్కలేనన్ని ప్రదర్శనలు నిర్వహించారు. మద్దిపాడు కళాక్షేత్రం అన్ని రంగాలకు నిలయంగా ఉండేది. గ్రామంలో ఎటువంటి కార్యకలాపాలు జరగాలన్నా వేదికగా ఉండేది. ఈ కళాక్షేత్రంలో నాటకాలు, నాటికలూ చాలా ప్రదర్శించి, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు గుర్తింపు పొందినారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా, పంచాయతీ ప్రాంగణంలోని ఈ కళాక్షేత్రాన్ని పూర్తిగా తొలగించారు. దీనికి తగిన పరిహారం కూడా అందజేసినారు. మూడు సంవత్సరాలుగా కళాక్షేత్రం నిర్మించెదమని హామీలు ఇచ్చుచున్నా గానీ ఒక్క అడుగు కూడా పని ముందుకు సాగుటలేదు. దీనితో ఈ కట్టడాల స్థలాలు ఆక్రమణలకు గురి అగుచున్నవి. కొందరు దుకాణాలు గూడా ఏర్పాటు చేసుకున్నారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల దొడ్డవరప్పాడులోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లో ఉన్నాయి.

 • కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల.
 • నాగార్జున పాఠశాల.
 • సరస్వతీ విద్యా నికేతన్.
 • శాఖా గ్రంథాలయం.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మద్దిపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మద్దిపాడులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మద్దిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 186 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 27 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 24 హెక్టార్లు
 • బంజరు భూమి: 293 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 657 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 921 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 53 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మద్దిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు
 • ఇతర వనరుల ద్వారా: 43 హెక్టార్లు
 • ఆదెన్న చెరువు.
 • వీరప్ప కుంట చెరువు

ఉత్పత్తి[మార్చు]

మద్దిపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

పొగాకు, శనగ

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. ప్రముఖ వాగ్గేయకారులు. బి.వేంకటేశ్వర్లు (రెయిన్బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
 4. "తెలుగువారి మంగళవాద్య కళావైభవం : డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు". Archived from the original on 2016-03-24. Retrieved 2015-07-05.

వెలుపలి లింకులు[మార్చు]