కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
నియోజకవర్గము నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1963-05-23) 23 మే 1963 (వయస్సు 57)
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతను 1963 మే 23న జన్మించాడు.[1] 1999, 2004, 2009లలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడూ ఇతనే. వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశాడు.[2] ప్రస్తుతం ఇతను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేయగా గవర్నరు 2011 అక్టోబరు 5న ఆమోదించాడు.[3] ఇతని సోదరుడు భువనగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]