Jump to content

జె.పి.నడ్డా

వికీపీడియా నుండి
జె.పి.నడ్డా
Jagat Prakash Nadda
J. P. Nadda addressing the Ministerial Parallel Panel at Moscow
11th President of the Bharatiya Janata Party
Assumed office
20 జనవరి 2020 (2020-01-20)
ఉపాధ్యక్షుడు Raman Singh, Vasundhara Raje, Raghubar Das, Radha Mohan Singh, Baijayant Panda, D. K. Aruna, A. P. Abdullakutty, Rekha Verma, M. Chuba Ao, Bharti Shiyal
అంతకు ముందు వారుAmit Shah
Member of Parliament, Rajya Sabha
Assumed office
3 ఏప్రిల్ 2012 (2012-04-03)
అంతకు ముందు వారుViplove Thakur
నియోజకవర్గంహిమాచల్ ప్రదేశ్
Working President of the Bharatiya Janata Party
In office
17 జూన్ 2019 (2019-06-17) – 20 జనవరి 2020 (2020-01-20)
అధ్యక్షుడుAmit Shah
అంతకు ముందు వారుPosition Established
తరువాత వారుPosition Abolished
Minister of Health and Family Welfare
In office
9 నవంబరు 2014 (2014-11-09) – 30 మే 2019 (2019-05-30)
ప్రధాన మంత్రిNarendra Modi
అంతకు ముందు వారుHarsh Vardhan
తరువాత వారుHarsh Vardhan
Member of Legislative Assembly ,Himachal Pradesh
Cabinet Minister
In office
2007 (2007)–2012 (2012)
Chief MinisterPrem Kumar Dhumal
MinistryForest, Environment, Science and Technology
In office
1998 (1998)–2003 (2003)
Chief MinisterPrem Kumar Dhumal
MinistryHealth & Family Welfare and Parliamentary Affairs
Member of Himachal Pradesh Legislative Assembly
In office
2007 (2007)–2012 (2012)
అంతకు ముందు వారుTilak Raj Sharma
తరువాత వారుBumber Thakur
నియోజకవర్గంBilaspur
In office
1993 (1993)–2003 (2003)
అంతకు ముందు వారుSada Ram Thakur
తరువాత వారుTilak Raj Sharma
నియోజకవర్గంBilaspur
వ్యక్తిగత వివరాలు
జననం
Jagat Prakash Nadda

(1960-12-02) 1960 డిసెంబరు 2 (వయసు 64)
Patna, Bihar, India
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
ఇతర రాజకీయ
పదవులు
National Democratic Alliance
జీవిత భాగస్వామి
Mallika Banerjee
(m. 1991)
సంతానం2
బంధువులుJayashree Banerjee (mother-in-law)
కళాశాల

జగత్ ప్రకాష్ నడ్డా, (జ:960 డిసెంబరు 2) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది.అతను 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా[1] [2] 2020 జనవరి 20 నుండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు [3] అతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను నిర్వహించిన కేంద్ర మంత్రి. [4] హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించాడు [5] గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. [6]

ఆయన నుండి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7] జగత్‌ ప్రకాశ్‌ నడ్డా 2024 ఏప్రిల్ 06న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8] ఆయన  2024 జూన్ 24న రాజ్యసభాపక్ష నేతగా నియమితుడయ్యాడు.[9][10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]
2017 మే 23న న జెనీవాలో జరిగిన 70వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నడ్డా పొల్గోన్న చిత్రం

నడ్డా 1960 డిసెంబరు 2న బీహార్‌లోని పాట్నాలో ఒక హిందూ కుటుంబానికి [11] చెందిన నారాయణ్ లాల్ నడ్డా, కృష్ణ నడ్డా దంపతులకు జన్మించాడు. [12] [13] అతనికి జగత్ భూషణ్ నడ్డా అనే సోదరుడు ఉన్నాడు. [14] నడ్డా పాట్నాలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చదివాడు.ఆ తర్వాత బిఏ చేశాడు. పాట్నా కళాశాల, పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి., హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం, సిమ్లా నుండి, ఫ్యాకల్టీ ఆఫ్ లా పూర్తిచేసాడు. అతని చిన్నతనంలో ఢిల్లీలో జరిగిన అఖిల భారత జూనియర్స్ సిమ్మింగ్ పోటీలలో బీహార్‌ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. నడ్డా 1991 డిసెంబరు 11న మల్లికా నడ్డా (నీ బెనర్జీ)ని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[13] అతని అత్త జయశ్రీ బెనర్జీ 1999లో లోక్‌సభకు ఎన్నికయ్యింది. [15] [16]

ఆరోగ్యం

[మార్చు]

నడ్డా 2020 డిసెంబరు13న కొవిడ్ లక్షణాలను లక్షణాలను అనుభవించిన తర్వాత తనకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందని తన అనుచరులకు ట్విట్ చేసాడు [17]

రాజకీయ జీవితం

[మార్చు]
2016 జూన్ 8న న్యూయార్క్‌లో ఎచ్ఐవి-ఎయిడ్స్ పై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నడ్డా ప్రసంగిస్తున్న చిత్రం

