Coordinates: 17°04′39″N 79°17′43″E / 17.07747°N 79.29528°E / 17.07747; 79.29528

పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పచ్చల సోమేశ్వర దేవాలయం
పచ్చల సోమేశ్వర దేవాలయం
పచ్చల సోమేశ్వర దేవాలయం
పచ్చల సోమేశ్వర దేవాలయం is located in Telangana
పచ్చల సోమేశ్వర దేవాలయం
పచ్చల సోమేశ్వర దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°04′39″N 79°17′43″E / 17.07747°N 79.29528°E / 17.07747; 79.29528
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నల్లగొండ జిల్లా
ప్రదేశం:పానగల్లు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కాకతీయ, ఇక్ష్వాకులు
ఇతిహాసం
వెబ్ సైట్:సోమేశ్వర దేవాలయం

పచ్చల సోమేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, పానగల్లు గ్రామంలోని ఉదయ సముద్రం ప్రక్కన ఉంది. పురాణాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడిన రెండు వేర్వేరు ఆలయ సముదాయాల కలిగిన ఈ త్రికూట అలయం పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి. స్వామికి నిరంతరం పచ్చలహారం ధరింపజేయటంవల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది.

చరిత్ర

[మార్చు]

సా.శ. 10,12 శతాబ్దాల్లో కాకతీయ సామంతులైన కందూరు చోళులు పానగల్లును రాజథాని చేసుకొని పరిపాలన సాగించారు. కందూరు చోడుల ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మధ్యయుగపు శిల్పకళా నైపుణ్యానికి గుర్తుగా నల్లరాతిలో చెక్కిన శిలా కళా కృతులతో 25 వరుసలలో ఈ ఆలయం నిర్మించబడింది. మహ్మదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వర లింగం పచ్చలను దొంగిలించబడ్డాయని స్థానికులు చెపుతారు.[1]

నిర్మాణం

[మార్చు]

ఈ ఆలయంలోని 70 స్తంభాలపై విష్ణువు, శివుడులకు సంబంధించిన భారతము, భాగవత, రామాయణ, శివపురాణ కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. లింగరూపంలో ఉన్న మూలవిరాట్ గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారుచేయబడింది. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందుభాగంలో సోమేశ్వరస్వామికి ఎదురుగా నందీశ్వరుడు, అంతరాలయం ముఖద్వారం దగ్గర చిన్న నందీశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరీ దేవి, చెన్నకేశవ ఉపాలయాలు ఉన్నాయి.[2]

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1994లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాలను ఆలయం వెనుక భాగంలో ఏర్పాటుచేయబడింది. 1వ శతాబ్ది నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి, దేవతా విగ్రహాలు, పలు నాణేలు అనేక చారిత్రక వస్తువులను దేవరకొండ, భువనగిరి, ఏలేశ్వరం, పిల్లలమర్రి మొదలైన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పురావస్తు ప్రదర్శన శాలలో భద్రపరచబడ్డాయి.[2]
  2. ఈ దేవాలయానికి 2 కి.మీ. దూరంలో ఛాయా సోమేశ్వరాలయం ఉంది.
  3. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పండగల సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.[3]
  4. ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. విశాలాంధ్ర, నల్లగొండ (28 May 2011). "కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..!". Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "పచ్చల సోమేశ్వరాలయం". www.ntnews.com. నగేష్ బీరెడ్డి. Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (23 November 2018). "రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు". www.andhrajyothy.com. Archived from the original on 5 ఆగస్టు 2019. Retrieved 5 August 2019.