Jump to content

జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°57′33″N 79°49′19″E / 17.95912°N 79.82207°E / 17.95912; 79.82207
వికీపీడియా నుండి
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం is located in Telangana
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం
జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:17°57′33″N 79°49′19″E / 17.95912°N 79.82207°E / 17.95912; 79.82207
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జనగామ జిల్లా
ప్రదేశం:జీడికల్, లింగాల ఘన్‌‌పూర్‌ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శ్రీరాముడు, సీత
ప్రధాన పండుగలు:శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి

జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ మండలం, జీడికల్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం.[1] శ్రీరాముడి వీరత్వానికి ప్రతీతిగా రెండో భద్రాద్రిగా పేరొందిన ఈ దేవాలయ ఉనికి త్రేతాయుగ కాలంనాటిది.

చరిత్ర

[మార్చు]

శ్రీరాముడు పర్ణశాలలో వనవాసంలో ఉన్నప్పుడు మాయ లేడి (బంగారు జింక) వేషంలో వచ్చిన రాక్షసు మారీచుడిన చూసి సీత, ఆ మాయలేడిని కోరగా రాముడు దాని వెంటబడి జీడికల్‌ సమీపంలోని లేడిబండ వద్ద సంహరించాడు. అప్పుడు మారీచుడు రాముడిని క్షమాపణ కోరి తనను ఆరాధిస్తానని వాగ్దానం చేయడంతో, ఇక్కడి కొండపైన ఉన్న దేవాలయంలో ‘స్వయంభు’గా ఉద్భవించటానికి అంగీకరిస్తాడు. అలా వెలసిన దేవాలయమే ఈ జీడికల్ శ్రీరామచంద్రస్వామి దేవాలయం. సంహార అనంతరం సంధ్యావందనం కోసం తన బొటన వేలిని నొక్కగా బండపై ఏర్పడిన గుంతలో నీరు వచ్చిందని, ఆ ప్రదేశాన్ని లేడీ బండగా పిలుస్తారు.[2]

కోనేరులు

[మార్చు]

దేవాలయంపైన ఉన్న కోనేరులను జీడిగుండం, పాలగుండం అని పిలుస్తారు. ఈ కోనేరుల మహత్యాన్ని చెప్పే ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజుల యుద్ధంలో చంద్రసేనుడు చనిపోగా, అతడి కవల పిల్లలైన బాలచంద్రుడు, బాలచంద్రికలు వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగిపెద్దవుతారు. వీరిద్దరు తోబుట్టువుల అని తెలియక స్వయంవరంలో వివాహం చేసుకోవడంతో ఆ వెంటనే వారి శరీరాలు నల్లబడిపోయాయి. అప్పుడు ఆకాశగంగ పలుకుతూ 101 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరు పాప విమోచనానికి దేవాలయాలన్ని దర్శించుకొని చివరిగా జీడికల్‌లోని జీడిగుండం, పాలగుండాలలో స్నానాలు చేయగా వారికి పాప విమోచనం జరిగిని, వారి శరీరాలు యథావిధిగా మారుతాయి. ఈ గుండాల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.[3]

సీతారాముల కల్యాణోత్సవం

[మార్చు]

ప్రతి సంవత్సరం శ్రీరామనవమితోపాటు, కార్తీకమాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కల్యాణోత్సవం జరుపడం ఈ దేవాలయ ప్రత్యేకత. అందుకే కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి జీడికల్‌ పున్నమిగా పేరు వచ్చింది. కార్తీక మాసంలో ఇక్కడ జాతర ప్రారంభమై నెలరోజులపాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీడికల్‌ రామచంద్రస్వామి పేరుతో 11 ఎకరాల భూమి కూడా ఉంది.[3]

అభివృద్ధి పనులు

[మార్చు]

దేవాలయ అభివృద్ధిలో భాగంగా 44 ఎకరాల్లో దేవాలయం, కల్యాణ మండపం, పార్కు, పార్కింగ్‌ ప్రదేశాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోసం మాస్టర్‌ ప్లాన్‌ను రూపకల్పన చేశారు. అందులోభాగంగా తెలంగాణ ప్రభుత్వం మంజూరుచేసిన 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్చిగేట్‌, దేవాలయ ప్రధాన రహదారి పనులకు 2022 ఆగస్టు 21న స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Jeedikal | JANGAON DISTRICT | India". Archived from the original on 2022-01-23. Retrieved 2022-08-22.
  2. Mahender, Adepu (2018-03-25). "A shrine that once aided Yadadri lies in neglect". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
  3. 3.0 3.1 "రామయ్య పెళ్లికి రండి". Sakshi. 2019-11-16. Archived from the original on 2020-10-21. Retrieved 2022-08-22.
  4. "జీడికల్ దేవాలయ అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి". Prabha News. 2022-08-21. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
  5. telugu, NT News (2022-08-21). "జీడికల్‌ ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.