కొమరంభీం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

కొమరంభీం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని, 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. [1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు[మార్చు]

పటం
కొమరంభీం జిల్లా
కొమరం భీమ్ జిల్లా రెవెన్యూ డివిజన్లు.

ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన[మార్చు]

అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

గణాంక వివరాలు[మార్చు]

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లా లోని మండలాలు[మార్చు]

పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా, 3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]

  1. సిర్పూర్ (యు) మండలం
  2. లింగాపూర్ మండలం*
  3. జైనూర్ మండలం
  4. తిర్యాని మండలం
  5. ఆసిఫాబాద్ మండలం
  6. కెరమెరి మండలం
  7. వాంకిడి మండలం
  8. రెబ్బెన మండలం
  9. బెజ్జూర్‌ మండలం
  10. పెంచికలపేట్ మండలం*
  11. కాగజ్‌నగర్‌ మండలం
  12. కౌటల మండలం
  13. చింతల మానేపల్లి మండలం*
  14. దహేగాం మండలం
  15. సిర్పూర్ పట్టణ మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-05-29.
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.

వెలుపలి లింకులు[మార్చు]