Jump to content

కె. అన్నామలై

వికీపీడియా నుండి
కె. అన్నామలై
కె. అన్నామలై


రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ , తమిళనాడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 జూలై 2021
ముందు ఎల్. మురుగన్

తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
29 ఆగస్టు 2020 – 7 జూలై 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1984-06-04) 1984 జూన్ 4 (వయసు 40)[1]
తొట్టంపట్టి, చిన్నతరపురం, కరూర్, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గుప్పుసామి గౌండర్
పరమేశ్వరి
జీవిత భాగస్వామి అఖిల స్వామినాథన్
సంతానం 2
నివాసం కరూర్ , తమిళనాడు
పూర్వ విద్యార్థి కోయంబత్తూరు PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో
వృత్తి రాజకీయ నాయకుడు
మాజీ ఐపిఎస్ అధికారి

అన్నామలై కుప్పుసామి (Aṇṇāmalai kuppusāmy) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, కర్ణాటక కేడర్ కు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి. ఆయనను 8 జూలై 2021న జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అన్నామలై కుప్పుసామి 1984 జూన్ 4న తమిళనాడు రాష్ట్రం, కరూర్ జిల్లా, చిన్నతరపురం,తొట్టంపట్టి గ్రామంలో గుప్పుసామి గౌండర్, పరమేశ్వరి దంపతులకు జన్మించాడు. ఆయన కరూర్, నామక్కల్ జిల్లాలో పాఠశాల విద్యను, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని ఆ తరువాత లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.[4]

అన్నామలై యూనియన్ సివిల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2011 సంవత్సరంలో ఐపీఎస్ కి సెలక్ట్ అయ్యి కర్ణాటక కేడర్‌కు కేటాయించబడడు.

వృత్తి జీవితం

[మార్చు]

అన్నామలై కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగళూరు, ఉడిపి జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌గా,  బెంగళూరు (దక్షిణం)లో డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా పని చేసి సెప్టెంబరు 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్నాడు. పోలీస్ ఫోర్స్‌లో పనిచేసిన సమయంలో తన పని తీరు కారణంగా ఆయనను 'సింగం అన్న' అని పిలిచేవారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

అన్నామలై 2020 ఆగష్టు 25న న్యూఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ సమక్షంలో బీజేపీలో చేరి[6][7], ఒక సంవత్సరం తర్వాత 8 జూలై 2021న 37 ఏళ్ల వయస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[2][8] ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి పోటీ చేసి తన సమీప డీఎంకే అభ్యర్థి ఆర్. ఎలాంగో చేతిలో 24,816 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

కె అన్నామలై  2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. T Muruganandham (8 July 2021). It's official: Former IPS officer Annamalai Kuppusamy is new chief of Tamil Nadu BJP. The New Indian Express.
  2. 2.0 2.1 Mint (8 July 2021). "Meet K Annamalai, the youngest Tamil Nadu BJP president ever" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  3. Eenadu (6 April 2024). "సొంత ఊరు.. సత్తా చాటేదెవరు?". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  4. Hindustan Times (26 September 2023). "K Annamalai: Police-officer-turned politician blamed for AIADMK's exit from NDA" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  5. The Economic Times (17 October 2019). "Government accepts IPS officer K Annamalai's resignation". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  6. The Economic Times (25 August 2020). "Ahead of Tamil Nadu polls, BJP ropes in former IPS officer Annamalai Kuppusamy". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  7. The Hindu (25 August 2020). "Former IPS officer K. Annamalai joins BJP" (in Indian English). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  8. Business Line (8 July 2021). "Ex-cop Annamalai appointed BJP Tamil Nadu President" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024. {{cite news}}: |last1= has generic name (help)
  9. India Today (21 March 2024). "Annamalai is special for BJP, so is Coimbatore" (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.