జనగాం
?జనగామ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 79°11′E / 17.72°N 79.18°ECoordinates: 17°43′N 79°11′E / 17.72°N 79.18°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16.04 కి.మీ² (6 చ.మై) |
జిల్లా (లు) | జనగామ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
92,394 (2011 నాటికి) • 5,760/కి.మీ² (14,918/చ.మై) |
భాష (లు) | తెలుగు |
జనగాం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జనగామ మండలానికి చెందిన పట్టణం.[1] ఇది ఇంతకుముందు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి జనగామ జిల్లాకు 89 కిలోమీటర్ల దూరం.
రవాణా వ్యవస్థ[మార్చు]
జనగాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ నుండి చుట్టుపక్కల గ్రామాలకు, హైదరాబాద్, హన్మకొండ, సిద్ధిపేట, సూర్యాపేట, చుట్టూ పక్కల ఉన్న 13 మండలాలకు బస్ సౌకర్యం ఉంది. జనగామ రైల్వేస్టేషన్ హైదరాబాద్ - కాజీపేట మధ్యలో ఉంది. ఇక్కడి నుండి దేశంలోని ఇతర పట్టణాలకు వెళ్ళే సౌకర్యం ఉంది.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,446 - పురుషులు 46,807 - స్త్రీలు 45,639
మండలంలోని పట్టణాలు[మార్చు]
- జనగాం
కలక్టరేట్ భవన ప్రారంభం[మార్చు]
2022, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. 25 ఎకరాల విస్తీర్ణంలో 32 కోట్ల రూపాయలతో మూడంతస్తుల్లో 34 జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 7 ఎకరాల గ్రీనరీతోవున్న ఈ ప్రాంగణం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లో రాష్ట్రంలోనే అతిపెద్దది. జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.[2]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf[permanent dead link]
- ↑ telugu, NT News. "జనగామలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". NTnews. Archived from the original on 2022-02-11. Retrieved 2022-02-11.