Jump to content

కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం

అక్షాంశ రేఖాంశాలు: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E / 19.1188949; 78.9989734
వికీపీడియా నుండి
కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం
జన్నారం అడవి (కవ్వాల్ అభయారణ్యం)
వన్యప్రాణుల అభయారణ్యం
కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం is located in Telangana
కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం
కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం
Location in Telangana, India
Coordinates: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E / 19.1188949; 78.9989734
దేశం భారతదేశం
రాష్ట్రంకవల్, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
విస్తీర్ణం
 • Total2,015.44 కి.మీ2 (778.17 చ. మై)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Websiteకవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం వెబ్సైటు
ఆధికారిక వెబ్సైటు

కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కవల్ గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం.[1] ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పురాతన అభయారణ్యమైన కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని 2012లో భారత ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.[2] ఈ అభయారణ్యానికి దక్షిణ దిశగా ప్రవహిస్తున్న గోదావరి, కడెం నదులకు పరీవాహక ప్రాంతంలో ఉంది.[3]

చరిత్ర

[మార్చు]

ఇది 1965లో స్థాపించబడింది. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనుసరించి 1999లో దీనిని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు.[4]

పులుల సంరక్షణ

[మార్చు]

దీనిని 2012 ఏప్రిల్‌ 10న పులుల సంరక్షణ కేంద్ర జాబితాలో చేర్చబడింది.[5] జంతువుల వేటను తనిఖీ చేయడానికి కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటుచేయబడ్డాయి,నీటి వనరులు మెరుగుపరచబడ్డాయి. ఇది భారతదేశంలో 42వ టైగర్‌జోన్‌గా గుర్తింపు పొందింది.

ప్రదేశం

[మార్చు]

మంచిర్యాల జిల్లా 18.8756 ° N, 79.4591 ° E మధ్య ఉంది. దీని చుట్టూ ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లా, కొమురంభీం జిల్లాలు, దక్షిణాన కరీంనగర్ జిల్లా, నిజామాబాదు జిల్లాలు, పశ్చిమాన నాందేడ్ జిల్లా ఉన్నాయి. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 50 కి.మీ. (31 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది పడమటి కనుమల నుండి మహారాష్ట్రలోని తడోబా అడవుల వరకు విస్తరించి, (GoAP2012; రాజగోపాల్ 1976)[6] 893 కి.మీ. (345 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. ఆక్రమణ, వేట, చెట్ల నరికివేత, నివాస గృహాల ఏర్పాటువల్ల అడవికి ముప్పు ఎక్కువగా ఉంది.[7]

వృక్షాలు

[మార్చు]

రాష్ట్రంలోని టేకు అడవులలో ఈ అభయారణ్యం ఒకటి. ఈ ప్రాంతంమీదుగా కడెం నది ప్రవహిస్తుంది. వెదురు, టెర్మినాలియా, టిరోకార్పస్, అనోజిసస్, కాసియాస్‌తో కలిపిన పొడి ఆకురాల్చే టేకు అడవులు ఇవి.

జంతువులు

[మార్చు]

పులి, చిరుతపులి, గౌర్, దుప్పి, సాంబార్, నీలగై, చౌసింగ్, బద్ధకపు ఎలుగుబంటి, జింకలు, నీల్‌గాయి, ఎలుగుబంట్లు, అడవిదున్నలు, రేసుకుక్కలు, ముళ్ళపందులు, అడవిపందులు, అడవి పిల్లులు వంటి జతువులు ఉన్న ఈ అభయారణ్యంలో అనేక జాతుల పక్షులు, సరీసృపాలు కూడా కనిపిస్తాయి.[8]

ఇతర వివరాలు

[మార్చు]
  1. మల్యాల దొంగపల్లి వాచ్‌టవర్‌ ఎక్కితే పచ్చని అందాలతో దట్టమైన అడవి కనిపిస్తుంది. ఇంధన్‌పెల్లి రేంజ్‌ పరిధిలోని కల్పకుంట వద్ద నిర్మించిన వాచ్‌టవర్‌ ఎక్కితే దాహం తీర్చుకోవడానికి వచ్చిన వన్యప్రాణులు కనిపిస్తాయి.
  2. గాయపడ్డ వన్యప్రాణులకు చికిత్స అందించేందుకు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన జింకల పునరావాస కేంద్రానికి తీసుకువస్తారు.
  3. ఇక్కడకు వచ్చే పర్యాటకుల వసతికోసం జన్నారం, కడెం మండలాల్లో తెలంగాణ పర్యాటక శాఖ కాటేజీలను నిర్మించింది.

