త్రిలింగరామేశ్వర దేవాలయం, తాండూరు
త్రిలింగరామేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°8′38″N 78°7′45″E / 18.14389°N 78.12917°E |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | కామారెడ్డి జిల్లా, |
ప్రదేశం: | తాండూరు, నాగిరెడ్డిపేట మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
త్రిలింగరామేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం, తాండూరు గ్రామంలో ఉన్న దేవాలయం. రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న ఈ దేవాలయం సా.శ. 12వ శతాబ్దంలో నిర్మించబడింది.[1]
చరిత్ర
[మార్చు]వనవాసం చేసిన సమయంలో ఇక్కడ కొద్దికాలం గడిపిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ప్రస్తుతం మంజీరా నది ఉన్న ప్రాంతానికి వచ్చి స్నానం చేసి, తమోగుణం ప్రభావం వల్ల వారు తమకు నచ్చిన విధంగా ముగ్గురు వేర్వేరుగా కూర్చొని స్వతహాగా లింగాలను తయారు చేసుకొని పూజలు చేశారు. వాళ్ళు పూజలు ముగించడంతోనే ఈ ప్రాంతంలో మూడు లింగాల ఆలయాన్ని నిర్మించారని, రాముడు స్నానం చేసిన ప్రాంతాన్ని రామపాదాలు అని, రాముడు తీర్థం సేవించిన ప్రాంతాన్ని రామతీర్థంగా అని పిలుస్తున్నారని ఇక్కడి గ్రామస్తుల కథనం.
నిర్మాణం
[మార్చు]ఒకే ఆలయంలో మూడు లింగాలు ప్రతిష్ఠితమై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. లింగాకారంలో కనిపించే ఈ ఆలయంలో ఒకే రాతితో నిర్మించిన ముఖద్వారం, ప్రధాన ద్వారం, స్వాగత తోరణాలు ఉన్నాయి. నాలుగు ముఖద్వారాల్లో ప్రతి ముఖద్వారానికి ఒకే రాతితో నిర్మించిన శిల్పకళ ఉంది. నాట్యంతో స్వాగతం పలుకుతున్నట్టుగా ద్వారాలకు రెండు ప్రక్కల శిల్పాలు చెక్కబడ్డాయి.
ఈ ఆలయంలో లేపాక్షి నందిని పోలిన ఒక నంది విగ్రహం ఉంది. దీనినితో పోల్చుతారు. ఈ ఆలయాన్ని ఒకే కాలు, ఒకే చేయి ఉన్న శిల్పా రూపకల్పన చేశాడని, ఈ ఆలయాన్ని నిర్మించి ఇదే ఆలయంలో తను సజీవ సమాధి అయ్యాడని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, రెండవ రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన, మూడవరోజు పద్మవ్యూహం, భజనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగవరోజు రథోత్సవం, ఐదవరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. శ్రావణ మాసంలో ప్రతిరోజూ అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి.
ఇతర వివరాలు
[మార్చు]- 2020, మార్చి 18న ఈ దేవాలయంలో కాకతీయుల నాటి విగ్రహం దొరికింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (23 February 2020). "మూడు లింగాల త్రిలింగేశ్వరాలయం". ntnews. Archived from the original on 29 February 2020. Retrieved 28 May 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 March 2020). "తాండూర్‌లో అరుదైన విగ్రహం లభ్యం". www.andhrajyothy.com. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.