తమిళిసై సౌందరరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమిళిసై సౌందరరాజన్
తమిళిసై సౌందరరాజన్


తెలంగాణ గవర్నర్
పదవీ కాలము
సెప్టెంబర్ 8, 2019 - ప్రస్తుతం
ముందు ఈ.ఎస్.ఎల్.నరసింహన్

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 2, 1961
నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం
జీవిత భాగస్వామి సౌందరరాజన్
సంతానము సుగానాథన్ సౌందరరాజన్
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు.[1] తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది.[2][3][4]

జననం[మార్చు]

ఈమె 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు.ఆమె వృత్తి రీత్యా వైద్యులు. ఆమె సోద‌రుడు వ‌సంత్‌కుమార్‌. [5]

విద్యాభ్యాసం[మార్చు]

ఈమె తన ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత శిక్షణను కెనడా లో పూర్తిచేసింది.

వివాహం[మార్చు]

తమిళసై, సౌందరరాజన్ ను వివాహమాడింది. ఆమె భర్త తమిళనాడులో వైద్యుడు, భారత వైద్య పరిశోధన మండలిలో పాలక మండలి సభ్యుడు.[6]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ఈమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. 2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయింది.[7]

మూలాలు[మార్చు]

  1. "డాక్టర్ నుంచి గవర్నర్ వరకూ తమిళిసై సౌందరరాజన్". www.andhrajyothy.com. Retrieved 1 September 2019. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ (4 September 2019). "8న గవర్నర్‌గా తమిళసై ప్రమాణస్వీకారం". ntnews.com. మూలం నుండి 4 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 4 September 2019.
  3. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం". ntnews.com. మూలం నుండి 8 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 September 2019.
  4. సాక్షి, తెలంగాణ (9 September 2019). "గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం". Sakshi. మూలం నుండి 8 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 September 2019.
  5. Dr Tamilisai Soundararajan. "New Governors Appointed In 5 States, Tamil Nadu BJP Chief Gets Telangana". www.ndtv.com. Retrieved 1 September 2019. Cite news requires |newspaper= (help)
  6. సాక్షి, గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌ (1 September 2019). "హోం » పాలిటిక్స్". Sakshi. మూలం నుండి 1 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 September 2019.
  7. BBC Telugu, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై (1 September 2019). "తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై, హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ". మూలం నుండి 1 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 September 2019. Cite news requires |newspaper= (help)