చింతల మానేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతల మానేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం[1]

ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు చింతల మానేపల్లి గ్రామం అదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని కౌటల మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చింతల మానేపల్లి నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన కుమ్రం భీమ్(ఆసిఫాబాద్) జిల్లా, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+20 (ఇరవైఒకటి) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. బాబాపూర్
 2. బాబాసాగర్
 3. బాలాజి అంకొడ
 4. చింతల మానేపల్లి
 5. గంగాపూర్
 6. బూరేపల్లి
 7. కొరిసిని
 8. రన్వల్లి
 9. రవీంద్రనగర్
 10. కేథిని
 11. దింద
 12. చిత్తం
 13. గూడెం
 14. బూరుగూడ
 15. కోయపల్లి
 16. శివపల్లి
 17. కర్జవెల్లి
 18. రుద్రాపూర్
 19. దబ్బా
 20. అడేపల్లి

గణనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.

వెలుపలి లంకెలు[మార్చు]