అంతర్జాతీయ అతిథులు

[మార్చు]

ఐరోపా నుంచి నార్తర్న్‌ పింటైల్‌ పక్షి వలస వచ్చింది. అలాగే నార్త్‌ ఇండియా నుంచి వలస వచ్చే పక్షుల్లో ప్రస్తుతం ఊలీనెక్డ్‌ స్టార్క్‌, బ్రాహ్మినీ డక్‌, బ్లాక్‌ హెడెడ్‌ ఐబిస్‌, రెడ్‌ న్యాప్‌డ్‌ ఐబిస్‌, గ్రేట్‌ కార్మరెంట్‌, ఓరియంటల్‌ డార్టర్‌, గ్రీన్‌ హెరాన్‌తోపాటు పలు రకాల పక్షులు ఉన్నాయి. ఇవే కాకుండా అరుదైన జాతులకు చెందిన ఎల్లో వ్యాటిల్డ్‌ ల్యాప్‌వింగ్‌, రివర్‌ లాప్‌వింగ్‌ వంటి ఎనిమిది రకాల పక్షులు కవ్వాల్‌ అడవుల్లో తిరిగి జీవం పోసుకుంటున్నాయి.[9]

వెబ్‌సైట్‌

[మార్చు]

క‌వ్వాల్ పులుల అభ‌యార‌ణ్యంపై అన్ని వివ‌రాల‌తో రూపొందించిన వెబ్‌సైట్‌ను 2022, ఆగస్టు 30న తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించాడు. ఈ వెబ్‌సైట్‌లో ప‌ర్యాట‌కులు, సంద‌ర్శ‌కుల‌కు పూర్తిగా ఉప‌యోగ‌ప‌డే స‌మాచారం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Kawal to be developed as eco-tourism centre". The Times of India. 4 November 2011. Archived from the original on 5 ఆగస్టు 2013. Retrieved 26 April 2020.
  2. "Kawal Wildlife Sanctuary declared tiger reserve". The Hindu. 4 November 2012. Retrieved 26 April 2020.
  3. "Kawal Wildlife Tiger Reserve". forests.telangana.gov.in. Archived from the original on 10 September 2019. Retrieved 26 April 2020.
  4. నవతెలంగాణ, ఆదిలాబాదు (3 May 2017). "కవ్వాల్‌.. చూసొద్దాం రండి..!". NavaTelangana. Archived from the original on 26 April 2020. Retrieved 26 April 2020.
  5. {{<http://www.thehindu.com/todays-paper/tp-national/kawal-tiger-reserve-a-green-oasis/article3953160.ece/>}}
  6. Rathod, Bikku and Rambabu M. "Tiger Reserve in Kawal Wildlife Sanctuary: Issues and Concerns". International Journal of Innovative Research and Practices. 1. ISSN 2321-2926.(
  7. "Andhra Pradesh / Hyderabad News : 'Carry on Heaven' play to be staged tomorrow". The Hindu. 6 October 2007. Archived from the original on 13 October 2007. Retrieved 26 April 2020.
  8. నవ తెలంగాణ, ఆదిలాబాదు (17 November 2019). "పర్యాటకుల మదిదోస్తున్న కవ్వాల్‌". NavaTelangana. Archived from the original on 26 April 2020. Retrieved 26 April 2020.
  9. "అరుదైన జీవ జాతులకు నిలయం.. కవ్వాల్‌". andhrajyothy. Retrieved 2022-01-29.
  10. telugu, NT News (2022-08-30). "క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.

ఇతర లంకెలు

[మార్చు]