ఏడుగుండ్లపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఏడుగుండ్లపాడు
రెవిన్యూ గ్రామం
ఏడుగుండ్లపాడు is located in Andhra Pradesh
ఏడుగుండ్లపాడు
ఏడుగుండ్లపాడు
నిర్దేశాంకాలు: 15°33′47″N 80°02′56″E / 15.563°N 80.049°E / 15.563; 80.049Coordinates: 15°33′47″N 80°02′56″E / 15.563°N 80.049°E / 15.563; 80.049 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం687 హె. (1,698 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,314
 • సాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523262 Edit this at Wikidata

ఏడుగుండ్లపాడు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 262., ఎస్.టి.డి.కోడ్ = 08592.

సమీప గ్రామాలు[మార్చు]

దొడ్డవరప్పాడు 3 కి.మీ, లింగంగుంట 3 కి.మీ, త్రోవగుంట 3 కి.మీ, మద్దిపాడు 3 కి.మీ, మండువవారిపాలెం 4 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షిణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. గ్రామంలో రెండు పాఠశాలలు ఉన్నాయి.
 2. గ్రంథాలయం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో త్రాగునీటికి బావి నీరు వాడెదరు.

వైద్య సౌకర్యం:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

 • గాలి మాధవీలత . ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

వ్యవసాయానికి రెండు పెద్ద చెరువులు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ[మార్చు]

 • శ్రీ మండువ హరిప్రసాదరావు, మాజీ సర్పంచ్.
 • శ్రీ మండువ వెంకటస్వామి, S/O హరిప్రసాదరావు, మాజీ సర్పంచ్.
 • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి దారా శోభారాణి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం[మార్చు]

ఈ గ్రామంలో 2016, నవంబరు-25వతేదీ శుక్రవారంనాడు, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. విగ్రహం వద్ద నవధాన్యాలను సమర్పించారు. కొబ్బరి కాయలున్ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండి హోమాలు నిర్వహించి బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలనుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. వీరందరికీ అన్నమారాధన కార్యక్త్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, గ్రామాన్నీ, ఆలయాలనూ రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఇక్కడ ఎక్కువగా పొగాకు, కంది, శనగ పంటలు పండిస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

 • ఈ గ్రామంలో ఎక్కువగా మాల, మాదిగ కులము వారు నివసిస్తున్నారు. అలాగే కమ్మ కులస్తులు కూడా ఉన్నారు.
 • అన్ని పండగలను ప్రజలందరు ఆనందంగా జరుపుకుంటారు.
 • ఈ గ్రామంలో విద్యావంతులు ఎక్కువగా ఊన్నారు.
 • ఈ గ్రామంలో ఎక్కువ క్రికెట్ ఆడుతారు.
 • ఈ గ్రామాన్ని ఎన్.టి.అర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభాా లెక్కల ప్రకారం గ్రామ జనాభాా 2,176.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,057, మహిళల సంఖ్య 1,119, గ్రామంలో నివాస గృహాలు 550 ఉన్నాయి.

జనాభాా (2011) - మొత్తం 2,314 - పురుషుల సంఖ్య 1,130 -స్త్రీల సంఖ్య 1,184 - గృహాల సంఖ్య 656
 • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-17; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-13; 3వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, నవంబరు-26; 2వపేజీ.