మంచిర్యాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?మంచిర్యాల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°52′04″N 79°27′50″E / 18.8679°N 79.4639°E / 18.8679; 79.4639Coordinates: 18°52′04″N 79°27′50″E / 18.8679°N 79.4639°E / 18.8679; 79.4639
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 90.92 కి.మీ² (35 చ.మై)[1]
జిల్లా (లు) మంచిర్యాల జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
2,41,500 (2019 నాటికి)
• 2,656/కి.మీ² (6,879/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మంచిర్యాల మున్సిపాలిటీ
కోడులు
పిన్‌కోడ్

• 504209


మంచిర్యాల రైల్వే స్టేషన్

మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల మండలానికి చెందిన నగరం. మంచిర్యాల నగరం గోదావరి నది ఒడ్డున ఉత్తర బాగంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]మంచిర్యాల పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది ఇక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉండడం వల్ల సింగరేణి వెలసిల్లింది.[3]

నీటి సరఫరా[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది

విద్యుత్ సరఫరా[మార్చు]

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,95,228 - పురుషులు 99,597 - స్త్రీలు 95,631

వ్యవసాయం, పంటలు[మార్చు]

మంచిర్యాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3633 హెక్టార్లు, రబీలో 1294 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[4]

ప్రముఖులు[మార్చు]

బద్రి గోపి కృష్ణ - నటుడు, రచయిత, యూట్యూబర్, మోటివేషన్ స్పీకర్

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

  1. ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం: మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.[5][6]

విద్యాసంస్థలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Basic Information of Municipality". Mancherial Municipality. Archived from the original on 19 ఆగస్టు 2016. Retrieved 28 June 2016.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 222
  5. ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
  7. Today, Telangana (2022-11-03). "Telangana: Mancherial govt medical college gets nod to take up admissions". Telangana Today. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-16.

వెలుపలి లంకెలు[మార్చు]