మైసిగండి మైసమ్మ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసిగండి మైసమ్మ దేవాలయం
మైసిగండి మైసమ్మ దేవాలయం
మైసిగండి మైసమ్మ దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రంగారెడ్డి జిల్లా
ప్రదేశం:మైసిగండి, ఆమన‌గల్ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:మైసమ్మ (మహాంకాళి)

మైసిగండి మైసమ్మ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఆమన‌గల్ మండలంలోని మైసిగండి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] హైదరాబాదు - శ్రీశైలం హైవేలో ఈ మైసిగండి గ్రామం ఉంది.[2] గ్రామ శివారులో ఉన్న ఈ మైసమ్మ దేవాలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ స్థానిక బంజారా ప్రజల సాంస్కృతిక, పౌరాణిక ఆచారాలు ప్రతిబింబిస్తుంటాయి.[3]

మైసిగండి మైసమ్మ దేవాలయం

దేవాలయ విశిష్టత[మార్చు]

హైదరాబాదు నుండి శ్రీశైలం వైపుకువెళ్ళే దారిలో 66 కి.మీ.ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడి మైసమ్మ విగ్రహం సుమారు 20 అడుగుల పొడవు ఉంది. గోపురం కూడా భారీగా, ఇతర దక్షిణ భారత దేవాలయాల గోపురాలకన్నా భిన్నంగా ఉండి, పైభాగంలో తెరిచి ఉంటుంది. దేవాలయ ప్రధాన దేవత ఆలయం పైభాగంలో తెరిచి ఉండాల్సిన అవసరం ఉందని పురాణ కథనం చెబుతోంది.[3] బంజారా లేదా లంబాడా కులానికి చెందినవారే ఇక్కడ పూజారులుగా ఉన్నారు. వారాంతాల్లో, ముఖ్యంగా బోనాలు, జాతర సమయాల్లో ఆలయ ప్రాంగణం పర్యాటకులు, భక్తులతో నిండిపోతుంది.[2] దేవాలయంలోని మహాంకాళిని శక్తివంతమైన దేవతగా, భక్తుల కోరికలను నెరవేరుస్తుందని స్థానికులు భావిస్తారు.

ఇతర వివరాలు[మార్చు]

ఈ ఆలయం వెనుకభాగంలో, రాముడు, ఆంజనేయ, శివుడు మొదలైన దేవుళ్ళ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. రాతి మెట్లతో నిర్మించిన పెద్ద కొనేరు కూడా ఇక్కడ ఉంది. రోజురోజుకి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Singh, Akash (2018-10-09). "Hyderabad To Srisailam – To The Pilgrimage Centre Of Andhra Pradesh". nativeplanet.com. Retrieved 2021-03-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Maisigandi Maisamma Temple, TS Tourism". tstourism.co.in. Retrieved 2021-03-01.
  3. 3.0 3.1 "Divine Destinations in Telangana :: Telangana Tourism". partials. Retrieved 2021-03-01.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు