ఆదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.పూర్వం ఎద్దుల పురం అని పిలిచేవారు.
?ఆదిలాబాద్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19°40′N 78°32′E / 19.67°N 78.53°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 4,153 చ.కి.మీ. కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. చ.మై) |
ముఖ్య పట్టణం | ఆదిలాబాదు |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
7,21,433 (2011 నాటికి) • 170/కి.మీ² (440/చ.మై) • 1366964 • 1370774 • 63.01 శాతం (2001) • 71.22 • 51.99 |
దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్.[1][2].బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు ఆదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 10 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.
జిల్లా పేరు వెనుక చరిత్ర
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది.[3] మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు.[4] ఈ జిల్లా పెరు ఎదులపురంగా పిలుస్థారు
జిల్లా చరిత్ర
[మార్చు]చారిత్రకంగా ఆదిలాబాద్ జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణ భారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు, చాళుక్యులు, గోండ్ రాజులు పాలించారు. ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మలయాళీ,రాజస్థానీ, గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.
భౌగోళిక స్వరూపం
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి.జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ, వార్థా.
జిల్లా సరిహద్దులు
[మార్చు]● ఉత్తరం- యావత్మాల్, మహారాష్ట్ర.
● ఈశాన్యం- చంద్రపూర్, మహారాష్ట్ర.
● దక్షిణ- నిర్మల్
● ఆగ్నేయం-మంచిర్యాల
● తూర్పు- కుంరం భీం ఆసిఫాబాద్
● పశ్చిమం- నాందేడ్,మహారాష్ట్ర.
ఆర్ధిక స్థితిగతులు
[మార్చు]వ్యవసాయం
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం, ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం, ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.
పరిశ్రమలు
[మార్చు]ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే ఆహారపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. ముడి, నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంబంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి. బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి
పరిపాలనా విభాగాలు
[మార్చు]ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో 52 మండలాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణ ముందు 52 మండలాలుతో కలిగిన జిల్లా రేఖా పటం
పునర్య్వస్థీకరణ తరువాత రెండు రెవెన్యూ డివిజన్లు (ఆదిలాబాద్, ఉట్నూరు), 18 రెవెన్యూ మండలాలు, 508 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 31 నిర్జన గ్రామాలు ఉన్నాయి.ఐదు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
స్థానిక స్వపరిపాలన
[మార్చు]జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 467 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[5]
పునర్య్వస్థీకరణకు ముందు జిల్లా పరిధిలో పట్టణ ప్రాంతాలు ఆదిలాబాదు, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ ఏడు పురపాలక సంఘాలున్నాయి.
కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు
[మార్చు]2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 52 పాత మండలాల నుండి 14 మండలాలుతో మంచిర్యాల జిల్లా,[6] 13 మండలాలుతో నిర్మల్ జిల్లా,[7] 12 మండలాలుతో అషిఫాబాద్ పరిపాలన కేంద్రంగా కొమరంభీమ్ జిల్లా[8] కొత్తగా ఏర్పడ్డాయి.ఈ జిల్లాలు 11.10.2016 నుండి అధికారికంగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మంచిర్యాల జిల్లాలో చేరిన మండలాలు.
[మార్చు]నిర్మల్ జిల్లాలో చేరిన మండలాలు
[మార్చు]కొమరంభీమ్ జిల్లాలో చేరిన మండలాలు
[మార్చు]పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలో మండలాలు
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో పునర్య్వస్థీకరణ తరువాత 18 మండలాలు ఉన్నాయి.అందులో 13 పాత మండలాలుకాగా 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.[9]
- గమనిక:వ.నెం.1 నుండి 13 వరకు పాత మండలాలు కాగా, వ.నెం.14 నుండి 18 వరకు గల (ఐదు) మండలాలు కొత్తగా ఏర్పడినవి.
ఉట్నూరు రెవెన్యూ డివిజన్
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఉట్నూరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంది.
