అక్షాంశ రేఖాంశాలు: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58

వరంగల్

వికీపీడియా నుండి
(ఓరుగల్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వరంగల్
Montage of Warangal city images.
ఎగువ నుండి సవ్యదిశలో: గోవిందరాజుల కొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ కోట, వెయ్యి స్తంభాల దేవాలయం, కాకతీయ కళా తోరణం నగర వీక్షణ దృశ్య చిత్రాలు
వరంగల్ is located in Telangana
వరంగల్
వరంగల్
వరంగల్ is located in India
వరంగల్
వరంగల్
Coordinates: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్ జిల్లా
Government
 • Bodyవరంగల్ మహానగర పాలక సంస్థ
విస్తీర్ణం
 • Total407.77 కి.మీ2 (157.44 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total8,11,844
 • జనసాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు

వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా లోని ఒక నగరం.[1] ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. 2014 2008 జనవరిన మహా నగరంగా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు. ఇది 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 830,281 జనాభాతో తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది. ఈ నగరం 406 కి.మీ2 (157 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రస్తుతం నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదపడ్డాయి. వరంగల్ లో కాకతీయులు నిర్మించిన కాకతీయ కళా తోరణం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా కూడా వరంగల్ కు స్థానం కలిపించబడింది.[2][3]

భారత ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి ఎంపిక చేసిన దేశంలోని పదకొండు నగరాల్లో వరంగల్ ఒకటి.[4] వరంగల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలను మెరుగుపరచడానికి అదనపు పెట్టుబడులకు అర్హత సాధించే "ఫాస్ట్ ట్రాక్ పోటీ"లో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది.[5]

మూడు పట్టణ నగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్లు కలిసి వరంగల్ ట్రై-సిటీ అని పిలుస్తారు. మూడు నగరాలు 163వ జాతీయ రహదారికి (హైదరాబాద్ - భువనగిరి - వరంగల్ - భూపాలపట్నం) కలుపబడ్డాయి. ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్.

పదవివరణ

[మార్చు]

కాకతీయుల పాలనలో వరంగల్ ఒక 'ఒకే రాతి' వరంగల్ కోటలో భారీ గ్రానైట్ బౌల్డర్ సూచిస్తూ ఓరుగల్లు, ఏకశిలా నగరం లేదా ఒంటికొండ వంటి వివిధ పేర్లతో పిలువబడింది.[6] 1323లో కాకతీయ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్ చేతిలో ఓడిపోయినప్పుడు, పాలకుడు జునా ఖాన్ నగరాన్ని జయించి సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చాడు.[7] తర్వాత ముసునూరి నాయకులు సా.శ.1336లో వరంగల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని దానికి మళ్ళీ ఓరుగల్లు అని పేరు పెట్టారు.

చరిత్ర

[మార్చు]

వరంగల్ కాకతీయ రాజవంశీకుల పురాతన రాజధాని. దీనిని బీటా రాజా I, ప్రోలా రాజా I, బీటా రాజా II, ప్రోలా రాజా II, రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవ, ప్రతాపురుద్ర, రాణి రుద్రమ దేవి వంటి వారు పరిపాలించారు. బీటా రాజా I కాకతీయ రాజవంశం స్థాపకుడు, 30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తరువాత అతని కుమారుడు ప్రోలా రాజా I తన రాజధానిని హన్మకొండకు మార్చాడు.

గణపతి దేవా పాలనలో రాజధాని హన్మకొండ నుండి వరంగల్‌కు మార్చబడింది. ఆకట్టుకునే కోట, నాలుగు భారీ రాతి ద్వారాలు, శివుడికి అంకితం చేసిన స్వయంభూ ఆలయం, రామప్ప సరస్సు సమీపంలో ఉన్న రామప్ప ఆలయం వంటి అనేక స్మారక చిహ్నాలను కాకతీయులు వదిలేసారు. కాకతీయులు సాంస్కృతిక, పరిపాలనా వ్యత్యాసాన్ని మార్కో పోలో పేర్కొన్నారు. ప్రతాపరుద్ర II ఓటమి తరువాత, ముసునూరి నాయకులు 72 నాయక అధిపతులను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానేట్ నుండి వరంగల్ ను స్వాధీనం చేసుకుని యాభై సంవత్సరాలు పాలించారు.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 నాటికి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, నగరంలో 627,449 జనాభా ఉంది, ఇది తరువాత విస్తరించిన నగర పరిమితులతో సహా ప్రస్తుత జనాభా 830,281కి పెరిగింది. వరంగల్‌లో ప్రధాన మతం హిందూ మతం, జనాభాలో 83% మంది హిందువులు, 14% మంది ఇస్లాం, క్రైస్తవులు - యూదులు - బౌద్ధుల తక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

