గుండ్లపల్లి (మద్దిపాడు)
గుండ్లపల్లి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°ECoordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మద్దిపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 945 హె. (2,335 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,627 |
• సాంద్రత | 490/కి.మీ2 (1,300/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523211 ![]() |
గుండ్లాపల్లి (గుళ్ళాపల్లి), ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్: 523 211.ఎస్.టి.డి. కోడ్ = 08592.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
కీర్తిపాడు 2 కి.మీ, రాచవారిపాలెం 3 కి.మీ, కొలచనకోట 3 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
తూర్పున నాగులుప్పలపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడుమండలం, దక్షణాన ఒంగోలు మండలం.
గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
గ్రామములో మౌలిక వసతులు[మార్చు]
- పవర్ స్టేషను.
- ఎన్.టి.ఆర్.సంత:- ఈ గ్రామములో ఈ సంతను, 2015,సెప్టెంబరు-11వ తేదీనాడు ప్రారంభించారు. [6]
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
కొసరాజు చెరువు.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వీరగంధం రఘురామయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సోమేశ్వరస్వామివారి దేవాలయం
శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ దేవి ఆలయం
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో 2017,మార్చి-7వతేదీ మంగళవారంనాడు, మొదట ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, అనంతరం శివపార్వతుల కళ్యాణం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [7]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు[మార్చు]
- ఈ గ్రామములో "సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూల్ డిజైన్" శాఖను ఏర్పాటు చేసేటందుకు ప్రతిపాదనలను, పరిశ్రమల కేంద్రం అధికారులు, కలక్టరు ద్వారా, సి.ఐ.టి.డికి పంపినారు. [3]
- ఈ గ్రామాన్ని అదనపు సంయుక్త కలెక్టర్ శ్రీ ప్రకాశ్ కుమార్, దత్తత తీకొన్నారు. వీరు ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధిచేసి, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దెదరు. [4]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 4,627 - పురుషుల సంఖ్య 2,361 - స్త్రీల సంఖ్య 2,266 - గృహాల సంఖ్య 1,233
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,181.[1] ఇందులో పురుషుల సంఖ్య 1,981, మహిళల సంఖ్య 1,200, గ్రామంలో నివాస గృహాలు 602 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 945 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-25; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం; 2015,ఫిబ్రవరి-26; 16వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,జూన్-17; 4వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-27; 2వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,సెప్టెంబరు-12; 3వపేజీ.[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,మార్చి-8; 1వపేజీ.