నడ్డా తొలిసారిగా 1993లో బిలాస్‌పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు . 1998లో తిరిగి ఎన్నికయ్యాడు. అతని మొదటి పదవీకాలంలో 1994 నుండి 1998 వరకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో తన పార్టీ గ్రూపు నాయకుడిగా పనిచేశాడు.అతను రెండవసారి ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసాడు. [18]

2007 ఎన్నికలలో నడ్డా మరొకసారి ఎన్నికయ్యాడు. తరువాత ప్రేమ్ కుమార్ ధుమాల్ ఏర్పాటుచేసిన ప్రభుత్వంలోని మంత్రివర్గంలో నడ్డా అటవీ, పర్యావరణం,శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞాన శాఖకు మంత్రిగా 2008 నుంచి 2010 వరకు బాధ్యత వహించాడు. [18]

నడ్డా 2012లో శాసనసభకు తిరిగి ఎన్నిక కావడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా హిమాచల్ ప్రదేశ్ నుండి భారత పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభకు ఎన్నికయ్యాడు. [18] 2014లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య శాఖ మంత్రిగా నడ్డాను నియమించాడు.[19]

2019 జూన్ లో నడ్డా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. 2020 జనవరి 20 జనవరి 20న అతను బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, అమిత్ షా నుండి బాధ్యతలు స్వీకరించాడు. [20] 2021 జనవరిలో పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో ఏక్ ముతీ చావల్ యోజన అనే కొత్త పథకాన్ని నడ్డా ప్రారంభించాడు.[21] 24 జూన్ 2024 సోమవారం న రోజున కేంద్రమంత్రి జే.పీ నడ్డా రాజ్యసభ పక్ష నేతగా నియమితులైయ్యారు[22].

మూలాలు

[మార్చు]
  1. "JP Nadda elected as BJP national working president, Amit Shah to remain party chief". The Indian Express. 17 June 2019. Retrieved 25 June 2019.
  2. "जेपी आंदोलन से सुर्खियों में आए थे जेपी नड्डा, बने विश्व की सबसे बड़ी पार्टी के राष्ट्रीय अध्यक्ष". Amar Ujala. 20 January 2020. Retrieved 20 January 2020.
  3. Dutta, Prabhash K. (20 January 2020). "JP Nadda gets full command of BJP in a journey that began with ABVP". India Today. Retrieved 20 January 2020.
  4. Ministry of Health & Family Welfare-Government of India. "Cabinet Minister". mohfw.nic.in. Archived from the original on 2019-03-28. Retrieved 2021-10-30.
  5. "Detailed Profile – Shri Jagat Prakash Nadda – Members of Parliament (Rajya Sabha) – Who's Who – Government: National Portal of India". india.gov.in.
  6. "The Biography of Jagat Prakash (J P) Nadda". news.biharprabha.com. 24 May 2014. Retrieved 24 May 2014.
  7. Andhrajyothy (14 February 2024). "గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్‌". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  8. Andhrajyothy (7 April 2024). "రాజ్యసభ సభ్యునిగా నడ్డా ప్రమాణ స్వీకారం". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  9. Andhrajyothy (24 June 2024). "పీయూష్ స్థానంలో జేపీ నడ్డా.. రాజ్యసభ పక్ష నేతగా నియామకం". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
  10. Eenadu (24 June 2024). "రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డా". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-30.
  12. Taneja, Nidhi (20 January 2020). "JP Nadda: Born in Bihar but Himachali by origin, BJP's new president has a challenge in hand". www.indiatvnews.com. Retrieved 20 January 2020.
  13. 13.0 13.1 "Detailed Profile: Shri Jagat Prakash Nadda".
  14. "Jagat Prakash Nadda all set to head BJP". Free Press Journal. 31 May 2019. Retrieved 20 February 2020.
  15. Arnimesh, Shanker (20 January 2020). "Himachal setbacks to Delhi rise — how Modi-Shah favourite JP Nadda became BJP chief". ThePrint. Retrieved 12 December 2020.
  16. "Jagat Prakash Nadda Biography". BJPHaryana.org.
  17. "Coronavirus | BJP chief J.P. Nadda tests positive for COVID-19". The Hindu. 13 December 2020. Retrieved 19 December 2020.
  18. 18.0 18.1 18.2 "Jagat Prakash Nadda Biography – About family, political life, awards won, history". www.elections.in. Retrieved 2 January 2020.
  19. Phiroze L. Vincent (November 9, 2014). "21 new Ministers inducted into Modi Cabinet". The Hindu.
  20. Hebbar, Nistula (20 January 2020). "Who is JP Nadda, the new BJP national president?". The Hindu. Retrieved 26 August 2020.
  21. "नड्डा बोले, ममता जी आपकी जमीन खिसक चुकी है, चिड़िया खेत चुग चुकी है". Amar Ujala. 9 January 2021. Retrieved 11 January 2021.
  22. "BJP's JP Nadda named leader of the house in Rajya Sabha". The Times of India. 2024-06-24. ISSN 0971-8257. Retrieved 2024-06-25.

వెలుపలి లంకెలు

[మార్చు]