ఆరోగ్య సంరక్షణ కోసం నగరంలో ఆసుపత్రులు ఉన్నాయి.[8] వాటిల్లో మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ నగరంలోని అతిపెద్ద ఆసుపత్రి. ఇది ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నుండి రోగులకు సేవలు అందిస్తోంది.[9]

డిజిటల్ మ్యూజియం

[మార్చు]

వరంగల్లులోని పోతన విజ్ఞాన పీఠంలో బమ్మెర పోతన పేరుమీద బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం ఉంది.[10] మహాకవి బమ్మెర పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్‌ చేసి, భావితరాలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది.[11]

అభివృద్ధి పనులు

[మార్చు]
  • 20 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనం, 8 కోట్ల రూపాయలతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్​, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని 2022, ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ తరువాత 15 కోట్ల రూపాయలతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్‌లో వివిధ అభివృద్ధి పనులు... స్మార్ట్ సిటీ పథకం ద్వారా 71 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, 8 కోట్ల రూపాయలతో మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం, 2 కోట్ల రూపాయలతో స్పెషల్‌ పార్కు, 9 కోట్ల రూపాయలతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు, 1.50 కోట్ల రూపాయలతో వరంగల్‌ పోతననగర్​ శ్మశాన వాటిక అభివృద్ధి, 80 లక్షల రూపాయలతో కేఎంజీ పార్కులో జాతీయ పతాకం, 4 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు పనులు, హనుమకొండలో 22 కోట్ల రూపాయలతో వరదనీటి కాల్వలకు రిటైనింగ్ వాల్స్, 15 కోట్ల రూపాయలతో కల్వర్టులు, ఆర్​అండ్​బీఆర్​ సీసీ రిటైనింగ్ వాల్స్​కు శంకుస్థాపనలు చేశాడు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్-పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్‌ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[12]
  • నగరంలో ఆజంజాహీ మిల్స్‌ గ్రౌండ్‌లో నిర్మించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)కు, 75 కోట్ల రూపాయలతో అత్యాధునిక పద్ధతులతో నిర్మించనున్న వరంగల్‌ మోడల్‌ బస్‌స్టేషన్‌, 313 కోట్లతో నిర్మించనున్న ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఉర్సు చెరువుకట్ట అభివృద్ధి, ఆధునిక దోబీఘాట్, ఓ సిటీ నందు మినీ స్టేడియం అభివృద్ధి, కల్చరల్ కన్వెన్షన్ సెంటర్, మంచినీటి సరఫరా నిర్మాణ పనులకు 2023, జూన్ 17న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు. 135 కోట్ల రూపాయలతో నిర్మించిన 16 స్మార్టు రోడ్లు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్-పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్‌ గుండు సుధారాణి, స్థానిక ప్రజాప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్, అధికారులు పాల్గొన్నారు.[13][14]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

చారిత్రిక ప్రదేశాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Warangal Municipal Corporation, Budget 2014-15". Greater Warangal Municipal Corporation. Retrieved 4 February 2015.
  2. Mahender, Adepu (2018-08-25). "Cultural capital of Telangana awaits State auditorium". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-12.
  3. Rao, Gollapudi Srinivasa (2016-09-07). "Warangal city may not be divided". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-12-16.{{cite news}}: CS1 maint: url-status (link)
  4. "Warangal | Heritage City Development and Augmentation Yojana (HRIDAY)". hridayindia.in. Archived from the original on 2016-10-18. Retrieved 2016-07-13.
  5. "Lucknow, Warangal among 13 smart cities announced by govt". The Hindu (in Indian English). 2016-05-24. ISSN 0971-751X. Archived from the original on 8 November 2020. Retrieved 2016-07-13.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-18. Retrieved 2021-11-23.
  7. "Series-16 Indian History–Medieval India".
  8. "Biomedical wastes pose a threat to lives". deccanchronicle.com. 2014-10-29. Archived from the original on 9 March 2020.
  9. "MGM, A 'Super Specialty' Hospital Sans Specialists and Nurses". The New Indian Express. 23 February 2015. Archived from the original on 18 March 2020. Retrieved 6 June 2019.
  10. "భాగవతామృతానికి డిజిటల్‌ తళుకు". EENADU. 2022-04-15. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
  11. telugu, NT News (2022-04-17). "పోతనకు.. డిజిటల్‌ పీఠం". Namasthe Telangana. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
  12. "'కేంద్రంలో మోదీ గ్యాస్ ధర పెంచితే.. ఇక్కడ మేం తగ్గిస్తున్నాం'". ETV Bharat News. 2022-04-21. Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.
  13. "శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు". EENADU. 2023-06-18. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  14. telugu, NT News (2023-06-17). "Minister KTR | కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  15. "'మనోహర' చిత్రాల చిరునామా." andhrabhoomi.net. 2019-12-28. Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-10.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వరంగల్&oldid=3919640" నుండి వెలికితీశారు