Jump to content

సిర్పూర్ (యు) మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°26′06″N 79°47′02″E / 19.434867°N 79.783974°E / 19.434867; 79.783974
వికీపీడియా నుండి
సిర్పూర్‌ (యు)
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°26′06″N 79°47′02″E / 19.434867°N 79.783974°E / 19.434867; 79.783974
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం సిర్పూర్ (యు)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,097
 - పురుషులు 12,972
 - స్త్రీలు 13,125
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.91%
 - పురుషులు 48.90%
 - స్త్రీలు 24.93%
పిన్‌కోడ్ 504313
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం
సిర్పూర్ యు చైవరాస్తా
చిరుదన్యాలు
చీరు దన్యాలు

సిర్పూర్ (యు) మండలం , తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 55 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో మొత్తం 18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 26,097 - పురుషులు 12,972 - స్త్రీలు 13,125

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 190 చ.కి.మీ. కాగా, జనాభా 15,248. జనాభాలో పురుషులు 7,566 కాగా, స్త్రీల సంఖ్య 7,682. మండలంలో 3,287 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సిర్పూర్ (యు)
  2. రాఘాపూర్
  3. భుర్నూర్
  4. ఫుల్లార
  5. దేవద్‌పల్లి
  6. సీతాగొంది
  7. పంగ్డి
  8. బాబ్జీపేట్
  9. నెత్నూర్
  10. పాములవాడ
  11. కోహినూర్ (బుజుర్గ్)
  12. కోహినూర్ (ఖుర్ద్)
  13. శెట్టిహదప్నూర్
  14. ఛప్రి
  15. ధనోర (పి)
  16. మహాగావ్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు..

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. పిట్టగూడ
  2. భీమన్ గూట్ట
  3. సితకార్రే
  4. భీమన్ గోంది
  5. మెట్ గూడ

ప్రభుత్వ కార్యాలయాలు

[మార్చు]
  • మండలా కార్యాలయం
  • మండలా విద్యాశాఖ కార్యాలయం
  • ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
  • గ్రామ పంచాయతీ కార్యాలయం
  • వ్యవసాయ మార్కెట్ కార్యాలయం
  • పోలిస్ స్టెషన్ కార్యాలయం
  • చౌకధర పౌరసరఫరాల శాఖ

విద్య సదుపాయాలు

[మార్చు]

సిర్పూర్-యు మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు,ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి,KGBV పాఠశాల ఒకటి, మెడల్ పాఠశాల ఒకటి , ప్రభుత్వ మెడల్ జూనియర్ ఒకటి, జిల్లా పరిషత్ మద్యమీక ఉన్నత పాఠశాల ఒకటి కలదు. ప్రభుత్వ డిగ్రీకళాశాల ఉట్నూరు లోను,అలాగే

ప్రభుత్వ బి.ఇ.డి కళాశాల కూడ ఉట్నూర్ లోనే కలదు. పాలిటెక్నిక్ కళాశాల బెల్లంపల్లి లోను, ఇక పై చదువులకు ఆదిలాబాద్ లోను, మంచిర్యాల లోను కలదు. అలాగే బి.టెక్ కళాశాల ఆదిలాబాద్ లోను మంచిర్యాల లోను కలదు.

వ్యవసాయం, పంటలు

[మార్చు]

మండలంలో ఖరీఫ్‌లో ప్రధాన పంటలు పత్తి, కంది, సోయబీన్, పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న.

రబీలో శనగ, గోధుమలు, జొన్న, మొక్కజొన్న

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]