అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E |
పేరు | |
ప్రధాన పేరు : | అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జగిత్యాల జిల్లా |
ప్రదేశం: | ధర్మపురి మండలం |
ఇతిహాసం | |
సృష్టికర్త: | అక్కపెల్లి |
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలో ఉన్న ఆలయం. సా.శ. 15వ శతాబ్దంలో అక్కపెల్లి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించడంతో, ఆయన పేరుమీద అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయంగా పిలువబడుతుంది.[1]
చరిత్ర
[మార్చు]ధర్మపురి క్షేత్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ఉండేది. ఆ సమయంలో శ్రీరామభద్రస్వామి ఈ ప్రాంతానికి వచ్చి అక్కడి గ్రామస్తులకు తాత్కాలికంగా విడిదిని ఏర్పాటుచేశాడనీ, ఇక్కడ స్థిరపడిన బ్రాహ్మణులు ఆయన కోరికమేరకు రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ సమీపంలో బావిలో దొరికిన శాసనం ద్వారా తెలిసిందని చరిత్రకారులు చెబుతున్నారు.
సా.శ. 15వ శతాబ్దంలో అక్కపెల్లి అనే దాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. కొంతకాలం తరువాత శివలింగం (సాలగ్రామ) రూపంలోని రాజరాజేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు.
ఉత్సవాలు
[మార్చు]శివరాత్రి
[మార్చు]మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రుద్రాభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తంలో స్వామివారికి కల్యాణోత్సవం, మరుసటిరోజు రథోత్సవం, అన్నపూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎడ్లబండ్లు, ఇతర వాహనాల్లో భక్తులు వస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "అడవిలో ఆది దేవుడు". Archived from the original on 4 March 2019. Retrieved 6 March 2019.