భారత పార్లమెంటు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారత పార్లమెంటు
Coat of arms or logo
విధానం
విధానం ద్వి సభ
సభలు రాజ్యసభ
లోక్ సభ
నాయకత్వం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
2017 జూలై 25 నుండి
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, స్వతంత్ర అభ్యర్థి
2017 ఆగస్టు 11 నుండి
మెజారిటీ నాయకుడు(లోక్ సభ) ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ, (భాజపా)
2014 మే 16 నుండి
లోక్ సభ స్పీకరు సుమిత్రా మహాజన్, (భాజపా)
2014 మే 16 నుండి
మెజారిటీ నాయకుడు (రాజ్యసభ) అరుణ్ జైట్లీ, (భాజపా)
2014 మే 16 నుండి
బలా బలాలు
సీట్లు 795 (250 రాజ్యసభ +
      545 లోక్ సభ)
House of the People, India, 2014.svg
లోక్ సభ రాజకీయ పక్షాలు

అధికారిక: ఎన్ డి ఎ

ప్రతిపక్షాలు: యూపీఎ, మూడవ ఫ్రంట్ మరియు ఇతరులు
Composition of the Council of States, India, 2014.svg
రాజ్య సభ రాజకీయ పక్షాలు యూపీఎ (మెజారిటీ), ఎన్ డి ఎ (రెండవ), ఇతరులు : మూడవ ఫ్రంట్
ఎన్నికలు
లోక్ సభ ప్రస్తుత ఎన్నిక 2014
సమావేశ స్థలం
ParliamentOfIndia.jpg
సంసద్ భవన్
వెబ్
parliamentofindia.nic.in

భారత పార్లమెంటు Parliament of India (లేదా సంసద్), భారత ఫెడరల్ ప్రభుత్వ, అత్యున్నత విధాన అంగము. దీని యందు రెండు సభలు గలవు, ఒకటి లోక్ సభ రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్గ్ లో గలదు.

పేరు పుట్టు పూర్వోత్తరాలు[మార్చు]

సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది, అర్థం ఇల్లు లేక భవనం.

లోక్ సభ[మార్చు]

దస్త్రం:Loksabha.jpg
పార్లమెంటులోని లోక్ సభ సభా స్థలి.

లోక్ సభ కు, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని దాదాపు సభ్యులంతా ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ, కొన్ని సార్లు రాజ్యసభ నిర్ణయాలను సైతం తోసిరాజంటుంది.

ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి. ప్రస్తుతం లోక్ సభలో 545 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మరియు 2 నామినేట్ చేయబడిన ఆంగ్లో-ఇండియన్ సభ్యులు గలరు.

సంసద్ భవన్, భారత పార్లమెంటు.

రాజ్య సభ[మార్చు]

దస్త్రం:Rajyasabha.jpg
పార్లమెంటులోని రాజ్యసభ యందు సభాస్థలి.

రాజ్యసభను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అనికూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.

రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడూ 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.

  • 12 మంది సభ్యులు భారత రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు. వీరు జ్ఞానరంగాలనుండి, సాహిత్య, శాస్త్రీయ, కళా మరియు సాహిత్యరంగాలనుండి నామినేట్ చేయబడతారు.
  • రాష్ట్రాలలోని శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
  • కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు, ఎలెక్టోరల్ కాలేజి ద్వారా ఎన్నుకోబడుతారు.

రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుండి 31 సభ్యులుంటే, నాగాలాండ్ నుండి కేవలం ఒక్కరే. ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు. మనము నిజాయితీగా ఉండవలసిన భవనము.

పార్లమెంట్ భవనం (సంసద్ భవన్)[మార్చు]

భారత పార్లమెంటు, సంసద్ భవన్.

పార్లమెంటు భవనం (సంసద్ భవన్), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.

దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో గలవు, రాష్ట్రపతి భవన్కు అందుకున్నంత దగ్గరలో గలవు.

బయటి లింకులు[మార్చు]