లోక్‌సభ,శాసనసభ వివరాలు
[మార్చు]- ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం: ప్రస్తుత ప్రతినిధి: గెడం నగేష్
- శాసనసభ స్థానాలు (10):
స్థానం | ప్రతినిధి |
---|---|
సిర్పూర్ | కోనేరు కొన్నప్ప, తెరాస |
చెన్నూర్ | బాల్క సుమన్, తెరాస |
బెల్లంపల్లి | దుర్గం చిన్నయ్య, తెరాస |
మంచిర్యాల | యన్ . దివాకర్ రావు, తెరాస |
ఆసిఫాబాద్ | ఆత్రం సక్కు,తెరాస |
ఖానాపూర్ | రెఖాశ్యాం నాయక్, తెరాస |
ఆదిలాబాదు | జోగు రామన్న - తెరాస, |
బోధ్ | ఆర్ బపురావ్, తెరాస |
నిర్మల్ | ఇంద్రకరన్ రెడ్డి, తెరాస |
ముధోల్ | విఠల్ రెడ్ది, తెరాస |
రవాణా వ్యవస్థ
[మార్చు]2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమధ్య రైల్వే లోని హైదరాబాదు విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషను అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.కృష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదుకు ఒక ప్రధాన రైలు.
దేశంలోనే అతి పొడవైన 'జాతీయ రహదారి 44 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.
జనాభా లెక్కలు
[మార్చు]1981 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా-16,39,003, వీరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి 990:1000, అక్షరాస్యత:18.97 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని. 985)
2011 జనాభా గణాంకాలను అనుసరించి ఆదిలాబాద్ జిల్లా జనసంఖ్య 27,37,738. వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగు. తెలుగును ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు గోండి, మరాఠీ, ఉర్ధూ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది.
సంస్కృతి
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. గోండు,ప్రధాన్, కొలాం, బంజార లంబాడీ , తోటి,అంద్ వంటి గిరిజన జాతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇంకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి.
పశు పక్ష్యాదులు
[మార్చు]ఆదిలాబాద్ జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ భాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు, అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు, సంబార్ వంటి సాధు జంతువులు నివసిస్తున్నాయి.
జలపాతాలు
[మార్చు]1.కుంటాల జలపాతం-నేరడిగొండ, మండలం
2.పొచ్చెర జలపాతం-నేరడిగొండ, మండలం
3.గాయత్రి జలపాతం- ఇచ్చోడ మండలం.
4.కనకాయి జలపాతం- బజాహాత్నుర్ మండలం.
5. సహస్ర కుండ్ జలపాతం, కోరటికల్.
6. గుండాల జలపాతం- గుండాల దండెపల్లి
జాతరలు
[మార్చు]1.నాగోబా జాతర- కేస్లాపూర్,ఇంద్రవెల్లి మండలం
2.సాలేవాడ జాతర-ఉట్నూర్, ఉట్నూరు.
3.బుడందేవ్ జాతర- శ్యామ్ పూర్, ఉట్నూరు.
4.సేవాలాల్ దీక్ష భూమి జాతర, కొత్తపల్లి H, నార్నూర్ మండలం
5.ఖాందేవ్ జాతర- నార్నూర్ మండలం.
6. జ్వాలాముఖీ జాతర అందునాయక్ తాండా ఇంద్రవెల్లి
దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]1.నాగోబా దేవాలయం-కేస్లాపూర్, ఇంద్రవెల్లి.
2.లక్ష్మీ నారాయణ ఆలయం- జైనథ్.
3. ఉట్నూరు రాజ్ గోండుల కోట
4. శ్రీ జగదాంబ దేవి, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం, సేవాలాల్ దీక్ష భూమి, కొత్తపల్లి -H,నార్నూర్ మండలం.
