కమ్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కమ్మ (Kamma) లేక కమ్మవారు అనునది దక్షిణ భారతదేశంలో ఒక కులం[1]. ఈ కులస్తులు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో కర్ణాటకలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.[2][3]. వీరి భాష ప్రధానంగా తెలుగు. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోను, మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాల (కోయంబత్తూరు, మదురై, రాజాపాళ్యం, తంజావూరు) లోను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరిని వివిధ ప్రాంతాలను బట్టి కోస్తా ఆంధ్రలో చౌదరి, రాయలసీమలో నాయుడుగా పిలుస్తారు. తమిళనాడులో నాయకర్ అనేది ఎక్కువగా వాడబడుతోంది.

చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు

కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు[4]. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు[5]. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. సూర్యదేవర నాయకులు, ముసునూరి నాయకులు, పెమ్మసాని నాయకులు, తంజావూరు నాయకులు, మధురై నాయకులు దీనికి ఉదాహరణ.

గోత్రాలు

ధసునుల్ల (ధనుల్ల, దానుల్ల), ముదునుల్ల, చెరుకునుల్ల (రామనుల్ల), సిరిమేడల (ధన్యాల, పలకుల, పైడిపాల, అవ్వుల, ధనొల్ల, మెనొల్ల), కచీపాల (కసిపల), పల్లుట్ల, పమిడిపాల, పావళ్ళ., గట్టిపలు, గనపర్తి, సున్నల, కంచిపల్ల, మద్రనుల్ల, మరుట్ల, పోత్లల, ఇనపల్ల, ఇనిమెల్ల, అయొధ్య, టంగుటురు, తాల్లూరు, తాలూరి, తాటిపాల, పసుపునుల్ల, యెజల్ల, శివపురి, చెనుల్ల, పొగునుల్ల, పెరము, తెరము, వల్లుట్ల, జనగుల, మథివెల్ల, వేమునుల్ల, గొట్టిపల్ల, కొండ్రుల్ల (కొండపల్ల, కునందుల్ల), విప్పర్ల, పునుగొటి (బోగోలు), గెరిసెట్ల, ఆరుట్ల, పొంగునుల్ల, పల్లుట్ల, పాలడుగుట్ల, మథివెల్ల, పమిడిచుక్కల, యేనిగంటి, గోగునుల్ల, పేపల, పులియెల్ల, కొట్టనుల్ల, చెరుకుల్ల, ఝన్నుడి, శ్యామల, కురునుల్ల, కాసిపాల, పెరినిల్ల, వెలల, తువ్వపాల, తువ్వభాల, రేచర్ల, కొర్రపళ్ళ, ముతునుల్ల, గొట్టిపర్తి, గురజాల, ఎర్వాకుల, గంధనుల్ల, చునుడ్రుల్ల, మొగలాయి, గొడితిపాల, మొగరాజుల, జన్నర్ల, పేపాల్ల, రాగిపల్ల, వెనుట్ల, కంచెర్ల, విరంకి, యలమంచి, యేరువాకల, మినుమునుల్ల, దారినేని, కనుబిరుదుల, జనకనుల్ల, జయనుల్ల, ఏల్పురి, పిప్పళ్ళ, ఎనింగలవల, గంధసిరి, దషిన్య, వెనొల్ల, పిల్లమడుగు, గోగుపూడి, తెరపరల్లు, కావనుల్ల, ముప్పర్ల, గురిజాల, భిమనుల్ల, అరుణుల్ల, తంగురుల, చంద్రొల్ల, పెసరెట్ల, ప్రెపాల్ల, గురుగునుల్ల, కొమెరపుడి, జైనుల్ల, మొగలిరేకుల, బాలరాజు, అనిరాజుల, రాజనాల, రాజునుల్య, యోనిరాజుల, యొండ్రుజుల, పినగంటి, తాటిపాల, శతకోటి, ఆదినుల్ల, గోతం, కంధనుల్ల, కొందుల్ల, మన్నవ, మరుట, చామంచుల, భానుల్ల, విరట్ల, తేరునుల్ల, చిలక, కోలుకుల, కకుమను, పులియెల, పొన్నపువ్వుల, అన్నంకుల, బాలుద్రుల, పలోట్ల, చెన్నమల్ల, ఎర్రనుల్ల, వెలిచెర్ల, పావళ్ళ, ఆళ్ళపూడి, నవనోళ్ళ

కమ్మవారి గూర్చి సామెతలు

  • కమ్మవాని చేతులు కట్టినా నిలవదు
  • కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
  • కమ్మవారికి భూమి భయపడుతుంది

ప్రస్తుత స్థితి

చాలాకాలం వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఉన్న ఈ కులస్తులు నేడు రాజకీయ, పారిశ్రామిక, విద్య, వైద్య, వాణిజ్య, ట్రావెల్స్, నిర్మాణ రంగాల్లో రాణిస్తున్నారు. మీడియా రంగాలైన టివి, వార్తాపత్రికలు, సినిమా రంగాలు అధిక భాగం వీరికి చెందినవే.

ప్రముఖ వ్యక్తులు

మూలాలు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006
  2. Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ
  3. 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి
  4. ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232
  5. దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 Castes and Tribes of Southern India
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మ&oldid=2137641" నుండి వెలికితీశారు