గడియపూడి
గడియపూడి | |
|---|---|
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°41′49.200″N 79°57′28.800″E / 15.69700000°N 79.95800000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండలం | మద్దిపాడు |
| విస్తీర్ణం | 5.41 కి.మీ2 (2.09 చ. మై) |
| జనాభా (2011)[1] | 0 |
| • జనసాంద్రత | 0.0/కి.మీ2 (0.0/చ. మై.) |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • పురుషులు | 0 |
| • స్త్రీలు | 0 |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| • నివాసాలు | 0 |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08592 |
| పిన్‌కోడ్ | 523263 |
| 2011 జనగణన కోడ్ | 591050 |
ఘడియపూడి, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన నిర్జన గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపుకు గురై ఖాళీచేయబడిన గ్రామం. ఈ గ్రామ ప్రజలకొరకు పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు.
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
[మార్చు]గ్రామంలోని ఈ పాఠశాల 109 సంవత్సరాలు నిండి 110 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ఆగస్టు-19,2013 సోమవారం నాడు, శతజయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రు.4.5 లక్షలతో నిర్మించిన "పరమాత్ముని కళా క్షేత్రాన్ని" లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనానికి దాత:- విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ పరమాత్ముని వెంకట సుబ్బారావు
మౌలిక సదుపాయాలు
[మార్చు]అంగనవాడీ కేంద్రం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొమ్మల రామారావు సర్పంచిగా ఎన్నికయినారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఘడియపూడి కాలనీలోని ఈ ఆలయంలో, 2014, జూన్-2న, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాలలో చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,358. ఇందులో పురుషుల సంఖ్య 698, మహిళల సంఖ్య 660, గ్రామంలో నివాస గృహాలు 330 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 541 హెక్టారులు.
మూలాలు
[మార్చు]- 1 2 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