5. కైలాస్ టేకడి శివాలయం నిగిని బోథ్
6.గోపాల కృష్ణ మఠం ఆదిలాబాద్
8.శ్రీ మహదేవ్ బైరాన్ దేవ్ ఆలయం సదల్ పూర్
9.పెండల్ వాడ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం
విద్యా వ్యవస్థ
[మార్చు]జిల్లాలో మొత్తం 4,826 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,354, ప్రాథమికోన్నత పాఠశాలలు 700, ఉన్నతపాఠశాలలు 772 ఉన్నాయి. దాదాపు 500278 మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని ఒక అంచనా. వీరికి 14,850 మంది ఉపాధ్యాయులు, 5031 మంది విద్యావాలంటీర్లు పాఠాలు బోధిస్తున్నారు.[10]
సంఖ్య | విద్యాసంస్థ | వివరణ | సంఖ్య |
1 | పాఠశాలలు | ప్రాథమిక పాఠశాలలు | 4,826 |
2 | వివరణ | ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు | 700,772 |
3 | జూనియర్ కళాశాలలు | సరాసరి అన్ని మండలాలో | 112 |
4 | కళాశాలలు | 32 | |
5 | ఉన్నత కళాశాలలు | మంచిర్యాల, ఆదిలాబాదు | 10 |
6 | ఇంజనీరింగ్ కళాశాలలు | ట్రిపుల్ ఐటీ, బాసర, ఆదిలాబాద్ | 3 |
7 | కంఫ్యూటర్ పాఠశాలలు | నిర్మల్, సిర్పుర్, అసిఫాబాదు, చెన్నూరు, ఖానాబాదు | 13 |
8 | బాలికల వృత్తి విద్య | మండలానికి ఒకటి కస్తూరిభా విద్యాలయాలు | 32 |
9 | వైద్య కళాశాలలు | రిమ్స్ | 1 |
10 | ఫార్మసీ | ||
11 | వృత్తి విద్యాలయాలు | పాలిటెక్నిక్, డైట్, ఐటీ, డీ ఎడ్, ఇతరాలు | 25 |
12 | ఉపాధ్యాయ శిక్షణ | ఉట్నూరు, నిర్మల్, అసిఫాబాదు, ఆదిలాబాదు | 5 |
ఆకర్షణలు
[మార్చు]జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది.తెలంగాణలో కల ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారతదేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది.
- దర్శనీయ ప్రదేశాలు: బాసర, పోచంపాడు నిర్మల్, కుంటాల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి, మందమర్రి, సిర్పూర్, బుగ్గ రాజేశ్వరాలయం, కొకసమన్నూరు హనుమాన్ ఆలయం. ఇచోడా నారాయణస్వామి ఆలయం, జైనాధ్, నగొబా జాతర అదివాసులకు చాలా ప్రత్యేకం. దీక్షభూమి కొత్తపల్లి లంబాడీలు సేవాలాల్ దీక్షలు ఇచ్చటనే తీసుకుంటారు
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- కొమురం భీమ్
- రాంజీ గోండు
- కొమురం సూరు
- దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్
- కొండా లక్ష్మణ్ బాపూజీ
- సామల సదా శివ
- సిడాం శంభు
- అంబాజీ ఖానాపూర్ తొలి శాసన సభ్యులు
- సముద్రాల వేణుగోపాలచారి
- రాథోడ్ రమేష్
- జోగు రామన్న
- సోయం బాపూరావు - ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు
- రాథోడ్ జనార్దన్ - ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్
- సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మేల్యే
- రాథోడ్ బాపూరావు బోథ్ మాజీ ఎమ్మేల్యే
- గోడం నగేష్ మాజీ మంత్రి
- పాయల్ శంకర్ ఆదిలాబాద్ శాసన సభ్యులు
- అనిల్ జాదవ్ బోథ్ శాసన సభ్యులు
- వేడ్మా భొజ్జు ఖానాపూర్ శాసన సభ్యులు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్". ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం. Archived from the original on 26 సెప్టెంబరు 2011. Retrieved 11 January 2015.
- ↑ "ఆదిలాబాద్ జిల్లా గణాంకాలు". ఎపి ఆన్లైన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 5 జూన్ 2014. Retrieved 11 January 2015.
- ↑ "ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర". Archived from the original on 2015-01-11. Retrieved 2012-05-15.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 223, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 224, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 221, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
- ↑ వికాస్ పీడియాలో అదిలాబాదు జిల్లాలో విద్యా సదుపాయాలపై సమాచారం