Jump to content

లేడిబండ

వికీపీడియా నుండి
శ్రీరాముడు

జనగాం జిల్లా, లింగాల ఘన్పూర్ మండలం, జీడికల్లు అనే గ్రామంలో రామాలయం ఉంది. ఈ రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పరుపు బండ ఉంది. దీనినే లేడిబండ అంటారు. ఈ బండకు రామాయణ గాథకు సంబంధం ఉందని ఇక్కడి ప్రజల విశ్వాసం. పర్ణశాల నుండి మాయాలేడిని వెంబడిస్తూ రాముడు ఈ జీడికల్లుకు వచ్చాడని, ఇక్కడి ఈ పరుపు బండపైన రాముడు మోకాలు ఆన్చి లేడిని సంహరించినాడని జానపదుల విశ్వాసం. అందుకే ఈ పరుపు బండకు లేడిబండ అని పేరు వచ్చింది. దీనిపై లేడి అడుగులు, నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఈ లేడిబండపైన చిన్న గుంట ఏర్పడి ఉంది. ఈ గుంట లోపలి అంచులను పరిశుభ్రమైన గుడ్డతో తుడిచినా గుంటలో నీరు ఊరుతుంది. పాప పుణ్య ఫలనిరూపణకు ఈ గుంట అంచులను తుడిచి యాత్రికులు సంతృప్తి చెందుతుంటారు. జీడికల్లు రామున్ని దర్శించే యాత్రికులు కచ్చితంగా లేడిబండను సందర్శించి, ఇక్కడి గుంటను తుడిచి, గుంటలో నీరూరినా పుణ్యాత్ములమని భావించి, ఆ తీర్థం స్వీకరించి వెళ్తుంటారు. లేడిబండ సమీపాన దూసమడుగు ఉంది. ఇది చాలా లోతైన మడుగు. మాయాలేడి సంహరణానంతరం రాముడు తన విల్లమ్ములను ఈ మడుగులోనే శుభ్రపరుచుకొన్నాడని జానపదుల విశ్వాసం.[1].

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 44

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లేడిబండ&oldid=3283836" నుండి వెలికితీశారు